Sameer sharma
-
సీఎం జగన్‌ను కలిసిన సమీర్ శర్మ, పూనం మాలకొండయ్య
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మాజీ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ, సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ పూనం మాలకొండయ్య గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. సమీర్ శర్మకు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఛైర్మన్‌గా, చీప్ ఎగ్జిక్యూటివ్ టూ చీఫ్ మినిస్టర్‌గానూ.. డాక్టర్ పూనం మాలకొండయ్యకు సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఏపీ ప్రభుత్వం నూతన బాధ్యతలు అప్పగించింది. చదవండి: (సొంత జిల్లాలో పరువు కోసం పాకులాడుతున్న బాబు.. కంటి మీద కునుకు కరువే!) -
ఏపీ సీఎప్ సమీర్‌శర్మకు అస్వస్థత
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) సమీర్‌శర్మ అస్వస్థతకు గురయ్యారు. దీంతో, వెంటనే ఆయనను తాడేపల్లిలోని మణిపాల్ ఆసుపత్రికి తరలించారు. -
విద్యా వ్యవస్థపై వాళ్లవి తప్పుడు రాతలు: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ పాఠశాలలకు వెళ్లే పిల్లలు, తల్లిదండ్రుల్లో నైతిక స్థైర్యం దెబ్బ తినేలా యెల్లో మీడియా వ్యతిరేక రాతలు రాస్తోందని, కానీ, వాస్తవాన్ని వివరించి తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, అధికారులకు సూచించారు. గురువారం విద్యాశాఖపై క్యాంపు కార్యాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. విప్లవాత్మక సంస్కరణలు నాణ్యమైన విద్యకోసం విద్యారంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రభుత్వం తీసుకొచ్చిందని సీఎం జగన్ తెలిపారు. రాష్ట్రంలో తొలిసారిగా బడులు ప్రారంభమ్యయే తొలిరోజునే విద్యాకానుక కిట్ ఇస్తున్నాం. ఇందులో భాగంగా స్కూల్ బ్యాగు, బైలింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫాం, షూ, సాక్సులు, బెల్టు, ఆక్స్ఫర్డ్ డిక్షనరీ ఉంటున్నాయి. వీటన్నింటినీ ఒకేసారి పిల్లలకు స్కూల్ ప్రారంభించే తొలిరోజే అందిస్తున్నాం. గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదు. గతంలో స్కూల్ పిల్లలకు సెప్టెంబరు, అక్టోబరు వరకు పాఠ్యపుస్తకాలు ఇవ్వని పరిస్థితి. మనం ఆ విధానంలో మార్పు తెచ్చాం. మనం స్కూల్ ప్రారంభించిన తొలిరోజు పాఠ్యపుస్తకాలు ఇతర మెటీరియల్ అందిస్తున్నాం, ఇది గతానికి ఇప్పటికీ ఉన్న పెద్ద తేడా అని వివరించారు. తప్పుడు రాతలతో.. ప్రభుత్వ స్కూళ్లలోని పిల్లలు, వారి తల్లిదండ్రుల్లో నైతిక స్థైర్యం దెబ్బతినేలా వ్యతిరేక మీడియా రాతలు రాస్తోందని అధికారులు ఈ సందర్భంగా.. సీఎం జగన్‌కు వివరించారు. సెకెండ్ సెమిస్టర్ ప్రారంభం అయినా.. ఇంకా పుస్తకాలు అందలేదంటూ మీడియాలో వచ్చిన కథనాలను అధికారులు ఖండించారు. డిసెంబరులో సెకెండ్ సెమిస్టర్ ప్రారంభం అవుతుందని, అలాంటిది ఇప్పుడే పుస్తకాలు అందలేదని రాయడం కచ్చితంగా తప్పుదోవ పట్టించడమేనని అధికారులు స్పష్టం చేశారు. డిసెంబర్లో రెండో సెమిస్టర్ ప్రారంభం అవుతుందన్న విషయాన్ని అకడమిక్ క్యాలెండర్లో పేర్కొన్నామని, ఈ విషయం తెలిసీ విద్యార్థులను, తల్లిదండ్రులను తప్పుదోవ పట్టించేలా కథనాలు రాశారన్నారు. జగన్‌కు వాళ్లు వ్యతిరేకం కాబట్టే.. వాస్తవాలను ఇలా వక్రీకరించడంతో పాటు... ప్రభుత్వ స్కూళ్లకు వెళుతున్న పిల్లలనైతిక స్థైర్యం దెబ్బతినేలా ఒక పద్ధతి ప్రకారం వ్యతిరేక వార్తలు రాస్తున్నారని సీఎం జగన్ అభిప్రాయపడ్డారు. ఇంగ్లిషు మీడియంకు, ప్రభుత్వ విద్యారంగానికి వారు వ్యతిరేకం కాబట్టే.. ఇలాంటి తప్పుడు వార్తలు రాసి ప్రచారం చేస్తున్నారన్నారాయన. ‘‘పేద పిల్లలకు ఇంగ్లిషు మీడియం విద్య అందడం వాళ్లకి ఇష్టం లేదు. అందుకే ఇలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. ఇంకా మొదలు కాక ముందే రెండో సెమిస్టర్ ప్రారంభం అయిందని వార్తలు రాయడంలో ఉద్దేశం ఇదే. డిసెంబరులో సెకెండ్ సెమిస్టర్ ప్రారంభం అవుతుందని అకడమిక్ క్యాలెండర్లో ఉంటే... ఆ విషయం రాయలేదు. రాజకీయంగా జగన్‌ను ఇబ్బందిపెట్టాలి కాబట్టే, ఇలాంటి కథనాలు రాస్తున్నారు. రాజకీయంగా జరుగుతున్న ఈ యుద్ధంలో.. దురదృష్టవశాత్తూ సామాన్యులు, తల్లిదండ్రులు, బడిపిల్లలు ఇబ్బంది పడుతున్నారు. వారిలో స్థైర్యం దెబ్బతినేలా నిరంతరం కథనాలు రాస్తున్నారు. రామోజీరావుకు, ఈనాడుకు జగన్మోహన్రెడ్డి అంటే ఇష్టం లేదు.. అంత మాత్రాన పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవడం తప్పు. ఇలా తప్పుడు వార్తలు రాయకూడదు. మన ప్రభుత్వం రాగానే పాఠ్యప్రణాళికలో మార్పులు తీసుకు వచ్చాం. పుస్తకాల్లో జోడించిన అదనపు సమాచారం వల్ల, బైలింగువల్ కాన్సెప్ట్ వల్ల టెక్ట్స్‌బుక్ సైజు పెరిగింది. బైలింగువల్ టెక్ట్‌బుక్స్‌లో ఒక పేజీ తెలుగు, ఒక పేజీ ఇంగ్లిషు ఉంటుంది.. దీంతో సాధారణంగానే టెక్ట్స్‌బుక్ సైజు పెరుగుతుంది. దీంతో టెక్ట్స్ బుక్‌ను సెమిస్టర్ వారీగా విభజించి పంపిణీ చేస్తున్నారు. దీన్ని వక్రీకరించి, పిల్లలు, తల్లిదండ్రుల్లో ఆందోళన రేకెత్తించేలా తప్పుడు వార్తలు రాస్తున్నారు. పటిష్టంగా సబ్జెక్ట్ టీచర్ల కాన్సెప్ట్ గతంలో క్లాస్ టీచర్‌కే అవకాశం లేని పరిస్థితుల నుంచి సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్‌ను తీసుకొస్తున్నామని సీఎం జగన్ పేర్కొన్నారు. ‘‘గతంలో పాఠ్యాంశాలు అదే సబ్జెక్టులో నిపుణుడైన టీచర్ బోధించే పరిస్థితి లేదు. అందుకే సబ్జెక్టు టీచర్ కాన్సెప్ట్ పేరుతో సంస్కరణలు తీసుకొచ్చాం’’ అని పేర్కొన్నారు. మూడోతరగతి నుంచి 10వ తరగతి వరకూ సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్ సమర్ధవంతగా అమలు చేయాలి. నిరంతరం పర్యవేక్షిస్తూ పిల్లలకు సబ్జెక్టుల వారీగా అత్యుత్తమ బోధన అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారాయన. స్లో బట్ బెటర్ రిజల్ట్ 45వేల స్కూళ్లను బాగుచేయాలంటే కనీసం మూడు నుంచి నాలుగేళ్లు పడుతుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా దురదృష్టవశాత్తూ వ్యతిరేక వార్తలతో, వ్యతిరేక రాజకీయాలతో మనం చేసే మంచిని జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ల స్వార్ధ రాజకీయాలకోసం ఇదంతా చేస్తున్నారు. వీటన్నింటినీ మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనం వీటన్నింటితో యుద్ధం చేస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నింటినీ జాగ్రత్తగా, పక్కాగా చేపట్టాలన్న సీఎం. మనం అధికారంలోకి రాకముందు 2018–19లో ప్రభుత్వ స్కూళ్లలో 37 లక్షల మంది విద్యార్ధులు ఉండేవారు. ప్రస్తుతం 42 లక్షల మంది ఉన్నారు. కోవిడ్ టైంలో కూడా మనం ఈ సంఖ్య చేరుకున్నాం. ప్రభుత్వ స్కూళ్లలో అమలు చేస్తున్న ఈ సంస్కరణలు ఫలితాలు క్రమంగా వస్తున్నాయి. ప్రస్తుతం నాడు - నేడు 15వేల స్కూళ్లలో జరిగింది. ఈ యేడు సుమారు మరో 22 వేల స్కూళ్లలోనూ, ఆ తర్వాత సంవత్సరం మిగిలిన స్కూళ్లలోనూ జరుగుతుంది. ఇది దశలవారీగా జరిగే ప్రక్రియ. దీనికి మరో 3–4 సంవత్సరాలు పడుతుంది. ఈ పనులన్నీ పూర్తయితే ప్రభుత్వ స్కూళ్లలో నాణ్యత పెరుగుతుంది. ప్రభుత్వం ఈ పనులు చేపట్టి.. పిల్లల తల్లిదండ్రుల్లో నమ్మకాన్ని కలిగించింది. నాడు–నేడు లో చివరి ప్రక్రియ డిజిటలైజేషన్ ఆఫ్ క్లాస్ రూమ్స్. అది జరిగితే నాడు నేడు పూర్తయినట్లు అని సీఎం జగన్ తెలిపారు. ఇంకా.. ► డిజిటలైజేషన్ ప్రక్రియలో స్కూల్లో ఉన్న ప్రతి క్లాస్‌రూం డిజిటలైజేషన్ కావాలి. ► ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న పేదపిల్లలకు మంచి భవిష్యత్ అందించాలన్నదే మన లక్ష్యం. ► అప్పుడే వారి జీవితాల్లో మార్పు వస్తుంది.. పేదరికం నుంచి బయటపడతారు. కేవలం విద్య ద్వారా మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ► విద్యారంగంలో చేపడుతున్న ఈ మార్పులు విషయంలో రాజీ పడొద్దు. ► విద్యారంగంలో పెడుతున్న ఖర్చు మానవవనరుల మీద పెడుతున్న అతి పెద్ద పెట్టుబడి కింద భావించాలి. ఈ విషయంలో ఎలాంటి వెనుకడుగు వేయాల్సిన పనిలేదు. ► గోరుముద్ద అమలు ప్రక్రియ కూడా పక్కాగా ఉండాలి. ► ఎస్ఎంఎఫ్, టీఎంఎఫ్ నిర్వహణకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. ► సీబీఎస్ఈ సిలబస్‌కు సంబంధించి ఇప్పటివరకు 1000 స్కూళ్లకు సీబీఎస్ఈ అఫిలియేషన్ వచ్చిందని తెలిపిన అధికారులు. ► నాడు–నేడు చేపట్టిన ప్రతి స్కూలుకు సీబీఎస్ఈ అఫిలియేషన్ ఉండాలి. ఈ దిశగా మరింత కృషి చేయాలన్నారు సీఎం జగన్. గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాల అమలు ప్రగతిని అధికారులు వివరించారు ► బైజూస్ కంటెంట్‌ను పాఠ్యప్రణాళికలో పొందుపరుస్తున్నాం. ► ఆఫ్ లైన్లోనూ ట్యాబులు వినియోగించుకునేందుకు వీలుగా అందులో కంటెంట్‌ను ప్రీలోడ్ చేస్తున్నాం. ► ఏప్రిల్ 2023లోగా తరగతి గదుల్లో డిజిటల్ క్లాస్ రూమ్స్‌ను ఏర్పాటు చేస్తామని, కార్యాచరణ రూపొందించామని వెల్లడి. ► మధ్యాహ్న భోజనానికి సార్టెక్స్ చేసిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నాం. ► అలాగే మెనూలో కూడా మార్పులు చేర్పులకు ప్రతిపాదనలు సిద్ధంచేస్తున్నాం. ► గుడ్లు పాడైపోకుండా పాటించాల్సిన పద్ధతులపై ఎస్ఓపీ కూడా తయారుచేశాం. ► వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్ ప్రకారం విద్యాకానుక కింద వస్తువుల కొనుగోలు కొనసాగుతోంది. ► ఫేజ్– 2 కింద 22,344 స్కూళ్లో నాడు – నేడు పనులు కొనసాగుతున్నాయి. ► బైజూస్ కంటెంట్‌ను ఇతర విద్యార్థులకు కూడా అందుబాటులోకి తీసుకురావడానికి వారి తల్లిదండ్రుల స్మార్ట్ ఫోన్లలోకి లోడ్ చేసే ప్రక్రియనూ ముందుకు తీసుకెళ్తున్నాం. ► 2024–25లో సీబీఎస్ఈ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు మరింత తోడుగా నిలవడానికి బోధనలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. ► 8వ తరగతి విద్యార్థులకు ఆంగ్ల భాషా పరిజ్ఞానంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామన్న అధికారులు. ► అధికారులకు ప్రశంసలు... పాఠశాల విద్యా పనితీరు సూచికల్లో అద్భుత పనితీరు కనపర్చింది ఏపీ. పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్(పీజీఐ)లో అగ్రశ్రేణి రాష్ట్రాల జాబితాలో చేరింది. దీంతో అధికారులను అభినందించారు సీఎం జగన్. కేంద్ర విద్యాశాఖపరిధిలో పాఠశాల విద్య, అక్షరాస్యత విభాగం.. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు 2020–21 గానూ పనితీరు గ్రేడింగ్ సూచీ(పీజీఐ) విడుదల చేసింది. రాష్ట్రాల వారీగా పాఠశాల విద్యావ్యవస్ధను విశ్లేషించేందుకు ఇది ఒక సాక్ష్యాధారిత ప్రత్యేక సూచీగా నిలుస్తుంది. మొత్తం 70 ఇండికేటర్ల ప్రాతిపదికన 1000 పాయింట్లను నిర్ణయించారు. వీటని ఫలితాలు, పాలనా యాజమాన్యం అనే రెండు కేటగిరీలుగా విభజించారు. వీటిని మరలా అభ్యాస ఫలితాలు, లభ్యత, మౌలిక సదుపాయాలు, ఈక్విటీ, పాలన ప్రక్రియకు సంబంధించిన 5 డొమైన్లుగా విభజించి పాయింట్లు కేటాయిస్తారు. ఇందులో 950 పాయింట్లు సాధించిన రాష్ట్రం లెవల్ –1లో ఉంటుంది. ఈ లెవల్ - 1 జాబితాలోలో ఏ రాష్ట్రమూ లేదు. 901 నుంచి 950 మధ్య స్కోరు సాధించిన లెవల్ - 2 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ నిల్చింది. విద్యారంగంలో చేపడుతున్న సంస్కరణలు, విప్లవాత్మక మార్పుల ఫలితంగా రాష్ట్రం ఈ జాబితాలో చోటు దక్కించుకుంది. తొలిసారిగా లెవల్-2 కు చేరుకుంది ఏపీ. గతంలో ఎప్పుడూ ఈ స్ధాయికి చేరుకోలేదు. -
Andhra Pradesh: జిల్లా స్థాయిలో ఆధార్ పర్యవేక్షణ కమిటీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఆధార్ సంబంధిత కార్యకలాపాలన్నీ పర్యవేక్షించేందుకు కలెక్టర్ల అధ్యక్షతన జిల్లాస్థాయి కమిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు పిల్లలతో సహా నూటికి నూరు శాతం ఆధార్ అనుసంధానం చేయించడం, సంబంధిత అంశాలను మరింత పటిష్టంగా అమలు కోసం జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేసినట్టు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 5.17 కోట్ల ఆధార్ నంబర్లు జారీ చేయగా.. 97 శాతం జనాభాకు ఆధార్ కవర్ అయినట్టు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఆధార్ సంబంధిత కార్యకలాపాల పర్యవేక్షణకు కలెక్టర్ అధ్యక్షునిగా జిల్లాస్థాయి కమిటీలను ఏర్పాటు చేశామని, ఇవి కనీసం మూడునెలలకోసారి సమావేశమై ఆధార్ సంబంధిత కార్యకలాపాలను సమీక్షించి అవసరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కమిటీ పర్యవేక్షించే అంశాలు ఇలా.. కవర్ కాని ప్రాంతాల్లో అదనపు ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల ఏర్పాటు. జిల్లా, సబ్ జిల్లా, బ్లాక్ స్థాయిలో ఆధార్ సేవా కేంద్రాలు ఏర్పాటు. జనన రిజిస్ట్రేషన్‌తో ఆధార్ అనుసంధానం చేయడం. వివిధ పథకాలన్నింటికీ ఆధార్ అనుసంధానం చేయడం. ఆధార్‌కు సంబంధించి మోసపూరిత కార్యకలాపాలను పర్యవేక్షించడం. ఆధార్ ఎన్రోల్మెంట్ కేంద్రాల కార్యకలాపాలను పర్యవేక్షణ చేయడంతోపాటు సమస్యలను పరిష్కరించడం. ఆధార్‌కు సంబంధించి నిపుణులు అవసరమైతే చైర్మన్ కమిటీలో నియమించవచ్చు. -
ప్రాధాన్య పనులు వేగంగా
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం వేగం పుంజుకుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రజాప్రతినిధులు సచివాలయాల సందర్శన సందర్భంగా అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనులకు నిధులు మంజూరు చేసి ప్రారంభించడంలో అధికార యంత్రాంగం నిమగ్నమైంది. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 27వ తేదీ వరకు 3,120 సచివాలయాల పరిధిలో రూ.624 కోట్ల విలువైన ప్రాధాన్యత పనులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటివరకు 17,107 గుర్తించగా 15,163 అత్యంత ప్రాధాన్యత పనులను మంజూరు చేశారు. ఇందులో ఇప్పటికే 1,697 సచివాలయాల పరిధిలో 8,248 పనులు ప్రారంభమయ్యాయి. వీటికి అవసరమైన సిమెంట్‌ను వైఎస్సార్ నిర్మాణ పోర్టల్ ద్వారా రాయితీపై కొనుగోలు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ ఆదేశించారు. ప్రాధాన్యత పనులను చేపట్టేందుకు సచివాలయాలకు రూ.20 లక్షల చొప్పున మొత్తం రూ.3,000.88 కోట్లను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనుల మంజూరు, ప్రారంభంపై సీఎస్ సమీర్ శర్మ ప్రతీ గురువారం వీడియో కాన్పరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష నిర్వహిస్తున్నారు. అత్యధికంగా రోడ్లు, మంచినీరు, డ్రైనేజీ పనులు గడప గడపకు మన ప్రభుత్వంలో అత్యధికంగా అంతర్గత రహదారులు, మంచినీటి పథకాలు, డ్రైనేజీ పనులను మంజూరు చేస్తున్నట్లు గ్రామ, వార్డు సచివాలయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ‘సాక్షి’కి తెలిపారు. విద్యుత్ లైన్ల మార్పు పనులకు డిమాండ్ ఉందని, ట్రాన్స్‌కోకు అడ్వాన్స్ చెల్లింపులు లేకుండా వీటిని చేపట్టాలని ఆదేశించినట్లు చెప్పారు. అడ్వాన్స్ చెల్లింపుల నుంచి వీటికి మినహాయింపు కల్పించినట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అత్యంత ప్రాధాన్యతగా గుర్తించిన పనులను అప్లోడ్ చేసిన వారంలోగా మంజూరు చేయడంతో పాటు నెల రోజుల్లోనే ప్రారంభిస్తున్నామన్నారు. -
సీఎస్ సమీర్‌శర్మకు అస్వస్థత.. విజయానంద్‌కు బాధ్యతలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌శర్మ అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల ఆయన స్వల్ప అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరి ప్రాథమిక చికిత్స చేయించుకున్నారు. అయితే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరగా.. గుండె సంబంధిత చికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన కోలుకుంటున్నారు. కొద్ది రోజుల్లో ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యి విధుల్లో చేరే అవకాశం ఉంది. కాగా, సమీర్‌శర్మను సీఎం వైఎస్ జగన్ బుధవారం ఫోన్లో పరామర్శించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి అదనపు బాధ్యతలు విజయానంద్‌కు.. సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మ అస్వస్థతకు గురై సెలవులో ఉన్న నేపథ్యంలో ఇంధన శాఖ ప్రత్యేక సీఎస్ కె.విజయానంద్‌కు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పూర్తి అదనపు బాధ్యతలను ప్రభుత్వం అప్పగించింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(రాజకీయ) ముఖ్యకార్యదర్శి ముత్యాల రాజు ఉత్తర్వులిచ్చారు. -
AP: దివ్యాంగులకు రిజర్వేషన్ పెంపు
సాక్షి, అమరావతి: దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఇకనుంచి ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం మూడుశాతం ఉన్న రిజర్వేషన్‌ను నాలుగు శాతానికి పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ గురువారం ఉత్తర్వులు జారీచేశారు. నిర్ధారిత వైకల్యాలున్న వారికి నాలుగు శాతం రిజర్వేషన్ వర్తిస్తుందని పేర్కొన్నారు. ఏశాఖలోనైనా రిజర్వేషన్ల నుంచి మినహాయింపు అవసరమైతే అందుకు తగిన కారణాల సమర్థనతోపాటు ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిటీ అనుమతి తీసుకోవాలని తెలిపారు. ఈ రిజర్వేషన్ పెంపునకు అనుగుణంగా ఏపీ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996లో సవరణలు చేయనున్నట్లు పేర్కొన్నారు. వికలాంగుల హక్కుల చట్టం–2016లోని సెక్షన్–34 ప్రకారం ప్రభుత్వ నియామకాలు, పదోన్నతుల్లో నిర్ధారిత వైకల్యాల వ్యక్తులకు నాలుగుశాతం రిజర్వేషన్ కల్పిస్తూ 2020 ఫిబ్రవరి 19వ తేదీన మహిళా శిశు సంక్షేమ, వికలాంగుల సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాలు, పదోన్నతుల్లో దివ్యాంగులకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పించింది. -
షీలా కమిటీ సిఫార్సులే దిక్సూచి
సాక్షి, అమరావతి: రాష్ట్ర విభజన చట్టం షెడ్యూల్ 9లో పొందుపరచిన ప్రభుత్వ రంగ సంస్థలు, కార్పొరేషన్ల మొత్తం ఆస్తులు, అప్పులను షీలా భిడే కమిటీ సిఫార్సుల మేరకు ఇరు రాష్ట్రాలూ విభజించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర హోంశాఖ వద్ద ప్రతిపాదించింది. విభజన సమస్యల పరిష్కారంపై ఆంధ్రప్రదేశ్ అడుగు ముందుకు వేసినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఇందుకు విముఖత వ్యక్తం చేసింది. కేంద్ర హోంశాఖ మాత్రం ఏపీ ప్రతిపాదనల పట్ల సానుకూలత వ్యక్తం చేస్తూ న్యాయ శాఖ సలహా తీసుకోనున్నట్లు తెలిపింది. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్ సమస్యల పరిష్కారంపై ఢిల్లీలో మంగళవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎస్‌లతోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారుల సమావేశం జరిగింది. ► షెడ్యూల్ 9లో పేర్కొన్న 90 ప్రభుత్వ రంగ సంస్ధలు, కార్పొరేషన్ల ఆస్తులు, అప్పులను ఇరు రాష్ట్రాలకు విభజిస్తూ షీలా భిడే నిపుణుల కమిటీ సిఫార్సులు చేసింది. అయితే 68 సంస్థలకు సంబంధించిన సిఫార్సులను తెలంగాణ ప్రభుత్వం, వీటిలో 53 సంస్ధల సిఫార్సులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్ని రోజులుగా అంగీకరిస్తూ వచ్చినా విభజన మాత్రం జరగలేదు. తాజాగా జరిగిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తం 90 సంస్ధలకు సంబంధించి షీలా భిడే సిఫార్సులను యధాతథంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖను కోరింది. ఇందుకు తెలంగాణ ప్రభుత్వం విముఖత వ్యక్తం చేసింది. దీనిపై నిర్ణయం తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కోరగా న్యాయ సలహా తీసుకుంటామని కేంద్ర హోంశాఖ కార్యదర్శి తెలిపారు. ► విభజన చట్టం షెడ్యూల్ 10లో పేర్కొన్న ఇన్స్టిట్యూట్స్ ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించి 2016లో కేంద్ర హోంశాఖ జారీ చేసిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. పదో షెడ్యూల్లోని 142 ఇన్స్టిట్యూషన్ల ఆస్తులు, అప్పుల పంపిణీ జనాభా ప్రాతిపదికన జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరుతూ వస్తోంది. అందుకు అనుగుణంగా ఒక సంస్థ విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా ఇచి్చంది. అయితే కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు సుప్రీం తీర్పునకు విరుద్ధంగా ఉన్నందున ఆ ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ డిమాండ్ చేసింది. దీనిపై సొలిసిటర్ జనరల్ అభిప్రాయాన్ని తీసుకోవాలని కేంద్ర హోంశాఖను కోరింది. ► ఢిల్లీలోని ఏపీ భవన్ ఆస్తులను ఇరు రాష్ట్రాలకు త్వరగా పంపిణీ చేయాలని ఏపీ ప్రభుత్వం కోరగా కేంద్ర హోంశాఖ కార్యదర్శి సానుకూలంగా స్పందించారు. విభజన చట్టం నిబంధనల మేరకు కేంద్రం ఉత్తర్వులు జారీ చేయాలని, జాప్యం చేయవద్దని ఏపీ ప్రభుత్వం కోరింది. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్, రాష్ట్ర పునర్విభజన ముఖ్యకార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యయం భారీగా పెరుగుతోంది.. ► నూతన రాజధాని కోసం రూ.25 వేల కోట్ల వ్యయం అవుతుందని శివరామకృష్ణన్ కమిటీ నివేదికలో పేర్కొన్నారని, ఆ నివేదిక ఇచ్చి చాలా సంవత్సరాలైనందున వ్యయం భారీగా పెరుగుతుందని, ఆ మేరకు నిధులివ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిమాండ్ చేసింది. మీరిచ్చే రూ.2,500 కోట్లు ఏ మూలకూ సరిపోవని ఏపీ ప్రభుత్వం కేంద్ర హోంశాఖకు స్పష్టం చేసింది. ► నూతన రాజధానికి ర్యాపిడ్ రైల్ కనెక్టివిటీ ఏర్పాటును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తావించగా వయబుల్ కాదని రైల్వే శాఖ పేర్కొంది. దీనిపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టలేని కారణంగానే విభజన చట్టంలో చేర్చారని, వయబుల్ కాకపోయినప్పటికీ కేంద్రం చేపట్టాలని ఏపీ ప్రభుత్వం పేర్కొంది. ఏపీ వాదనతో కేంద్ర హోంశాఖ కార్యదర్శి ఏకీభవిస్తూ సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని రైల్వే శాఖకు సూచించారు. -
పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో పలువురు ఐఏఎస్‌లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ బదిలీలు తక్షణం అమల్లోకి వస్తాయంటూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీచేశారు. హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ డైరెక్టర్‌గా ఉన్న చదలవాడ నాగరాణిని సాంకేతిక విద్య డైరెక్టర్‌గా బదిలీ చేశారు. పోలా భాస్కర్‌ను సాంకేతిక విద్య డైరెక్టర్‌గా పూర్తి అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శిగా ఉన్న ఎంఎం నాయక్‌ను హ్యాండ్లూమ్స్, టెక్స్టైల్స్ కార్యదర్శిగా బదిలీ చేశారు. ఆయనకు ఆప్కో వీసీ, ఎండీతోపాటు ఏపీ ఖాదీ, గ్రామీణ పరిశ్రమల బోర్డు సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆప్కో ఎండీ, ఖాదీ–గ్రామీణ పరిశ్రమల శాఖ సీఈఓ బాధ్యతల నుంచి చదలవాడ నాగరాణిని రిలీవ్ చేశారు. ఇక బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. జయలక్ష్మికి సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు. మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ కమిషనర్‌గా ఉన్న కాటంనేని భాస్కర్‌ను పాఠశాల విద్యా శాఖ పరిధిలోని పాఠశాల మౌలిక వసతుల కమిషనర్‌గా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు కాటంనేని భాస్కర్ మిషన్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్స్ కమిషనర్‌గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తారు. అలాగే, బి. శ్రీనివాసరావును సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు శ్రీనివాసరావుకు రైతుబజార్ల సీఈఓగా పూర్తి అదనపు బాధ్యతల్లో కొనసాగనున్నారు. -
విద్యాశాఖపై సమీక్షలో సీఎం జగన్ కీలక ఆదేశాలు
-
CM Jagan: అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్యాశాఖపై సమీక్ష చేపట్టారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్ సమీర్‌శర్మ, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ మేరకు స్కూళ్ల నిర్వహణ కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని సీఎం జగన్ ఆదేశించారు. స్కూళ్లకు ఎలాంటి మరమ్మత్తు వచ్చినా వెంటనే బాగు చేసే విధానం ఉండాలన్నారు. అదే సమయంలో అన్ని స్కూళ్లకు ఇంటర్నెట్ను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. వచ్చే ఏడాది విద్యాకానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరినాటికే సిద్ధం చేయాలన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులను వెంటనే ప్రొక్యూర్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోధన కోసం టీవీ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధం చేయాలని, దశలవారీగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ సూచించారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. నాడు – నేడు కింద పనులు పూర్తిచేసుకున్న స్కూళ్లలో నిర్వహణ బాగుండాలి, దీనికోసం ఎస్ఓపీలను రూపొందించాలి ఒక ప్రత్యేక అధికారికి స్కూళ్ల నిర్వహణ బాధ్యతలు అప్పగించండి స్కూళ్లకు కల్పించిన సౌకర్యాల నిర్వహణ విషయంలో ఎక్కడ ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే మరమ్మతులు నిర్వహించేలా విధానం ఉండాలి వచ్చే సమీక్షా సమావేశం నాటికి దీనికి సంబంధించిన విధి విధానాలు రూపొందించాలన్న సీఎం ఒక ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించాలని సీఎం ఆదేశాలు అన్ని స్కూళ్లకూ ఇంటర్నెట్ సదుపాయం కల్పించాలన్న సీఎం అత్యుత్తమ బోధనకు ఇది దోహదపడుతుందన్న సీఎం స్కూళ్లకు కాంపౌండ్ వాల్స్ తప్పనిసరిగా ఉండాలి, వీటిపై దృష్టిపెట్టాలి జగనన్న విద్యా కానుకపై సీఎం సమీక్ష వచ్చే ఏడాది విద్యాకానుకకు సంబంధించి ఇప్పటినుంచే అన్నిరకాలుగా సిద్ధంకావాలని సీఎం ఆదేశాలు ఏప్రిల్ నాటికే విద్యా కానుక కింద అందించే వాటిని సిద్ధంచేసుకోవాలన్న సీఎం సమావేశంలో పిల్లలకు అందిస్తున్న యూనిఫామ్ నాణ్యతను పరిశీలించిన సీఎం. ట్యాబ్‌ల పంపిణీపైనా సమీక్ష 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు అందించే కార్యక్రమంపైనా సీఎం సమీక్ష టెండర్లు ఖరారుచేసి వెంటనే ఆర్డర్ ఇవ్వాలని సీఎం ఆదేశం తరగతి గదుల డిజిటలైజేషన్‌మీద సీఎం సమీక్ష స్మార్ట్ టీవీ లేదా ఇంటరాక్టివ్ టీవీ ఏర్పాటుపైనా సీఎం సమీక్ష ప్రతి తరగతి గదిలోనూ ఏర్పాటుపై కార్యాచరణ సిద్ధంచేయాలని సీఎం ఆదేశం పాఠ్యపుస్తకాలకు సంబంధించిన కంటెంట్‌ను అందరికీ అందుబాటులో పెట్టండి పీడీఎఫ్ ఫైల్స్ రూపంలో అందరికీ అందుబాటులో ఉండేలా చూడండి దీనివల్ల లిబరల్గా అందరికీ పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి వస్తాయి అంతేకాక ప్రభుత్వేతర స్కూళ్లు ఎవరైనా ప్రభుత్వ ముద్రణా సంస్థ నుంచి పాఠ్యపుస్తకాలు కావాలనుకుంటే.. నిర్ణీత తేదీలోగా ఎన్ని పుస్తకాలు కావాలో వివరాలు తీసుకుని ఆమేరకు వాటిని అందించండి ఎక్కడా కూడా పాఠ్యపుస్తకాల కొరత అనేది ఉండకూడదు అధికారులకు స్పష్టం చేసిన సీఎం బాలికల భద్రతపై అవగాహన రక్షణ, భద్రత, ఆరోగ్యం తదితర అంశాలపై స్కూళ్లలో విద్యార్థినులకు సరైన అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ గ్రామ సచివాలయం నుంచి మహిళా పోలీసు, ఏఎన్ఎం తరచుగా వీరిని కలిసి అవగాహన కల్పించాలన్న సీఎం జగన్ విద్యార్థినులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఒక మహిళా ఉపాధ్యాయురాలిని కౌన్సెలింగ్ కోసం నియమించాలన్న సీఎం జగన్ -
లంచమడిగితే వెంటనే చర్యలు
సాక్షి, అమరావతి: ఏ ప్రభుత్వ అధికారి లంచం అడిగినా ‘ఏసీబీ 14400 యాప్’ ద్వారా ఫిర్యాదు చేస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ చెప్పారు. మంగళవారం సచివాలయం మొదటి బ్లాక్ నుంచి ఏసీబీ 14400 కాల్ సర్వీసులు, దానిపై రూపొందించిన యాప్‌పై వీడియో సమావేశం ద్వారా ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీనిపై విస్తృత ప్రచారం కల్పించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ యాప్‌ను ప్రజలు గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ యాప్‌లో లైవ్ రికార్డు ఆడియో, ఫొటో లేదా వీడియో సౌకర్యం వంటి ప్రత్యేక ఆప్షన్లు ఉన్నాయని వివరించారు. వీడియోలు, ఫొటోలు, డాక్యుమెంట్లు, ఇతర ఆధారాలతో ఫిర్యాదు చేసేందుకు వీలైన సౌకర్యం ఇందులో ఉందని తెలిపారు. ఈ యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే సంబంధిత మొబైల్‌కు ఆ ఫిర్యాదుకు సంబంధించిన రిఫరెన్స్ వస్తుందన్నారు. -
మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్ స్పందన
-
AP: వాళ్ల సమస్యలను వెంటనే పరిష్కరించండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గృహ నిర్మాణాలకు వనరుల విషయంలో దృష్టిసారించాలని, నాణ్యత విషయంలో రాజీపడొద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి.. సంబంధిత అధికారులను ఆదేశించారు. ఏపీలో గృహనిర్మాణశాఖపై తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇవాళ(సోమవారం) సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా.. ఏపీలో మున్సిపల్ కార్మికుల సమస్యలపై సీఎం వైఎస్ జగన్ స్పందించారు. వారి సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి హై పవర్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు సీఎం జగన్ తెలిపారు. సీఎస్ సమీర్ శర్మ నేతృత్వంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్‌లతో కూడిన హై పవర్ కమిటీని సమస్య పరిష్కారం కోసం నియమించినట్టు స్పష్టం చేశారు. ఇది కూడా చదవండి: గృహ నిర్మాణంపై సీఎం జగన్ సమీక్ష.. వనరులపై దృష్టిసారించాలని ఆదేశం -
ఏబీవీ సస్పెన్షన్
సాక్షి, అమరావతి: ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఆయనపై గతంలో క్రిమినల్ కేసు నమోదై ఉండటంతో అఖిల భారత సర్వీసు నిబంధనల ప్రకారం సస్పెండ్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ విభాగం అదనపు డీజీగా ఉన్నప్పుడు ఏబీ వెంకటేశ్వరరావు దేశ రక్షణ శాఖ నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాలు కొనుగోలు చేశారని ఆయనపై గతంలో కేసు నమోదైంది. కేంద్ర హోంశాఖ ఆమోదించడంతో ఆయన్ను 2020, మార్చి 7న సస్పెండ్ చేసింది. దీనిపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు ఆయన సస్పెన్షన్ ఈ ఏడాది ఫిబ్రవరి 7తో ముగిసినట్లు చెప్పింది. కానీ, గతంలో ఆయనపై నమోదైన క్రిమినల్ కేసుల విషయంలో దర్యాప్తును కొనసాగించవచ్చని, అందుకు అనుగుణంగా ఉన్నతాధికారులు తగిన చర్యలు తీసుకోవచ్చని పేర్కొంది. తదనంతర పరిణామాలతో ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా నియమించింది. కానీ, ఆయన తనపై నమోదైన క్రిమినల్ కేసుకు సంబంధించి సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని ప్రభుత్వం గుర్తించింది. ఎందుకంటే నిబంధనలకు విరుద్ధంగా నిఘా పరికరాల కొనుగోలు, అందుకోసం తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆకాశ్ అడ్వాన్స్డ్ సిస్టం అనే కంపెనీకి అడ్డగోలుగా లబ్ధి కలిగించారన్న ఆరోపణలపై ఆయనపై కేసు పెండింగులో ఉంది. ఆ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు వీలుగా టెండరు నిబంధనలు, సాంకేతిక అర్హతలను కూడా మార్చారు. అంతేకాక.. ఆకాశ్ అడ్వాన్స్డ్ సిస్టం కంపెనీకి ప్రయోజనం కల్పిస్తూ 2018, అక్టోబరు 31న రూ.35లక్షలు చెల్లించారు. ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇజ్రాయెల్‌కు చెందిన ఆర్టీ ఇన్‌ఫ్లాటబుల్ ఆబ్జెక్ట్స్ లిమిటెడ్/ ఆర్టీ ఎల్‌టీఏ సిస్టమ్స్ ఉత్పత్తులను భారత్‌లో మార్కెట్ సృష్టించేందుకు యత్నించారు. అందుకోసం ఏబీ వెంకటేశ్వరరావు తన అధికారిక హోదాను దుర్వినియోగం చేస్తూ టెక్నికల్, కొనుగోలు కమిటీలను ప్రభావితం చేశారు. ఆ విధంగా సర్వీసు నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా కుట్రపూరితంగా వ్యవహరించిన ఆయనపై క్రిమినల్ కేసు నమోదైంది. మరోసారి సర్వీసు నిబంధనలు ఉల్లంఘన ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం సస్పెన్షన్ అనంతరం ప్రింటింగ్, స్టేషనరీ, స్టోర్స్ విభాగం కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఏబీ వెంకటేశ్వరరావు తనపై పెండింగులో ఉన్న క్రిమినల్ కేసులో సాక్షులను ప్రభావితం చేసేందుకు యత్నించడం ద్వారా అఖిల భారత సర్వీసు నిబంధనలను మరోసారి ఉల్లంఘించారు. క్రిమినల్ కేసు పెండింగులో ఉన్న అధికారి తన హోదాను దుర్వినియోగం చేస్తే సస్పెన్షన్ విధించవచ్చని సర్వీసు నిబంధనలు స్పష్టంచేస్తున్నాయి. ఆ నిబంధనను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును మంగళవారం సస్పెండ్ చేసింది. సస్పెన్షన్ కాలంలో ముందస్తు అనుమతిలేకుండా విజయవాడను విడిచి వెళ్లకూడదని కూడా ఆ ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది. -
విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ.. సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విద్యాశాఖలో నాడు-నేడు, డిజిటల్ లెర్నింగ్‌పై సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో బైజూస్‌తో ఒప్పందం దృష్ట్యా విద్యార్థులకు సంబంధిత కంటెంట్ అందించడంపై సీఎం జగన్ చర్చించారు. అలాగే సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వడంపై సమీక్షించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. తరగతి గదుల్లో డిజిటల్ స్క్రీన్ల ఏర్పాటుపై కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్నామన్నారు.. సెప్టెంబరులో 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్ ఇస్తామని, ఆ ట్యాబ్‌లో బైజూస్ కంటెంట్‌ను లోడ్ చేయాలని తెలిపారు. దీనికి తగినట్టుగా ట్యాబ్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు ఉండాలన్నారు ఇవి నిర్దారించాక ట్యాబ్‌ల కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టాలని పేర్కొన్నారు.. టెండర్లు పిలిచేటప్పప్పుడు నాణ్యత, డ్యూరబులటీని దృష్టిలో ఉంచుకోవాలని సూచించారు. 8వ తరగతిలో ఇచ్చే ట్యాబ్ సంబంధిత విద్యార్థి తర్వాత చదివే తరగతులకు కూడా అంటే 9, 10 తరగతుల్లో కూడా పనిచేయాలని తెలిపారు. అందుకే నిర్వహణ కూడా అత్యంత ముఖ్యమని, ఏదైనా సమస్య వస్తే వెంటనే దాన్ని రిపేరు చేసే అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. నిర్దేశిత సమయంలోగా ట్యాబ్‌లు పిల్లలకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంచి కంపెనీలను పరిగణలోకి తీసుకోవాలని తెలిపారు. చదవండి: మేనిఫెస్టోను పవిత్ర గ్రంధంలా భావించిన ఘనత సీఎం జగన్‌దే: పెద్దిరెడ్డి ఇంకా ఏమన్నారంటే.. ►అలాగే తరగతి గదిలో డిజిటల్ బోర్డులు, టీవీలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ►దీనికి సంబంధించి కార్యాచరణ కూడా రూపొందించండి: ►విద్యా నిపుణుల సలహా మేరకు కొన్ని తరగతుల్లో ఇంటరాక్టివ్, మరికొన్ని తరగతులకు టీవీ స్క్రీన్లు పెట్టేందుకు ప్రతిపాదిస్తున్నామన్న అధికారులు. ►ప్రతి తరగతి గదిలోనూ ఇవి ఉండేలా చూడాలని సీఎం ఆదేశం ►తరగతి గదిలో డిజిటల్ స్క్రీన్, బ్లాక్ బోర్డులు.. వీటి అమరిక ఎలా ఉండాలన్న దానిపై కూడా ఆలోచన చేయాలన్న సీఎం ►బోధనకు ఎప్పుడు, దేన్ని ఉపయోగించుకున్నా.. అందుకు అనుగుణంగా వీటి అమరిక ఉండాలన్న సీఎం ►ఇప్పటికే డిజిటల్ స్క్రీన్లు, బోర్డులు వినియోగిస్తున్న తీరును పరిశీలించాలన్న సీఎం ►వీటి వల్ల సైన్స్, మాథ్స్ లాంటి సబ్జెక్టులు పిల్లలకు మరింత సులభంగా చక్కగా అర్థం అవుతాయన్న సీఎం ►వీటి వల్ల టీచర్ల బోధనా సామర్ధ్యం కూడా పెరుగుతుంది ►స్క్రీన్ మీద కంటెంట్‌ను హైలెట్ చేసుకునేలా, ఎనలార్జ్ చేసుకునేలా ఏర్పాటు ఉంటే బాగుంటుంది. ►డిజిటల్ స్క్రీన్లు, ప్యానెళ్ల ఆస్తుల భద్రతపైనా దృష్టి పెట్టాలి ►దీనికి సంబంధించి కూడా ప్రతిపాదనలు తయారుచేయాలి ఈ సమీక్షా సమావేశానికి సీఎస్ సమీర్ శర్మ, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్ కుమార్, సర్వ శిక్షా అభయాన్ ఎస్పీడీ వెట్రిసెల్వి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: CM YS Jagan Review: హెల్త్ నాడు-నేడుపై సీఎం జగన్ సమీక్ష -
నిత్యావసర ధరల పర్యవేక్షణకు ప్రత్యేక యాప్
సాక్షి, అమరావతి: రైతు బజారులు, స్థానిక మార్కెట్లలో కూరగాయలు, ఇతర నిత్యావసర సరుకుల ధరల పర్యవేక్షణకు త్వరలో ప్రత్యేక యాప్ అందుబాటులోకి రానుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ చెప్పారు. ఆయన బుధవారం సచివాలయంలో ధరల స్థితిగతులపై అధికారులతో సమీక్షించారు. ఈ ధరలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు వీలుగా సీఎంయాప్–సీపీఏ (కన్సూమర్ ప్రైస్ అప్లికేషన్) పేరిట ప్రత్యేక యాప్‌ను త్వరలో అందుబాటులోకి తేనున్నట్టు తెలిపారు. మార్కెటింగ్, తూనికలు కొలతలు, విజిలెన్స్ అండ్ మానిటరింగ్ అధికారులు, రైతు బజారుల సీఈవో ఈ యాప్‌ను ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ స్థానిక మార్కెట్లలో వివిధ సరుకుల ధరలు, రైతు బజారుల్లోని ధరలను విశ్లేషిస్తూ అందుకు సంబంధించిన డేటాను ఈ యాప్‌లో అందుబాటులో ఉంచుతారని వివరించారు. రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ కమిషనర్ ప్రద్యుమ్న మాట్లాడుతూ 10 శాఖల అధికారులు ఈ యాప్‌ను మానిటర్ చేసేందుకు ప్రత్యేక లాగిన్ ఐడీలను ఇస్తామని చెప్పారు. ధరల పర్యవేక్షణకు ప్రత్యేక మాస్టర్ డ్యాష్ బోర్టును కూడా రూపొందించినట్లు తెలిపారు. విపత్తుల నిర్వహణకు యాప్ రూపొందించాలి నైరుతి రుతుపవన కాలంలో తుపానులు, వరదలు వంటి విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేందుకు సన్నద్ధమై ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ అధికారులను ఆదేశించారు. ఈ విపత్తుల సమాచారాన్ని సకాలంలో సంబంధిత శాఖల అధికారులు పొందేందుకు వీలుగా ప్రత్యేక యాప్‌ను రూపొందించాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను ఆదేశించారు. ఆయన బుధవారం సచివాలయంలో నైరుతి రుతుపవన సన్నాహక ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ నెల మొదటి రెండు వారాల్లో వర్షాలు తక్కువగా, చివరి రెండు వారాల్లో పూర్తిస్థాయిలో పడతాయని వాతావరణ విభాగం అధికారులు తెలిపారని చెప్పారు. జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది తదితరులు మాట్లాడారు. -
ఎకనమిక్ కారిడార్‌కు భూసేకరణ పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: రాయపూర్–విశాఖ ఎకనమిక్ కారిడార్‌కు భూసేకరణ పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మను ప్రధాని నరేంద్రమోదీ ఆదేశించారు. ఈ కారిడార్‌తో ఛత్తీస్‌గఢ్, ఒడిశా, ఏపీ రాష్ట్రాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని ప్రధాని చెప్పారు. అల్యూమినియం, బొగ్గు, బాక్సైట్ వంటి విలువైన ఖనిజాలు విశాఖపట్నం ఓడరేవు ద్వారా ఎగుమతి, దిగుమతులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కాకినాడ–శ్రీకాకుళం సహజ వాయువు ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం వేగవంతమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ బుధవారం ఢిల్లీ నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో వివిధ రాష్ట్రాల సీఎస్‌లు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శులతో ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి రాయపూర్–విశాఖపట్టణం ఎకనమిక్ కారిడార్, కాకినాడ–శ్రీకాకుళం సహజ వాయువు పైపులైను ప్రాజెక్టుల ప్రగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ సమీర్‌శర్మ మాట్లాడుతూ ఎకనమిక్ కారిడార్ కోసం 798 హెక్టార్లకుగాను 561 హెక్టార్ల భూమిని ఇప్పటికే అప్పగించినట్లు చెప్పారు. రోడ్‌సైడ్ ఎమినిటీస్‌కు మరో 50 ఎకరాలు ఇచ్చినట్లు తెలిపారు. మిగిలిన భూసేకరణకు అడ్వాన్స్ పొజిషన్ చేసేందుకు నోటిఫికేషన్ జారీచేస్తున్నట్లు తెలిపారు. సహజవాయువు పైపులైను ప్రాజెక్టుకు సంబంధించి శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వరకు మొదటిదశ పూర్తయిందని చెప్పారు. విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు రెండోదశ పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్టు సీఎస్ తెలిపారు. -
పథకాల అమలుపై దృష్టి పెట్టండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు పూర్తిస్థాయిలో విజయవంతంగా అందేందుకు, వారికి మెరుగైన పాలన అందించేందుకు అన్ని శాఖల కార్యదర్శులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ ఆదేశించారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో గల సీఎం సమావేశ మందిరంలో బుధవారం సీఎస్ అధ్యక్షతన కార్యదర్శుల సమావేశం నిర్వహించారు. గత కార్యదర్శుల సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలు, సుస్థిరాభివృధ్ధి లక్ష్యాల సాధన, సైబర్ సెక్యూరిటీ, ఏపీ ఆన్లైన్ లీగల్ కేసుల పర్యవేక్షణ విధానం వంటి అంశాలపై సమీక్షించారు. కోర్టు కేసులపై ప్రత్యేక దృష్టి ఏపీ ఆన్లైన్ లీగల్ కేస్ మేనేజ్మెంట్ సిస్టం (ఏపీ ఓఎల్‌సీఎంఎస్) చక్కటి విధానమని, న్యాయపరమైన కేసుల నిర్వహణకు సంబంధిత శాఖల్లోని లైజన్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సమీర్‌శర్మ అదేశించారు. ఆయా శాఖల లైజన్ అధికారులు ప్రతిరోజు కోర్టుల్లో నమోదైన కేసులు, వాటికి సంబంధించిన వివరాలను ఆన్లైన్లో పరిశీలించి ఎప్పటికప్పుడు సంబంధిత శాఖ కార్యదర్శికి తెలియజేయడం, సకాలంలో కౌంటర్లు దాఖలు చేయడంతోపాటు కోర్టులకు వివరాలను అందించాలన్నారు. ఇకపై ప్రతినెలా అడ్వకేట్ జనరల్‌తో కలిసి గవర్నమెంట్ ప్లీడర్లు సంబంధిత శాఖల కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేసి కేసులపై సమీక్షించాలని, తద్వారా ప్రభుత్వానికి సంబంధించి పెండింగ్ కేసులను తగ్గించేందుకు వీలుంటుందని సీఎస్ పేర్కొన్నారు. నీతిఆయోగ్ నిర్దేశించిన ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనపై అన్ని శాఖలు ప్రత్యేక దృష్టి సారించాలని అదేశించారు. -
పలువురు ఐపీఎస్ అధికారుల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీచేశారు. బదిలీ అయిన అధికారుల వివరాలు.. -
ఏపీలో 15 మంది ఐపీఎస్‌ల బదిలీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదిహేను మంది ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీ ప్రక్రియ జరిగింది. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పేరు మీదుగా ప్రభుత్వ జీవో విడుదల అయ్యింది. ఎల్‌కేవీ రంగారావు, ఎస్వీ రాజశేఖర బాబు, పీహెచ్డీ రామకృష్ణ, కేవీ మోహన్ రావు, ఎస్ హరికృష్ణ, గోపినాథ్ జట్టి, కోయ ప్రవీణ్, విశాల్ గున్నీ, రవీంద్ర బాబు, అజిత వెజెండ్ల, జీ కృష్ణకాంత్, పీ జగదీశ్, తుహిన్ సిన్హా, బిందు మాధవ్ గరికపాటి, పీవీ రవికుమార్ బదిలీ జాబితాలో ఉన్నారు. విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీకి అదనపు బాధ్యతలు అప్పగించగా, శాంతి భద్రతల డీఐజీగా రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా ఎస్ హరికృష్ణకు, న్యాయవ్యవహారాల ఐజీపీగా గోపీనాథ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. గుంతకల్లు రైల్వే పోలీస్ సూపరింటెండెంట్‌గా అజిత వేజెండ్లకు అదనపు బాధ్యతలు అప్పగించగా, పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు డీఎన్ మహేష్‌ను బదిలీ చేశారు. ఐజీపీ స్పోర్ట్స్, సంక్షేమ బాధ్యతలు ఎల్ కె వి రంగారావుకు, గ్రేహౌండ్స్ డీఐజీగా గోపీనాథ్ శెట్టికి బాధ్యతలు అప్పగించారు. ఇక ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబుకు కాకినాడ థర్డ్ బెటాలియన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీఐజీగా పీహెచ్డీ రామకృష్ణ బదిలీ కాగా, 16వ బెటాలియన్ కమాండెంట్‌గా కోయ ప్రవీణ్‌ను బదిలీ చేశారు. పల్నాడు అదనపు ఎస్పీ అడ్మిన్‌గా బిందు మాధవ్ బాధ్యతలు తీసుకోనున్నారు. తాజా బదిలీలు, పోస్టింగ్‌లు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎస్ తాజా జీవోలో పేర్కొన్నారు. -
ఏపీ సీఎస్ సమీర్‌శర్మ పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. దీంతో సీఎస్ సమీర్ శర్మ మరో 6 నెలల పాటు.. అంటే నవంబరు 30వ తేదీ వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉంటారు. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై ఉత్తర్వులు విడుదల చేసింది డీవోపీటీ(Department of Personnel and Training). గతంలో 6 నెలల పాటు సమీర్ శర్మ కి సర్వీస్ పొడిగించించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ఏపీలో మొదటి సారి ఆరు నెలలకు మించి పొడిగింపు పొందిన అధికారిగా సీఎస్ సమీర్ శర్మ గుర్తింపు దక్కించుకున్నారు. గతంలో యూపీ, బీహార్ సీఎస్ లకు మాత్రమే ఇలాంటి అవకాశం ఇచ్చింది కేంద్రం. -
వ్యర్థాల నిర్వహణకు పటిష్ట చర్యలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతా ల్లో పారిశుధ్యాన్ని మరింత మెరుగుపర్చడంతోపాటు ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణకు పటిష్ట చర్యలు చేపట్టామని ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ తెలిపారు. గురువారం సచివాలయంలోని సీఎస్ సమావేశ మందిరంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణపై ఏర్పాటైన రాష్ట్రస్థాయి టాస్క్‌ఫోర్స్ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ ఆళ్ల అయోధ్య రామిరెడ్డితో కలిసి ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ.. అన్ని గ్రామాలు, పట్టణాల్లో రోజూ ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించేందుకు పటిష్ట చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేసేందుకు విశాఖపట్నం, గుంటూరు క్లస్టర్లలో ఏర్పాటైన ప్లాంట్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. వివిధ గ్రామ పంచాయతీలను మ్యాపింగ్ చేసి ఘన, ద్రవ వ్యర్థాలను సక్రమంగా నిర్వహించేం దుకు చర్యలు తీసుకోవాలని స్వచ్ఛాంధ్రప్రదేశ్ అధికారులను ఆదేశించారు. గ్రామాలు, పట్టణా ల్లో పారిశుధ్యాన్ని మెరుగుపర్చేందుకు ఈ నెల 29, 30 తేదీల్లో మాస్ క్లీనింగ్ కార్యక్రమాన్ని పెద్దఎత్తున చేపడుతున్నామన్నారు. ఆళ్ల అయోధ్య రామిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి 100 కి.మీల పరిధిలో వ్యర్థాల నుంచి ఇంధనం తయారు చేసే ప్లాంటును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఇందుకు మౌలిక సదుపాయాలను కల్పించేందుకు చర్యలు తీసు కోవాలని అధికారులకు సూచించారు. ఈ సమా వేశంలో స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఎండీ పి.సంపత్‌కుమార్, రాష్ట్ర అటవీ పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నీరబ్‌కుమార్ ప్రసాద్, వీడియో లింక్ ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కాలుష్య నియంత్రణమండలి కార్యదర్శి విజయకుమార్, మున్సిపల్ పరిపాలన శాఖ కమిషనర్, డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీలను త్వరగా అందుబాటులోకి తేవాలి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయతలపెట్టిన జిల్లా పోలీస్ కంప్లైంట్ అథారిటీలకు మౌలిక సదుపాయాల కల్పనపై గురువారం సచివాలయంలో సీఎస్ సమీర్‌శర్మ అధికారులతో సమీ క్షించారు. కలెక్టర్లతో మాట్లాడి ఆయా కలెక్టరేట్ల లో రెండేసి రూముల వంతున వసతి కల్పించేలా చర్యలు తీసుకోవాలని సీసీఎల్ఏ కార్యదర్శి అ హ్మద్బాబును ఆదేశించారు. త్వరితగతిన పోలీస్ కంప్లైంట్ అథారిటీలు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్‌కు సూచించారు. జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియాపై సీఎస్ సమీక్ష నేషనల్ జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వివిధ అంశాలపై సీఎస్ సచివాలయం నుంచి న్యాయాధికా రులతో సమీక్షించారు. వీడియో ద్వారా హైకోర్టు రిజిస్ట్రార్ వెంకట రమణ, తదితరులు పలు అంశాలను సీఎస్ దృష్టికి తెచ్చారు. వాటిలో ప్రాధాన్యతతో కూడిన అంశాలను త్వరగా పరిష్కరించాలని కోరారు. అనంతరం సీఎస్ మాట్లాడుతూ.. అథారిటీకి సంబంధించిన వివిధ అంశాల ప్రగతిని ప్రతి సోమవారం న్యాయశాఖ కార్యదర్శి తనకు వివరించాలని కోరారు. -
నూతనోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలన సౌలభ్యం, వికేంద్రీకరణ అవసరాల మేరకు ఏర్పాటైన 26 జిల్లాలకు ప్రభుత్వం ఇన్చార్జ్ మంత్రులను నియమించింది. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రులు.. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యకలాపాల అమలుపై సమీక్షలు, పర్యవేక్షణ చేయనున్నారు. అలాగే 26 జిల్లాలకు పార్టీ అధ్యక్షులు, 11 మంది ప్రాంతీయ సమన్వయకర్తలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. దీంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం తొణికిసలాడుతోంది. పాలన వికేంద్రీకరణలో భాగంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించి కొత్తగా ఏర్పాటు చేసిన 26 జిల్లాల్లో ఈ నెల 4 నుంచి పరిపాలనను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. అదేవిధంగా 25 మందితో ఈ నెల 11న కొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు జిల్లాలకు ఇన్చార్జి మంత్రులతోపాటు పార్టీ అధ్యక్షులను, ప్రాంతీయ సమన్వయకర్తలను నియమించారు. వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలు, జిల్లాల అధ్యక్షుల కో–ఆర్డినేటర్‌గా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఇక పార్టీ అనుబంధ విభాగాల ఇన్చార్జిగా రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డిని నియమించారు. ఇందుకు సంబంధించిన వివరాలను వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తితో కలిసి సజ్జల రామకృష్ణారెడ్డి మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఆదిలోనే చెప్పినట్లుగానే.. 2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అఖండ విజయం సాధించి.. అధికారం చేపట్టిన తొలి రోజుల్లోనే రెండున్నరేళ్ల తర్వాత మంత్రివర్గంలో మార్పులు చేసి.. వారికి పార్టీ బాధ్యతలు అప్పగిస్తామని.. మంత్రివర్గంలోకి కొత్తవారిని తీసుకుంటామని.. ఇది నిరంతర ప్రక్రియ అని సీఎం వైఎస్ జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 11న మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించారు. ఎవరిని మంత్రివర్గంలోకి తీసుకోవాలో.. ఎవరికి పార్టీ బాధ్యతలు ఇవ్వాలో తనకు బాగా తెలుసని చెప్పిన సీఎం వైఎస్ జగన్ ఆ మేరకు నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఆదిలోనే చెప్పినట్లుగానే మంత్రివర్గం నుంచి తప్పించినవారికి జిల్లాల పార్టీ అధ్యక్షులుగా, ప్రాంతీయ సమన్వయకర్తలుగా బాధ్యతలు ఇచ్చారు. జిల్లాల పార్టీ అధ్యక్షులు, ఇన్చార్జి మంత్రులు, ప్రాంతీయ సమన్వయకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీని సంస్థాగతంగా మరింతగా బలోపేతం చేయాలని దిశానిర్దేశం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ప్రత్యేక దృష్టి.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజు జూలై 8న వైఎస్సార్సీపీ ప్లీనరీ నిర్వహిస్తామని సీఎం వైఎస్ జగన్ ప్రకటించారు. ఆలోగా పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జిలను జిల్లా అధ్యక్షులు సమన్వయం చేసుకుంటూ వైఎస్సార్సీపీ గ్రామ, మండల కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సంస్థాగతంగా పార్టీ నిర్మాణంలో, పార్టీని బలోపేతం చేయడంలో ప్రాంతీయ సమన్వయకర్తలు క్రియాశీలక పాత్ర పోషించనున్నారు. గడపగడపకూ వెళ్లి ప్రజల ఆశీర్వాదం.. వచ్చే నెల నుంచి ప్రతి నియోజకవర్గంలో నెలకు పది సచివాలయాలను ప్రతి ఎమ్మెల్యే సందర్శించాలని సీఎం వైఎస్ జగన్ నిర్దేశించారు. వాటి పరిధిలోని గ్రామాల్లో 20 రోజులు పర్యటించి.. ప్రతి ఇంటికి వెళ్లాలని సూచించారు. గత మూడేళ్లలో సంక్షేమ పథకాల ద్వారా ఆ ఇంటిలోని సభ్యులకు అందిన ప్రయోజనాన్ని వివరించాలన్నారు. అలాగే ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాలను ఎండగట్టడంతోపాటు తమను ఆశీర్వదించమని ప్రజలను కోరాలని ఇటీవల వైఎస్సార్సీపీ శాసనసభాపక్ష సమావేశంలో ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేశారు. గడపగడపకూ వెళ్లి ప్రజల ఆశీర్వాదం తీసుకుంటున్న సమయంలోనే బూత్ కమిటీలను పునర్ నిర్మించాలని.. వాటిలో కనీసం 50 శాతం మంది మహిళలు ఉండేలా చూడాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో సగటున 80 సచివాలయాల వరకూ ఉంటాయి. గడపగడపకూ వైఎస్సార్సీపీ కార్యక్రమం పూర్తయ్యేసరికి కనీసం ఎనిమిది నెలల సమయం పడుతుంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆశీర్వాదాన్ని పొందడంతోపాటు బూత్ స్థాయి నుంచి పార్టీ మరింతగా బలోపేతమవుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పార్టీ విస్తృత కార్యక్రమాలు చేపట్టనుండటంతో వైఎస్సార్సీపీ శ్రేణుల్లో సరికొత్త జోష్ కనిపిస్తోంది. -
AP: నూతన మంత్రుల ప్రమాణ స్వీకారం.. సీఎస్ కీలక ఆదేశాలు
సాక్షి, అమరావతి: ఈ నెల 11వతేదీన జరగనున్నఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సీఎం క్యాంపు కార్యాలయం నుండి నూతన మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఏర్పాట్లపై వీడియో సమావేశం ద్వారా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ నూతన మంత్రివర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత శాఖల కార్యదర్శులను పోలీస్ శాఖ ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. చదవండి: AP: కేబినెట్ కూర్పుపై సర్వత్రా ఉత్కంఠ బ్లూబుక్ లోని నిబంధనల ప్రకారం నూతన మంత్రి వర్గ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం విజయవంతంగా జరిగేందుకు సంబంధిత శాఖల వారీగా చేపట్టాల్సిన ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని అధికారులను సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో డీఐజీలు సి.త్రివిక్రమ వర్మ, రాజశేఖర్, సమాచార శాఖ సంయుక్త సంచాలకులు పి.కిరణ్ కుమార్ తదితరులుతో పాటు వీడియో సమావేశం ద్వారా గుంటూరు కలెక్టర్ ఎం.వేణుగోపాల్ రెడ్డి, ప్రోటోకాల్ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం రెడ్డి, ఇంకా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
వంట నూనెలకు రైతు బజార్లలో అదనపు కౌంటర్లు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వంట నూనెల ధరలను నిర్దేశిత ఎమ్మార్పీ ధరలకు అమ్మాలని అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)డాక్టర్ సమీర్ శర్మ ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో వంట నూనెలపై సీఎస్ అధ్యక్షతన ప్రైస్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ సన్ ఫ్లవర్, వేరుశనగ, పామాయిల్ నూనెలు ఎమ్మార్పీకే ప్రజలకు అందాలని చెప్పారు. ధరల నియంత్రణకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద వివిధ రైతు బజార్లలో అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయాలని, చౌక ధరల దుకాణాల్లో కూడా నూనెలు విక్రయించాలని ఆదేశించారు. స్వయం సహాయక బృందాలు, మొబైల్ వాహనాల ద్వారా కూడా నూనెలు అమ్మాలని చెప్పారు. హోల్ సేల్ డీలర్లు, మిల్లర్లు, రిఫైనరీదారులు, సాల్వెంట్ ఎక్స్‌ట్రాక్టర్స్, స్టాకిస్టులు కేంద్ర ప్రభుత్వ వెబ్ పోర్టల్‌కు లోబడి స్టాకు పరిమితిని పాటిస్తున్నారో లేదో తనిఖీలు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా అక్రమ స్టాకు గుర్తిస్తే దానిని స్వాధీనం చేసుకుని బహిరంగ మార్కెట్లోకి వెంటనే విడుదల చేసి తక్కువ ధరకు అమ్మాలని చెప్పారు. రాష్ట్రస్థాయి టాస్క్ ఫోర్సు కమిటీ ప్రతి రోజు సమావేశమై వంట నూనెల ధరలను సమీక్షించాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్, డీఎస్‌వోల నేతృత్వంలో నిఘా పెట్టి అక్రమంగా నిల్వ చేసే వారిపై 6ఎ కేసులు నమోదు చేసి స్టాకును స్వాధీనం చేసుకోవాలని సీఎస్ ఆదేశించారు. రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి వై.మధుసూదన్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్, ఈవో కార్యదర్శి గిరిజా శంకర్, మార్కెటింగ్ శాఖ కమిషనర్ ప్రద్యుమ్న తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. వంట నూనెల ధరల నియంత్రణకు కమిటీ రాష్ట్రంలో వంట నూనెల ధరలను అదుపు చేసేందుకు మార్కెటింగ్ శాఖ ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన ప్రత్యేక కమిటీని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సివిల్ సప్లైస్ కమిషనర్ కన్వీనర్‌గా వ్యవహరిస్తారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్, లీగల్ మెట్రాలజీ కంట్రోలర్, వ్యవసాయ–మార్కెటింగ్ శాఖ కమిషనర్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, మార్క్‌ఫెడ్ డైరెక్టర్, రాష్ట్ర సివిల్ సప్లైస్ ఎండీ, ఏపీ ఆయిల్‌ఫెడ్ ఎండీ, రైతు బజార్ల సీఈవో, సివిల్ సప్లైస్ డైరెక్టర్ కమిటీలో సభ్యులుగా ఉంటారని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కమిటీ ఏప్రిల్ 15 వరకు ప్రతిరోజు వంట నూనెల ధరలను సమీక్షించి, సంబంధిత విభాగాల అధికారులకు సూచనలిస్తుందని పేర్కొంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై దిగుమతి సుంకాన్ని తగ్గించింది. దీంతో స్థానిక మార్కెట్లలో ధరలను పెంచాల్సిన అవసరం లేదు. అయినా కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి అధిక రేట్లకు విక్రయిస్తున్నట్టు ప్రభుత్వం గుర్తించింది. వీటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకుంది. వ్యాపారులు, డీలర్ల వద్దనున్న పాత నిల్వలను పాత ధరలకే అమ్మాలని, నిబంధనలను అతిక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. -
కొత్త జిల్లాలకు ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు.. ముఖ్య సూత్రాలు
సాక్షి, అమరావతి: ఏప్రిల్ 2వ తేదీ నుంచి కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లకు అధికారులు, ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్డర్ టు సెర్వ్ ప్రకారం ఆ జిల్లాల్లో వారి సేవలను వినియోగించుకోనుంది. మార్చి 11వ తేదీలోపు తాత్కాలిక కేటాయింపులు పూర్తి చేయాలని అన్ని శాఖలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఆదేశించారు. కొత్త జిల్లాల అపాయింటెడ్ తేదీ నుంచి అధికారులు, ఉద్యోగులు కేటాయించిన చోటు నుంచి పని చేసేలా చూసేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. ఇందు కోసం ఉద్యోగుల సాధారణ బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించారు. ప్రస్తుతం పని చేస్తున్న వారిని ఆ జిల్లాల్లో తాత్కాలికంగా కేటాయించి, ఆ తర్వాత అవకాశాన్ని బట్టి పూర్తి స్థాయి విభజన చేపట్టాలని నిర్ణయించారు. జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాల హెచ్ఓడీలు, ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపునకు అనుసరించాల్సిన మార్గదర్శకాలకు సంబంధించిన ఉత్తర్వులను శనివారం సీఎస్ సమీర్ శర్మ జారీ చేశారు. కేటాయింపులకు ముఖ్య సూత్రాలు ► తాత్కాలిక కేటాయింపులో జిల్లా, డివిజినల్ కార్యాలయాలను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. రాష్ట్ర, రీజినల్/జోనల్, మండలం, గ్రామ స్థాయిలో పరిగణనలోకి తీసుకోకూడదు. ► జిల్లా, డివిజినల్ స్థాయిలో తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న కార్యాలయాలను కేటాయింపులో వదిలేయాలి. ఆ కార్యాలయాలు ప్రస్తుతం కొనసాగే జిల్లాల పరిధిలోనే ఉండేలా చూడాలి. ► తుది కేటాయింపు పూర్తయ్యే వరకు తాత్కాలిక కేటాయింపు ప్రకారం పనిచేసే వారి సీనియారిటీపై ఎలాంటి ప్రభావం ఉండదు. ► జిల్లా/డివిజన్ హెడ్ తప్ప కొత్తగా ఏ పోస్టు సృష్టించకుండా కేటాయింపులు జరపాలి. ► ఉద్యోగులు, అధికారుల తాత్కాలిక కేటాయింపు చేపట్టిన విభాగాధిపతులు ఈ సూత్రాలను కచ్చితంగా పాటించాలి. జిల్లా కార్యాలయాల విభజన ఇలా.. ► జిల్లా పరిధి ఉన్న అన్ని జిల్లా స్థాయి కార్యాలయాలను తాత్కాలిక కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోవాలి. వ్యవసాయ శాఖ జేడీ, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాలు ఈ కోవలోకి వస్తాయి. జిల్లా స్థాయి ఉన్నా జిల్లా పరిధి లేని కార్యాలయాలను కేటాయింపునకు పరిగణనలోకి తీసుకోకూడదు. డివిజనల్ ఫారెస్ట్ అధికారి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయాలు ఈ కోవలోకి వస్తాయి. డివిజనల్ స్థాయి పోలీసు కార్యాలయాలు తమ పరిధిని మార్చకుండా ప్రస్తుతం ఉన్న చోటు నుంచే పని చేయాలి. ► అన్ని శాఖలు జిల్లా స్థాయి పరిపాలనా యూని ట్ను ఏర్పాటు చేసుకోవాలి. ఒకే తరహా క్యాడర్ ఉన్న అధికారి పోస్టును సంబంధిత శాఖకు హెచ్ఓడీ కోసం ఉపయోగించుకోవాలి. కొత్త జిల్లాల్లో హెచ్ఓడీ పోస్టుల్లో తాత్కాలిక నియామకాల కోసం సమాన స్థాయి అధికారులతోపాటు దానికి ఒక ర్యాంకు పైన, ఒక ర్యాంకు తక్కువ క్యాడర్ అధికారుల పూల్‌ను ఏర్పాటు చేసుకోవా లి. అందుబాటులోని రాష్ట్ర, జిల్లా, జోనల్ కార్యాలయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. ► జనాభా,సర్వీస్ డెలివరీ యూనిట్ల సంఖ్య(ఉ దా: అంగన్వాడీ కేంద్రాలు), దాని పరిధి, లబ్ధి దా రుల సంఖ్య ఆధారంగా కొత్త జిల్లాలకు అధి కా రులను ఆ రేషియో ప్రకారం (ప్రొవిజినల్ అ లొ కేషన్ రేషియో) తాత్కాలికంగా కేటాయించాలి. ► జిల్లా కార్యాలయాల మాదిరిగానే డివిజన్ కార్యాలయాలను అదే డివిజన్ స్థాయిలో తాత్కా లిక కేటాయింపులు చేసుకోవాలి. డివిజన్ పరిధి ఉన్న అన్ని డివిజన్ స్థాయి కార్యాలయాలను తాత్కాలిక కేటాయింపులో చేర్చాలి. ఆర్డీఓ కార్యాలయాలు ఈ పరిధిలోకి వస్తాయి. డివిజన్ స్థాయి ఉండి, డివిజన్ పరిధిలోని కార్యాల యాలను కేటాయింపులో చేర్చకూడదు. ఫారెస్ట్ రేంజి కార్యాలయాలు ఈ కోవలోకి వస్తాయి. నివేదికలు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ► పైన పేర్కొన్న మార్గదర్శకాల ప్రకారం ఆయా శాఖల హెచ్ఓడీలు 13 జిల్లాల్లో తక్కువ సంఖ్యలో ఉద్యోగులున్న కార్యాలయాలను గుర్తించాలి. ప్రతి జిల్లాలో ఆయా శాఖల హెచ్ఓడీలు తమ పరిధిలోని కార్యాలయాల్లో వేటిని విభజించాలి.. వేటిని విభజించకూడదు.. ఏవి జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాలో నిర్ధారించాలి. ► ఉద్యోగులు, అధికారులు, కార్యాలయాల విభజనపై సూచించిన విధంగా నివేదికలు తయారు చేసి జిల్లా పునర్వ్యవస్థీకరణ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి. ► ఆ శాఖల కార్యదర్శులు.. కార్యాలయాలు, ఉద్యోగులు, పోస్టుల తాత్కాలిక కేటాయింపులను స్క్రుటినీ చేసి ఆర్థిక శాఖ అనుమతి కోసం పంపాలి. అనుమతిచ్చిన తర్వాత తుది కేటా యింపు జాబితా తయారవుతుంది. ఆర్థిక శాఖ చివరగా ఉద్యోగుల సేవలను ఎక్కడ వినియోగించుకుంటారో తెలుపుతూ ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలను ఆయా శాఖలకు జారీ చేస్తుంది. ► ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలు మార్చి 11వ తేదీకల్లా ఇచ్చేలా ఈ ప్రక్రియలన్నీ పూర్తి చేయాలని సీఎస్ అన్ని శాఖల హెచ్ఓడీలు, ఆర్థిక శాఖను ఆదేశించారు. కొత్త జిల్లాల ఏర్పాటు తుది నోటిఫికేషన్ వెలువడే లోపు పూర్తి కావాలి. ఆర్డర్ టు సెర్వ్.. తాత్కాలికంగా కేటాయించిన ఉద్యోగుల సేవలను కొత్తగా ఏర్పడిన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో వినియోగించుకునేలా ఆర్డర్ టు సెర్వ్ ఆదేశాలు ఇవ్వాలి. రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం వీరి జిల్లా, జోనల్, మల్టీ జోనల్ క్యాడర్లు పాత జిల్లాల్లో ఉన్నట్టుగానే కొనసాగుతాయి. తాత్కాలిక కేటాయింపులో భాగంగా జరిగిన సీనియారిటీ, పదోన్నతులు, సర్వీస్ అంశాలు, ఇతర సర్దుబాట్లన్నీ ప్రజా ప్రయోజనాల కోసం పరిపాలనా అవసరాల కోసం తాత్కాలికంగానే ఉంటాయి. తాత్కాలిక కేటాయింపు లేని ఉద్యోగులు పాత జిల్లాల కార్యాలయాల్లోనే అపాయింటెడ్ డే నుంచి పని చేయాలి. ఉద్యోగులు, అధికారుల తాత్కాలిక కేటాయింపు ప్రక్రియ కోసం బదిలీలపై ఉన్న నిషేధాన్ని తాత్కాలికంగా సడలిస్తారు. బదిలీల రవాణా అలవెన్సు వారి అర్హతలను బట్టి నిబంధనల ప్రకారం మంజూరు చేస్తారు. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కూడా కొత్త జిల్లాల్లో తాత్కాలికంగా పని చేసేందుకు కేటాయిస్తారు. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏపీసీఓఎస్ డేటా బేస్ ప్రకారం కేటాయించాలి. -
AP: వారిని క్షేమంగా రప్పిస్తాం.. ఆందోళన చెందొద్దు
సాక్షి, అమరావతి: ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న విద్యార్థులు, తెలుగు వారందరినీ క్షేమంగా రాష్ట్రానికి తీసుకు వచ్చేందుకు ప్రభుత్వం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ స్పష్టం చేశారు. విద్యార్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. శుక్రవారం ఆయన సచివాలయంలో ప్రత్యేక అధికారి గితేశ్ శర్మ (ఇంటర్నేషనల్ కోఆపరేషన్)తో కలసి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న రాష్ట్రానికి చెందిన వారందరినీ సురక్షితంగా తీసుకువచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారిని స్వరాష్ట్రానికి తీసుకువచ్చేందుకు వీలుగా రాష్ట్ర స్థాయిలో వివిధ అధికారులతో ఒక టాస్క్ ఫోర్సు కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీలో రవాణా, ఆర్అండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శి యం.టి కృష్ణ బాబు, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ ఎండీ ఎ.బాబు, ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, రాష్ట్ర రైతు బజారు సీఈవో శ్రీనివాసులు, ఏపీఎన్ఆర్టీ సొసైటీ సీఈవో కె.దినేష్ కుమార్, ప్రత్యేక అధికారి (ఇంటర్నేషనల్ కోఆపరేషన్) గితేశ్ శర్మ, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ కమిషనర్ కె.కన్నబాబుతో పాటు జిల్లా కలెక్టర్లు సభ్యులుగా ఉన్నారని తెలిపారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న మన రాష్ట్రానికి చెందిన వారంతా తిరిగి వచ్చే వరకు ఈటాస్క్ ఫోర్సు కమిటీ పని చేస్తుందన్నారు. 1902 టోల్ ఫ్రీ నంబర్ ఉక్రెయిన్‌లో చిక్కుకున్న విద్యార్థులు, ఇతర తెలుగు వారిని ఆదుకునేందుకు 1902 టోల్ ఫ్రీ డెడికేటెడ్ నంబరుతో హెల్ప్ లైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని శర్మ తెలిపారు. ఇది 24 గంటలూ పని చేస్తుందన్నారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వారి వివరాలను ఈ నంబర్‌కు ఫోన్ చేసి, తెలియజేస్తే వారిని స్వదేశానికి సురక్షితంగా తీసుకువచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అలాగే 0863–2340678 నంబరుతో హెల్ప్ లైన్ కేంద్రాన్ని, +91–8500027678 నంబరుతో వాట్సప్ గ్రూపును ఏర్పాటు చేశామన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. తహశీల్దార్లు వారి మండలాల పరిధిలోని వారి వివరాలు సేకరించి జిల్లా, రాష్ట్ర స్థాయి కంట్రోల్ రూమ్‌తో సమన్వయం చేస్తారన్నారు. ప్రత్యేకంగా చొరవ చూపిస్తున్న సీఎం ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు వారిని స్వస్థలాలకు తీసుకురావడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేకంగా చొరవ చూపిస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక అధికారి (ఇంటర్నేషనల్ కోఆపరేషన్)గితేశ్ శర్మ పేర్కొన్నారు. ఇప్పటికే కేంద్ర విదేశాంగ శాఖ మంత్రికి లేఖ రాశారని, ఫోన్లో కూడా మాట్లాడారని చెప్పారు. శుక్రవారం ఉన్నత స్థాయి సమీక్షలో పలు ఆదేశాలు జారీ చేశారన్నారు. అక్కడ చిక్కుకు పోయిన కొంత మంది విద్యార్థులతో ఇప్పటికే మాట్లాడామని చెప్పారు. ఏపీ డెయిరీ డెవలప్మెంట్ సంస్థ ఎండీ ఎ.బాబు మాట్లాడుతూ.. కాల్ సెంటర్‌కు ఇప్పటి వరకూ 130 కాల్స్ వచ్చాయని తెలిపారు. తెలుగు విద్యార్థులు ఉన్న విశ్వవిద్యాలయాలు, పోస్టు కోడ్ల ఆధారంగా వివరాలు సేకరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఉక్రెయిన్‌లో 4 కంట్రోల్ రూమ్‌లు ఉక్రెయిన్‌లో భారత విదేశాంగ శాఖ నాలుగు బృందాలను ఏర్పాటు చేసిందని సీఎస్ డా.సమీర్ శర్మ వెల్లడించారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను సరిహద్దు దేశాల వరకు తీసుకువచ్చి, అక్కడి నుంచి విమానాల ద్వారా హంగేరీ, పోలండ్, స్లోవక్ రిపబ్లిక్, రొమేనియాల ద్వారా స్వదేశానికి తీసుకువచ్చేందుకు కేంద్ర విదేశాంగ శాఖ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఈ బృందాలతో సమన్వయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ఉక్రెయిన్ సరిహద్దు దేశాల వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ సభ్యుల వివరాలు హంగేరీ టీం: ఎస్.రాంజీ +36305199944, వాట్సప్ నంబరు +917395983990, అన్కూర్ + 36308644597, మోనిత్ నాగ్ +36302286566, వాట్సప్ నంబర్+918950493059 పోలండ్ టీం: ఫంకజ్ గార్గ్ +48660460814/+48606700105 స్లోవక్ రిపబ్లిక్ టీం: మనోజ్ కుమార్ +421908025212, ఇవాన్ కోజింకా+421908458724 రొమేనియా టీం : గుస్నల్ అన్సారి +40731347728, ఉద్దేశ్య ప్రియదర్శి +40724382287, ఆండ్రా హర్లనోవ్ +40763528454, మారిస్ సిమా +40722220823 ఇదిలా ఉండగా.. ఉక్రెయిన్ సరిహద్దు ప్రాంతాల్లో రెండు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. అక్కడికి వారిని రప్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారి కోసం +48660460814, +48606700105 నంబర్లతో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామన్నారు. అయితే, కంట్రోల్ రూమ్ నెంబర్లకు ఇప్పటికే 130 మంది కాల్ చేశారని, వారిలో వెయ్యి మంది తెలుగు విద్యార్థులు ఉన్నారని చెప్పారు. విద్యార్థుల కోసం ప్రతీ జిల్లా కలెక్టర్ ఆఫీసులో జిల్లా సెల్‌ను ఏర్పాటు చేశామన్నారు. స్వరాష్ట్రానికి విద్యార్థుల తరలింపుపై సీఎం జగన్ ప్రతీ రోజు సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రతీ విద్యార్థిని ట్రేస్ చేసి రోడ్డు మార్గంలో వారిని బోర్డర్‌కు తీసుకువచ్చి అక్కడి నుంచి విమానంలో రాష్ట్రానికి రప్పిస్తామని స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రభుత్వం నుండి పూర్తి సహకారం ఉంటుందని వెల్లడించారు. -
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌గా గౌతమ్ సవాంగ్
-
ఏపీపీఎస్సీ చైర్మన్‌గా గౌతమ్ సవాంగ్.. ఉత్తర్వులు జారీ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్‌ను నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, 2019 జూన్ నుంచి ఆంధ్రప్రదేశ్ డీజీపీగా బాధ్యతలు నిర్వర్తించిన సవాంగ్‌ను ప్రభుత్వం నాలుగు రోజుల క్రితం బదిలీ చేసిన విషయం తెలిసిందే. ఆయన సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో సవాంగ్‌ను ఏపీపీఎస్సీ చైర్మన్‌గా నియమించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. (చదవండి: హత్య, కుట్ర రాజకీయాలే చంద్రబాబు నైజం.. ఈ ప్రశ్నలకు సీబీఐ, సీబీఎన్ సమాధానం చెప్పాలి) -
సర్వాంగ సుందరంగా విశాఖ
సాక్షి, విశాఖపట్నం: అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న నౌకాదళ విన్యాసాలకు ఆహ్వానం పలుకుతున్న విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్‌శర్మ అధికారులను ఆదేశించారు. ఈ నెల 21న ప్రెసిడెంట్ ఫ్లీట్ రివ్యూ (పీఎఫ్ఆర్), 25 నుంచి మార్చి 4 వరకూ మిలాన్ విన్యాసాలకు విశాఖ నగరం ఆతిథ్యమివ్వనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను సీఎస్ శనివారం సమీక్షించారు. బీచ్‌రోడ్డు, తూర్పు నౌకాదళ పరిధిలో రహదారులు, పోర్టు పరిసరాలు, వీవీఐపీలు ప్రయాణించే మార్గాల్లో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్కే బీచ్‌లో అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఆజాది కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా స్వచ్ఛ సర్వేక్షణ్ పైలాన్‌ను సమీర్‌శర్మ, జిల్లా కలెక్టర్ మల్లికార్జున్, జీవీఎంసీ కమిషనర్ డాక్టర్ జి.లక్ష్మీశ ఆవిష్కరించారు. అనంతరం కలెక్టరేట్లో తూర్పు నౌకాదళ ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టరేట్, విశాఖపట్నం పోర్టు ట్రస్టు, జీవీఎంసీ.. పరిశ్రమలు, టూరిజం, కస్టమ్స్ విభాగాల ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ నెల 19 నాటికి నగరంలో అన్ని పనులూ పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటించే ప్రాంతాల్లో పారిశుధ్యం, రహదారులు, బ్యూటిఫికేషన్‌పై దృష్టిసారించాలన్నారు. ఘనంగా మిలాన్ ఏర్పాట్లు అదేవిధంగా 25 నుంచి ప్రారంభమయ్యే మిలాన్‌కు కూడా ఏర్పాట్లు ఘనంగా ఉండాలని సీఎస్ సూచించారు. మిలాన్–2022కి సుమారు 46 దేశాలకు చెందిన 900 మంది ప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్ బ్రాండ్‌ని వారికి పరిచయం చేసి.. ఆంధ్ర సంప్రదాయానికి అంతర్జాతీయ ఖ్యాతి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. 27న బీచ్ రోడ్డులో జరిగే ఇంటర్నేషనల్ పరేడ్ కార్నివాల్‌ని తిలకించేందుకు సుమారు 2 లక్షల మంది హాజరయ్యే అవకాశం ఉందన్నారు. తూర్పు నౌకాదళాధిపతి వైస్ అడ్మిరల్ బిస్వజిత్ దాస్‌గుప్తా, నగర పోలీస్ కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా, జీవీఎంసీ కమిషనర్ డా.లక్ష్మీశ, వీఎంఆర్డీఏ కమిషనర్ వెంకటరమణారెడ్డి, జేసీ వేణుగోపాల్‌రెడ్డి తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
ఐఆర్ ఇవ్వడం వల్లే సమస్య!
సాక్షి, అమరావతి: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఉద్యోగులు అడగకుండానే రాష్ట్ర ప్రభుత్వం 11వ పీఆర్సీలో 30 నెలలపాటు 27 శాతం ఐఆర్ (మధ్యంతర భృతి) ఇచ్చిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ తెలిపారు. దాదాపు రూ.17,918 కోట్ల మేర ప్రభుత్వం ఉద్యోగులకు చెల్లించిందన్నారు. గురువారం గుంటూరు జిల్లా వెలగపూడిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఆర్ అనేది వడ్డీ లేని రుణం అని.. దాన్ని సర్దుబాటు చేయకతప్పదన్నారు. అసలు ఐఆర్ ఇవ్వకుండా డీఏ ఇచ్చి పీఆర్సీ ప్రకటించి ఉంటే సర్దుబాటు సమస్య ఉండేది కాదని చెప్పారు. పరిస్థితులు ఇలాగే ఉంటే భవిష్యత్తులో ఐఆర్‌ను ప్రకటించేందుకు ప్రభుత్వాలు భయపడతాయన్నారు. తెలంగాణ మాదిరి తాము కూడా అప్పట్లోనే డీఏ ఇస్తే ప్రభుత్వానికి రూ.10 వేల కోట్లు మిగిలేవని తెలిపారు. డీఏ, హెచ్ఆర్ఏ, ఐఆర్ వంటి దాదాపు పది అంశాలను కలిపి చూసినప్పుడే వేతనాల్లో పెరుగుదల కనిపిస్తుందన్నారు. కోవిడ్‌తో రాష్ట్ర ఆదాయం గత మూడేళ్లలో 15 శాతం కూడా పెరగలేదని చెప్పారు. ఈ పరిస్థితుల్లోనూ ప్రభుత్వం ఉద్యోగులకు చేయగలిగినంత చేసిందన్నారు. ఇప్పుడు ఒమిక్రాన్ నేపథ్యంలో ప్రభుత్వం భారీగా నిధులను వెచ్చించాల్సిన పరిస్థితులున్నాయని తెలిపారు. ఈ పరిస్థితిని ఉద్యోగులు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు. సమ్మె వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు.. ఉద్యోగులు సంయమనం పాటిస్తూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని సీఎస్ కోరారు. కొత్త పీఆర్సీ అమలు అంశంలో సమ్మెకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. సమ్మెలు, నిరసనలు, ఆందోళనలతో ఎవరికీ ప్రయోజనం ఉండదనే విషయాన్ని ఉద్యోగులు గుర్తించాలని కోరారు. పీఆర్సీకి సంబంధించి ఉద్యోగుల సందేహాలను తీర్చేందుకే ప్రభుత్వం మంత్రుల కమిటీని ఏర్పాటు చేసిందన్నారు. ఉద్యోగులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. పీఆర్సీ ఆలస్యమవుతుంటే ముందస్తు సర్దుబాటుగా ఐఆర్ ఇస్తారన్నారు. కొత్త పీఆర్సీ వల్ల ఎవరి జీతాలు తగ్గలేదని తేల్చిచెప్పారు. ఐఆర్‌తో కొత్త పీఆర్సీని పోల్చిచూడటం సరికాదన్నారు. పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీని పోల్చి చూడాలని సూచించారు. ఎవరికీ జీతం తగ్గలేదు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ.. ఓ పత్రికలో ఉద్యోగుల జీతం తగ్గుతుందంటూ కథనం వచ్చిందని.. అందులో బేసిక్ వేతనాన్ని తక్కువవేయడంతో తగ్గుదల కనిపించిందన్నారు. కొత్త పీఆర్సీతో ఎవరికీ జీతం తగ్గలేదన్నారు. ‘ప్రతి ఉద్యోగికి ఏటా ఇంక్రిమెంట్‌తో 3 శాతం పెరుగుదల ఉంటుంది. ఐఆర్ కలిపినా, కలపకపోయినా జీతం పెరుగుతుంది. ఐఆర్ కేవలం తాత్కాలిక ప్రయోజనం’ అని వివరించారు. ఐఆర్ ప్రకటించేటప్పుడే పీఆర్సీ ఫిట్మెంట్లో హెచ్చుతగ్గులు ఉంటే ఆ వ్యత్యాసాన్ని సర్దుబాటు చేస్తామని సంబంధిత జీవోలో స్పష్టంగా పేర్కొన్నామన్నారు. -
దయచేసి ఉద్యోగులు సమ్మె విరమించాలి: సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఉద్యోగుల సమస్యలు చర్చల ద్వారానే పరిష్కారమవుతాయని ఏపీ సీఎస్ సమీర్ శర్మ పేర్కొన్నారు. చర్చలు జరపకపోతే సమస్యలెలా తీరుతాయని ప్రశ్నించారు. నిరసనలు, ఆందోళనలతో ఉపయోగం ఉండదని, ఉద్యోగులతో చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని స్పష్టం చేశారు. ఉద్యోగులకు కావాల్సింది ఏంటో చెబితే కూర్చొని మాట్లాడతామని తెలిపారు. ఐఆర్ అంటే ముందస్తు సర్దుబాటు అని, పీఆర్సీ ఆలస్యం అయితే ఇస్తారని పేర్కొన్నారు. దయచేసి ఉద్యోగులు సమ్మె విరమించాలని విజ్ఞప్తి చేశారు. కొత్త పీఆర్సీ వల్ల ప్రభుత్వంపై రూ.10 వేల కోట్ల రూపాయల భారం పడుతుందని, డీఏ మాత్రమే పెంచితే 10 వేల కోట్లు మిగిలేవని సీఎస్ తెలిపారు. కొత్త పీఆర్సీ వల్ల ఎవరి జీతాలు తగ్లేదని, ఐఆర్‌తో కొత్త పీఆర్సీని పోల్చి చూడటం సరికాదన్నారు. పాత పీఆర్సీతో కొత్త పీఆర్సీని పోల్చి చూడాలన్నారు. ఉద్యోగులకు సమస్యలు ఉంటే మంత్రుల కమిటీ ఉందని, ఏదైనా రిపోర్ట్ తయారు చేసి పరిష్కారం ఆలోచిద్దామని సూచించారు. చదవండి: సమస్యను మరింత జఠిలం చేసేలా ఉద్యోగుల తీరు: సజ్జల ఎవ్వరికీ జీతం తగ్గలేదు: ప్రిన్సిపాల్ సెక్రెటరీ ఉద్యోగుల జీతం తగ్గిందని ఓ పత్రిక రాసిందని, వాస్తవానికి ఎవ్వరికీ జీతం తగ్గలేదని ప్రిన్సిపాల్ సెక్రెటరీ శశిభూషన్ కుమార్ పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రతి ఉద్యోగికి ఇంక్రిమెంట్ వస్తుంది. దాని వలన 3 శాతం పెరుగుతుంది. ఐఆర్ కలిపినా, కలపకపోయిన జీతం పెరుగుతుంది. ఐఆర్ కేవలం తాత్కాలిక ప్రయోజనం. ఇప్పటి వరకు అన్ని పీఆర్సీల కంటే అత్యధిక ఐఆర్ ఈ ప్రభుత్వం ఇచ్చింది. అది కూడా అత్యధికంగా 30 నెలలు ఐఆర్ ఇచ్చారు.’’ అని ప్రిన్సిపాల్ సెక్రెటరీ వివరించారు. చదవండి: ‘ఉద్యమాన్ని వారే నడుపుతున్నట్లుగా.. చంద్రబాబు బిల్డప్’ -
ఏ ఉద్యోగికీ జీతం తగ్గలేదు.. పే స్లిప్‌లు చూస్తే విషయం తెలుస్తుంది: సీఎస్
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ ప్రకారం ఏ ఒక్క ఉద్యోగి జీతం తగ్గలేదని, ప్రతి ఒక్కరి గ్రాస్ జీతం పెరిగిందని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ చెప్పారు. జీతాలు పెరిగాయి కాబట్టి ఆందోళనలు విరమించుకుని మంత్రుల కమిటీతో చర్చలకు రావాలన్నారు. వెలగపూడి సచివాలయంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉద్యోగుల పే ఫిక్సేషన్ దాదాపు పూర్తయిందని.. డిసెంబర్, జనవరి నెలల పే స్లిప్‌లను పోల్చి చూసుకుని ఎంత జీతం పెరిగిందో తెలుసుకోవచ్చన్నారు. మంగళవారం రాత్రికల్లా ఉద్యోగులందరి ఖాతాల్లో జీతాలు పడతాయని తెలిపారు. ఐఆర్ కలిసినా, కలవకపోయినా జీతాల్లో పెరుగుదల ఉందన్నారు. ఎవరి జీతం తగ్గించకూడదని సీఎం చెప్పారని, ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్నామని స్పష్టం చేశారు. 32 గ్రేడ్ల పే స్లిప్‌లను పరిశీలిస్తే ఎవరికీ జీతం తగ్గలేదన్నారు. సాధారణంగా పీఆర్సీలో ఐఆర్ కలపరని, ఇప్పుడు దాన్ని కలిపి చూసినా కొంచెం పెరుగుదల ఉందని చెప్పారు. ఐఆర్ తీసేసి పీఆర్సీ టు పీఆర్సీ చూస్తే ఇంకా కొంచెం పెరుగుదల ఎక్కువ ఉందన్నారు. ఈ సందర్భంగా సీఎస్ ఇంకా ఏమన్నారంటే.. ప్రభుత్వ ఉద్యోగులు శ్రీనివాసరావు, ఎల్. సత్యనారాయణల నూతన పే స్లిప్‌లు ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం ► రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గత 3, 4 సంవత్సరాలుగా ఇబ్బందికరంగా ఉంది. రూ.60 వేల కోట్ల ఆదాయం తగ్గింది. ప్రతి సంవత్సరం 15 శాతం పెరుగుదల ఉండాలి. కానీ కోవిడ్ వల్ల ఆదాయం పెరగలేదు. గత మూడేళ్లలో రూ.15 వేల కోట్ల నుంచి రూ.20 వేల కోట్ల ఆదాయాన్ని కోల్పోయాం. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని పీఆర్సీ సిఫారసులు చేశాం. ► అయినా 23 శాతం ఫిట్‌మెంట్‌ను ప్రభుత్వం ఇచ్చింది. పీఆర్సీకి మించి ఉద్యోగులకు మేలు జరిగింది. రిటైర్మెంట్ వయసు రెండేళ్ల పెంపుదల, ఎంఐజీ ఇళ్లలో 20 శాతం రాయితీ వంటివి పీఆర్సీకి సంబంధం లేకపోయినా సీఎం ఇచ్చారు. ► ఉద్యోగులు ప్రభుత్వంలో భాగం. అందువల్ల సమ్మె ఆలోచన విరమించుకోవాలి. సమ్మె వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. ఉద్యోగ సంఘాలు మంత్రుల కమిటీతో అన్ని అంశాలపైనా చర్చించాలి. ప్రభుత్వం ఉద్యోగుల వెంటే ఉంది. కావున పరస్పర చర్చల ద్వారానే అన్ని అంశాలు పరిష్కారం అవుతాయి. హెచ్ఆర్ఏ సహా అన్ని అంశాలపైనా చర్చిద్దాం ► ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగుల ఆందోళన కార్యక్రమాలతో ప్రజలు మరిన్ని ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవస్థ ఇంకా క్షీణించే అవకాశం ఉంది. హెచ్ఆర్ఏ సహా అన్ని అంశాలపైనా సామారస్యంగా మాట్లాడుకుందాం. ► ఉద్యోగులతో సంబంధం లేని వ్యక్తులు ఈ అంశాన్ని హైజాక్ చేస్తున్నారు. ఎంత వరకు చేయాలో అంత వరకు ఉద్యోగులకు మేలు చేయాలని సీఎం చెప్పారు. ఉద్యోగుల సమ్మెపై హైకోర్టు ఆదేశాలను గౌరవిస్తాం. కొత్త పీఆర్సీ అమలుకు గతంలో 6 నెలల సమయం పట్టేది. ఇప్పుడు కేవలం 6 రోజుల్లో చేశాం. మనదంతా ఒకే కుటుంబం మన ఉద్యోగులందరిదీ ఒకే కుటుంబం. కొత్త పీఆర్సీ అమలు కోసం డీడీఓలు, ఎస్టీఓలు, డీటీఓలు, డీడీలు, పే అండ్ అకౌంట్స్ ఉద్యోగులు చాలా సహకరించారు. గ్రామ సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు, ఆశావర్కర్లు, అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులందరికీ జీతాలు వారి ఖాతాల్లో వేశాం. 3.3 లక్షల మంది పెన్షనర్ల ఖాతాల్లో పింఛను జమ అయింది. 3.97 లక్షల మంది ఉద్యోగులకు పే ఫిక్సేషన్ చేశాం. వారి ఖాతాల్లో జీతం పడింది. ప్రతి ఉద్యోగికి వారి జీతం వివరాలు పంపాం. అంతే కాకుండా 94,827 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఆప్కాస్ ద్వారా, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు చెల్లించాం. 3,68,545 మంది పెన్షనర్లకు జీతాలు వేశాం. – ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ప్రతి ఒక్కరి జీతం పెరిగింది.. ప్రతి ఉద్యోగికి పాత పీఆర్సీ ప్రకారం డిసెంబర్ నెల జీతం ఎంత వచ్చింది.. కొత్త పీఆర్సీ ప్రకారం జీతం ఎంత వచ్చిందో పే స్లిప్‌లో వివరంగా ఉంటుంది. ఏపీ అసెంబ్లీలో డిప్యుటేషన్‌పై కార్యదర్శి హోదాలో పని చేస్తున్న శ్రీనివాసరావు గ్రాస్ జీతం డిసెంబర్లో రూ.199,685 ఉండగా, కొత్త పీఆర్సీ ప్రకారం రూ.2.32 లక్షలు వచ్చింది. సాంఘిక సంక్షేమ శాఖ సచివాలయంలో పనిచేసే సహాయ సెక్షన్ అధికారి వి శ్రీనివాసులుకు డిసెంబర్లో రూ.50,044 గ్రాస్ జీతం ఉంటే, జనవరి గ్రాస్ జీతం రూ.57,618 వచ్చింది. డిసెంబర్లో ఇతని బేసిక్ పే రూ.27,360 ఉండగా, జనవరిలో అది రూ.42,140కి పెరిగింది. డిసెంబర్లో హెచ్ఆర్ఏ రూ.5,472 ఉండగా జనవరిలో రూ.6,742 ఉంది. ఆయన నికర జీతం డిసెంబర్లో రూ.43,855 కాగా, జనవరిలో రూ.50,075కు పెరిగింది. జల వనరుల శాఖలో ఏఈఈగా పని చేస్తున్న లావు సీతారామయ్య డిసెంబర్ గ్రాస్ రూ.91,181 కాగా, జనవరిలో రూ.99,038కు పెరిగింది. ఐఆర్ మినహాయించి చూస్తే రూ.20,635 పెరిగింది. పోలీసు శాఖలో ఆర్ఎస్ఐగా పని చేస్తున్న బి వెంకటరమణ డిసెంబర్ గ్రాస్ జీతం రూ.1,31,924 కాగా, జనవరిలో గ్రాస్ రూ.1,48,063కి పెరిగింది. ఐఆర్ మినహాయించి చూస్తే ఆయన జీతం రూ.34,048 పెరిగింది. 32 గ్రేడ్ల ఉద్యోగులు, అధికారుల్లో ప్రతి ఒక్కరి జీతం పెరిగింది. – శశిభూషణ్‌కుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి -
ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు.. ఆ ఆలోచనను విరమించుకోండి: సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు సీఎం ఏమి చెయ్యగలరో అన్నీ చేస్తారని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు. ఈ మేరకు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఆర్ ఉన్నా.. ఐఆర్ లేకున్నా ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఎవ్వరికీ జీతం తగ్గకూడదని సీఎం చెప్పారు. గత పీఆర్సీ నుంచి ఇప్పటి పీఆర్సీ వరకు చూస్తూ ఎక్కువ పెరుగుదల ఉంది. ఐఆర్‌తో కలిపినా పెరుగుదల ఉంది. ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు. ఈ రోజు రాత్రికి అందరికీ జీతాలు వచ్చాక తెలుస్తుంది. ఉద్యోగులు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ప్రతి ఏటా 15 శాతం ఆదాయం పెరగాలి. పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్ స్కీమ్ వలన అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగం. ప్రతి పీఆర్సీ అప్పుడు చర్చల కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం. సమ్మె ఆలోచనను విరమించుకోండి. మనమంతా ఒక కుటుంబం. హెచ్ఆర్ఏ లాంటివి మాట్లాడుకుందాం రండి. ఉద్యోగులను చర్చలకు రమ్మని కోరుతున్నాను' అని సీఎస్ సమీర్ అన్నారు. చదవండి: (కేంద్ర బడ్జెట్ నిరుత్సాహపరిచింది: ఎంపీ విజయసాయిరెడ్డి) ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ నుంచి ఉద్యోగులను.. మంత్రులు, అధికారులతో చర్చలకు రమ్మని కోరుతున్నాను. ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. ఒకటో తేదీన జీతాలు వెయ్యడం ప్రభుత్వ బాధ్యత. 3.69లక్షల సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు జీతాలు వేశాము. 1.75 లక్షల ఇతర ఉద్యోగులకు జీతాలు వేశాము. 94,800 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు జమచేశాము. 3.3 లక్షల మంది పెన్షనర్లకు జమచేశాము. 3,97,564 రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు కూడా వేశాము. వారికి శాలరీ బ్రేక్ అప్ కూడా పంపాము. ప్రతి ఉద్యోగి వారి జీతాల పెరుగుదలను తెలుసుకునేలా బ్రేక్ అప్ ఇచ్చాము అని ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్ అన్నారు. -
కరోనా పరిస్థితుల్లో సమ్మెతో ఇబ్బంది
సాక్షి, అమరావతి: ‘ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఉద్యోగులు సమ్మెకు వెళితే దాని పరిణామాలు ఎలా ఉంటాయో ప్రతి ఉద్యోగి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా కోవిడ్ అనంతర పరిస్థితుల్లో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, ఆసుపత్రుల నుంచి బయటికి వచ్చే కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు. కోవిడ్ ఇబ్బందుల నుంచి ఇప్పుడిప్పుడే ఊపం దుకుంటున్న వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలకు భంగం కలుగుతుంది. సమ్మె వల్ల రాష్ట్రం మీద తీవ్ర ప్రతికూల ప్రభావం ఉంటుంది. అర్థం చేసుకోండి’ అని ఉద్యోగులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. సమీర్‌శర్మ ఉద్బోధించారు. సమస్యలు ఉంటే చర్చించి పరిష్కరించుకుందామని పిలుపునిచ్చారు. ఉద్యోగ సంఘాలతో మాట్లాడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకునేందుకు ఆందోళన విరమించేలా సంఘాలను ఒప్పించాలని చెప్పారు. సోమవారం అమరావతి సచివాలయం నుండి ఆయన ఆర్థిక శాఖ అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం నిర్వహించారు. మనమంతా ఒక కుటుంబమని ఉద్యోగులకు చెప్పారు. అందరం ప్రభుత్వంలో భాగమని, మెరుగైన సేవల ద్వారా సమాజాభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని తెలిపారు. ఉద్యోగులుగా మనకు ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వంలో ప్రత్యేక యంత్రాంగం ఉందని ఉద్యోగ సంఘాలకు తెలపాలని కలెక్టర్లకు చెప్పారు. ప్రభుత్వం ఉద్యోగుల వెంటే ఉందనే విషయాన్ని తెలియజేసి అందరూ కలిసి పని చేద్దామని చెప్పాలన్నారు. ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ కూడా పాల్గొన్నారు. -
కరోనా పరిస్థితుల్లోను మెరుగైన సేవలు
సాక్షి, అమరావతి: భారత గణతంత్రదిన వేడుకలను బుధవారం రాష్ట్ర సచివాలయంలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్‌శర్మ జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మన రాజ్యాంగం దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు, అవకాశాలు కల్పించిందని చెప్పారు. స్వాతంత్య్ర సమరయోధులు, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ సహా ఇతర ప్రముఖుల త్యాగాలను, వారి కృషిని ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాల్సిన తరుణమిదని పేర్కొన్నారు. రెండేళ్లుగా కరోనా పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ సమస్యలను అధిగమించి ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు విశేషకృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి సకాలంలో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఎనలేని కృషిచేస్తోందని కొనియాడారు. రానున్న రోజుల్లో అధికారులు, సిబ్బంది మరింత చిత్తశుద్ధి, అంకితభావాలతో పనిచేసి ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలందించేందుకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. సచివాలయం చీఫ్ సెక్యూరిటీ అధికారి కృష్ణమూర్తి, సచివాలయ అధికారులు, ఉద్యోగులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించిన మంత్రి పెద్దిరెడ్డి గణతంత్ర దినోత్సవం సందర్భంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, అంబేడ్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బాపు మ్యూజియంలో.. విజయవాడ బాపు మ్యూజియంలో దేవదాయశాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య 1921లో ఆ జెండాను మహాత్మాగాంధీకి బాపు మ్యూజియం ప్రాంగణంలో అందజేశారు. బస్ భవన్లో.. ఆర్టీసీ ప్రధాన కార్యాలయం విజయవాడలోని బస్‌భవన్ ప్రాంగణంలో ఆర్టీసీ ఈడీ ఎ.కోటేశ్వరరావు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈడీలు కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి, పి.కృష్ణమోహన్, ఆర్థిక సలహాదారు ఎన్.వి.రాఘవరెడ్డి, ఏడీ (విజిలెన్స్–సెక్యూరిటీ) శోభామంజరి తదితరులు పాల్గొన్నారు. టిడ్కో ఉత్తమ ఉద్యోగులకు సత్కారం ఈ ఏడాది చివరినాటికి టిడ్కో ద్వారా చేపట్టిన పేదల ఇళ్ల నిర్మాణం పూర్తిచేసి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా లబ్ధిదారులకు అందజేసేందుకు కృషిచేయాలని టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, ఎండీ సీహెచ్ శ్రీధర్.. అధికారులను, సిబ్బందిని కోరారు. ఏపీ టిడ్కో కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో వారు ప్రసంగించారు. ఉత్తమ సేవలు అందించిన చీఫ్ ఇంజినీర్ గోపాలకృష్ణారెడ్డి, జీఎం హరినాథ్, లైసనింగ్ అధికారి విజయకుమార్, వివిధ విభాగాలకు చెందిన 40 మంది అధికారులు, సిబ్బందిని సత్కరించారు. టిడ్కో డైరెక్టర్లు రాఘవరావు, నాగేశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు. ఏపీపీఎస్సీ, ఎస్సెస్సీ బోర్డుల్లో.. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) కార్యాలయంలో కమిషన్ చైర్మన్ ఎ.వి.రమణారెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సభ్యుడు సలాంబాబు, అధికారులు పాల్గొన్నారు. ఎస్సెస్సీ బోర్డులో డైరెక్టర్ దేవానందరెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు. బోర్డు అధికారులు పాల్గొన్నారు. పవన్‌కళ్యాణ్ పతాకావిష్కరణ హైదరాబాద్‌లోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్, మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాసయాదవ్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. -
పలువురు ఐఏఎస్‌ల బదిలీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ ముఖ్య కార్యదర్శి కె.సునీతను మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా, మైనారిటీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న గంధం చంద్రుడిని సాంఘిక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రాను కార్మిక శాఖ ప్రత్యేక కమిషనర్‌గా నియమించారు. ప్రస్తుతం ఆ స్థానంలో పనిచేస్తున్న రేఖారాణిని కాపు కార్పొరేషన్ ఎండీగా బదిలీ చేశారు. కాపు కార్పొరేషన్ ఎండీగా ఉన్న అనంతరామును అదనపు బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్‌ను పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌గా నియమించారు. సీసీఎల్ఏ కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఉన్న రంజిత్ బాషాను విజయవాడ కమిషనర్‌గా బదిలీ చేశారు. హిమాన్షు కౌశిక్‌కు ఏపీ భవన్ బాధ్యతలు ఏపీ భవన్ ప్రత్యేక అధికారి ఎన్వీ రమణారెడ్డిని ఏపీ ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈవోగా నియమించారు. ఏపీ భవన్ ప్రత్యేక అధికారిగా అక్కడ అదనపు కమిషనర్‌గా ఉన్న హిమాన్షు కౌశిక్‌కు బాధ్యతలు అప్పగించారు. ఎంఎస్ఎంఈ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఈఓగా ఉన్న ఆర్. పవన్‌మూర్తిని సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్ విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శిగా నియమించారు. -
కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు చేపట్టేందుకు, రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర స్థాయి కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తక్షణమే పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నిబంధనల అమలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, ఆక్సిజన్, పరికరాలు అందుబాటులో ఉంచడం, హోం ఐసొలేషన్ కిట్లు సరఫరా, ఫీవర్ సర్వే, అత్యవసర మందులు తదితర అంశాలను సమర్ధంగా పర్యవేక్షించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారులతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఐఏఎస్ అధికారులు, వారి బాధ్యతలు ► ఎం.టి.కృష్ణబాబు: కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు నాణ్యమైన ఆహారం సరఫరా, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు ► ఎం.రవిచంద్ర: జిల్లాస్థాయిలో కమాండ్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, కోవిడ్ కేర్ సెంటర్లలో శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, కోవిడ్ కేసుల రోజువారీ సమాచారం, ప్రజల్లో చైతన్యం కలిగించడం, సహాయ చర్యల్లో జాయింట్ కలెక్టర్లు, ఎన్జీవోలు, యునిసెఫ్‌తో సమన్వయం ► ఎ.బాబు: రాష్ట్ర, జిల్లా స్థాయిలో 104 కాల్ సెంటర్లు సమర్ధంగా పనిచేసేలా చూడటం, హెల్ప్ డెస్క్, సీసీ టీవీ వ్యవస్థల పర్యవేక్షణ ► వి.వినయ్‌చంద్: ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ వైద్య సేవలు, ల్యాబ్ మేనేజ్మెంట్, మొబైల్ మెడికల్ యూనిట్లు, అంబులెన్స్‌ల పర్యవేక్షణ ► మురళీధర్ రెడ్డి: కోవిడ్ మందులు, పరికరాల కొనుగోలు, ఆక్సిజన్ లైన్లు, పీఎస్ఏ ప్లాంట్లు, వెంటిలేటర్లు సక్రమంగా పనిచేసేలా చూడటం, శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచడం ► జె.సుబ్రహ్మణ్యం: కోవిడ్ కేసుల వివరాల సేకరణ, విశ్లేషణ, నివేదికలు రూపొందించడం, గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో పాజిటివ్ కేసులు పెరగకుండా రోజూ కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సమర్ధవంతమైన చర్యలు చేపట్టడం ► ఐఏఎస్‌లు జి.సృజన, షాన్మోహన్, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి: మెడికల్ ఆక్సిజన్ సరఫ రా,పరిశ్రమల యూనిట్లు, రైల్వేతో సమన్వ యం, ఎల్ఎంఓ కేటాయింపు, ఉత్పత్తి బాధ్యత ► వి.వినోద్‌కుమార్: క్లినికల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్, క్లినికల్ మేనేజ్మెంట్ ప్రొటోకాల్, వెంటిలేటర్ల సరఫరా, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచడం ► రవి శంకర్: అత్యవసర మందులు అందుబాటులో ఉంచడం, మందుల ధరల నియంత్రణ ► జి.ఎస్. నవీన్‌కుమార్: ఫీవర్ సర్వే పర్యవేక్షణ, హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ, సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం -
Andhra Pradesh: వేతనాలు తగ్గవు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ అమలు వల్ల ఎవరి వేతనాలు తగ్గవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ స్పష్టం చేశారు. పది రోజులు ఆగితే పే స్లిప్‌లు వస్తాయని, గత పేస్లిప్, ఇప్పటి పేస్లిప్‌ను పోల్చి చూసుకుంటే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ఉద్యోగులందరి జీతాలను లెక్కించామని, ఏ ఉద్యోగి గ్రాస్ జీతంలో తగ్గుదల ఉండదన్నారు. హెచ్ఆర్ఏ జీతంలో భాగమని, ఐఆర్ అనేది సర్దుబాటు అని చెప్పారు. గత పీఆర్సీ, ఈ పీఆర్సీ మధ్య తేడా చూడాలన్నారు. సగటున ప్రతి ఉద్యోగి జీతం 20 శాతం పెరుగుతుందని తెలిపారు. మధ్యంతర భృతి (ఐఆర్) తీసి వేసిన తర్వాత కూడా జీతాల్లో తగ్గుదల లేదని చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఇతర అధికారులతో కలిసి పీఆర్సీకి సంబంధించిన పలు అంశాలపై మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. హెచ్ఆర్ఏ అంశం వేరని, కొత్త స్లాబు ప్రకారం హెచ్ఆర్ఏ 2 నుంచి 5 శాతం తగ్గినా గ్రాస్‌లో అది కనిపించదన్నారు. కొన్ని తగ్గి, కొన్ని పెరిగినా మొత్తంగా ఉద్యోగుల జీతాలు తగ్గవని స్పష్టం చేశారు. పది సంవత్సరాల క్రితం ఇచ్చిన పీఆర్సీ ప్రక్రియలో తాను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పాల్గొన్నానని, అప్పటికి, ఇప్పటికీ చాలా తేడా ఉందన్నారు. కరోనా వల్ల ప్రస్తుతం ఆదాయం రూ.62 వేల కోట్లకు తగ్గిపోయిందని తెలిపారు. కరోనా లేకపోతే ఇది రూ.98 వేల కోట్లకు చేరుకునేదన్నారు. కరోనా వల్ల సొంత రెవెన్యూ తగ్గిందని, ఇప్పుడు మళ్లీ ఒమిక్రాన్ వల్ల రెవెన్యూపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. సీఎస్ ఇంకా ఏమన్నారంటే.. కేంద్రం మోడల్‌ను అనుసరిస్తున్నాం ► కేంద్ర ప్రభుత్వ వేతన సవరణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరించింది. ఐఏఎస్ అధికారులకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం నిజం కాదు. పీఆర్సీతో ఉద్యోగులకు చాలా ప్రయోజనాలున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు టైమ్ స్కేల్స్ వచ్చాయి. హోంగార్డులు, ఏఎన్ఎంల జీతాలు పెరిగాయి. గ్రాట్యుటీ కూడా పెరిగింది. ► 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కమిటీ చెబితే ముఖ్యమంత్రి 23 శాతం ఇచ్చారు. పెరిగే జీతాల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.10 వేల కోట్లు అదనపు భారం పడుతుంది. ఇతరత్రా భారం మరో రూ.10 వేల కోట్లు ఉంటుంది. ► ఎంతో అధ్యయనం తర్వాత కేంద్ర వేతన సవరణ కమిషన్ 80 ఏళ్ల తర్వాత పెన్షనర్లకు ఖర్చులు పెరుగుతాయని.. ఎక్కువ డబ్బు అవసరం అని చెప్పి, అమలు చేస్తోంది. ఆ కమిషన్‌లో మెరుగైన వృత్తి నిపుణులున్నారు. వారి మోడల్‌ను మేము అనుసరిస్తున్నాం. ప్రస్తుతం పెన్షనర్ల వైద్యం అలవెన్సు పెరుగుతుంది. ఉద్యోగుల కనీస పే స్కేల్ రూ.20 వేలకు పెరుగుతుంది. మనదంతా ఒకే కుటుంబం.. ► అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పీఆర్సీలో భాగం కాకపోయినా వారికి ఇప్పటి నుంచే డబ్బు ఇస్తున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్నది చాలా మెరుగైన విధానం. ఒకే దేశం, ఒకే పీఆర్సీ. అశుతోష్ మిశ్రా కమిటీ సిఫారసులను ప్రభుత్వం పక్కన పెట్టలేదు. వాటిలో చాలా అంశాలను అమలు చేస్తున్నాం. ► పీఆర్సీలో సిఫారసులు మాత్రమే చేస్తాం. వాటిని ప్రభుత్వం అమలు చేయొచ్చు, చేయకపోవచ్చు. అయినా పీఆర్సీలోని 90 శాతం సిఫారసులను ప్రభుత్వం యథావిధిగా అమలు చేస్తోంది. నేను కార్యదర్శుల కమిటీకి నేతృత్వం వహించి నివేదిక ఇచ్చాను. ఇంకా అనేక మార్గాల ద్వారా ముఖ్యమంత్రికి ఎంతో సమాచారం, వివరాలు వెళతాయి. వాటన్నింటినీ చూసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. మేము చేసిన సిఫారసుల్లో చాలా వాటిని అంగీకరించారు. ► ఉద్యోగులు ఇప్పుడైనా ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు. మనదంతా ఒకటే కుటుంబం. పిల్లలకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే తండ్రినే అంటారు. అలాగే నన్నూ అని ఉండవచ్చు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ► ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ఈఓ కార్యదర్శి సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరం కలసి సిఫారసులు చేశాం కొత్త పీఆర్సీలో ప్రతి ఉద్యోగికీ వేతనం పెరుగుతుంది. సీఎస్‌ని నిందించడం సబబు కాదు. కార్యదర్శుల కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. అందరం కలసి సిఫారసులు చేశాం. వ్యక్తిగత నిర్ణయం ప్రకారం ఏమీ జరగలేదు. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని మేము సిఫారసు చేయకపోయినా సీఎం ప్రకటించారు. ఉద్యోగులతో మాకు మంచి సంబంధాలున్నాయి. అవి కొనసాగుతాయి. రాష్ట్ర విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. 9, 10వ షెడ్యూల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి రూ.1.06 లక్షల కోట్లు, రూ.39,191 కోట్లు నష్టపోయాం. రాజధాని నగరం కోల్పోవడం వల్ల ఏడేళ్లలో లక్షా 80 వేల కోట్ల నష్టం వచ్చింది. తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు రూ.6,284 కోట్లు ఉన్నాయి. కోవిడ్ వల్ల రూ.21,933 కోట్ల ఆదాయాన్ని కోల్పోగా, అదనంగా రూ.30 వేల కోట్లు ఖర్చయింది. – ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ అధికారుల హెచ్ఆర్ఏ రద్దుకు నిర్ణయం ఉద్యోగులకు ఒక ప్యాకేజీలా ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం వల్ల ప్రతి ఉద్యోగికి రూ.24 లక్షల అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఇళ్ల స్థలాల వల్ల రూ.10 లక్షల వరకు నేరుగా లబ్ధి కలుగుతుంది. రిటైర్మెంట్ సమయంలో ఇచ్చే గ్రాట్యూటీ కూడా పెరిగింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పీఆర్సీ ఏర్పాటు సమయానికి లేరు. అయినా సీఎం వారికి ప్రొబేషన్ ఇచ్చి, స్కేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఐఏఎస్ అధికారుల హెచ్ఆర్ఏ రూ.40 వేలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. – శశిభూషణ్‌కుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి -
కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు: సీఎస్ సమీర్ శర్మ
-
కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవు: సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: కరోనా వైరస్ వల్ల ప్రభుత్వ ఆదాయం తగ్గిపోయిందని ఆంధ్రప్రదేశ్ సీఎస్ సమీర్ శర్మ తెలిపారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. థర్డ్‌వేవ్ వల్ల మరింత నష్టం జరిగే పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు. ఏపీలోనే ఉద్యోగుల జీతాల బడ్జెట్ ఎక్కువగా ఉందని.. ఆర్థిక సమస్యలు ఉన్నప్పుడు ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు, సంక్షేమ పథకాలు బ్యాలెన్స్ చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా ఉద్యోగులకు ఐఆర్ ఇచ్చామని వివరించారు. కరోనా లేకపోతే రాష్ట్ర రెవెన్యూ రూ.98 వేల కోట్లు ఉండేదని సమీర్ శర్మ చెప్పారు. పీఆర్సీ ఆలస్యం అవుతుందనే ఐఆర్ ఇచ్చామన్నారు. కరోనా కారణంగా రాష్ట్ర రెవెన్యూ రూ.62 వేల కోట్లే ఉందని.. కరోనా సంక్షోభంతో రాష్ట్ర ఆదాయం పడిపోయిందన్నారు. కొత్త పీఆర్సీతో ఎవరి జీతాలు తగ్గవని స్పష్టం చేశారు. ఉద్యోగులందరినీ ప్రభుత్వం సమానంగానే చూస్తుందని.. ఐఏఎస్‌లకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం అవాస్తవమని తెలిపారు. ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ రావత్ మాట్లాడుతూ.. 27 శాతం ఐఆర్ గతంలో ఎవరూ ఇవ్వలేదేని తెలిపారు. అందరికీ న్యాయం చేయడానికి సీఎం వైఎస్ జగన్ ప్రయత్నించారని పేర్కొన్నారు. విభజన కారణంగా ఏపీ ఆర్థికంగా దిగజారిపోయిందని.. సేవా రంగం నుంచి వచ్చే పన్నుల ఆదాయం తగ్గిపోయిందని తెలిపారు. ఏపీలో వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉందని.. వ్యవసాయం నుంచి పన్నుల ఆదాయం ఉండదని తెలిపారు. విభజనే వల్ల హైదరాబాద్‌ను కోల్పోయామని దాంతో పాటే పన్నుల ఆదాయం కూడా నష్టపోయామని పేర్కొన్నారు. ఏపీకి జనాభా ఎక్కువ.. పన్నుల ఆదాయం తక్కువ అన్నారు. ఇంకా రూ. 33,490 కోట్ల అప్పుల విభజన జరగాల్సి ఉందని.. కేంద్రం నుంచి రావాల్సిన పన్నుల వాటా తగ్గిపోయిందని వెల్లడించారు. ఐఆర్ రూపంలో రూ. 17,918 కోట్లు ఇచ్చామని వివరించారు. అంగన్వాడీ, అవుట్ సోర్సింగ్ సిబ్బందితో పాటు ఆశా వర్కర్లకు కూడా గౌరవ వేతనాలు పెంచామని తెలిపారు. మధ్యాహ్న భోజన కార్మికులకు కూడా వేతనాలు పెంచామని చెప్పారు. కాంట్రాక్ట్ వర్కర్లకు మినిమం టైమ్ స్కేల్ అమలు చేస్తున్నామని రావత్ తెలిపారు. చదవండి: రూ.కోటి విరాళం.. ప్రభుత్వ పాఠశాలల్లో నాడు–నేడు కోసం.. -
పెండింగ్‌పై సామరస్యంగా..
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల మధ్య పెండింగ్‌లో ఉన్న విభజన అంశాలు సామరస్యంగా పరిష్కారమయ్యేలా కేంద్ర ప్రభుత్వం తగిన తోడ్పాటు అందిస్తుందని కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా తెలిపారు. పెండింగ్ అంశాలపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు డాక్టర్ సమీర్‌శర్మ, సోమేశ్‌కుమార్‌తో బుధవారం ఆయన ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇరు రాష్ట్రాల వాదనలను తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. విద్యుత్తు బకాయిలపై చర్చ.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య చిక్కుముడిగా మారిన 10 ద్వైపాక్షిక అంశాలతో పాటు 8 ప్రాజెక్టులు, అజెండాలోని ఇతర అంశాలను అజయ్ భల్లా సమీక్షించారు. ముఖ్యంగా షెడ్యూల్ 9, 10లో పేర్కొన్న సంస్థలకు సంబంధించిన వివాదాలు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్షియల్ కార్పొరేషన్, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్, అనుబంధ కంపెనీ ఆంధ్రప్రదేశ్ హెవీ మెషినరీ ఇంజనీరింగ్ లిమిటెడ్ విభజన, ఢిల్లీలోని ఏపీ భవన్, పన్ను బకాయిలు, రీఫండ్ అంశాలపై సమీక్షించారు. పునర్విభజన చట్టం జాబితాలో లేని సంస్థల విభజన, నగదు నిల్వలు, బ్యాంకు డిపాజిట్ల విభజన, తెలంగాణ డిస్కమ్‌లు ఏపీ జెన్కోకు చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలు తదితర అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎస్‌లతో చర్చించారు. రెవెన్యూ లోటు, పోలవరం, కడప స్టీల్ ప్లాంట్.. ఆంధప్రదేశ్‌కు 2014 – 15కి సంబంధించి రెవెన్యూ లోటు నిధులను చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ సమావేశంలో ప్రస్తావించారు. పోలవరానికి నిధులు, గ్రీన్‌ఫీల్డ్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ, పెట్రో కెమికల్ కాంప్లెక్స్ ఏర్పాటు తదితరాలను అజయ్ భల్లా దృష్టికి తెచ్చారు. కడపలో స్టీల్ ప్లాంటు, విశాఖ, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో విమానాశ్రయాల ఆవశ్యకతను వివరించారు. దుగ్గరాజుపట్నం ఓడరేవుకు బదులుగా రామాయపట్నం రేవు అభివృద్ధి, విశాఖపట్నం–చైన్నై పారిశ్రామిక నడవా, కేంద్రం నుంచి పన్ను రాయితీ బకాయిల గురించి కూడా ప్రస్తావించారు. ఈ సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల వలవన్, రాష్ట్ర పునర్విభజన విభాగం ముఖ్య కార్యదర్శి ఎల్.ప్రేమచంద్రారెడ్డి, ఏపీ జెన్కో ఎండీ శ్రీధర్, వాణిజ్య పన్నుల శాఖ కార్యదర్శి ముకేష్‌కుమార్ మీనా, ఇంధన శాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్, పౌరసరఫరాల శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డా.కేఎస్.జవహర్ రెడ్డి వీడియో లింక్ ద్వారా పాల్గొన్నారు. -
సంప్రదింపులతోనే పెండింగ్ అంశాల పరిష్కారం
సాక్షి, అమరావతి: సంప్రదింపుల ద్వారా పెండింగ్ అంశాలను పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, ఒడిశా నిర్ణయించాయి. ఈ మేరకు సోమవారం సచివాలయం నుంచి రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు సమీర్‌శర్మ, సురేశ్ చంద్ర మహాపాత్ర వర్చువల్ విధానంలో సమావేశం నిర్వహించారు. అంతర్రాష్ట్ర సమస్యలను నిర్దిష్ట వ్యవధిలోగా పరిష్కరించుకునే అంశంపై ఇటీవల ఏపీ, ఒడిశా ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్రెడ్డి, నవీన్ పట్నాయక్ భువనేశ్వర్‌లో సమావేశమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల సీఎస్ల నేతృత్వంలో అధికారులతో కమిటీలను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఆ కమిటీలు రెండూ సోమవారం పెండింగ్ అంశాలపై సమీక్షించాయి. ఈ సందర్భంగా సీఎస్ డా.సమీర్ శర్మ మాట్లాడుతూ.. పెండింగ్ అంశాలను సంప్రదింపుల ద్వారా పరిష్కరించుకుందామన్నారు. ఒడిశా సీఎస్ సురేశ్ చంద్ర మహాపాత్ర మాట్లాడుతూ సీఎంల భేటీలో ప్రస్తావనకు వచ్చిన అంశాలను పరిష్కరించుకునేందుకు సమావేశాలు దోహదం చేస్తాయన్నారు. రెండు రాష్ట్రాల సరిహద్దు గ్రామాల్లో రోడ్డు అనుసంధాన పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని సీఎస్ సమీర్ శర్మ దృష్టికి తెచ్చారు. సమావేశం మినిట్స్‌ను రెండు రాష్ట్రాలు పంపితే తదుపరి భేటీల్లో పెండింగ్ అంశాలపై చర్చించుకోవచ్చన్నారు. ఇంధనం, జల వనరులు, రవాణాపై చర్చ ఈ సమావేశంలో ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ఇంధన, జలవనరులు, ఉన్నత విద్య, పాఠశాల విద్య, రెవెన్యూ, రవాణా శాఖలకు సంబంధించి వివిధ పెండింగ్ అంశాలపై చర్చించారు. ముఖ్యంగా ఇంధన శాఖకు సంబంధించి జోలాపుట్, లోయర్ మాచ్‌ఖండ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులు, బలిమెల డ్యామ్, చిత్రకొండ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులపై చర్చలు జరిపారు. జలవనరుల శాఖకు సంబంధించి వంశధార నదిపై నేరడి బ్యారేజ్, ఝంజావతి రిజర్వాయర్, బహుదా నది నీరు విడుదలకు సంబంధించి పంపు స్టోరేజ్ ప్రాజెక్టులకు ఇరు రాష్ట్రాల తరఫున ఎన్వోసీల మంజూరు అంశాలపై సమీక్షించారు. బహుదా నీటిని విడుదల చేయండి నేరడి బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా ప్రభుత్వం 106 ఎకరాల భూమిని అప్పగించాల్సి ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కెఎస్ జవహర్‌రెడ్డి తెలిపారు. ఆ భూమిని అప్పగిస్తే బ్యారేజ్ సకాలంలో పూర్తయి ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం కలుగుతుందన్నారు. అలాగే ఝంజావతి రిజర్వాయర్ ప్రాజెక్టు నిర్మాణంతో విజయనగరం జిల్లాలోని 5 మండలాల్లో 75 గ్రామాలకు తాగునీరు అందడమే కాకుండా 24,640 ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఒడిశా ప్రభుత్వం ఆ ప్రాంతంలో గ్రామ సభలు నిర్వహించలేదన్నారు. ఒప్పందం ప్రకారం బహుదా నది ద్వారా ఒడిశా ప్రభుత్వం 1.5 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉందన్నారు. -
సీఎస్ సమీర్ శర్మకు అధికారుల శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం సందర్భంగా శనివారం విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలతో పాటు టీటీడీ క్యాలెండర్, డైరీలను సీఎస్‌కు అందించారు. అంతకుముందు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యక్షుడు కె.ఫరీడ, రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి విజయానంద్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సీఎస్ పి.ప్రశాంతి, స్పెషల్ ఆఫీసర్ ఎంఐజీ బసంత్ కుమార్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సత్యనారాయణ, సీఎం అదనపు కార్యదర్శి ఆర్.ముత్యాలరాజు, రాష్ట్ర కార్మిక శాఖ విశ్రాంత ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ శారదతో పాటు దివ్యాంగ విద్యార్థులు సీఎస్ సమీర్ శర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. -
ప్రభుత్వం.. మీ వెంటే: సమీర్‌శర్మ
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు సంబంధించిన అన్ని అంశాలను రాష్ట్ర ప్రభుత్వం విశాల దృక్పథంతో సానుకూలంగా పరిశీలించి పరిష్కరించేందుకు కృషి చేస్తోందని ఆంధ్రప్రదేశ్ సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ తెలిపారు. ప్రభుత్వం ఉద్యోగుల వెంటే ఉందన్నారు. వెలగపూడిలోని సచివాలయంలో బుధవారం సమీర్ శర్మ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. 70 అంశాలపై కార్యదర్శుల సమావేశంలో చర్చించామని, త్వరలోనే వీలైనన్ని పరిష్కరిస్తామని చెప్పారు. పీఆర్సీ, ఫిట్మెంట్, పెండింగ్ బిల్లుల చెల్లింపు అంశాలను మరోసారి పరిశీలించి మళ్లీ సంఘాలను పిలుస్తామన్నారు. ఆర్థికేతర అంశాలను పరిష్కరించాలి ఆర్థికేతర అంశాలను నిర్దిష్ట సమయంలోగా పరిష్కరించాలని ఉద్యోగ సంఘాల నేతలు కోరారు. కార్యదర్శుల కమిటీ నివేదికను పక్కనపెట్టి 11వ పీఆర్సీ నివేదికను అమలు చేయాలన్నారు. సమావేశంలో ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్.. ఆర్ధిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు(ఉద్యోగుల సేవలు) పి.చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అధికారుల లెక్కలు తప్పని చెప్పాం కేంద్ర ప్రభుత్వ పీఆర్సీ 14.28 శాతం అని అధికారులు వేసిన లెక్కలు తప్పని చెప్పాం. లెక్కలతో సహా తప్పుడు అంచనాలు వేశారని తెలియచేశాం. 14.29 శాతం ఫిట్మెంట్ వల్ల ఎవరికీ ఉపయోగం ఉండదు. 34 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నాం. ముఖ్యమంత్రితో సమావేశం ఏర్పాటు చేయాలని అడిగాం. – వెంకట్రామిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు మార్చి లోపు పరిష్కరిస్తామన్నారు ఉద్యోగుల ఆర్థికేతర సమస్యలను మార్చి లోపు పరిష్కరిస్తామన్నారు. రూ.1,600 కోట్ల ఉద్యోగుల నిధులకు సంబంధించి బెనిఫిట్స్ త్వరలో ఇస్తామని చెప్పారు. పీఆర్సీపై అన్ని సంఘాలు ఒకే మాటపై ఉన్నాయి. ఫిట్‌మెంట్‌ను ముఖ్యమంత్రి వద్దే తేల్చాలని కోరాం. – బండి శ్రీనివాసరావు, ఏపీ జేఏసీ చైర్మన్ పీఆర్సీ అంశానికి ముగింపు పలకాలి ఉద్యోగుల పీఆర్సీ అంశానికి వెంటనే ముగింపు పలకాలని కోరాం. పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలి. ఫిట్‌మెంట్‌పై ప్రభుత్వం క్లారిటీతోనే ఉంది. – సూర్యనారాయణ, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సుదీర్ఘంగా చర్చించాం.. రెండు గంటల పాటు దాదాపు 70 డిమాండ్లపై చర్చించాం. రూ.వెయ్యి కోట్ల జీపీఎఫ్, రూ.300 కోట్ల ఏపీజీఎల్ఐ కొంత విడుదల చేయాలని కోరాం. మెడికల్ రీయింబర్స్‌మెంట్‌కు రూ.21 కోట్లు, నెట్వర్క్ ఆస్పత్రులకు రూ.42 కోట్లు ఇస్తామన్నారు. – బొప్పరాజు వెంకటేశ్వర్లు, ఏపీ జేఏసీ అమరావతి ఛైర్మన్ -
ఏపీ 11వ పీఆర్సీ నివేదిక.. కేంద్రం తరహాలోనే!
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఫిట్‌మెంట్‌పై ఏడు రకాల విశ్లేషణలు చేసిన సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ కేంద్ర వేతన సంఘం (సీపీసీ) మాదిరిగానే ఇవ్వాలని సిఫారసు చేసింది. 11వ పీఆర్సీ నివేదికను సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి అందచేసిన అనంతరం వెలగపూడి సచివాలయంలో కార్యదర్శుల కమిటీ సభ్యులతో కలసి సీఎస్ మీడియాతో మాట్లాడారు. అధికారుల కమిటీ మూడు సార్లు సమావేశమైందని, ఉద్యోగ సంఘాలతో ఒకసారి సమావేశం నిర్వహించామని చెప్పారు. అనంతరం నివేదిక రూపొందించామని, దీనిపై ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. ఎంత ఇస్తే ఎంత భారం? ఫిట్మెంట్ ఎంత శాతం ఇస్తే ఎంత భారం పడుతుందనే అంశాలను విశ్లేషిస్తూ ఏడు మోడల్స్ సూచించాం. 23 శాతం ఫిట్మెంట్ అయితే ప్రభుత్వంపై ఏటా రూ.11,557 కోట్ల అదనపు భారం పడుతుంది. 27 శాతం అయితే రూ.13,422 కోట్లు, కేంద్ర వేతన సంఘం అమలు చేస్తున్న 14.29 శాతం అయితే రూ.9,150 కోట్లు భారం పడుతుంది. ఏడో సీపీసీ ప్రకారం ఇస్తే... 23 శాతం ఫిట్మెంట్ ఇస్తే అదనపు పెన్షన్, హెచ్ఆర్ఏతో రూ.10,211 కోట్ల అదనపు భారం పడుతుంది. 23.5 శాతం ఫిట్మెంట్ అయితే అదనపు పెన్షన్, హెచ్ఆర్ఏతో రూ.11,413 కోట్లు భారం పడుతుంది. 30 శాతం ఫిట్మెంట్ ఇచ్చి హెచ్ఆర్ఏ, క్వాంటమ్ పెన్షన్ 7వ సీపీసీ ప్రకారం ఇస్తే రూ.12,736 కోట్ల అదనపు భారం పడుతుంది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కేంద్ర వేతన సంఘం ఇస్తున్న ఫిట్‌మెంట్‌ను ఇవ్వాలని సిఫారసు చేశాం. ఉత్తరప్రదేశ్ సహా పలు రాష్ట్రాలు ఇదే విధానాన్ని అమలు చేస్తున్నాయి. ఇది మంచి విధానం. శాస్త్రీయంగా అధ్యయనం చేశాకే అమలు చేస్తున్నారు. ఇక్కడా కూడా ఇది అమలు చేయాలి. 2018 నుంచి అమలు ఈ పీఆర్సీని 2018 నుంచి అమలు చేయాలని సిఫారసు చేశాం. ఈ ఏడు సిఫారసుల్లో ఏది అమలు చేసినా ప్రభుత్వంపై సుమారు రూ.8 వేల నుంచి రూ.9 వేల కోట్ల అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఉద్యోగులకు మధ్యంతర భృతి కింద సుమారు రూ.16 వేల కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఆర్థిక శాఖ వెబ్సైట్లో అప్లోడ్.. ఉద్యోగ సంఘాలకు ప్రతి 11 పీఆర్సీ నివేదికను ఆర్థిక శాఖ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తాం. ఉద్యోగ సంఘాల నేతలకు కాపీని అందచేస్తాం. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు, హోంగార్డులను పీఆర్సీ నివేదికలో కలిపాం. గతంలో ఈ విధానం లేదు. అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను కూడా చేర్చాం. ఉద్యోగులకు అమలు చేయాల్సిన ఇతర సంక్షేమ చర్యలను కూడా సూచించాం. వైద్యం, ఇతర సౌకర్యాలపైనా సిఫారసులు చేశాం. జీతాల వ్యయం ఏపీలో 36 శాతం.. తెలంగాణలో 21 శాతం నివేదిక తయారు చేసే క్రమంలో ఇతర రాష్ట్రాల ఉద్యోగుల జీతాలను కూడా పోల్చి చూశాం. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఖర్చులో ఉద్యోగుల జీతాల వ్యయం ఏపీలో ప్రస్తుతం 36 శాతం ఉంది. చత్తీస్‌ఘడ్‌లో 32 శాతం, మహారాష్ట్రలో 31, పశ్చిమబెంగాల్ 31, ఒరిస్సా 29, మధ్యప్రదేశ్‌లో 28 శాతం, హర్యానాలో 23 శాతం, తెలంగాణలో 21 శాతం ఉంది. మిగతావి కూడా పరిష్కరిస్తాం.. సీపీఎస్‌కి పీఆర్సీకి సంబంధం లేదు. నివేదిక తయారు చేసేముందు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకున్నాం. కేంద్రం, వివిధ రాష్ట్రాల్లో వేతనాలు, గత 30 సంవత్సరాల్లో వేతనాలపై అధ్యయనం చేశాం. భవిష్యత్తులో ఎలా ఉండాలో చూసి నివేదిక ఇచ్చాం. ఉద్యోగ సంఘాల 71 డిమాండ్లలో పీఆర్సీ ఒకటి కాగా మిగిలిన వాటిపై రాష్ట్ర, జిల్లా స్థాయి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ పరిశీలిస్తున్నాయి. వాటిని కూడా పరిష్కరిస్తాం. హౌస్ రెంట్ అలవెన్స్(హెచ్ఆర్ఏ) 11వ పీఆర్సీ: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్ నుంచి తరలివెళ్లిన ఉద్యోగులకు మూల వేతనంలో 30 శాతం లేదా నెలకు రూ.26 వేలకు మించకుండా ఇవ్వాలి. పది లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 22 శాతం లేదా నెలకు రూ.22,500లు ఇవ్వాలి. రెండు నుంచి పది లక్షల జనాభా లోపు ఉన్న పట్టణాల్లో మూల వేతనంలో 20 శాతం లేదా రూ.20 వేలకు మించకుండా ఇవ్వాలి. 50 వేల నుంచి రెండు లక్షల జనాభా ఉన్న పట్టణాల్లో మూల వేతనంలో 14.5 శాతం లేదా రూ.20 వేలకు మించకుండా.. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగులకు మూల వేతనంలో 12 శాతం లేదా నెలకు రూ.17 వేలకు మించకుండా ఇవ్వాలి. సెక్రటరీల కమిటీ: కేంద్ర ఏడో వేతన సవరణ సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగులకు 50 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 24 శాతం, 5 లక్షల నుంచి 50 లక్షలలోపు ఉన్న నగరాల్లో ఉద్యోగులకు మూల వేతనంలో 16 శాతం, ఐదు లక్షలలోపు జనాభా ఉన్న నగరాల్లో మూల వేతనంలో 8 శాతాన్ని హెచ్ఆర్ఏగా ఇవ్వాలి. సిటీ కాంపెంసేటరీ అలవెన్స్(సీసీఏ) 11వ పీఆర్సీ కమిటీ: విశాఖపట్నం, విజయవాడల్లో రూ.400 నుంచి రూ.1000, ఇతర మున్సిపల్ కార్పొరేషన్లలో రూ.300 నుంచి రూ.750 చొప్పున ఇవ్వాలి. సెక్రటరీల కమిటీ: కేంద్ర ఆరో వేతన సంఘం సీసీఏను రద్దు చేసింది. కేంద్రం తరహాలోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సీసీఏను రద్దు చేయాలి. అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ 11వ పీఆర్సీ: ఉన్నత అర్హతలు సాధించిన వారికి మాత్రమే ప్రత్యేకంగా ఇవ్వవచ్చు. సాధారణ పరిస్థితుల్లో అడ్వాన్స్ ఇంక్రిమెంట్స్ ఇవ్వకూడదు. సెక్రటరీల కమిటీ: 11వ పీఆర్సీ కమిటీ సిఫార్సును అమలు చేయాలి. కరవు భత్యం(డీఏ) 11వ పీఆర్సీ: కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న తరహాలోనే ఏడాదికి రెండు సార్లు జనవరి 1, జూలై 1న డీఏలు ఇవ్వాలి. 1–1–2019 నుంచి కేంద్రం డీఏను ఒక శాతం పెంచితే.. రాష్ట్ర ప్రభుత్వం 0.91 శాతం పెంచాలి. సెక్రటరీల కమిటీ: 11వ పీఆర్సీ చేసిన సిఫార్సును అమలు చేయాలి. -
ఉద్యోగులకు మేలు.. సెలవు సిఫారసులు
సాక్షి, అమరావతి: పదకొండో వేతన సంఘం ఉద్యోగుల సెలవులు, వైద్య సౌకర్యాలపై కొన్ని సిఫారసులు చేసింది. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ ద్వారా ఇతర రాష్ట్రాల్లో అందిస్తున్న వైద్య సేవలను ఈహెచ్ఎస్ పథకానికి కూడా వర్తింపజేయాలని సూచించింది. పిల్లలను దత్తత తీసుకున్న వారికి సైతం దత్తత సెలవులు 180 రోజులు ఉండాలని, చైల్డ్ కేర్ లీవ్స్ కూడా ఇదే స్థాయిలో ఉండాలని, ఇది ఒంటరి పురుష ఉద్యోగులకు కూడా అమలు చేయాలని సిఫారసు చేసింది. అంతేగాక ఈ విభాగంలో పితృత్వ సెలవులను సైతం సూచించింది. వికలాంగ ఉద్యోగులకు సైతం మేలు జరిగేలా మరికొన్ని సిఫారసులను నివేదికలో పొందుపరిచింది. ఈ సూచనలు మహిళా, వికలాంగ ఉద్యోగులకు మేలు చేసేవిగా ఉండడంతో కార్యదర్శుల కమిటీ ఓకే చెప్పింది. లీవ్ బెనిఫిట్స్:11వ పీఆర్సీ సిఫారసు ► బోధన రంగంలో ఉన్న బోధనేతర మహిళా ఉద్యోగులకు సైతం అదనంగా ఐదు సాధారణ సెలవులు ఉండాలి ► ఇద్దరు పిల్లలు ఉన్న మహిళా ఉద్యోగి ఏడాది లోపు వయసున్న పిల్లలను దత్తత తీసుకుంటే 180 రోజుల దత్తత సెలవులు ఇవ్వాలి, అలాగే ఒంటరి లేదా అవివాహిత పురుష ఉద్యోగులకు సైతం 15 రోజుల పితృత్వ సెలవులు కూడా ఉండాలి ► చైల్డ్ కేర్ లీవ్స్ 180 రోజులకు పెంచాలి, ఇదే నిబంధన ఒంటరి లేదా అవివాహిత పురుష ఉద్యోగులకు వర్తించాలి ► కృత్రిమ అవయవాల అవసరం ఉన్న ఆర్థోపెడిక్ వికలాంగ ఉద్యోగులకు ఏడాదికి ఏడు ప్రత్యేక సాధారణ సెలవులు. హైరిస్క్ వార్డులో పనిచేసే నర్సింగ్ ఉద్యోగులకు సైతం ఈ వర్తింపు ఉండాలి కార్యదర్శుల కమిటీ ప్రతిపాదనలు: మహిళలు, వికలాంగుల లీవ్ బెనిఫిట్స్‌కు కమిటీ ఆమోదం తెలిపింది మెడికల్ బెనిఫిట్స్: పీఆర్సీ సిఫారసు ► ఉద్యోగుల హెల్త్ స్కీమ్‌లో ఆర్థిక స్థిరత్వం కోసం ప్రభుత్వ సహకారం పెరగాలి, నెట్వర్క్ ఆస్పత్రుల పెండింగ్ బిల్లుల చెల్లింపులకు ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌కు ఆదనపు నిధులను విడుదల చేయాలి ► పెన్షన్ తీసుకునేవారు, వారి సహచరుల వార్షిక ఆరోగ్య పరీక్షల స్కీమ్‌ను పెంచాలి ► డా. వైఎస్సార్ ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ద్వారా వివిధ రాష్ట్రాల్లో వైద్య సేవలు అందిస్తున్న ఆస్పత్రుల్లో ఈహెచ్ఎస్ సేవలు కూడా అందించేందుకు ఆయా ఆస్పత్రులతో చర్చించాలి ► సర్వీస్ పెన్షనర్ / ఫ్యామిలీ పెన్షనర్స్‌కు నెలకు రూ.500 మెడికల్ భృతి చెల్లించాలి కార్యదర్శుల కమిటీ: మెడికల్ బెనిఫిట్స్ సిఫారసులన్నింటినీ అంగీకరించింది ప్రత్యేక చెల్లింపులు: 11వ పే కమిషన్ సిఫారసు ► ప్రస్తుతమున్న ఉద్యోగుల్లో కొన్ని కేటగిరీలకు ప్రత్యేక చెల్లింపుల క్వాంటం/రేటు పెంపు, కొన్ని వర్గాల ఉద్యోగుల చెల్లింపులను నిలిపి వేయాలి కార్యదర్శుల కమిటీ సిఫారసు: ఉద్యోగులకు ప్రత్యేక వేతనాల మంజూరును సమీక్షించడానికి సీనియర్ సెక్రటరీలు, హెచ్ఆర్ నిపుణులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటుకు కట్టుబడి ఉంది. నిర్దిష్టమైన ప్రత్యేక వేతనాల రేట్ల పెంపునకు సిఫార్సు, ప్రత్యేక చెల్లింపుల సమస్యను, దీనిపై ప్రస్తుత మార్గదర్శకాల పరిశీలనకు అంగీకారం ఇతర భత్యాలు: పే కమిషన్ సిఫారసులు ► పెట్రోల్ అలవెన్సులను కిలోమీటర్‌కు రూ.15.50కి పెంచాలి. పెట్రోల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలకు కి.మీకి రూ.11.50, డీజిల్ వాహనానికి రూ.6.50 ఇవ్వాలి ► రోజువారీ భత్యం, వసతి చార్జీలు 33 శాతం పెంపు. రాష్ట్రం లోపల పర్యటనలకు రోజుకు రూ. 300 నుంచి రూ. 600 వరకు, రాష్ట్రం వెలుపల పర్యటనలకు రూ.400 నుంచి రూ.800కు పెంచవచ్చు. రాష్ట్రం వెలుపల బస చేసినప్పుడు రోజువారీ లాడ్జింగ్ భత్యం రూ.1,700 చెల్లించాలి ► కోర్టు మాస్టర్స్, హైకోర్టు న్యాయమూర్తుల వ్యక్తిగత కార్యదర్శుల రవాణా చార్జీలు రూ.5 వేలకు పెంచాలి, ప్రయాణ భత్యాన్ని నెలకు రూ.1,700 కు పెంచాలి ► పిల్లల ట్యూషన్ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఏడాదికి రూ.2,500 పెంచాలి ► మరణించిన ఉద్యోగి అంత్యక్రియల చార్జీలను రూ.20 వేలకు పెంచాలి ► గిరిజన ప్రాంతాల్లో పనిచేసే వారికి నెలకు చెల్లించే ప్రత్యేక పరిహార భత్యాన్ని ప్రస్తుతమున్న రూ.500 నుంచి రూ.1,275కు, రూ.700 నుంచి రూ.1800కు పెంచాలి ► యూనిఫారం అలవెన్సులు, రిస్క్ అలవెన్సులు గణనీయంగా పెంచాలి ► మెడికల్ విభాగంలో పనిచేసే ఉద్యోగులకు ఎమర్జెన్సీ హెల్త్ అలవెన్సు, రూరల్ మెడికల్ అలవెన్సులు, పీజీ డిగ్రీ అలవెన్సులు పెంచాలి ► విజువల్లీ చాలెంజ్డ్ ఉపాధ్యాయులు, లెక్చరర్ల రీడర్స్ అలవెన్సును 33 శాతం పెంచాలి ► ఏపీ భవన్లో పనిచేసే వారికి ఢిల్లీ అలవెన్సు కింద బేసిక్ పేలో 15 శాతం లేదా నెలకు రూ.5 వేలు చెల్లించాలి. ఏపీ భవన్లో పనిచేసే డ్రైవర్లకు స్పెషల్ అలవెన్సు కింద గంటకు రూ.30 చొప్పున గరిష్టంగా నెలకు 100 గంటలకు చెల్లించాలి ► ఫిజికల్లీ చాలెంజ్డ్ ఉద్యోగుల కన్వీనియన్స్ చెల్లింపుల కింద వారి బేసిక్ పేలో 10 శాతం పెంచాలి. ఇది రూ.2 వేలకు మించరాదు కార్యదర్శుల కమిటీ: పే కమిషన్ సిఫారసులు పూర్తిగా మహిళలు, వికలాంగ ఉద్యోగులకు మేలు జరిగేదిగా ఉంది కాబట్టి ఈ సిఫారసులను ఆమోదించవచ్చు సీఎం జగన్‌కి పీఆర్సీ నివేదిక అందజేసిన సీఎస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సోమవారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి 11వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) నివేదికను అందజేశారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, ఆర్ధిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు పాల్గొన్నారు. -
AP: రాబడిని మించిన జీతాలు
సాక్షి, అమరావతి: రాష్ట్ర సొంత ఆదాయాన్ని మించి ఉద్యోగుల వేతనాల వ్యయం అవుతోందని, ఈ నేపథ్యంలో ఐదేళ్లకు ఒకసారి ఉద్యోగుల వేతన సవరణను రాష్ట్రం భరించే స్థితిలో లేదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అధికారుల కమిటీ 11వ వేతన సవరణ కమిషన్ సిఫార్సులపై స్పష్టం చేసింది. ఇప్పటికే చాలా ఏళ్ల నుంచి అత్యధిక ఫిట్మెంట్ ఇస్తూ వస్తున్నారని, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని కేంద్ర 7వ వేతన సవరణ కమిషన్‌ను అనుసరించి 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని సీఎస్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. 11వ వేతన సవరణ కమిషన్ నివేదికను అధ్యయనం చేసిన కమిటీ పలు సిఫార్సులతో సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్‌కు నివేదిక సమర్పించింది. కేంద్ర వేతన సంఘం సిఫార్సుల దిశగానే .. ► కొద్ది సంవత్సరాలుగా మంజూరైన ఫిట్మెంట్ ఎక్కువగా ఉందని గమనించాలి. రాష్ట్ర సొంత రాబడికి మించిన ఖర్చు హెచ్ఆర్ వ్యయం పెరగడానికి దారి తీసింది. ► 9వ పీఆర్సీలో 27 శాతం సిఫార్సు చేస్తే దాన్ని మించి 39% ఫిట్మెంట్ మంజూరు చేశారు. ► 10వ పీఆర్సీ 29 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేస్తే అంతకు మించి 43% మంజూరు చేశారు. ► ఇదే కాలంలో 7వ కేంద్ర వేతన సవరణ కమిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14.29% ఫిట్మెంట్ మంజూరైంది ► 11వ రాష్ట్ర పీఆర్సీ కమిటీ ఐదేళ్లకు 27 శాతం ఫిట్మెంట్ సిఫార్సు చేసింది. ఈ సిఫార్సు చాలా ఎక్కువగా ఉంది. ► తెలంగాణలో పీఆర్సి 7.5% ఫిట్మెంట్ సిఫారసు చేసింది. ► చాలా రాష్ట్రాలు కేంద్ర వేతన సంఘం సిఫార్సుల స్వీకరణ దిశగా అడుగులు వేస్తున్నాయి. ► ఈ పరిస్థితుల్లో రాష్ట్రం ఐదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణలను కొనసాగించలేదు. పదేళ్లకు ఒకసారి 7వ కేంద్ర వేతన సవరణ ప్రకారం 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలి. తన క్యాంపు కార్యాలయంలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్ ఏపీలోనే అత్యధికం ► 2018–19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల వ్యయం రూ. 52,513 కోట్లు కాగా 2020–21 నాటికి ఏకంగా రూ.67,340 కోట్లకు చేరుకుంది. ► 2018–19లో రాష్ట్ర ప్రభుత్వం సొంత ఆదాయం (ఎస్ఓఆర్)లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం కాగా 2020–21 నాటికి 111 శాతానికి చేరుకుంది. ► ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయం 2018–19లో 32 శాతం అయితే 2020–21 నాటికి 36 శాతానికి పెరిగింది. ► ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. 2020–21లో తెలంగాణాలో ఇది కేవలం 21 శాతమే. ఛత్తీస్‌గఢ్‌లో 32 శాతం, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లో 31 శాతం, ఒడిశాలో 29 శాతం, మధ్యప్రదేశ్‌లో 28 శాతం, హర్యానాలో 23 శాతం ఉంది. బకాయిలు రాలేదు... కోవిడ్‌తో పెను భారం ► విభజన రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావం చూపింది ► తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా ఏపీలో అది కేవలం రూ. 1,70,215 మాత్రమే ఉంది. ► రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి ఇంకా రావాల్సి ఉంది ► రెవిన్యూ లోటు కింద రూ.18,969.26 కోట్లు కేంద్ర ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ► కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారి దాదాపు రూ.30 వేల కోట్ల అదనపు భారం పడింది. కష్టాలున్నా ప్రయోజనాలను కాపాడుతూ.. ► ఇన్ని కష్టాల్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం పలు నిర్ణయాలు తీసుకుంది. ► ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే 2019 జూలై 1 నుంచి 27 శాతం ఐఆర్ ఇచ్చింది. ఐఆర్ రూపంలో ఉద్యోగులకు రూ.11,270.21 కోట్లు, పెన్షనర్లకు రూ.4,569.78 కోట్లు, మొత్తంగా రూ.15.839.99 కోట్లు చెల్లించింది. ► అంగన్వాడీ, ఆశావర్కర్లు సహా వివిధ కేటగిరీలకు చెందిన ఉద్యోగులకు వేతనాలు పెంచింది. ► 3,01,021 మంది ఉద్యోగులకు ఈ ప్రభుత్వం జీతాలు పెంచింది. తద్వారా ఏడాదికి జీతాల రూపంలో ప్రభుత్వం చేస్తున్న ఖర్చు రూ.1,198 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు పెరిగింది. ► కాంట్రాక్టు ఉద్యోగులకు మినిమం టైం స్కేలు సహా ఇతర ప్రయోజనాలను ఈ ప్రభుత్వం అందించింది. ► ప్రభుత్వ విభాగాలు, యూనివర్శిటీలు, సొసైటీలు, కేజీవీబీ, మోడల్ స్కూళ్లు తదితర ఉద్యోగులకు వర్తింప చేసింది. ► ప్రమాదవశాత్తూ మరణిస్తే రూ.5 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా అమలు చేస్తోంది. ► ఈ చర్యల వల్ల ప్రభుత్వంపై రూ.360 కోట్ల మేర ఏటా భారం పడుతోది. మధ్యవర్తులు లేకుండా నేరుగా జీతాలు ► అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ప్రయోజనాల కోసం అప్కాస్‌ను ప్రారంభించింది. మధ్యవర్తులు లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే జీతాలను జమ చేస్తోంది. ఈపీఎఫ్ మరియు ఈఎస్ఐ వంటి సదుపాయాలను కల్పించింది. అప్కాస్ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ. 2,040 కోట్ల భారం పడుతోంది. ► ఎంపీడీఓలకు ప్రమోషనల్ ఛానల్ అంశాన్ని ఈ ప్రభుత్వం పరిష్కరించింది. ► గ్రేడ్–1 వీఆర్వోలకు ప్రమోషన్ ఛానల్‌ను ఏర్పాటు చేసింది. ► రాష్ట్రవ్యాప్తంగా 3,795 వీఆర్వో, వీఆర్ఏ పోçస్టుల భర్తీకి ఆదేశాలు ఇచ్చింది. ► మహిళా ఉద్యోగులకు ఏటా అదనంగా ఐదు రోజుల పాటు ప్రత్యేకంగా సెలవులు మంజూరు చేసింది. ► హైదరాబాద్ నుంచి అమరావతి వచ్చిన ఉద్యోగులకు 30శాతం హెచ్ఆర్ఐ చెల్లిస్తోంది. ► ప్రజారోగ్యానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ కోవిడ్‌ను ఎదుర్కొంటూ డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ తదితర సిబ్బంది నియమకాలు పెద్ద ఎత్తున చేపట్టడంతో ఏటా అదనంగా రూ.820 కోట్ల భారం ఖజానాపై పడింది. ఆర్టీసీ విలీనం... పాలన సంస్కరణలు ► ఏపీఎస్ ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయడంతో 2020 జనవరి నుంచి సంస్థ సిబ్బంది ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. జనవరి 2020 నుంచి అక్టోబరు 2021 వరకూ రూ.5,380 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. ► పరిపాలనా సంస్కరణల్లో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తెచ్చింది. ► 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను తీసుకుంది. ఏడాదికి రూ. 2,300 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. అడగకుండానే ‘ఐఆర్’ రాష్ట్ర ప్రభుత్వం 2019లో అధికారంలోకి వస్తూనే ఉద్యోగుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎవరూ అడగకుండానే 27 శాతం మధ్యంతర భృతి (ఐఆర్) ప్రకటించింది. దీనివల్ల ఏటా దాదాపు రూ.16 వేల కోట్ల అదనపు భారం పడినప్పటికీ వారి ప్రయోజనాలను కాపాడుతూ ముందుకు సాగింది. ఉద్యోగులకు జీతభత్యాలు, పెన్షన్ల చెల్లింపులు ఈ ఏడాది రూ.67,340 కోట్లకు చేరుకున్నాయి. ఐఆర్ ప్రకటించేనాటికి అంతా బాగున్నా కోవిడ్‌తో 2019–20లో రూ.8వేల కోట్లకు పైగా, 2020–21లో రూ.14వేల కోట్లకు పైగా ఆదాయం తగ్గిపోయింది. కోవిడ్ నియంత్రణ, వైద్య రంగాన్ని బలోపేతం చేసేందుకు మరో రూ.8వేల కోట్ల వరకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. మొత్తంగా రూ.30 వేల కోట్ల భారం పడింది. వీటితో పాటు ఐఆర్‌తో ఇప్పటికే మోయలేని భారం ఉన్నా ఉద్యోగుల డిమాండ్లు, పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఫిట్‌మెంట్‌ను భరించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వివిధ అంశాలపై సిఫార్సులు ఇవీ.. పే స్కేల్స్ 11వ పీఆర్సీ సిఫార్సు: మాస్టర్ పే స్కేల్‌ను 32 గ్రేడ్లు, 83 (81 నుంచి 83కు పెంపు) స్టేజస్తో రూపొందించాలి. ఉద్యోగుల గ్రేడ్లు, స్టేజ్‌ల ఆధారంగా నెలకు కనీస వేతనం రూ.20 వేలు.. గరిష్ఠ వేతనం రూ.1.79 లక్షలు చెల్లించేలా మాస్టర్ పే స్కేల్‌ను అమలు చేయాలి. సెక్రటరీల కమిటీ: పదవీ విరమణ వయోపరిమితిని 58 నుంచి 60 ఏళ్లకు పెంచిన నేపథ్యంలో మాస్టర్ పే స్కేల్లో స్టేజ్‌లను 81 నుంచి 83కు పెంచడం సబబే. నెలకు కనీస వేతనం రూ.20 వేలు.. గరిష్ఠ వేతనం రూ.1.79 లక్షలు ఇవ్వాలని 11వ పీఆర్సీ చేసిన ప్రతిపాదన సహేతుకమైనదే. ఫిట్మెంట్ 11వ పీఆర్సీ: ఐఎల్వో ప్రమాణాల ప్రకారం ఉద్యోగులకు 23 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే 27 శాతం ఐఆర్ ఇస్తోంది. ఈ నేపథ్యంలో 27 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. సెక్రటరీల కమిటీ: గత పదేళ్లలో 9వ పీఆర్సీ ఫిట్మెంట్ బెనిఫిట్‌ను 27 శాతం సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 39 శాతం మంజూరు చేసింది. పదో పీఆర్సీ కమిటీ ఫిట్మెంట్ బెనిఫిట్‌ను 29 శాతం సిఫార్సు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం 43 శాతం మంజూరు చేసింది. గత పదేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు 82 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇస్తే.. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14.29 శాతం(ఏడో పీఆర్సీ) మాత్రమే ఇచ్చింది. తెలంగాణ పీఆర్సీ కమిటీ ఐదేళ్ల కాలానికి 7.5 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్‌ను సిఫార్సు చేస్తే.. రాష్ట్రంలో 11వ పీఆర్సీ 27 శాతాన్ని సిఫార్సు చేసింది. దీని వల్లే రాష్ట్ర సొంత ఆదాయానికి మించి ఉద్యోగుల వేతనాలకు అధికంగా వ్యయమవుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఏడో వేతన సంఘం చేసిన సిఫార్సుల మేరకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు 14.2 శాతం ఫిట్మెంట్ బెనిఫిట్ ఇస్తే సరిపోతుంది. కొత్త పే స్కేలు వర్తింపజేయాల్సిన తేదీ.. 11వ పీఆర్సీ: 1–7–2018 నుంచి కొత్త పే స్కేల్‌ను వర్తింపజేయాలి. మానిటరి బెనిఫిట్‌పై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. సెక్రటరీల కమిటీ: ఏపీఎస్ఆర్టీసీ(పీటీడీ) ఉద్యోగులకు 1–1–2020 నుంచి కొత్త పే స్కేల్‌ను వర్తింపజేయాలి. మానిటరి బెనిఫిట్‌ను 1–10–2022 నుంచి అమలు చేయాలి. అంటే 2022, నవంబర్‌లో మానిటరి బెనిఫిట్‌తో కూడిన వేతనాన్ని ఇవ్వాలి. -
సీఎం జగన్‌కు పీఆర్సీ నివేదిక అందజేసిన కమిటీ
AP PRC Report 2021: సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి పీఆర్సీ నివేదికను కమిటీ అందజేసింది. చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మతో పాటు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్, ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి (హెచ్ఆర్) శశిభూషణ్ కుమార్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, సీఎంవో అధికారులు హాజరయ్యారు. 14.29 శాతం ఫిట్‌మెంట్‌ను సీఎస్ కమిటీ సిఫార్సు చేసింది. 11వ వేతన సంఘం సిఫార్సులపై సీఎస్ కమిటీ సిఫార్సులు ఇచ్చింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై నివేదికలో కమిటీ ప్రస్తావించింది. చదవండి: Nellore: టీడీపీలో ‘కార్పొరేషన్’ బ్లో అవుట్.. రాజీనామాల బాట ‘‘2018-19లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల రూపేణా చేసిన వ్యయం రూ.52,513 కోట్లు. 2020-21 నాటికి వ్యయం రూ.67.340 కోట్లు. 2018-19లో రాష్ట్ర ప్రభుత్వ సొంత ఆదాయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల మొత్తం 84 శాతం. 2020-21 నాటికి 111 శాతానికి చేరుకుంది. ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల కోసం చేస్తున్న వ్యయంలో 2018-19లో 32 శాతం.. 2020-21 నాటికి 36 శాతానికి చేరింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ వ్యయం ఏపీలోనే అధికం. 2020-21లో తెలంగాణలో ఇది కేవలం 21 శాతమేనని’’ కమిటీ పేర్కొంది. ‘‘రాష్ట్ర విభజన ఆర్థిక పరిస్థితులపై పెను ప్రభావం చూపింది. తెలంగాణలో సగటు తలసరి ఆదాయం రూ.2,37,632 కాగా, ఏపీలో కేవలం రూ.1,70,215 మాత్రమే. రూ.6,284 కోట్ల విద్యుత్ బకాయిలు ఇంకా తెలంగాణ నుంచి రావాలి. రెవెన్యూ లోటు కింద రూ.18,969 కోట్లు కేంద్రం ఇవ్వాలి. కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. కోవిడ్ కారణంగా రూ.20వేల కోట్ల అదనపు భారం పడింది. కష్టాల్లో కూడా ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాల కోసం అనేక నిర్ణయాలు తీసుకుంది. 2019, జులై 1న 27 శాతం ఐఆర్ ఇచ్చింది. ఐఆర్ రూపేణా ఉద్యోగులకు రూ.11,270 కోట్లు, పెన్షన్లకు రూ.రూ.4,569 కోట్లు చెల్లించాం. అంగన్వాడీ, ఆశా వర్కర్లు సహా వివిధ కేటగీరీలకు చెందిన ఉద్యోగులకు వేతనాలు పెంచాం. 3,01,021 ఉద్యోగులకు ప్రభుత్వం జీతాలు పెంచింది. జీతాల రూపంలో ప్రభుత్వ ఖర్చు రూ.1198 కోట్ల నుంచి రూ.3187 కోట్లకు పెరిగింది. కాంట్రాక్ట్ ఉద్యోగులకు మినిమం టైం స్కేల్ సహా ఇతర ప్రయోజనాలు కల్పించారు. ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.5లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల పరిహారం అమలు చేస్తోంది. ఏపీఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేశారు. దీని వల్ల 2020 జనవరి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. 2020, జనవరి నుంచి అక్టోబర్ 2021 వరకు ప్రభుత్వంపై రూ.5380 కోట్ల పడిందని’’ కమిటీ పేర్కొంది. పరిపాలనా సంస్కరణలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను ప్రభుత్వం తీసుకొచ్చింది. 1.28 లక్షల మంది శాశ్వత ఉద్యోగులను తీసుకుంది. ఏడాదికి రూ.2300 కోట్ల భారం ప్రభుత్వంపై పడింది. ఆరోగ్య రంగంలో డాక్టర్లు, నర్సులు, పారా మెడికల్ సిబ్బందిని నియమించాం. దీని వల్ల అదనంగా ఏడాదికి ప్రభుత్వంపై రూ.820 కోట్ల భారం. అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల కోసం అప్కాస్‌ను ప్రారంభించారు. అప్కాస్ రూపంలో ఏడాదికి ప్రభుత్వంపై రూ.2040 కోట్ల భారం పడిందని’’ కమిటీ నివేదికలో పేర్కొంది. ప్రభుత్వంపై 8వేల నుంచి 10వేల కోట్లు భారం: సీఎస్ ముఖ్యమంత్రికి పీఆర్సీ నివేదిక అందజేసిన అనంతరం చీఫ్ సెక్రటరీ డాక్టర్ సమీర్ శర్మ మీడియా సమావేశంలో మాట్లాడారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందిస్తామన్నారు. నివేదికను వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని తెలిపారు. అనేక అంశాలను సిఫారసు చేశామన్నారు. ప్రభుత్వంపై రూ.8 వేల నుంచి 10వేల కోట్ల భారం పడనుందని.. ఫిట్‌మెంట్‌పై సీఎంకు 11 ప్రతిపాదనలు ఇచ్చామని సీఎస్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలు, కేంద్రం ఇచ్చిన ఫిట్‌మెంట్‌ను పరిశీలించామని సీఎస్ తెలిపారు. -
ఇంధన పొదుపుతో ఖర్చుల అదుపు
సాక్షి, అమరావతి: ఇంధన సామర్థ్యం, పొదుపు చర్యలపై ప్రజలు, ప్రభుత్వ శాఖలు, ప్రైవేట్ సంస్థలకు పెద్దఎత్తున అవగాహన కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ దృష్ట్యా అందరూ ఇంధన పరిరక్షణ వారోత్సవాలలో భాగస్వాములు కావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఇంధన సంరక్షక మిషన్ (ఏపీఎస్ఈసీఎం) చైర్మన్ సమీర్‌శర్మ కోరారు. రాష్ట్రంలో ఈ నెల 14 నుంచి మొదలయ్యే ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా అందించనున్న స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్ (సెక) 2021పై ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్, ఇతర అధికారులతో ఆయన ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా చర్చించారు. పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ను అందుకోవడానికి, ఇంధన భద్రత, ఆర్థికాభివృద్ధి సాధించేందుకు, ఇంధనంపై వ్యయాన్ని తగ్గించేందుకు ఇంధన సామర్థ్య చర్యలు దోహదపడతాయని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఇంధన పరిరక్షణ అవార్డుల కార్యక్రమంలో ఎక్కువ మంది పాల్గొనేలా సహకరించాల్సిందిగా అన్ని ప్రభుత్వ శాఖలకు ఇప్పటికే విజ్ఞప్తి చేసినట్లు ఇంధన శాఖ కార్యదర్శి నాగులపల్లి శ్రీకాంత్ సీఎస్‌కు వివరించారు. వివిధ రంగాల్లో ఇంధన సామర్థ్య కార్యక్రమాలు అమలు చేయడం ద్వారా ఏటా 15 వేల మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఆదా చేసే అవకాశముందని పేర్కొన్నారు. ‘సెక’ పోటీలో ఎక్కువ మంది పాల్గొనేందుకు వీలు కల్పిస్తూ దరఖాస్తు గడువును ఈ నెల 8వ తేదీ వరకూ పొడిగిస్తున్నట్లు ఏపీఎస్ఈసీఎం సీఈవో ఎ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. కేటగిరీల వారీగా అవార్డులకు అర్హతలు ఇలా.. పరిశ్రమలు, భవన నిర్మాణం, మునిసిపల్ రంగానికి సంబంధించిన వివిధ సంస్థల మధ్య నిర్విహిస్తున్న సెక–2021 అవార్డుల పోటీకి సంబంధించిన అర్హత ప్రమాణాలను ఏపీఎస్ఈసీఎం ఆదివారం ప్రకటించింది. పారిశ్రామిక రంగం కింద, మొత్తం వార్షిక ఇంధన వినియోగం 3000 టీన్ ఆఫ్ ఆయిల్ ఈక్వలెంట్ (టీఓఈ) లేదా అంతకంటే ఎక్కువ కలిగిన సిమెంట్ పరిశ్రమలు, 1500 టీఓఈ లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వార్షిక ఇంధన వినియోగం కలిగిన టెక్స్టైల్ పరిశ్రమలు, 1000 కేవీఏ, అంతకంటే ఎక్కువ డిమాండ్ ఉన్న ఎంఎస్ఎంఈ సంస్థలు ఈ అవార్డులకు దరఖాస్తు చేసుకోవచ్చు. భవనాల విభాగం కింద, వాణిజ్య భవనాలు, హోటళ్లు, ఆస్పత్రులు, షాపింగ్ మాల్స్, ప్లాజాలు, యూనివర్సిటీలు, 100 కిలోవాట్, 120 కిలోవాట్ లేదా అంతకంటే ఎక్కువ కాంట్రాక్ట్ డిమాండ్ ఉన్న ఇంజనీరింగ్ కళాశాలలు, 50 కిలోవాట్ కంటే ఎక్కువ లోడ్ ఉన్న విశ్వవిద్యాలయాలు, ఇంజనీరింగ్ కళాశాలలు దరఖాస్తుకు అర్హులు. మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, మురుగు నీటి పంపింగ్ బోర్డులు, తాగునీటి సరఫరా బోర్డులు కూడా పోటీలో పాల్గొనవచ్చు. దరఖాస్తు వివరాలు ఏపీఎస్ఈసీఎం, డిస్కంల వెబ్సైట్లలో అందుబాటులో ఉన్నాయి. పూరించిన దరఖాస్తును seca.apsecm.gmail.com ద్వారా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌కు సమర్పించాలి. -
విజయవాడ సీపీగా కాంతి రాణా..
సాక్షి, విజయవాడ: 2004 బ్యాచ్ ఐపీఎస్ అధికారి కాంతి రాణా విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఏపీ సీఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం అనంతపురం డీఐజీగా పని చేస్తున్న కాంతి రాణా.. గతంలో విజయవాడ డీసీపీగా పని చేశారు. -
ఉద్యోగులకు ఆదివారం షాక్.. కలసిరాని 'సెలవు'
సాక్షి, అమరావతి: రాబోయే ఏడాదికిగాను ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులిచ్చారు. కనుమ, శ్రీరామనవమి, బక్రీద్, గాంధీ జయంతి, ఈద్ మిలాద్‌నబీ, క్రిస్మస్ వంటి సాధారణ సెలవులు, మహాలయ అమావాస్య, నరక చతుర్థశి, యాజ్–దహుం–షరీఫ్ వంటి ఐచ్ఛిక సెలవులు ఆదివారమే రావడం ఉద్యోగులను నిరాశపరుస్తోంది. చంద్ర దర్శనం బట్టి సెలవులు ఇచ్చే రంజాన్, బక్రీద్, మొహరం, ఈద్ మిలాద్‌నబి వంటి పర్వదినాలు, తిథులను బట్టి హిందు పండుగల్లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వాటిని ముందస్తుగా పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. -
థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి : సీఎస్ సమీర్‌శర్మ
సాక్షి, అమరావతి: కోవిడ్ థర్డ్‌వేవ్ వస్తే ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) డాక్టర్ సమీర్‌శర్మ వైద్య ఆరోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. ఆయన అధ్యక్షతన గురువారం సచివాలయంలో కోవిడ్–19 వ్యాక్సినేషన్ కార్యక్రమం రాష్ట్ర స్టీరింగ్ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్, కమిషనర్ కాటమనేని భాస్కర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రాష్ట్రంలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రగతిని వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ థర్డ్‌వేవ్‌ను ప్రణాళికాబద్ధంగా ఎదుర్కొనేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. థర్డ్‌వేవ్ కోవిడ్‌ను గుర్తించి, అందుకు అనుగుణంగా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టేందుకు అందుబాటులో ఉన్న ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్సు ప్రాజెక్టు, ఇంటిగ్రేటెడ్ హెల్త్ సమాచార ప్లాట్‌ఫామ్, కమ్యూనికేషన్ వ్యవస్థల పనితీరు గురించి ఆరా తీశారు. సకాలంలో వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. -
సీఎస్ నేతృత్వంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభం
-
సీఎస్ నేతృత్వంలో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం
సాక్షి, అమరాతి: ప్రభుత్వ ఉన్నతాధికారులతో చీఫ్ సెక్రెటరీ సమీర్ శర్మ నేతృత్వంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం ముగిసింది. జీఏడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శశి భూషణ్, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ ఈ సమావేశానికి హాజరయ్యారు. పీఆర్సీ, ఇతర సమస్యలపై ఉద్యోగ సంఘాలతో వారు చర్చించారు. ఈ సందర్భంగా ఏపీ సచివాలయం ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో కూడా కలెక్టర్లతో ఉద్యోగ సంఘాలు చర్చించిచాలని గత సమావేశంలో నిర్ణయం తీసుకుందని గుర్తు చేశారు. మెడికల్ రియంబర్స్మెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. పీఆర్సీ నివేదిక త్వరగా ఇవ్వాలని కోరామని మీడియాతో ఆయన చెప్పారు. ఉద్యోగులకి ప్రభుత్వం నుంచి వచ్చే బకాయిలు త్వరలో పూర్తిగా చెల్లిస్తామని అధికారులు చెప్పారని వెంకట్రామిరెడ్డి వెల్లడించారు. వచ్చే సమావేశానికి పీఆర్సీ నివేదికతో రావాలని ప్రభుత్వాన్ని కోరామని అన్నారు. కాగా, గతనెల 29న చీఫ్‌సెక్రటరీ సమీర్ శర్మ అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కొన్ని విషయాలపై చర్చించారు. వాటికి కొనసాగింపుగా నేడు మరోసారి భేటీ అయ్యారు. -
సమన్వయంతో సమర్థ వినియోగం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమలకు జీవితకాలం తోడు అందించాలన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర పరిశ్రమలశాఖ వేగంగా అడుగులు వేస్తోంది. రాష్ట్రంలోని పరిశ్రమలకు సింగిల్‌విండో విధానంలో చేయూత అందించే విధంగా ప్రవేశపెట్టిన ‘వైఎస్సార్ ఏపీ వన్’తో పాటు వివిధ విభాగాల వనరులను సమర్థంగా వినియోగించుకునే విధంగా నివేదిక రూపొందించే బాధ్యతను పరిశ్రమలశాఖ బోస్టన్ కన్సల్టెన్సీ గ్రూపు (బీసీజీ)నకు అప్పగించింది. విస్తృత అధ్యయనం అనంతరం పరిశ్రమలశాఖ పరిధిలోకి వచ్చే ఏపీఐఐసీ, ఏపీ ఈడీబీ, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్, ఏపీఎస్ఎఫ్సీ, ఏపీటీపీసీలతోపాటు స్కిల్ డెవలప్మెంట్ వంటి విభాగాలను సమన్వయం చేసుకుంటూ మానవ వనరులను ఎలా వినియోగించుకోవచ్చన్న దానిపై ప్రతి విభాగానికి స్పష్టమైన విధివిధానాలను సూచిస్తూ బీసీజీ నివేదికను తయారుచేసి ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలోని అంశాల అమలుపై పరిశ్రమలశాఖ అధికారులు వివిధ శాఖల అధికారులతో చర్చిస్తున్నారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ పార్కుల నిర్మాణం, నిర్వహణ వంటి వాటిల్లో ఏపీఐఐసీ, ఎంఎస్ఎంఈ కార్పొరేషన్ల మధ్య సమన్వయం కొరవడింది. కొన్ని సందర్భాల్లో ఒకేపనిని రెండు సంస్థలు చేపట్టడంతో మానవ వనరులు, సమయం వృధా అవుతున్నాయి. ఇలాంటి సమస్యలకు పరిష్కారం చూపిస్తూ బీసీజీ పలు సూచనలు చేసింది. పరిశ్రమలశాఖ ఏయే రంగాల్లో పటిష్టంగా ఉంది, ఎక్కడ బలహీనంగా ఉందనే విషయాలను ఈ నివేదికలో వివరించింది. అన్నీ వైఎస్సార్ ఏపీ వన్ గొడుగు కిందకు అన్ని శాఖలను సమన్వయపర్చేలా వైఎస్సార్ ఏపీ వన్ పేరుతో కొత్త వ్యవస్థను ఏర్పాటు చేయాలని బీసీజీ సిఫారసు చేసింది. వైఎస్సార్ ఏపీ వన్‌కి ప్రత్యేకంగా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని, 20 నుంచి 25 మంది ఉద్యోగులను నియమించాలంది. ఏడాదికి రూ.10 కోట్ల నుంచి రూ.15 కోట్ల బడ్జెట్ అవసరమవుతుందని అంచనా వేసింది. రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలను పునరుజ్జీవింప చేసేవిధంగా ఒక ప్రత్యేక సెల్‌తో పాటు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్, వైఎస్సార్ బడుగు వికాసం, పెర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సెల్స్ ఏర్పాటు చేయాలని సూచించింది. ఈ నివేదికను సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ.. రాష్ట్రంలోని పరిశ్రమలకు జీవితకాలం హ్యాండ్‌హోల్డింగ్ ఇవ్వడంతోపాటు కొత్తగా యూనిట్లు ఏర్పాటు చేయాలనుకునే వారికి సహాయకారిగా ఉండటానికి ప్రాధాన్యత ఇవ్వాలని పరిశ్రమలశాఖ అధికారులను బుధవారం ఆదేశించారు. -
AP: ఇద్దరు మంత్రుల శాఖల పునర్వ్యవస్థీకరణ
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇద్దరు మంత్రుల శాఖలను పునర్వ్యవస్థీకరించింది. వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలను మంత్రి బుగ్గనకు అప్పగించారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి ఇకపై ఎక్సైజ్‌శాఖ మంత్రిగా కొనసాగనున్నారు. ఆర్థిక, ప్రణాళిక, వాణిజ్య పన్నుల శాఖ మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కొనసాగనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ గెజిట్‌ను విడుదల చేశారు. చదవండి: (బాబు ఊగిపోతూ.. తమ్ముళ్లు తూగిపోతూ!) -
పీఆర్సీ సిఫార్సుల అమలుకు సర్కారు సానుకూలం
సాక్షి, అమరావతి: పీఆర్సీ సిఫార్సులను వీలైనంత వరకూ పూర్తి సానుకూలంగా అమలు చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ స్పష్టం చేశారు. ఏపీ సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో జరిగింది. సమీర్ శర్మ మాట్లాడుతూ.. పీఆర్సీ సిఫార్సుల అమలుకు తీసుకోవాల్సిన చర్యలపై వచ్చే వారం పీఆర్సీ కమిటీ అధికారులతో సమావేశమై పూర్తిస్థాయిలో చర్చిస్తామన్నారు. పీఆర్సీ నివేదికను దాచిపెట్టాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదన్నారు. పీఆర్సీ నివేదికను ఉద్యోగ సంఘాలకు ఇవ్వాలన్న డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ.. దీనిని సంబంధించి సంగ్రహ నివేదికను వారం రోజుల్లోగా అందిస్తామన్నారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సుమారు రెండేళ్లుగా ఆశాజనకంగా లేవని, వాస్తవ పరిస్థితులను ఉద్యోగులు అర్థం చేసుకోవాలని సూచించారు. కాంట్రాక్ట్, ఒప్పంద ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై సర్వీసెస్, హెచ్ఆర్ ముఖ్య కార్యదర్శి సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. వివిధ ఉద్యోగ సంఘాలు తెలిపిన అంశాలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. సర్వీసెస్, హెచ్ఆర్ఎం ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ మాట్లాడుతూ 2010లో సివిల్ సర్వీసెస్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగ్గా.. పదేళ్ల అనంతరం ఇప్పుడు జరుగుతోందని చెప్పారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్‌చంద్ర, ప్రవీణ్‌కుమార్, ఎస్ఎస్ రావత్, వి.ఉషారాణి, గోపాలకృష్ణ ద్వివేది, బి.రాజశేఖర్, కార్యదర్శి శ్యామలరావు, అరుణ్‌కుమార్ పాల్గొన్నారు. -
14న సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం
సాక్షి, అమరావతి: తిరుపతిలో వచ్చే నెల 14న 29వ సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఏపీ, తెలంగాణ, కర్నాటక, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్, లక్షద్వీవులకు చెందిన గవర్నర్లు, లెఫ్టినెంట్ గవర్నర్లు, ముఖ్యమంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, సలహాదారులు, ఇతర సీనియర్ అధికారులు హాజరవుతారు. ఆయా రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడంతో పాటు కేంద్రం నుంచి అందాల్సిన సాయం తదితరాలపై చర్చిస్తారు. ఈ సమావేశాన్ని విజయవంతం చేసేందుకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఆదేశించారు. జోనల్ కౌన్సిల్ సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లపై గురువారం సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో వివిధ శాఖల కార్యదర్శులు, టీటీడీ ఈవో, చిత్తూరు కలెక్టర్, ఎస్పీ తదితరులతో సమీక్ష నిర్వహించారు. సీఎస్ మాట్లాడుతూ.. ఎలాంటి లోపాలకు ఆస్కారమివ్వకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి చర్చించాల్సిన అంశాలు, కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాల్సిన అజెండాపై వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ ప్రత్యేకంగా సమీక్షించారు. ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పూనం మాలకొండయ్య, ఎల్. ప్రేమచంద్రారెడ్డి, అనిల్ సింఘాల్, వి.ఉషారాణి, శ్యామల రావు, పి.బాలకృష్ణమాచార్యులు తదితరులు పాల్గొన్నారు. -
ఎంటర్టైన్మెంట్ సిటీగా విశాఖ
సాక్షి, అమరావతి: విశాఖను ఎంటర్టైన్మెంట్ సిటీగా అభివృద్ధి చేసే అంశంపై సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే విశాఖపట్నం పర్యాటక పరంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సాధిస్తుండగా దాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎస్ పేర్కొన్నారు. విశాఖ నగరంతోపాటు భీమిలి నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ అభివృద్ధి, 7 స్టార్ హోటల్స్, గోల్ఫ్ కోర్సు వంటివి ఏర్పాటు, అడ్వెంచర్, వాటర్ స్పోర్ట్స్ వంటివి అభివృద్ధి చేయడంపై సీఎస్ సమీక్షించారు. జెట్టీ, బీచ్ వాటర్ స్ట్రక్చర్ల నిర్మాణం, సీప్లేన్లు, క్రూయిజ్ షిప్పులు, అమ్యూజ్మెంట్ పార్కు, యాంపీ థియేటర్, రిటైల్ అవుట్‌లెట్స్ వంటి వాటి ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. -
వచ్చే నెల 30వ తేదీలోగా ‘కోవిడ్’ కారుణ్య నియామకాలు పూర్తిచేయాలి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌తో చనిపోయిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కారుణ్య నియామకాలను నవంబర్ 30లోగా పూర్తి చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వివిధ శాఖల కార్యదర్శులను ఆదేశించారు. సచివాలయంలో గురువారం వివిధ శాఖల కార్యదర్శులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. ప్రధానంగా మంత్రివర్గ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల అమలుకు తీసుకున్న చర్యలపై నివేదిక, వివిధ శాఖలకు సంబంధించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, కోర్టు కేసులకు సంబంధించి సకాలంలో కౌంటర్ల దాఖలు, కోర్టు తీర్పుల సత్వర అమలు, వివిధ పథకాలకు కేంద్రం నుంచి సకాలంలో నిధులు రాబట్టడం, నూతన ప్రతిపాదనలు సమర్పించడం తదితర అంశాలపై సీఎస్ సమీక్షించారు. ప్రతి నెలా మొదటి బుధవారం సమావేశం ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ ఇక నుంచి ప్రతి నెలా మొదటి బుధవారం కార్యదర్శుల సమావేశం నిర్వహించనున్నట్టు చెప్పారు. ► రాష్ట్ర సచివాలయం మొదలు.. గ్రామస్థాయి వరకూ ఈ–ఆఫీస్ విధానాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ► ఒక అంశానికి సంబంధించిన ఫైలును.. క్షేత్రస్థాయి కార్యాలయం మొదలు, రాష్ట్ర సచివాలయం వరకూ ఒకే నంబర్‌తో నిర్వహించేలా చూడాలని, దీనికి సంబంధించి కొన్ని యునిక్ నంబర్లను రూపొందించి జిల్లా కలెక్టర్లకు పంపేందుకు చర్యలు తీసుకోవాలని ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శిని సీఎస్ ఆదేశించారు. ► వివిధ శాఖల్లో డీపీసీ క్యాలెండర్ల ప్రకారం సకాలంలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు సతీష్‌చంద్ర, పూనం మాలకొండయ్య, ప్రవీణ్‌కుమార్, అజయ్ జైన్, కరికాల వలవన్ తదితరులు పాల్గొన్నారు. -
దాన్యం సేకరణను వేగవంతం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ధాన్యం సేకరణను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో సంబంధిత శాఖల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సీఎస్ సమీక్షించారు. సీఎస్ మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలను కేంద్రంగా చేసుకుని ధాన్యం సేకరణ వేగవంతంగా చేయాలని ఆదేశించారు. అదే విధంగా కొనుగోలు చేసిన ధాన్యానికి రైతులకు సకాలంలో సొమ్ము చెల్లించాలని సూచించారు. అలాగే రానున్న రోజుల్లో ధాన్యం సేకరణ మరింత సులువుగా సాఫీగా జరిగేలా చూడాలని సీఎస్ ఆదేశించారు. జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్షపై సమీక్ష అనంతరం జిల్లా కలెక్టర్లతో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ జగనన్న శాశ్వత భూ హక్కు– భూరక్ష పథకం జిల్లా కలెక్టర్లతో వీడియో సమావేశం ద్వారా సమీక్షించారు. ఉన్నతాధికారులతో 21న సీఎస్ సమావేశం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ ఈ నెల 21వ తేదీన అన్ని శాఖల ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. ఉద్యోగులకు సంబంధించిన ఆర్థికేతర అంశాలకు చెందిన సమాచారాన్ని వీలైనంత త్వరగా సీఎస్ కార్యాలయానికి పంపించాలని అన్ని శాఖలకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక సీఎస్ ప్రవీణ్ కుమార్ సోమవారం ఆదేశాలు జారీ చేశారు. -
దుర్గమ్మ సేవలో సీఎస్ సమీర్‌శర్మ
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ శనివారం దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన సమీర్‌శర్మ దంపతులకు దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు జరిపించారు. మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు. -
నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం చర్యలు తీసుకోండి
-
సీఎం జగన్‌ను కలిసిన సీఎస్ సమీర్ శర్మ
-
సీఎం జగన్‌ను కలిసిన సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఈ భేటీ జరిగింది. ఈ భేటీలో ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ కూడా పాల్గొన్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ సమీర్ శర్మ గురువారం బాధ్యతలు స్వీకరించగా, ఆదిత్యనాథ్ దాస్ ఈ రోజు ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా బాధ్యతలు స్వీకరించనున్నారు. చదవండి: (సాగునీటి ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్ష) -
నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం చర్యలు తీసుకోండి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ క్రమంలో అధికారులు పోలవరం ప్రాజెక్ట్ పనుల ప్రగతిని సీఎం జగన్‌కు వివరించారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన దిగువ కాపర్ డ్యాం పనులు, కెనాల్స్‌కు కనెక్టివిటీ అంశాలపై సమీక్షలో చర్చించారు. గ్యాప్ 3 కాంక్రీట్ డ్యామ్ పనులు పూర్తి చేశామని అధికారులు తెలిపారు. వచ్చే ఖరీఫ్ నాటికి కాల్వల ద్వారా నీరందించేందకు సిద్ధంగా ఉన్నామని అధికారులు తెలిపారు. ఈసీఆర్ఎఫ్ పనుల ప్రారంభానికి ప్రణాళిక సిద్ధం చేశామని అధికారలు సీఎం జగన్‌కు వివరించారు. ఆర్ అండ్ ఆర్ పనులపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి 2,033 కోట్ల రూపాయలకు పైగా నిధులు రావాల్సి ఉందని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. ఈ క్రమంలో కేంద్ర నిధులు త్వరగా వచ్చేలా చూడాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. (చదవండి: Badvel By Election: ఓటింగ్ శాతం పెరగాలి: సీఎం జగన్) ఇతర ప్రాజెక్ట్‌లపై సీఎం జగన్ సమీక్ష రాష్ట్రంలోని ఇతర ప్రాజెక్ట్‌ల ప్రగతిపై కూడా సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నెల్లూరు బ్యారేజీ పనులు పూర్తి చేశామని.. నవంబర్‌లో ప్రారంభోత్సవానికి సిద్ధమని అధికారులు వెల్లడించారు. అవుకు టన్నెల్ నిర్మాణంలో గణనీయ ప్రగతి సాధించామని.. వచ్చే ఆగస్టు నాటికి టన్నెల్ పూర్తి చేసి నీటిని ఇస్తామని అధికారులు తెలిపారు. వెలిగొండ ప్రాజెక్ట్ పనులపై సీఎం జగన్ సమీక్ష వెలిగొండ ప్రాజెక్ట్ పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. రెండో టన్నెల్ పనులు వేగవంతం చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. వంశధార స్టేజ్-2 పనులు వచ్చే మే నాటికి పూర్తి చేస్తామని తెలిపారు అధికారులు. నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఒడిశా రాష్ట్రంతో చర్చల కోసం చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ సూచించారు. తోటపల్లి బ్యారేజీ కింద వచ్చే ఖరీఫ్ నాటికి నీటిని అందిస్తామని అధికారులు తెలిపారు. (చదవండి: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం: 6 నెలలు ఎక్కడ ఉంటే అక్కడే పింఛన్) మహేంద్రతనయ ప్రాజెక్ట్ నిర్మాణంపై దృష్టి పెట్టాల్సిందిగా సీఎం జగన్ ఆదేశించారు. కొల్లేరు వద్ద గోదావరి, కృష్ణా డెల్టాల్లో రెగ్యులేటర్ నిర్మాణ పనులు చేపట్టాలని సూచించారు. తాండవ ప్రాజెక్ట్ విస్తరణ, కృష్ణా నదిపై బ్యారేజీల నిర్మాణంపై దృష్టి పెట్టాలని కోరారు. తాండవ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం ఇప్పటికే టెండర్లు పిలిచామని అధికారులు సీఎం జగన్‌కి తెలిపారు. తొలివిడత టెండర్ల ప్రిక్రియలో అధికంగా కోట్ చేసిన పనులపై మరోసారి రివర్స్ టెండరింగ్‌కు వెళ్లామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమానికి జలవనరులశాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, నూతన సీఎస్ సమీర్ శర్మ, ఇరిగేషన్ సెక్రెటరీ శ్యామలరావు, ఉన్నతాధికారులు హాజరయ్యారు. చదవండి: సచివాలయాల సేవలను మరింత విస్తరించాలి -
