మహా శాకంబరీ నమోనమః | bhadrakali in shakambari | Sakshi
Sakshi News home page

మహా శాకంబరీ నమోనమః

Published Wed, Jul 20 2016 2:01 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 AM

మహా శాకంబరీ నమోనమః

మహా శాకంబరీ నమోనమః

శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు భద్రకాళి అమ్మవారు మహా శాకంబరీ అవతారంలో భక్తులకు దర్శన మిచ్చారు. అమ్మవారిని రెండు టన్నుల దుంపలు, కాయలు, 70 రకాల పండ్లు, కూరగాయలతో సంపూర్ణ శాకంబరీగా అలంకరించారు. 
 
హన్మకొండ కల్చరల్‌ : వరంగల్‌ శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు మంగళవా రం ముగిశాయి. చివరిరోజు భద్రకాళి అమ్మవారిని రెండు టన్నుల దుంపలు, కాయలు, 70 రకాల పండ్లు, కూరగాయలతో అలం కరించా రు. ఈ సందర్భంగా తెనాలికి చెందిన అలంకా ర కళానిధి చావలి హనుమాన్‌కుమార్‌ బృందం, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ముఖ్యార్చకులు పార్నంది నరసింహామూర్తి, చెప్పెల నాగరాజుశర్మ, టక్కరసు సత్యం, పాలకుర్తి నరసింహామూర్తి, ప్రభాకరశర్మ, సుధాకర్‌శర్మ, సురేష్‌శర్మ, రాముశర్మ అమ్మవారిని సంపూర్ణ శాకంబరీగా అలంకరించి పూజలు చేశారు. హన్మకొండ టీచర్స్‌ కాలనీకి చెందిన మండువ వెంకటకిషన్‌రావు, దయామణి దం పతులు, మండువ శేషగిరిరావు, రేణుక దంపతులు అమ్మవారి అలంకరణ దాతలుగా వ్యవహరించారు. వ్యాపారవేత్త తోట గణేష్‌ ఆధ్వర్యంలో యువకులు అమ్మవారికి కూరగాయ లు, పూలదండలు తయారు చేశారు. బుధ వారం మధ్యాహ్నం వరకు అమ్మవారి దర్శనం ఉంటుందని అర్చకులు తెలి పారు.
 
మితాక్రమంలో ముగిసిన ఉత్సవాలు
చివరి రోజు అమ్మవారి ఇచ్ఛామూర్తిని కాళీక్రమంలోని మితాక్రమంలోనూ, జ్ఞానమూర్తిని షోఢశీక్రమంలో చిత్రానిత్యా అమ్మ వారిగా అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు చతుఃస్థానార్చన పూజలు, నీరాజనమంత్రపుష్పములు నిర్వహించారు.  ఉత్సవాల ముగింపు క్రతువుల్లో భాగంగా వృద్ధిహోమం, బలిప్రదానం, మహా పూర్ణాహుతి, త్రిశూల తీర్థోత్సవము, అవబృథ స్నానం నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రకాళి శరణమమః అని కొలుస్తూ పూజలు చేశారు. కాగా, ఆలయ ఈఓ, అసిస్టెంట్‌ కమిషనర్‌ కట్టా అంజనీదేవి, ఆలయ సూప రింటెండెంట్‌ అద్దంకి విజయ్‌కుమార్, సిబ్బంది కూచన హరినాథ్, కృష్ణ, కె. వెంకటయ్య, అశోక్, చింతశ్యామ్, సిబ్బంది ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. 
 
అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు
డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ దంపతులు, కలెక్టర్‌ వాకాటి కరుణ, డీఐజీ ప్రభాకర్‌రావు, జైళ్ల శాఖ డీఐజీ కేశవులునాయుడు దంపతులు, మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మట్టెవాడ సీఐ శివరామయ్య ఆధ్వర్యంలో 70 మంది పోలీసులు, ఆర్‌పీఎఫ్‌ సిబ్బంది ఆలయంలో బందోబస్తు నిర్వహించారు. మహబూబాబాద్‌కు చెందిన శ్రీవేంకటేశ్వరసేవా సమితి సభ్యులు 40 మంది భక్తులకు సేవలు అందించారు. అయిత గోపినాథ్‌ ఆధ్వర్యంలో భద్రకాళి సేవా సమితి సభ్యులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు.     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement