తెలంగాణలో టీడీపీ అడ్రస్ గల్లంతుకానుంది. తాజా ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేసిన ఆ పార్టీ.. కేవలం రెండే సీట్లను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గెలిచిన ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా త్వరలో కారెక్కనున్నట్లు తెలుస్తోంది. సత్తుపల్లి నుంచి గెలిచిన సండ్రవెంకట వీరయ్య.. అశ్వారావుపేటలో గెలుపొందిన మచ్చా నాగేశ్వరరావులు టీఆర్‌ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే జరిగితే తెలంగాణలో టీడీపీ ఖాళీ కానుంది. ఏపీలో ప్రతిపక్షపార్టీ ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొన్న టీడీపీ.. అందులో కొందరికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టింది. దీంతో తెలంగాణలో తమ పార్టీ ఎమ్మెల్యేలు ఫిరాయింపులకు పాల్పడినా ప్రశ్నించలేని దుస్థితిలో ఉంది.