ఏపీ నూతన సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన డాక్టర్ సమీర్‌శర్మ గురువారం సచివాలయంలో బాధ్యతలు స్వీకరించారు. సీఎస్‌గా పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్ స్థానంలో ఆయన నూతన బాధ్యతలు చేపట్టారు. తనకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తూ అందరి సహకారంతో రాష్ట్ర పురోభివృద్ధి, నవరత్నాల అమలు కోసం కృషి చేస్తానని సమీర్‌శర్మ తెలిపారు. పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్ ఢిల్లీలో ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమితులైన విషయం తెలిసిందే. శుక్రవారం సచివాలయంలో ఆయన ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. పదవీ విరమణ చేసిన ఆదిత్యనాథ్‌దాస్‌కు వీడ్కోలు, డాక్టర్ సమీర్ శర్మకు స్వాగత సభ కార్యక్రమాన్ని గురువారం సచివాలయం మొదటి బ్లాక్ సీఎం సమావేశ మందిరంలో సాధారణ పరిపాలన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏపీని ఉత్తమ రాష్ట్రంగా నిలబెట్టడమే లక్ష్యం: ఆదిత్యనాథ్‌దాస్ ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ఉత్తమ రాష్ట్రంగా, అగ్రగామిగా నిలబెట్టాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు ఆదిత్యనాథ్‌దాస్ తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా తన తొలి ఇన్నింగ్స్ పూర్తి చేసుకుని ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించబోతున్నట్లు చెప్పారు. అధికారులు, సిబ్బందితో కలసి టీమ్ వర్క్‌తో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకువెళ్లేలా కృషి చేశామన్నారు. పదేళ్లపాటు నీటిపారుదల శాఖలో పనిచేసిన తనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో పనిచేయడం చాలా సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ముఖ్యమంత్రితోపాటు యావత్ ప్రభుత్వ యంత్రాంగానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేశారు. తన పదవీకాలంలో ఏ ఒక్కరినీ తక్కువ చేయకుండా అందరినీ సమానభావంతో చూశానన్నారు. నూతన సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ సమీర్‌శర్మను తాను నరసాపురం సబ్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు కలిశానని గుర్తు చేసుకున్నారు. ఆయన సమర్ధుడైన అధికారి అని, నూతన భావాలు కలిగినవారని అభినందించారు. మరో ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నారు: సమీర్ శర్మ తనకు సాదర స్వాగతం పలుకుతున్న అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నట్లు నూతన సీఎస్ డాక్టర్ సమీర్‌శర్మ పేర్కొన్నారు. మంచి వ్యక్తిత్వం కలిగిన ఆదిత్యనాథ్‌దాస్ తన కుటుంబ స్నేహితుడని చెప్పారు. ఆయనది పదవీ విరమణ కాదని, ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా మరో ప్రస్థానాన్ని ప్రారంభిస్తున్నారని తెలిపారు. ఉన్నత విలువలు ఆయన సొంతం.. సభకు అధ్యక్షత వహించిన ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ ఆదిత్యనాథ్‌దాస్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తి అని కొనియాడారు. అధికారులందరికీ పలు అంశాల్లో నిరంతరం మార్గదర్శనం చేసే వారని చెప్పారు. డాన్సింగ్ విత్ డ్రీమ్స్ అనే పుస్తకాన్ని రచించడం ద్వారా ఆయనలో మంచి కవి ఉన్నాడని నిరూపించారన్నారు. ఆదిత్యనాథ్ దాస్ ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇరువర్గాలను పిలిచి సామరస్యపూర్వకంగా పరిష్కరించే వారని వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య కొనియాడారు. నీటిపారుదల రంగంలో విశేష అనుభవాన్ని గడించిన ఆదిత్యనాథ్‌దాస్‌ను వాటర్‌మెన్‌గా పిలవవచ్చని సర్వీసులు శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ పేర్కొన్నారు. ఆదిత్యనాథ్ దాస్ సమర్థంగా పనిచేశారని, సీఎస్‌గా బాధ్యతలు చేపట్టిన సమీర్ శర్మ పట్టణాభివృద్ధి రంగంలో నిపుణులని సాంఘిక సంక్షేమశాఖ ముఖ్యకార్యదర్శి సునీత చెప్పారు. ఆదిత్యనాథ్ దాస్ మంచి మానవతావాది అని ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ పేర్కొన్నారు. ఆదిత్యనాథ్ దాస్ ఫైళ్లను చాలా వేగంగా క్లియర్ చేసేవారని రెవెన్యూశాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి తెలిపారు. ఆదిత్యనాథ్ దాస్ వద్ద సౌకర్యవంతంగా విధులు నిర్వహించగలిగినట్లు ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. ఆదిత్యనాథ్ దాస్, డాక్టర్ సమీర్ శర్మను ఈ సందర్భంగా అధికారులు దుశ్శాలువ, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. సమాచార, పౌర సంబంధాలశాఖ ఈవో కార్యదర్శి టి.విజయకుమార్‌రెడ్డి, ఆర్ధిక శాఖ ఈఓ కార్యదర్శి సత్యనారాయణ పాల్గొన్నారు. -
సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తదుపరి సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ
-
సీఎం జగన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన తదుపరి సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని తదుపరి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన డాక్టర్ సమీర్ శర్మ సీఎం క్యాంప్ కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. కాగా ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఆయన స్ధానంలో సీఎస్‌గా డాక్టర్ సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రణాళికా, రిసోర్స్ మొబిలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా శర్మ విధులు నిర్వర్తిస్తున్నారు. చదవండి: 48 గంటల్లో మా భూమిని మాకు అప్పగించారు -
AP: తదుపరి సీఎస్‌గా సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా డా.సమీర్ శర్మ నియమితులు కానున్నారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో తదుపరి సీఎస్‌గా డా.సమీర్ శర్మ బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఈయన రాష్ట్ర ప్రణాళిక, రిసోర్స్ మొబిలైజేషన్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్నారు. -
ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ
-
ఏపీ నూతన సీఎస్‌గా సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శి(సీఎస్)గా సమీర్ శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1985 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ సమీర్ శర్మ.. ఉమ్మడి ఏపీలో ఆప్కో, ఐటీడీసీ సీఎండీగా పనిచేశారు. అక్టోబర్ 1 నుంచి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నెల 30న ప్రస్తుత సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ విరమణ చేయనున్నారు. ఇవీ చదవండి: ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం తీపి కబురు ఏపీ: వైద్యుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం -
ఏపీ: ఐఎల్ఈజీ వైస్ ఛైర్మన్‌గా ఐఏఎస్ అధికారి సమీర్‌శర్మ
సాక్షి, విజయవాడ: ఇనిస్టిట్యూట్ ఆఫ్ లీడర్ షిప్, ఎక్సలెన్స్ అండ్ గవర్నెన్స్ (ఐఎల్ఈజీ) వైస్ ఛైర్మన్, మెంబర్ సెక్రటరీగా సమీర్‌శర్మ నియమితులయ్యారు. ఈ మేరకు సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. సమీర్‌శర్మ ఇటీవలే కేంద్ర సర్వీస్ నుంచి రాష్ట్రానికి వచ్చారు. -
భారత్ విధానం కావాలి మార్గదర్శకం
గతంలో విశ్వాన్ని తుడిచిపెట్టిన వ్యాధులను ఎదుర్కోవడానికి అనుసరించిన విధానాలేవైనా, ఇప్పుడు కరోనాను ఎదుర్కోవడానికి పనికొస్తాయా? మన ప్రస్తుత స్థితికి సరి పోయే సామీప్య చారిత్రక అను భవంగా 1918 ఫ్లూ మహమ్మా రిని పేర్కొనవచ్చు. దీన్ని ఎదు ర్కోవడానికి అమెరికాలోని నగరాలు ఈ కింది ‘ఔష ధాలతో నిమిత్తం లేని విధాన నిర్ణయాల’లో అన్నింటిని గానీ, కొన్నింటినిగానీ అమలుచేశాయి. ఫ్లూ అనేది అంటు వ్యాధి అని ప్రకటించడం; పాఠశాలలు, చర్చీలు, థియే టర్లు, హోటళ్లు, నృత్యశాలలు మూసేయడం; జనం గుంపులుగా పోగవకుండా చూడటం; రోగులను విడిగా ఉంచడం. ఈ వ్యాధి వ్యాపిస్తోందన్న వార్తలు వచ్చిన తొలి రోజుల్లోనే కొన్ని నగరాల్లో ఈ తక్షణ చర్యలకు పూను కుంటే, కొన్ని నగరాల్లో మాత్రం ఆలస్యంగా ఉపక్రమిం చారు. కొన్ని నగరాల్లో అసలు స్పందనే కరువైంది. వీటి అమలు జరిగిన సమయ సందర్భాలు, తదనంతర పరి ణామాలు ఇట్లాంటి ఉపద్రవాలు తలెత్తినప్పుడు విధాన కర్తలు అనుసరించాల్సిన వ్యూహాలకు ముడిసరుకుగా పని కొస్తాయి. ఒక స్పష్టమైన ఉదాహరణగా మనం ఫిలడెల్ఫియా, సెయింట్ లూయిస్ నగరాల్లో అనుసరించిన భిన్న వైఖరు లను పరిశీలిద్దాం. ఫిలడెల్ఫియాలో మొదటి కేసు 1918 సెప్టెంబర్ 17న నమోదైంది. అధికారులు దీన్ని తీవ్రంగా పరిగణించకపోవడమే కాకుండా, జన సమూహాలను యథాతథంగా అనుమతించారు. సెప్టెంబర్ 28న ఒక పరేడ్ కూడా జరగడం గమనార్హం. అక్టోబర్ 3 నాటికిగానీ పాఠశాలలు మూసేయడం, సమావేశాల మీద నిషేధం విధించడం జరగలేదు. ఈలోగానే ఫ్లూ జనంలోకి వ్యాపిం చింది. ఇక దాన్ని నియంత్రించడం వైద్యుల వశంలో లేకుండా పోయింది. మరోవైపు సెయింట్ లూయిస్‌లో చురుగ్గా వ్యవహ రించారు. అక్కడ మొదటి కేసు 1918 అక్టోబర్ 5న నమో దైంది. అక్టోబర్ 7 నుంచే జనం సామాజిక దూరాన్ని పాటించేలా వివిధ చర్యలు తీసుకున్నారు. మొదటి కేసు నమోదు కాగానే ఈ రెండు నగరాల స్పందనలో తేడా వ్యవధి, రెండు వారాలు. ఇది ఎలా పరిణమించిందో చూద్దాం. వ్యాధి తీవ్రత అత్యధికంగా ఉన్న సమయంలో సెయింట్ లూయిస్‌లో లక్షకు 50 మంది చనిపోతే, ఫిలడె ల్ఫియాలో మాత్రం లక్షకు 250 మంది చనిపోయారు. మొత్తంగా మరణాల సంఖ్య (సెప్టెంబర్ 8–డిసెంబర్ 28, 1918) ఫిలడెల్ఫియాలో లక్షకు 719 ఉండగా, సెయింట్ లూయిస్‌లో లక్షకు 347 ఉంది. అయితే సెయింట్ లూయి స్లో ఈ మరణాల సంఖ్య పెరగడానికి కారణం, విధాన పరమైన నిర్ణయాలను నవంబర్ మధ్యకల్లానే ఉపసంహ రించుకోవడం. 1918 ఫ్లూ మహమ్మారి నేర్పుతున్న పాఠాలు కొన్ని వున్నాయి. మొదటిది, సామాజిక దూరాన్ని తక్షణమే, అదీ తీవ్రంగా పాటింపచేయడం వల్ల మరణాల సంఖ్యను తగ్గించవచ్చు. ఔషధాలతో నిమిత్తం లేని విధాన నిర్ణ యాల్లో చాలా తక్కువ వాటిని అమలు చేసిన నగరాల్లో మరణాల సంఖ్య సగటున వారానికి లక్షకు 146 ఉంది. అదే ఈ విధానపరమైన నిర్ణయాలను ఎక్కు వగా అమలు చేసిన నగరాల్లో మరణాల సంఖ్య కేవలం లక్షకు 65. ఇంకో ముఖ్యమైన అంశం, ఈ విధాన నిర్ణయాలను ఒక పద్ధతిలో ఉపసంహరించుకోవాలి. లేదంటే మరణాల సంఖ్య మళ్లీ ఎగబాకుతుంది. జనాలు సమూహాలుగా పోగయ్యే కార్యక్రమాల మీద నిషేధం విధించడం; పాఠశాలలు, ప్రార్థనాలయాలు, థియేటర్లు మూసేయడం లాంటి చర్యలు తీసుకున్న నగరాల్లో వ్యాధి తీవ్రత ఎక్కు వగా ఉన్న సమయంలో కూడా మరణాల సంఖ్య తక్కు వగా ఉంది. అయితే, ఈ అంటువ్యాధి కెరటంలా వచ్చి పడుతుంటుంది. తొలి దశలో తక్కువ మరణాలు సంభ వించిన నగరాలు కూడా తర్వాత కెరటాల బారిన పడ వచ్చు. కాబట్టి, పక్కా ప్రణాళికతో కూడిన ఉపసంహరణ చర్యలు అవశ్యం. ఈ గత అనుభవాల వెలుగులో ప్రస్తుత స్థితిగతులకు వస్తే గనక, కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి అత్య వశ్యమైన సామాజిక దూరాన్ని పాటించేలా జనతా కర్ఫ్యూతో శ్రీకారం చుట్టిన భారత ప్రభుత్వ యోచన గొప్ప మెళకువతో కూడినది. కానీ ఈ విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి. ఈ జాతీయ లాక్డౌన్ ఉపసం హరణ రాష్ట్రాలు, జిల్లాలు, నగరాల వారీగా ప్రణాళికా బద్ధంగా దశలుగా జరగాలి. మనం అమలు చేస్తున్న కార్యక్రమాల పనితీరులో మార్పులు చేసుకోవడానికి ఈ మహమ్మారిని ఒక సవా లుగా తీసుకోవాలి. దీనికిగానూ కొన్ని మూలసూత్రాలను ఏర్పరచుకోవాలి. తమకు అవసరమైన సేవల కోసం ప్రజలు ప్రభుత్వం దగ్గరికి పోవడం కాకుండా, ప్రభు త్వమే ప్రజల దగ్గరికి వెళ్లేలా చూసుకోవాలి. పిల్లలకు డిజి టల్ మాధ్యమంలో బోధన, వివిధ సంక్షేమ పథకాల అమలు లాంటివి దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఆహార సామగ్రి కోసం ప్రజలు రేషన్ దుకాణాలకు వెళ్లకుండా ప్రభుత్వమే ఇంటింటికీ పంపిణీ చేయాలి. ప్రభుత్వ కార్యాలయాల పనితీరులో కార్బన్ ఫుట్‌ప్రింట్ నమోదు తక్కువగా ఉండేలా చూసుకోవడం ఒక ముఖ్య సూత్రం కావాలి. అన్ని సమావేశాలను టెలి, వీడియో కాన్ఫరెన్సుల్లోనే జరపాలి. సమాచార బదిలీ పూర్తిగా డిజిటల్ మాధ్యమంలో సాగాలి. ఇంకో ముఖ్య విషయం, ముందు జనాన్ని నమ్మాలి, తర్వాత ధ్రువీకరించుకోవాలి. అవసరమైన చోట్ల తగిన అనుమతులు ఆటోమేటిగ్గా ఇచ్చే ట్టుగా ఉండి, క్షేత్రస్థాయి ధ్రువీకరణ తర్వాత చేసుకోవాలి. ఆదాయాన్నీ, ఉద్యోగాలనూ కాపాడేలా నిర్మాణ రంగానికి ఆర్థిక ప్యాకేజీ ప్రకటించాలి. ఇవి కొన్ని సూచ నలు మాత్రమే. ఇలాంటివి ఎన్నో పరిగణనలోకి తీసుకుని విధాన నిర్ణయాలను ఏర్పరచుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే, కొంతకాలానికి పూర్తిస్థాయి లాక్డౌన్ అమలు, దానికి అనుగుణమైన చర్యలు అన్నీ కలిసి, కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కోవడానికి తగిన ఒక పటిష్టమైన భారతీయ విధానంగా రూపొందాలి. ఇలాంటి సంక్షోభాలు తలెత్తినప్పుడు అవసరమైన మార్గదర్శక చర్యల్లో ఇవి ప్రపంచవ్యాప్తంగా శాశ్వత మార్పు తేవాలి. డా. సమీర్ శర్మ ఐఏఎస్ వ్యాసకర్త అమెరికాలో పీహెచ్డీ చేశారు, కంచి యూనివర్సిటీ నుంచి డీలిట్ పట్టా పొందారు. -
వికేంద్రీకరణే ప్రగతికి చుక్కాని
ఒకటి కంటే ఎక్కువ నగరాలు ఉనికిలో ఉంటున్న రాష్ట్రంలో, పలు రాజధానులు ఉండటం అనే భావన మరింత ప్రభావశీలమైన, అభివృద్ధి వ్యూహంతో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి రాష్ట్రంలో సరళమైన, నిర్వహణాత్మకమైన అభివృద్ధికి చోటు ఉంటుంది. ఇప్పటికే ఉన్న పలు నగరాల ప్రాదేశిక స్వరూపాన్ని సమతుల్యం చేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి నిర్వహణను కొనసాగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని విధులను రాష్ట్రంలోని పలు నగరాల మధ్య పంపిణీ చేయడం అనేది విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రాదేశిక చట్రాల అభివృద్ధి చరిత్రను ప్రత్యేకంగా నిర్మించడం అనే వైఖరిలోనే సంప్రదాయేతర దృక్పధం ఇమిడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఈ విశిష్ట ప్రయత్నం ఫలవంతమైతే, పలు ప్రధాన నగరాల అనుసంధానంతో కొనసాగుతున్న ఇతర రాష్ట్రాలకు కూడా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక దీపస్తంభంలా దారి చూపుతుంది. సంప్రదాయకంగా చూస్తే భారతదేశంలోని రాష్ట్రాలకు చాలావరకు ఒకే నగరంలోనే రాజధాని ఉంటూవచ్చింది. ఒకే నగరంలో రాజధాని ఉండాలా లేక రాజధాని విధులను వివిధ నగరాలకు పంపిణీ చేయాలా అనేది ఒక రాష్ట్రంలో నగరాల అనుసంధానం ఏ రీతిలో అభివృద్ధి చెందింది అనే ప్రాతిపదికపై ఆధారపడి ఉంటుంది. ఈ సందర్భంగా భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో నగరాల ప్రత్యేక నిర్మాణచట్రం ఎలా పరిణమించిందో తెలుసుకుందాం. 17వ శతాబ్ది తొలి భాగంలో, 18వ శతాబ్ది మలిభాగంలో భారతదేశం వస్తూత్పత్తి కేంద్రాలతో విలసిల్లింది. నాణ్యత, చౌకధర, హస్తనైపుణ్యం కారణంగా నాట భారతీయ చేతి ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా పేరుకెక్కాయి. బ్రిటిష్ వారి రాకతో ఆ వైభవం మొత్తంగా మారి పోయింది. భారతదేశంలోని లోతట్టు ప్రాంతాలనుంచి ముడిసరుకులను సేకరించి ఇంగ్లండుకు పంపి వాటినుంచి తయారు చేసిన సరుకులను అక్కడినుంచి భారత్‌కు పంపడమే బ్రిటిష్ వలసవాదపు ప్రధాన లక్ష్యంగా ఉండేది. వలసవాదపు ఈ ఆర్థిక తర్కం ప్రభావం వల్ల భారతీయ నగరాలు, పట్టణాలు తమను తాము మార్చుకున్నాయి, పునర్నిర్మాణ బాటలో సాగాయి. బ్రిటిష్ పాలనా కాలంలో భారతీయ నగరాల్లో జరిగిన ఈ పునర్వ్యవస్థీకరణ.. స్వాతంత్య్రం సిద్ధించిన నాటికి భారత్‌లో ఒక ప్రత్యేక ప్రాదేశిక చట్రాన్ని అనుసరించింది. ఆనాడు ప్రధానమైన రేవు పట్టణాలతో కూడిన రాష్ట్రాలు (ఉదా. మద్రాసు, బొంబాయి, కలకత్తా) బ్రిటన్ తో బలమైన అనుసంధానాన్ని కలిగి ఉండేవి. ఢిల్లీ దీనికి మినహాయింపు. ఇది భారత రాజధానిగానే అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఆనాడు రేవు పట్టణాలు రెండు ప్రయోజనాలను నెరవేర్చేవి. ఒకటి ఎగుమతి ప్రాంతాలుగా, ప్రధానంగా ముడిసరుకులను సేకరించి విదేశాలకు (ప్రధానంగా బ్రిటన్) ఎగుమతి చేయడానికి ఇవి ఉపయోగపడేవి. రెండు, ఆ ముడి సరుకులనుంచి తయారు చేసిన సరుకులను బ్రిట¯Œ నుంచి దిగుమతి చేసుకుని వాటిని దేశంలోని మారుమూల ప్రాంతాలకు పంపిణీ చేయడానికి దిగుమతి కేంద్రాలుగా వ్యవహరించేవి. క్రమక్రమంగా ఈ రేవు పట్టణ జనవాసాలు మార్కెట్ కేంద్రాలుగా పరిణమించి తక్కువ విలువ కలి గిన సరుకులను ఉత్పత్తి చేసేవి. లండన్ వంటి విదేశీ మహానగరంతో నిత్యం అనుసంధానంతో ఉండటంతో రేవుపట్టణాల్లో సాగిన నిత్య ఆర్థిక కార్యాచరణ ఫలితమే ఇది. వ్యూహాత్మక నగరాల స్థాపన–రేవు పట్టణాలను లోతట్టులోని స్థానిక ప్రాంతాలతో అనుసంధించటం– అనేది దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలలో అభివృద్ధి చెందింది. భారీ స్థాయి ఎగుమతుల కోసం, ప్రాథమిక ఉత్పత్తుల కొనుగోలును సంఘటితం చేయడం, చిన్న చిన్న మార్కెట్లలో పంపిణీ కోసం టోకున వినియోగ సరుకులను కొనుగోలు చేయడం ద్వారా రేవు పట్టణాలను వ్యూహాత్మక పట్టణాలకు అనుసంధానిస్తూ సుదీర్ఘమైన రవాణా లింకులను నిర్మించారు. దీని ఫలితంగా దేశంలోని ఆన్ని రాష్ట్రాలూ.. వేరుపడిన అనేక స్థానిక మార్కెట్ల అభివృద్ధికి సాక్షీభూతమై నిలిచాయి. ఈ స్థానిక మార్కెట్లు రవాణా, ప్రాసెసింగ్, నిల్వ, భారీమొత్తంలోని సరుకులను వేరుపర్చడం, రుణ సౌకర్యం వంటివాటికోసం వ్యూహాత్మక పట్టణాలపై ఆధారపడేవి. ఈ స్థానిక మార్కెట్లలో చేతివృత్తుల ఉత్పత్తులు, వ్యవసాయ సరుకులు స్థానికంగానే పంపిణీ అయ్యేవి. ఎగుమతి అయ్యేవి కాదు. ఇక్కడ కూడా బ్రిటిష్ పాలకులు వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకాల కోసం రవాణా, కమ్యూనికేషన్ సౌకర్యాలు, పాలనా కేంద్రాలు (ఉదా, జిల్లా కేంద్రాలు, తాలుకాలు) నెలకొల్పడం, క్రమబద్ధీకరణ మార్కెట్లను సృష్టించడం వంటి అనుబంధ కార్యకలాపాలను చేపట్టేవారు. ఈ ప్రాదేశిక చట్రం అనేది స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా విస్తృతంగా కొనసాగింది. 1990లలో మాత్రమే సేవల ఔట్ సోర్సింగ్ వల్ల దేశంలోని నాలుగు ప్రధాన కేంద్రాలు– ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై–తోపాటు మొదటిసారిగా హైదరాబాద్, బెంగళూరు కూడా ప్రధాన నగరాల స్థాయికి ఎదిగాయి. అందుచేత, భారతదేశంలోని రాష్ట్రాలు రెండు రకాల ప్రాదేశిక సంబంధమైన అభివృద్ధి చట్రాలను కలిగి ఉంటున్నాయి. మొదటి రకంలో కొన్ని ప్రధాన నగరాలు తమ చుట్టూ ఉన్న చిన్న పట్టణాలు, గ్రామాలకు సరుకులను, సేవలను అందిస్తూ ఉంటాయి. మొదటి విభాగంలోని కొన్ని రాష్ట్రాలు ఏవంటే– ఉత్తరప్రదేశ్ (కాన్పూర్, అలహాబాద్, వారణాసి, ఆగ్రా, లక్నో. వీటి ఇంగ్లిష్ పేర్లలోని తొలి అక్షరాలను కలిపి వీటిని కావల్ పట్టణాలు KAVAL అని పిలుస్తున్నారు); రాజస్తాన్ (జైపూర్, ఉదయ్‌పూర్); పంజాబ్ (లూథియానా, అమృత్సర్); హరియాణా; మధ్యప్రదేశ్ (భోపాల్, ఇండోర్), కేరళ. ఈ ప్రధాన పట్టణాలు వాటి సమీప ప్రాంతాలపై బలమైన ఆర్థిక ప్రభావం కలిగి ఉంటాయి. ఇక రెండో రకం ప్రాదేశిక చట్రం పూర్తిగా విభిన్నంగా ఉంటోంది. ఈ నిర్మాణంలో అత్యంత ప్రధానమైన నగరం ఉంటుంది దీన్నే ప్రధాన నగర చట్రం అని పిలిచారు. ఈ ప్రధాన నగరం మొత్తం రాష్ట్రంపైన అత్యధిక స్థాయిలో ఆర్థిక ప్రభావం వేస్తూ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా కొనసాగుతూ ఉంటుంది. ఈ విభాగంలోకి తమిళనాడు (చెన్నై), మహారాష్ట్ర (ముంబై), పశ్చిమబెంగాల్ (కోల్‌కతా), ఢిల్లీ జాతీయ రాజధాని వస్తాయి. మునుపటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేకమైనది, అద్వితీయమైనది. రెండు వేర్వేరు ప్రాంతాలు కలిపి ఇది రూపొందింది. నిజాం ప్రాబల్యంలోని కొన్ని భాగాలు, మద్రాస్ ప్రెసిడెన్సీలోని కొన్ని ప్రాంతాలు కలిపి రూపొందిన రాష్ట్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ప్రాదేశికంగా చూస్తే ఈ రెండు ప్రాంతాలు పూర్తిగా విభిన్నమైనవి. నిజాం పరిధిలోని ప్రాంతంలో ఒకే ప్రధాన నగరం (హైదరాబాద్) ఉంటూండగా, మద్రాస్ ప్రెసిడెన్సీలో అనేక ప్రధాన నగరాల (విజయవాడ, విశాఖపట్నం, కర్నూలు) నెట్‌వర్క్‌తో ఉంటూ వచ్చింది. 2014లో మునుపటి ఆంధ్రప్రదేశ్‌ను పునర్ వ్యవస్థీకరించిన తర్వాత తెలుగు వారికి మళ్లీ రెండు రాష్ట్రాలు ఏర్పడ్డాయి. హైదరాబాద్ ప్రధాన నగరంగా ఉంటున్న తెలంగాణ, రెండు మూడు ప్రధాన నగరాల అనుసంధానంతో కూడిన ఆంధ్రప్రదేశ్. ఒకటి కంటే ఎక్కువ నగరాలతో కూడిన రాష్ట్రంలో పలు రాజధానులు ఉండటం అనే భావన మరింత ప్రభావశీలమైన అభివృద్ధి వ్యూహంతో కూడుకుని ఉంటుంది. ఎందుకంటే ఇలాంటి రాష్ట్రంలో నిర్వహణాత్మకమైన అభివృద్ధి వ్యూహా నికి చోటు ఉంటుంది. అభివృద్ధి నిర్వహణకు సంబంధించిన సాంప్రదాయక సాధనాలు ఏవంటే భూమి (ఉపయోగం/భవననిర్మాణ) క్రమబద్ధీకరణలు, అభివృద్ధికి సంబంధించిన సరిహద్దులను నెలకొల్పడం, అద్భుతమైన పన్నుల ప్రభావం వంటివే. రాష్ట్రంలోని పలు నగరాలకు రాజధాని నగరం విధులను పంపిణీ చేయడం అనేది అభివృద్ధి నిర్వహణకు సంబంధించిన నూతన సాధనంగా ఉంటుంది. ఉనికిలో ఉన్న నగరాల ప్రాదేశిక చట్రాన్ని సమతుల్యం చేయడం ద్వారా రాష్ట్ర స్థాయిలో అభివృద్ధి నిర్వహణను కొనసాగించడాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకుంది. మూడు అంశాలు అంటే ఆర్థికాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ, సమానత్వం అనే వాటి మధ్య సమతూకాన్ని సాధించగలగడానికి అభివృద్ధి నిర్వహణ వ్యూహం తోడ్పడుతుంది. ప్రత్యేకించి, ఈ సాహసోపేతమైన, నూతన అభివృద్ధి నిర్వహణ వ్యూహం అనేది.. అభివృద్ధి పరిమాణానికి, ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రాంతాల్లో రవాణా, ఇంధనం, నీరు, వ్యర్థాల తొలగింపు, ప్రజాభద్రత, విద్య, ప్రజారోగ్యం తదితర ప్రధాన సేవలను అందించడానికి మధ్యన నిజమైన సమతూకాన్ని సాధించగలుగుతుంది. అంతకుమించి, ఆహార ఉత్పత్తి, నీటి పరిమాణం, నీటి నాణ్యత, గాలి నాణ్యత, మొక్కలు, జంతువుల ఆవాసం వంటి సహజ వ్యవస్థలు సమర్థంగా మనగలగడానికి ఈ నూతన అభివృద్ధి వ్యూహం ఇతోధికంగా తోడ్పడుతుంది. పైగా ఇప్పుడు పర్యావరణం తనకు తానుగా అభివృద్ధి కారకంగా ఉంటోందని మనం గుర్తించి తీరాలి. రాజధాని నగరంలోని విధులను రాష్ట్రంలోని పలు నగరాల మధ్య పంపిణీ చేయడం అనేది విజయవంతం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రాదేశిక చట్రాల అభివృద్ధి చరిత్రను ప్రత్యేకంగా నిర్మించడం అనే వైఖరిలోనే సంప్రదాయేతర దృక్పథం ఇమిడి ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న ఈ విశిష్ట ప్రయత్నం విజయవంతమైతే, పలు ప్రధాన నగరాల అనుసంధానంతో కొనసాగుతున్న ఇతర రాష్ట్రాలకు కూడా భవిష్యత్తులో ఏపీ ఒక దీపస్తంభంలా దారి చూపుతుంది. (ది వైర్ సౌజన్యంతో) సమీర్ శర్మ పీహెచ్డీ స్కాలర్, అమెరికా: డీలిట్, కంచి విశ్వవిద్యాలయం -
భద్రకాళి ఆలయంలో అమ్రపాలి దంపతులు
-
భద్రకాళికి అమ్రపాలి దంపతులు ప్రత్యేక పూజలు
-
భద్రకాళి ఆలయంలో అమ్రపాలి దంపతులు
సాక్షి, వరంగల్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలి దంపతులు శుక్రవారం భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నూతన వధూవరులు, కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు అమ్రపాలి దంపతులకు ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. కాగా ఈ నెల 18 జమ్ములో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో అమ్రపాలి వివాహం జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం అమ్రపాలి దంపతులు నిన్న (గురువారం) వరంగల్ విచ్చేశారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)