సాక్షి,అమరావతి: హైకోర్టుకు 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టును హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లుంటారు.
జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ కృష్ణమోహన్‌లు ధర్మాసనంలో కేసులను విచారిస్తే, జస్టిస్ గంగారావు సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. ఈ నెల 11న వెకేషన్ కోర్టు కేసులను విచారిస్తుంది. 12 తర్వాత వరుసగా ప్రభుత్వ సెలవులు కావడంతో హైకోర్టు ఈ నెల 18న పునఃప్రారంభమవుతుంది.
18న హైకోర్టు పునఃప్రారంభం
Published Sat, Jan 9 2021 5:24 AM | Last Updated on Sat, Jan 9 2021 5:24 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment