
సాక్షి నెట్‌వర్క్ : చంద్రబాబు అరెస్టును తట్టుకోలేక తెలుగుదేశం పార్టీ అభిమానులు ప్రాణాలు విడుస్తున్నట్లుగా ప్రజలను నమ్మించడానికి టీడీపీ విఫలయత్నం చేస్తోంది. అభూత కల్పనలు, అసత్య ప్రచారాలతో సహజ మరణాలను సైతం చంద్రబాబు అరెస్టు, జైలుకు ముడిపెట్టి శవ రాజకీయం కొనసాగిస్తోంది.
ఈ విషయానికి పెద్ద ఎత్తున ప్రచారం కల్పించి, సానుభూతి పొందేందుకు పచ్చ బ్యాచ్ తెగతాపత్రయ పడుతోంది. నిజానికి.. ‘పచ్చ’ మీడియా పేర్కొన్న వారంతా అనారోగ్య కారణాలతో మరణిస్తున్నా ‘బాబు అరెస్టును తట్టుకోలేక..’ అంటూ నానా హడావుడి చేస్తోంది. టీడీపీ, ఎల్లో మీడియా భజనతో గ్రామాల్లో ప్రజలు నివ్వెరపోతున్నారు. మొత్తానికి ‘సాక్షి’ పరిశీలనలో తేలిన వాస్తవాలివి.