
సాక్షి, వరంగల్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలి దంపతులు శుక్రవారం భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నూతన వధూవరులు, కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు అమ్రపాలి దంపతులకు ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. కాగా ఈ నెల 18 జమ్ములో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో అమ్రపాలి వివాహం జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం అమ్రపాలి దంపతులు నిన్న (గురువారం) వరంగల్ విచ్చేశారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు.
(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)