నారావారి నైవైద్యం | The medical and health department was weakened during the TDP regime | Sakshi
Sakshi News home page

నారావారి నైవైద్యం

Published Thu, Mar 7 2024 5:17 AM | Last Updated on Thu, Mar 7 2024 5:17 AM

The medical and health department was weakened during the TDP regime - Sakshi

టీడీపీ హయాంలో వైద్య ఆరోగ్య శాఖ నిర్వీర్యం 

మేనిఫెస్టోలో 14 హామీలిచ్చినా ఒక్కటీ నెరవేర్చని వైనం   

ప్రభుత్వాస్పత్రుల్లో పేదలకు నరకం  

ఈఎస్‌ఐ కుంభకోణంతో టీడీపీ నేతలకు లబ్ధి  

నేడు రూపురేఖలు మారిన వైద్య రంగం  

సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన తర్వాత వైద్య సదుపాయాలు మృగ్యమైన ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన తెలుగుదేశం పార్టీ వైద్యారోగ్యశాఖను నిర్విర్యం చేసింది. పేదల ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టి నారావారి నైవైద్యంగా మలచుకుంది. ప్రభుత్వాస్పత్రులను నరకానికి నకళ్లుగా మార్చింది. వైద్య పరీక్షల పేరిట ప్రైవేటు సంస్థలకు పందేరం చేసింది. ఈఎస్‌ఐ మందుల కుంభకోణానికి పాల్పడింది.   ఎన్నికల మేనిఫెస్టోలో వైద్య ఆరోగ్య విధానం పేరిట చంద్రబాబు మొత్తం 14 హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ నెరవేర్చలేదు. జిల్లాకు ఒక నిమ్స్‌ ఆస్పత్రి నిర్మాణాన్ని గాలికి వదిలేసింది.

ఏకంగా ప్రభుత్వాస్పత్రిలో నెలలు నిండని శిశువును ఎలుకలు కొరికిన వైనం రాష్ట్ర వైద్యారోగ్యశాఖకు తీరని మచ్చగా మిగిలింది.     2014–19 మధ్య ప్రభుత్వాస్పత్రులంటేనే ప్రజలు బెంబేలెత్తిపోయారు. ప్రస్తుతం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో వైద్యారోగ్యశాఖ స్వర్ణయుగాన్ని చూస్తోంది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో నాడు–నేడు ద్వారా సకల వసతులూ సమకూరాయి. అర్బన్, విలేజ్‌ హెల్త్‌క్లినిక్‌లు బలోపేతమయ్యాయి.

ఫ్యామిలీ డాక్టర్‌ విధానంతో ఇంటింటికీ వైద్యసేవలు అందుతున్నాయి. ఆరోగ్యసురక్ష ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆరోగ్యాంధ్రను సర్కారు ఆవిష్కరించింది. కరోనా సంక్షోభాన్ని దీటుగా ఎదుర్కొంది. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రత్యేకంగా ఆక్సిజన్‌ ప్లాంట్లు నెలకొ ల్పింది. వైద్యారోగ్యశాఖలో నెలకొన్న  నాటి.. నేటి పరిస్థితులను ఓసారి పరిశీలిస్తే..  

చంద్రబాబు హయాంలో.. 
ఆరోగ్యశ్రీకి పేరుమార్చి తూట్లు  
నిరుపేద ప్రజలకు ప్రైవేట్, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో ఉచితంగా మెరుగైన వైద్య సేవలందించాలనే సదుద్దేశంతో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకానికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తూట్లు  పొడిచింది. ‘‘ఆరోగ్యశ్రీలో కొత్త వ్యాధులను చేర్చి ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఉచిత పరీక్షలు, చికిత్సలు ఆపరేషన్‌ల సౌకర్యం కల్పిస్తాం.’ అని మేనిఫెస్టోలో ప్రకటించిన బాబు కల్ల»ొల్లి మాటలతో ప్రజలను వంచించారు.

2007లో వైఎస్సార్‌ హయాంలో 942  వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తెచ్చి ప్రారంభిస్తే చంద్రబాబు ప్రభుత్వం రోగాల సంఖ్యను ఎన్టీఆర్‌ వైద్యసేవగా పేరు మార్చి 1,059కి అంటే కేవలం 117 వ్యాధులను మాత్రమే పెంచింది. అయినా వాటికి ప్రైవేటు, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో చికిత్స సరిగా అందని దుస్థితి ఉండేది.  

108 ఊపిరి తీశారు 
108, 104 సేవలను బలోపేతం చేస్తామని ఇచ్చిన హామీని బాబు పట్టించుకోలేదు. సంచార వైద్యవాహనాల నిర్వహణను గాలికి వదిలేశారు. ఒక్క కొత్త వాహనమూ కొనుగోలు చేయలేదు. ఫలితంగా అత్యవసర సమయంలో వైద్యం అందక ఎన్నో ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా 679 మండలాలు ఉంటే కేవలం 336 అంబులెన్సులు (108) మాత్రమే ఉండేవి. అంటే మండలానికి ఒక్క సంచార వాహనం కూడా లేని దుస్థితి ఉండేది.  కేవలం 292 ‘104’ మొబైల్‌ మెడికల్‌ యూనిట్‌ (ఎంఎంయూ) వాహనాలు ఉండేవి. 

తూతూ మంత్రంగా పోస్టుల భర్తీ 
వైద్య శాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తామని 2014 మేనిఫెస్టోలో ప్రకటించిన టీడీపీ 2014–19 మధ్య పట్టుమని 10 వేల పోస్టులు కూడా భర్తీ చేసిన పాపాన పోలేదు. ఆ ఐదేళ్లలో వైద్య శాఖలో కేవలం 4,469 పోస్టులు భర్తీ చేశారు. ఆస్పత్రుల్లో పెరిగిన జనాభా అవసరాలకు తగ్గట్టుగా వైద్యులు, సిబ్బంది లేరని సూపరింటెండెంట్‌లు, విభాగాధిపతులు ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా అవి బుట్టదాఖలే అయ్యాయి.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఒక్క మెడికల్‌ ఆఫీసర్‌ మాత్రమే అందుబాటులో ఉండేవారు. దీంతో ఆ ఒక్క డాక్టర్‌ సెలవుపై వెళితే అక్కడ రోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉండేది. మందులు కావాలంటే బయట కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉండేది. 

నిమ్స్‌ స్థాయి ఆస్పత్రుల ఊసే లేదు 
అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ (నిమ్స్‌ స్థాయి) నిర్మిస్తామని హామీ ఇచ్చిన బాబు గద్దెనెక్కాక ఆ ఊసే ఎత్తలేదు. 2014లో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పొత్తులో ఉండి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటుకు  ఎటువంటి చొరవా చూపలేదు.  ప్రైవేట్‌ ఆస్పత్రులను ప్రోత్సహించి తన అనుయాయుల జేబులు నింపడానికి బాబు పెద్ద పీట వేశారు. దీంతో వైద్య విద్యను అభ్యసించాలన్న నిరుపేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థుల కలలు కల్లలుగానే మిగిలిపోయాయి.   

వైఎస్‌ జగన్‌ పాలనలో.. 
ఆరోగ్యశ్రీకి పునరుజ్జీవం  
టీడీపీ ప్రభుత్వంలో పూర్తిగా కునారిల్లిన ఆరోగ్యశ్రీ పథకానికి 2019లో అధికారం చేపట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పునరుజ్జీవం పోసింది. కేవలం 1,059గా ఉన్న రోగాల సంఖ్యను 3,257కు పెంచింది. రూ.5 లక్షలలోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలన్నింటినీ వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ పథకం పరిధిలోకి తెచ్చింది.

చికిత్స వ్యయం పరిమితిని రూ.25 లక్షలకు పెంచింది. పేద, మధ్య తరగతి ప్రజల ఆరోగ్యానికి పూర్తి భరోసా క ల్పించింది. నెట్‌వర్క్‌ ఆస్పత్రులను విస్తృతంగా పెంచింది. అన్ని ఆస్పత్రుల్లో చేరిన వెంటనే వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టింది. ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి ఆరోగ్యశ్రీ ట్రస్టు కేర్‌ తరఫున ఉద్యోగులను నియమించింది. 

53 వేలకుపైగా పోస్టుల భర్తీ  
వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి వచ్చాక  వైద్య శాఖలో 53 వేలకు పైగా పోస్టుల భర్తీ చేసింది.  రూ.16,852 కోట్లతో నాడు–నేడు కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైద్య రంగాన్ని బలోపేతం చేసింది. గిరిజన ప్రాంతాల్లో ఐదు మల్టీ సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ విధానం అమలుకు శ్రీకారం చుట్టింది.  గ్రామాల్లో 10,032 వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేసింది.

 12 రకాల వైద్యసేవలు, 14 రకాల పరీక్షలు అందుబాటులోకి తెచ్చింది.  దేశంలోనే తొలిసారిగా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ అమలు చేసింది. నెలకు రెండుసార్లు గ్రామాలకు  వైద్యులు వెళ్లేలా చర్యలు చేపట్టింది. ప్రభుత్వాస్పత్రుల్లో జీఎంపీ, డబ్ల్యూహెచ్‌వో ప్రమాణాలు కలిగిన 105 రకాల మందులు ఉచితంగా అందిస్తోంది.  
సంచార వైద్యానికి ప్రాధాన్యం  
2019లో వైఎస్సార్‌ సీపీ అధికారంలోకి రాగానే సంచార వైద్యానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రతి పల్లెకు వైద్య వాహనాలు వెళ్లేలా చర్యలు చేపట్టింది.  679 మండలాలు ఉంటే 689 వాహనాలు(108) సమకూర్చింది. ఫ్యామిలీ డాక్టర్‌ విధానం ప్రవేశపెట్టి   మొత్తం 910 ( 104) కొత్త వాహనాలు కొనుగోలు చేసింది.

  2020 జూలై 1న 412 కొత్త అంబులెన్సులను సీఎం వైఎస్‌ జగన్‌  ప్రారంభించారు. గిరిజన ప్రాంతాల కోసమే ప్రత్యేకంగా రూ.4.76 కోట్లతో 20 కొత్త అంబులెన్స్‌లు కొన్నారు.   అంబులెన్స్‌ల కొనుగోలుకు రూ.136.05 కోట్లు, వీటి నిర్వహణ  ఏటా రూ.188 కోట్ల  ఖర్చుచేస్తున్నారు.   

జిల్లాకు ఓ వైద్య కళాశాల  
వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఓ వైద్యకళాశాల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ఒకేసారి ఏకంగా 17 కళాశాలల నిర్మాణాన్ని ప్రారంభించింది. మచిలీపట్నం, ఏలూరు తదితర చోట్ల ఐదు నిర్మాణాలు పూర్తి చేసి ఈ విద్యాసంవత్సరం నుంచి తరగతులూ ప్రారంభించింది.

మరో ఐదు వచ్చే విద్యా సంవత్సరంలో ప్రారంభించడానికి వేగంగా అడుగులు వేస్తోంది.  మిగిలిన ఏడు 2025–26లో ప్రారంభించేలా ప్రణాళికలు రచిస్తోంది.   ఫ్యామిలీ డాక్టర్‌ విధానం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ల బలోపేతం, ఆరోగ్య సురక్ష ద్వారా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ఆరోగ్యాంధ్ర దిశగా అడుగులు వేస్తోంది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement