ఓటుకు కోట్లు వ్యవహారంలో ఏసీబీ నోటీసులు జారీచేసినప్పటినుంచీ అజ్ఞాతంలో ఉన్న సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గురువారం ఖమ్మంలో ప్రత్యక్షమయ్యారు. నగరంలో ఆయన తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న విషయం తెలియగానే స్థానిక టీడీపీ నేతలు, అనుచరులు ఆయనతో భేటీ అయ్యారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఏసీబీ అధికారులు ఎప్పుడు పిలిచినా హాజరయ్యేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. తమ పిల్లలను విశాఖపట్నంలోని గీతమ్ స్కూల్లో చేర్పించేందుకు వెళ్లానని, అయితే అప్పటికే అనారోగ్యానికి గురైన తనకు ఏసీబీ నోటీసులు జారీ అయ్యాయని పేర్కొన్నారు.