deputy cm kadiam srihari
-
రేపు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ప్రారంభం
విద్యారణ్యపురి : మడికొండలో నూతనంగా ఏర్పాటు చేసిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్‌ను ఈనెల 4న డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రారంభిం^è నున్నట్లు ప్రిన్సిపాల్ ఎల్. సరిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రారంభోత్సవంలో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సొసైటీ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, మంత్రి ప్రసంగిస్తారన్నారు. ప్రీ ప్రైమరీ –1, 2, 1వ తరగతులు ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభమవుతాయని ఆమె పేర్కొన్నారు. -
‘గురుకులాలు’ ఆదర్శంగా నిలవాలి
నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పరకాల : ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్న గురుకుల పాఠశాలలు దేశానికే ఆదర్శం గా నిలవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆత్మకూరు మండలానికి మంజూరైన గురుకుల పాఠశాలను మండలంలోని మల్లక్కపేట గురుకులంలో బుధవారం ఆయన ప్రా రంభించారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడియం మాట్లాడుతూ.. 1995–99 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశానని చెప్పారు. ఇప్పుడు ప్రత్యేక రా ష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు పాటుపడుతున్నామని చెప్పా రు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్తగా 319 గురుకులాలను ప్రారంభించినట్లు చెప్పారు.16 గురుకులాలనుకాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామన్నారు. కొత్తగా ఏర్పా టు చేసిన గురుకులాల్లో 7వేల కోట్ల ఖర్చుతో 10 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు చెప్పా రు. సాంఘిక సంక్షేమ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఎంతో కష్టపడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం పని చేస్తున్నారని అభినందించారు. నడికూడలో 15 వేల మొక్కలను నాటి సంరక్షించాలని, వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుం టే 25 లక్షల నిధులను మంజూరు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్రావు, జడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి–ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ నేతాని సులోచన–శ్రీనివాస్‌రెడ్డి, నగర పంచాయతి చైర్మన్ మార్త రాజభద్రయ్య, డీసీవో రూపాదేవి పాల్గొన్నారు. మనసున్న మహారాజు కేసీఆర్ చదువుతోపాటు సన్న బియ్యంతో విద్యార్థుల కడుపు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కొని యాడారు. కేసీఆర్ మనువడు, మనుమరాలు తింటున్న సన్న బియ్యా న్ని విద్యార్ధులకు అందించిన మహామనిషి అని కొనియాడారు. రాష్ట్రంలో 319 గురుకులాలను ఏర్పాటు చేస్తే అందులో 200 గురుకులాలను కేవలం బాలికల కోసం కేటాయించడం జరిగిందన్నారు. అవకాశం కల్పిస్తే ఆడపిల్లలు ఆకాశమే హద్దుగా ఎదుగుతారన్నారు. మన రాష్ట్రంలోనే చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి మోదీ సైతం అభినందించారని చెప్పారు. ఏడాదికి 46కోట్ల మొక్కల చొప్పున ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలను పెంచడం కోసం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. ప్రభుత్వం రూ.46వేల కోట్లతో మిషన్ భగీరథతో ఇంటింటికి సురక్షితమైన నల్లా నీళ్లు అందిస్తుందన్నారు. చెరువుల పూడికతీత కోసం ప్రారంభించిన మిషన్ కాకతీయ ప్రపం చ ప్రజల దృష్టిని ఆకర్షించిందన్నారు. ఆసరా పింఛన్ల కోసం ఏటా రూ.4600 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, రూ.17వేల కోట్లతో రుణమాఫీని అమ లు చేస్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. మంత్రి వెం ట ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ పాల్గొన్నారు. -
మేడారంలో లక్ష మొక్కలు
మేడారం, నార్లాపూర్‌లో హరితహారం హాజరైన మంత్రులు కడియం, జోగు రామన్న, చందూలాల్ వనదేవతలకు పూజలు.. ఎస్‌ఎస్‌తాడ్వాయి : హరితహారం కార్యక్రమం ఉద్యమంలా సాగుతోందని, వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని మేడారం ఆలయంలో, నార్లాపూర్ చింతల క్రాస్ వద్ద అటవీ భూమిలో కడియంతో పాటు మంత్రులు జోగు రామన్న, అజ్మీరా చందూలాల్, కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ మెుక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. భావితరాలకు పచ్చదనాన్ని కానుకగా ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు. మేడారంలో లక్షల మొక్కలు పెంచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. మానవాళి మనుగడ కోసం సీఎం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, ఇది ఆయన మానసపుత్రిక అని అన్నారు. చెట్లను పెంచితేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని చెప్పారు. గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ.. హరితహారంతో మొక్కలను పెంచి పూర్వవైభవం చూడాలన్నారు. మేడారం వంటి వనదేవతల పవ్రిత స్థలంలో మొక్కలు నాటితే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంతకుముందు మంత్రులు వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వన్యప్రాణి విభాగం అడిషనల్ పీసీసీఎఫ్ పృ«థ్విరాజు, కన్జర్వేటర్లు అక్బర్, పీవీ రాజారావు, జేసీ ప్రశాంత్ జీవన్ పటేల్, పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ మహేందర్‌జీ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్రావు, ఎంపీపీ కొండూరి శ్రీదేవి, జేడ్పీటీసీ సభ్యురాలు పులుసం సరోజన. డీఎఫ్ఓలు పురుషోత్తం, బీమా, మండల అధ్యక్షుడు బాపిరెడ్డి పాల్గొన్నారు. -
మహా శాకంబరీ నమోనమః
శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు భద్రకాళి అమ్మవారు మహా శాకంబరీ అవతారంలో భక్తులకు దర్శన మిచ్చారు. అమ్మవారిని రెండు టన్నుల దుంపలు, కాయలు, 70 రకాల పండ్లు, కూరగాయలతో సంపూర్ణ శాకంబరీగా అలంకరించారు. హన్మకొండ కల్చరల్ : వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు మంగళవా రం ముగిశాయి. చివరిరోజు భద్రకాళి అమ్మవారిని రెండు టన్నుల దుంపలు, కాయలు, 70 రకాల పండ్లు, కూరగాయలతో అలం కరించా రు. ఈ సందర్భంగా తెనాలికి చెందిన అలంకా ర కళానిధి చావలి హనుమాన్‌కుమార్ బృందం, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ముఖ్యార్చకులు పార్నంది నరసింహామూర్తి, చెప్పెల నాగరాజుశర్మ, టక్కరసు సత్యం, పాలకుర్తి నరసింహామూర్తి, ప్రభాకరశర్మ, సుధాకర్‌శర్మ, సురేష్‌శర్మ, రాముశర్మ అమ్మవారిని సంపూర్ణ శాకంబరీగా అలంకరించి పూజలు చేశారు. హన్మకొండ టీచర్స్ కాలనీకి చెందిన మండువ వెంకటకిషన్‌రావు, దయామణి దం పతులు, మండువ శేషగిరిరావు, రేణుక దంపతులు అమ్మవారి అలంకరణ దాతలుగా వ్యవహరించారు. వ్యాపారవేత్త తోట గణేష్ ఆధ్వర్యంలో యువకులు అమ్మవారికి కూరగాయ లు, పూలదండలు తయారు చేశారు. బుధ వారం మధ్యాహ్నం వరకు అమ్మవారి దర్శనం ఉంటుందని అర్చకులు తెలి పారు. మితాక్రమంలో ముగిసిన ఉత్సవాలు చివరి రోజు అమ్మవారి ఇచ్ఛామూర్తిని కాళీక్రమంలోని మితాక్రమంలోనూ, జ్ఞానమూర్తిని షోఢశీక్రమంలో చిత్రానిత్యా అమ్మ వారిగా అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు చతుఃస్థానార్చన పూజలు, నీరాజనమంత్రపుష్పములు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు క్రతువుల్లో భాగంగా వృద్ధిహోమం, బలిప్రదానం, మహా పూర్ణాహుతి, త్రిశూల తీర్థోత్సవము, అవబృథ స్నానం నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రకాళి శరణమమః అని కొలుస్తూ పూజలు చేశారు. కాగా, ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ కట్టా అంజనీదేవి, ఆలయ సూప రింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, సిబ్బంది కూచన హరినాథ్, కృష్ణ, కె. వెంకటయ్య, అశోక్, చింతశ్యామ్, సిబ్బంది ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ దంపతులు, కలెక్టర్ వాకాటి కరుణ, డీఐజీ ప్రభాకర్‌రావు, జైళ్ల శాఖ డీఐజీ కేశవులునాయుడు దంపతులు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మట్టెవాడ సీఐ శివరామయ్య ఆధ్వర్యంలో 70 మంది పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది ఆలయంలో బందోబస్తు నిర్వహించారు. మహబూబాబాద్‌కు చెందిన శ్రీవేంకటేశ్వరసేవా సమితి సభ్యులు 40 మంది భక్తులకు సేవలు అందించారు. అయిత గోపినాథ్ ఆధ్వర్యంలో భద్రకాళి సేవా సమితి సభ్యులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. -
కేజీబీవీ, మోడల్ స్కూళ్ల వద్ద పోలీసు భద్రత: కడియం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలోని కేజీబీవీ, మోడల్ స్కూళ్ల వద్ద పోలీసు భద్రతను ఏర్పాటు చేయనున్న ట్లు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఈ మేరకు జిల్లాల ఎస్పీలతో పాఠశాలల వద్ద తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించామన్నారు. శనివారం ఆయన పాఠశాల విద్య డెరైక్టర్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో 192 మోడల్ స్కూళ్లకు గాను 182 పనిచేస్తున్నాయని, గత ప్రభుత్వాల నిర్వాకం వల్ల ఇవి పట్టణాలు, మండల కేంద్రాలకు దూరంగా విసిరేసినట్లున్నాయన్నారు. అందుకే వీటిలో విద్యార్థుల భద్రతపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిం చినట్లు తెలిపారు. ప్రతీ పాఠశాల వద్ద రాత్రివేళ ఒక మహిళా కానిస్టేబుల్, లేదా మహిళా హోంగార్డును నియమించాలని ఎస్పీలను ఆదేశించామన్నారు. ఎస్పీల సూచన మేరకు ప్రతీ పాఠశాలకు ప్రహరీ గోడ, సీసీటీవీ కెమెరాలు, అలారం వ్యవస్థ ఏర్పాటు చేస్తామన్నారు. -
పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
వీసీలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పాలమూరు : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం జిల్లా సచివాలయం నుంచి విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లోని మరుగుదొడ్లకు నిరంతర నీటి సరఫరా కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదర్శ పాఠశాలలకు అనుబంధంగా ఏర్పాటు చేస్తున్న బాలికల వసతి గృహాల భవన నిర్మాణాలను పూర్తి చేయడంతో పాటు అవసరమైన వసతులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బాలికల వసతి గృహాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులకు సూచించారు. ఒక్కో వసతి గృహాన్ని ప్రజాప్రతినిధులు, అధికారులు దత్తత తీసుకొని కనీస అవసరాలు కల్పించేందుకు ముందుకు రావాలన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆదర్శ పాఠశాలలు, కేజీబీవీలకు ప్రహరీల నిర్మాణాలకు రూ.35కోట్లు విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. విద్యావలంటీర్ల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, ఎలాంటి అవకతవకలు జరుగకుండా ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలని కలెక్టర్లకు సూచించారు. అనంతరం కలెక్టర్ టీకే శ్రీదేవి మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయుల కొరత ఉన్నందున 1954మంది విద్యావలంటీర్ల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపగా, 1637మంది వలంటీర్లను నియమించుకునేందుకు అనుమతి వచ్చిందని చెప్పారు. మిగిలిన విద్యావలంటీర్లను కూడా నియమించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. విద్యార్థులకు సంబంధించిన యూనిఫాంలను ఈనెల చివరి వరకు అందించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ అభివృద్ధి పనులు పురోగతిలో ఉన్నాయని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస్, డీఈఓ విజయలక్ష్మిభాయి, డిప్యూటీ ఈఓ గోవిందరాజులు, తదితరులు పాల్గొన్నారు. -
జిల్లాను ‘ఆదర్శజ్యోతి’గా నిలపాలి
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హన్మకొండ : గ్రామజ్యోతి పథకం అమలులో జిల్లాను రాష్ర్టంలోనే ఆదర్శంగా నిలుపుదామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం హన్మకొండలో టీఆర్ఎస్ శ్రేణులకు గ్రామజ్యోతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల సమగ్రాభివృద్ధికే టీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని చేపట్టిందని, గంగదేవిపల్లిని స్ఫూర్తితో ముం దుకు సాగాలన్నారు. గ్రామసభలో ప్రాధాన్య త క్రమంలో ప్రణాళికలు రూపొందించాల న్నారు. అవకాశాలు రాలేదనే నిరుత్సాహం తో పార్టీ శ్రేణులు గ్రామజ్యోతికి దూరంగా ఉండొద్దని సూచించారు. మాజీ ఉప ముఖ్యమం త్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల విమర్శలు అర్థం లేనివన్నారు. పత్రికల్లో వచ్చిన ఆరోపణల ఆధారంగా, ప్రభుత్వం పారదర్శకంగా ఉంద ని చెప్పడానికే తనను మంత్రి వర్గం నుంచి తొలగించారన్నారు. అవినీతి జరిగిందని కాదన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రావణ మాసం పదవుల పందేరం మాసమన్నారు. టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్రావు, జెడ్పీ చైర్పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి,ఎమ్మెల్యేలు దా స్యం వినయభాస్కర్, ఆరూరి రమేష్, శంకర్ నాయక్, చల్లా ధర్మారెడ్డి, రెడ్యా నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, మొలుగూరి భిక్షపతి, సుధాకర్‌రావు, రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, టీఆర్ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు నరేందర్ పాల్గొన్నారు. టీఆర్ఎస్ శ్రేణుల అసమ్మతి హన్మకొండ: ఏడాదిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న టీఆర్ఎస్ శ్రేణులు తమ అసమ్మతిని వ్యక్తం చేశాయి. గ్రామజ్యోతి పథకంపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు శనివారం ఏర్పాటు చేసిన సదస్సు.. టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు లేక బోసిపోయింది. ఈ సదస్సులో ఖాళీ కుర్చీలు కనపడడం, హాల్ బోసిపోయి ఉండటంతో ఉప ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసినపుడు నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేయవద్దని, ఎంతటి ప్రాధాన్యత పనులున్నా వదులుకొని పార్టీ సమావేశాలకు పాల్గొనాలని సూచించారు. టీఆర్ఎస్ శ్రేణులు మోటివేటర్లుగా పని చేయాల్సి ఉండగా సదస్సుకు హాజరు కాకపోవడటం మంచిది కాదని అన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీ కార్యక్తలు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు ఈ దిశగా ఆలోచించాలన్నారు. ఎంతో ప్రాధాన్యతాంశంగా తీసుకొని ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరు కాలేదు. చల్లా ధర్మారెడ్డి గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి సమావేశంలో పాల్గొని ఆలస్యంగా వచ్చారు. -
'దొంగలకు నీతులు చెప్పే హక్కులేదు'
హైదరాబాద్: ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టపగలు దొరికిన దొంగ అని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. 'సెక్షన్ - 8' అంశంపై శనివారం మాట్లాడుతూ... దొరికిన దొంగలకు నీతులు చెప్పే హక్కులేదని ఆయన వ్యాఖ్యానించారు. సెక్షన్ 8 పై ఏపీ మంత్రులు అవగాహనతో మాట్లాడితే మంచిదని ఆయన హితవు పలికారు. చంద్రబాబు, ఆయన మంత్రుల్లాంటి వారు దొరకడం ఏపీ ప్రజలు చేసుకున్న కర్మ అని మంత్రి కడియం శ్రీహరి అభిప్రాయపడ్డారు. -
'క్యూ' సెట్ తో తెలంగాణ ఎంసెట్
-
'క్యూ' సెట్ తో తెలంగాణ ఎంసెట్
హైదరాబాద్: తెలంగాణలో నేడు ఎంసెట్ ఎంట్రన్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఇంజినీరింగ్ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌కు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి సెట్ 'క్యూ' విడుదల చేశారు. తెలంగాణలో 423 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 2,31,998 విద్యార్థులు హాజరుకానున్నారు. ఇంజినీరింగ్ కు 251 సెంటర్లు, మెడికల్ అగ్రికల్చర్ కు 172 సెంటర్లు ఏర్పాటుచేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఇంజినీరింగ్ పరీక్ష నిర్వహిస్తారు. మెడిసిన్ పరీక్షను మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీక్షకు అనుమతించేది లేదని ఎంసెట్ కన్వీనర్ రమణారావు అన్నారు.