'దొంగలకు నీతులు చెప్పే హక్కులేదు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టపగలు దొరికిన దొంగ అని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. 'సెక్షన్ - 8' అంశంపై శనివారం మాట్లాడుతూ... దొరికిన దొంగలకు నీతులు చెప్పే హక్కులేదని ఆయన వ్యాఖ్యానించారు.
సెక్షన్ 8 పై ఏపీ మంత్రులు అవగాహనతో మాట్లాడితే మంచిదని ఆయన హితవు పలికారు. చంద్రబాబు, ఆయన మంత్రుల్లాంటి వారు దొరకడం ఏపీ ప్రజలు చేసుకున్న కర్మ అని మంత్రి కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు.