
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, అమరావతి: రాబోయే ఏడాదికిగాను ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక, నెగోషియబుల్ ఇన్‌స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులిచ్చారు. కనుమ, శ్రీరామనవమి, బక్రీద్, గాంధీ జయంతి, ఈద్ మిలాద్‌నబీ, క్రిస్‌మస్ వంటి సాధారణ సెలవులు, మహాలయ అమావాస్య, నరక చతుర్థశి, యాజ్–దహుం–షరీఫ్ వంటి ఐచ్ఛిక సెలవులు ఆదివారమే రావడం ఉద్యోగులను నిరాశపరుస్తోంది.
చంద్ర దర్శనం బట్టి సెలవులు ఇచ్చే రంజాన్, బక్రీద్, మొహరం, ఈద్ మిలాద్‌నబి వంటి పర్వదినాలు, తిథులను బట్టి హిందు పండుగల్లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వాటిని ముందస్తుగా పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment