సాక్షి, గుంటూరు: బ్రాండ్ ఏపీని దెబ్బతీసేలా గత ఐదేళ్ల పాలన సాగిందని సీఎం చంద్రబాబు చేసిన అసత్య ఆరోపణలపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అబ్బో.. ఇదేనా మీ రెడ్ బుక్ బ్రాండ్ పాలన అని వైఎస్సార్‌సీపీ నేతలు చంద్రబాబు ప్రస్తుత, గతంలో చేసిన అరాచక పాలనపై మండిపడుతున్నారు.
‘బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం భట్టిప్రోలులో శనివారం (ఆగష్టు 3,2024)తేదీన టీడీపీ కార్యకర్త ఆదిన తాండవకృష్ణ నగరం ఎస్‌ఐ కోటేశ్వరరావు చొక్కా పట్టుకుని నెట్టివేశాడు. అక్రమ ఇసుక తవ్వకాన్ని అడ్డుకున్నారని(జులై 10 2015)తేదీన ఎమ్మార్వో వనజాక్షిని టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ఇసుకలో వేసి కొట్టించాడు. విజయవాడ ట్రాన్స్‌పోర్టు కమీషనర్ అయిన ఐపీఎస్ అధికారి బాలసుబ్రమణ్యం మీదికి వెళ్లి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ(మార్చి 26 2017) తేదీన ఆయన సెక్యూరిటీ గార్డును తోసివేశాడు. నన్ను రామసుబ్బారెడ్డిని నలుగురు ఐఏఎస్‌ల సమక్ష్మ లో కూర్చోబెట్టి (అక్రమంగా ) సంపాదించిన దానిలో చెరి సగం పంచుకోమని చెప్పాడు మా పెద రా (నా) యుడు అని అప్పటి టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి చెప్పిన వీడియో ఉంది. అమరావతి డిజైన్ల కోసం అని చంద్రబాబు ఏరికోరి తెచ్చుకున్న జపాన్ మాకీ సంస్థ చైర్మన్ పుమిహికో అయితే.. ఏపీ కంటే బీహార్ నయం, ప్రతిదానికి లంచం ఇవ్వాలి అని విసిగి వేసారి లేఖ రాసి వెళ్లిపోలేదా? ’అని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
ఎవరీ పాలన బ్రాండ్ ఏపీ ప్రతిష్ట దెబ్బతీసిందో తెలుసుకోవాలని, రాజకీయల కోసం అసత్య ఆరోపణలు చేయవద్దని వైఎస్సార్‌సీపీ నాయకులు మండిపడుతున్నారు. చంద్రబాబు గ్రాఫిక్స్ పాలన ప్రజలందరికీ తెలుసని ఎద్దేవా చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment