నియోజకవర్గ ప్రజల అవసరాలు, అభివృద్ధి కోసం తాను పార్టీ మారుతున్నట్లు సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తెలిపారు. త్వరలోనే టీడీపీకి రాజీనామా చేసి అధికార టీఆర్‌ఎస్‌లో చేరబోతున్నట్లు స్పష్టం చేశారు. శనివారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును సండ్ర కలిసిన విషయం తెలిసిందే.