government holidays
-
తెలంగాణ: 2024 సెలవుల్ని ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: మరికొన్నిరోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. ఈ క్రమంలో సెలవులపై మంగళవారం ఒక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో అన్ని పండుగలతో కలిపి 27 సాధారణ(జనరల్), 25 ఆఫ్షనల్(ఐచ్ఛిక సెలవులు) హాలీడేస్ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. జనవరి 15న సంక్రాంతి సెలవు, మార్చి 8న మహా శివరాత్రి, మార్చి 25న హోలి, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామనవమి, జూన్ 17న బక్రీద్, సెప్టెంబర్ 7న వినాయక చవితి, అక్టోబర్ 10న దసరా, అక్టోబర్ 31న దీపావళికి సెలవులుగా పేర్కొంది. -
ప్రభుత్వోద్యోగులకు కలిసొచ్చిన వచ్చే ఏడాది సెలవులు
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే ఏడాది (2024) పండుగలు, పర్వదినాల సెలవులు కలిసొచ్చాయి. 2024కు రాష్ట్ర ప్రభుత్వం 20 సాధారణ సెలవులను ప్రకటించగా అందులో 11 సెలవులు వారాంతం లేదా వారం ప్రారంభంలోనే వచ్చాయి. 2024కు సంబంధించి ప్రభుత్వ సాధారణ సెలవులు, ఐచ్చిక సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కె.ఎస్.జవహర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 2024 సంవత్సరానికి 20 సాధారణ సెలవులతో పాటు 17 ఐచ్చిక సెలవులను ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు ఏడాదిలో గరిష్టంగా అయిదు ఐచ్చిక సెలవులను వినియోగించుకోవచ్చని స్పష్టం చేశారు. చంద్ర దర్శనం బట్టి మారే రంజాన్, బక్రీద్, మొహర్రం,, మిలాద్ ఉల్ నబీ వంటి పర్వదినాలతో పాటు తిధుల ప్రకారం మారే హిందూ పండుగల వివరాలను తరువాత ఆయా పరిస్థితులకు అనుగుణంగా ప్రకటిస్తామని పేర్కొన్నారు. అటువంటి సందర్భాల్లో సాధారణ ఉత్తర్వులు వచ్చే వరకు ఆగకుండా ఆయా శాఖాధిపతులు తగు నిర్ణయం తీసుకోవచ్చని స్పష్టం చేశారు. -
TS Public Holidays: 2024లో ప్రభుత్వ సాధారణ సెలవులివే
సాక్షి, హైదరాబాద్ : 2024లో ప్రభుత్వ సాధారణ సెలవుల వివరాలను ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. కాగా, ఫిబ్రవరి, మే, నవంబర్ నెలల్లో ఒక్కటి కూడా సాధారణ సెలవు లేదు. -
ఉద్యోగులకు ఆదివారం షాక్.. కలసిరాని 'సెలవు'
సాక్షి, అమరావతి: రాబోయే ఏడాదికిగాను ఉద్యోగులకు సాధారణ, ఐచ్ఛిక, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మొత్తం 17 సాధారణ, 18 ఐచ్ఛిక సెలవులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ సోమవారం ఉత్తర్వులిచ్చారు. కనుమ, శ్రీరామనవమి, బక్రీద్, గాంధీ జయంతి, ఈద్ మిలాద్‌నబీ, క్రిస్మస్ వంటి సాధారణ సెలవులు, మహాలయ అమావాస్య, నరక చతుర్థశి, యాజ్–దహుం–షరీఫ్ వంటి ఐచ్ఛిక సెలవులు ఆదివారమే రావడం ఉద్యోగులను నిరాశపరుస్తోంది. చంద్ర దర్శనం బట్టి సెలవులు ఇచ్చే రంజాన్, బక్రీద్, మొహరం, ఈద్ మిలాద్‌నబి వంటి పర్వదినాలు, తిథులను బట్టి హిందు పండుగల్లో ఏమైనా మార్పులు చేయాల్సి వస్తే వాటిని ముందస్తుగా పత్రికా ప్రకటనల ద్వారా తెలియజేస్తామని ఆ ఉత్తర్వులో పేర్కొన్నారు. -
వచ్చే ఏడాది సెలవులివే.. ఆ నెలలోనే అధిక సెలవులు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సాధారణ సెలవులను ప్రభుత్వం వెల్లడించింది. 2022 సంవత్సరంలో మొత్తం 23 ప్రభుత్వ సాధారణ సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ నెలలోనే ఆరు సాధారణ సెలవులు రానున్నాయి. ఉగాది, శ్రీరామనవమితో పాటు మరో నాలుగు సెలవులు ఈ నెలలో రానున్నాయి. చదవండి: కావలి మేఘనకు కేటీఆర్ అభినందనలు, శాలువాతో సత్కారం అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే జనవరి 1న సెలవు దినంగా ప్రకటించినందున, ఆరోజుకు బదులుగా ఫిబ్రవరి 12 రెండో శనివారం రోజున కార్యాలయాలు పని చేస్తాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులు ఐదుకు మించి ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్ హాలిడేస్) వాడుకోరాదని సూచించారు. (చదవండి: కిలో టమాట రూ. 50.. ఎగబడ్డ జనం) -
18న హైకోర్టు పునఃప్రారంభం
సాక్షి,అమరావతి: హైకోర్టుకు 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టును హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లుంటారు. జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ కృష్ణమోహన్‌లు ధర్మాసనంలో కేసులను విచారిస్తే, జస్టిస్ గంగారావు సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. ఈ నెల 11న వెకేషన్ కోర్టు కేసులను విచారిస్తుంది. 12 తర్వాత వరుసగా ప్రభుత్వ సెలవులు కావడంతో హైకోర్టు ఈ నెల 18న పునఃప్రారంభమవుతుంది. -
2020 సెలవులను ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: 2020కి సంబంధించిన సాధారణ సెలవులు, ఐచ్ఛిక సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. 28 సాధారణ సెలవుల్లో 5 సెలవులు ఆదివారం/రెండో శనివారం వస్తున్నాయి. ప్రధాన పండుగలైన దసరా (విజయదశమి), మొహర్రం, గణతంత్ర దినోత్సవం, బాబూ జగ్జీవన్‌రాం జయంతి ఆదివారం రానుండటంతోపాటు దీపావళి రెండో శనివారం రానుంది. మిగిలిన 23 సాధారణ సెలవుల్లో 6 సెలవులు శనివారాల్లో వస్తుండటంతో ప్రభుత్వ ఉద్యోగులకు మరుసటిరోజు ఆదివారం సెలవు రోజు కలసి రానుంది. అదే విధంగా మరో 5 సాధారణ సెలవులు శుక్రవారం వస్తున్నాయి. మరో 4 సాధారణ సెలవులు సోమవా రం వస్తుండటంతో అంతకుముందు రోజు ఆదివారం సెలవు కలసి రానుంది. జనవరి 1న కొత్త ఏడాది సందర్భంగా సెలవు ప్రకటించినందున ఫిబ్రవరి 8న రెండో శనివారం వర్కింగ్ డేగా ప్రభుత్వం వెల్లడించింది. తమ మత విశ్వాసాలతో సంబంధం లేకుండా ఐచ్ఛిక సెలవుల్లో ఏవైనా 5 సెలవులను రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు వినియోగించుకోవచ్చని పేర్కొంది. నోట్: 1) మార్చి 9న హజ్రత్ అలీ జయంతి నేపథ్యంలో ఇవ్వాల్సిన ఐచ్ఛిక సెలవును అదేరోజు హోళి రావడంతో సాధారణ సెలవుగా ప్రకటించారు. 2) అక్టోబర్ 24న మహర్నవమి నేపథ్యంలో ఇవ్వాల్సిన ఐచ్ఛిక సెలవును దుర్గాష్టమి అదేరోజు రావడంతో సాధారణ సెలవుగా ప్రకటించారు. 3) నవంబర్ 14న నరక చతుర్థి సందర్భంగా ఇవ్వాల్సిన ఐచ్ఛిక సెలవును దీపావళి అదేరోజు రావడంతో సాధారణ సెలవుగా ప్రకటించారు. -
2015లో ప్రభుత్వ సెలవులివే!
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది(2015) సెలవు దినాలను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆది, రెండో శనివారాలు కాకుండా 20 రోజులు ప్రభుత్వ సెలవుదినాలుగా పేర్కొంది. మరో మూడు ప్రభుత్వ సెలవులు ఆదివారం రోజు వస్తున్నాయి. ఇవి కాకుండా వివిధ మతాలకు చెందిన పండుగలు, ఇతర ప్రాముఖ్యత గల 21 రోజులను ఐచ్చిక సెలవులుగా ప్రకటించింది.