sankranthi holidays
-
తెలుగు ప్రజలకు వైఎస్ జగన్ సంక్రాంతి శుభాకాంక్షలు
-
సంక్రాంతి సంబరాల్లో మోహన్ బాబు (ఫొటోలు)
-
విశాఖపట్నం : ఉత్సాహంగా ఏవీఎన్ కళాశాలలో సంక్రాంతి సంబరాలు (ఫొటోలు)
-
TS: స్కూల్స్‌కు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి పండుగకు సంబంధించి అధికారికంగా పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటనలో పేర్కొంది. వివరాల ప్రకారం.. సంక్రాంతి పండుగకు తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు సెలవులను ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని తెలిపింది. ఈ క్రమంలోనే మిషనరీ స్కూళ్లకు మినహా అన్ని స్కూళ్లకు ఈ సెలవులు వర్తిస్తాయని పేర్కొంది. ఇక, జనవరి 13న రెండో శనివారం కాగా.. 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి. -
పల్లెబాట పట్టిన నగరవాసులు
-
ఏపీలో సంక్రాతి సెలవులు పొడిగింపు
-
TS: సంక్రాంతి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం.. ఎన్ని రోజులంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈ ఏడాది సంక్రాంతి పండుగకు విద్యా సంస్థలు, కాలేజీలకు సెలవులను ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సంక్రాంతి పండుగకు గానూ జనవరి 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఇచ్చారు. విద్యాసంస్థలు, కాలేజీలు తిరిగి 18వ తేదీన తెరుచుకోనున్నాయి. -
ఏపీలో సెలవుల పొడిగింపుపై మంత్రి ఆదిమూలపు క్లారిటీ
-
పిల్లలకు బోర్ కొట్టిస్తున్న సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్: ‘సెల్ ఫోన్‌తో ఆడుకోవడం లేదా డల్‌గా పడుకోవడం’.. ప్రస్తుత సంక్రాంతి సెలవుల్లో పిల్లలు చేసేది ఇదే అంటున్నారు చాలామంది తల్లిదండ్రులు. కరోనా పుణ్యమాని ఉత్సాహంగా ఊరెళ్లే పరిస్థితి లేదు. ఆనందంగా అయిన వాళ్లను రమ్మనే అవకాశం లేదు. కనీసం పక్కింటి పిల్లలతో ఆడుకుందామన్నా ఆందోళన.. వెరసి సంక్రాంతి సెలవులు విద్యార్థులకు బోర్ కొట్టిస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అర్ధరాత్రి వరకు సెల్ పట్టుకుని, అదే పనిగా ఆన్లైన్ గేమ్స్ ఆడుతుంటే మౌనంగా చూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోయారు. సరే అని కట్టడి చేస్తే ఏదో కోల్పోయినట్టుగా ఉండిపోతున్నారని చెప్పారు. కరోనా వ్యాప్తి తీవ్రమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు కనీసం పక్కింటి పిల్లలతో ఆడుకోవడానికి కూడా సంశయించాల్సి వస్తోంది. కరోనా పరిస్థితుల్లో వచ్చిన సంక్రాంతి సెలవుల్లో స్కూల్ పిల్లల దిన చర్యను ‘సాక్షి’క్షేత్రస్థాయిలో తెలుసుకునే ప్రయత్నం చేసింది. కొన్ని ప్రాంతాల్లోని విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పలకరించింది. ఇంట్లో బందీగా పిల్లలు ‘ఇది వరకు సంక్రాంతి సెలవులొస్తే చాలు పిల్లాడిని పట్టుకోవడం కష్టంగా ఉండేది. పొద్దున లేస్తే గాలి పటాల గోలే. ఇప్పుడు ఇల్లు కదలడం లేదు. బయట కూడా అంతా సందడిగా ఉండేది. ఇప్పుడా వాతావరణం లేదు..’ అని వరంగల్ పట్టణానికి చెందిన లలిత చెప్పారు. కరోనా భయంతో పిల్లల్ని ఇల్లు కదలనివ్వడం లేదు. ఇంటికి వేరే పిల్లల్నీ రానివ్వడం లేదు. పక్క పక్క ఇళ్ళవాళ్ళయితే కాస్త సర్దుకుపోతున్నారు. అదీకూడా వాళ్ళింటికి కొత్తవాళ్ళు ఎవరూ రాకపోతేనే. నిజానికి సంక్రాంతి పండగొస్తే పోస్టాఫీసు కాలనీ మొత్తం హడావిడిగా ఉంటుందని, ఎక్కడెక్కడి నుంచో గాలి పటాలు ఎగరెయ్యడానికి, ఆటల పోటీల్లో పాల్గొనడానికి వస్తుంటారని హన్మకొండ పోస్టాఫీసు కాలనీకి చెందని రవి తెలిపారు. ఇప్పుడు అవేవీ కన్పించడం లేదని అన్నారు. పక్క వీధిలోని ఫ్రెండ్ ఇంటికి తన కొడుకు వస్తానంటే, అతని తల్లిదండ్రులు ‘రోజులు బాగోలేవు కదా’అని సున్నితంగా వద్దని చెప్పారని వెల్లడించారు. రెండేళ్ళ క్రితం చూసిన ముగ్గుల పోటీలు, కబడ్డీ ఆటలు, కుస్తీ పోటీలు ఏవీ పిల్లలు ఎంజాయ్ చేసే పరిస్థితి కన్పించడం లేదని అన్నారు. అమ్మమ్మ ఇంటికెళ్ళినా అదే సీన్... ‘నేనొచ్చానని అమ్మమ్మ ఎన్నో పిండి వంటలు చేసింది. కొత్త దుస్తులూ కొన్నది. కానీ ఇల్లు మాత్రం దాటనివ్వడం లేదు..’అని కరీంనగర్ జిల్లా కమాన్‌పూర్‌లో అమ్మమ్మ ఇంటికొచ్చిన 9వ తరగతి విద్యార్థి రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశాడు. నిజానికి ఆ ఊళ్ళో వారం రోజులుగా పరిస్థితి బాగాలేదు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. కొన్నిచోట్ల మనవళ్లు, మనవరాళ్లు ఊరికి వస్తామన్నా వద్దన్న ఘటనలున్నాయి. ఖమ్మం పట్టణంలో ఉంటున్న చంద్రం దంపతులు.. తమ ఇంటికి హైదరాబాద్ నుంచి మనవడు, మనమరాలు సంక్రాంతికి వస్తామన్నా.. వద్దన్నారు. ‘రోజులు బాగోలేవు. ఇక్కడ వాళ్ళకు ఏవైనా వచ్చినా వాళ్ళనే అంటారు. వాళ్ళకు ఏమైనా అయినా మాటొస్తుంది’అని చంద్రం వ్యాఖ్యానించారు. కొత్త గేమ్స్ కోసం వేట లాక్డౌన్లో విద్యార్థులు ఆడే గేమ్స్‌పై సూపర్ స్కూల్స్ అనే సంస్థ ఓ సర్వే చేపట్టింది. ఆన్లైన్ గేమ్స్ విషయంలోనూ పిల్లల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోందని ఆ సంస్థ సీఈవో భానూ ప్రసాద్ తెలిపారు. పబ్జీ, క్యాండీ క్రష్, యాంగ్రీ బర్డ్, సబ్వే సర్ఫర్స్, టెంపుల్ రన్ వంటి ఆటలు వాళ్ళకు పెద్దగా కిక్కెకించడం లేదు. దీంతో కొత్త కొత్త గేమ్స్ ఏమొచ్చాయా అనే దిశగా నెట్లో వెతుకుతున్నారు. కరోనా కారణంగా బయటకెళ్ళే అవకాశం లేకపోవడంతో 24 గంటలూ సెల్‌ఫోన్ గేమ్స్‌పై ఆధారపడుతున్నారని సర్వేల్లో తేలింది. సంక్రాంతి సెలవుల్లోనూ ఇదే కన్పిస్తోందని తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇక్కడే జాగ్రత్తగా ఉండాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. గేమ్స్ మోజులో నెట్ లింక్స్ తెలియకుండా క్లిక్ చేస్తే తలిదండ్రుల బ్యాంకు సమాచారం తెలుసుకుని, సైబర్ నేరగాళ్ళు దాడి చేసే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. పిల్లల మానసిక స్థితిపై ప్రభావం కరోనా కాలంలో పిల్లలకు ఆన్లైన్ విద్య కోసం తల్లిదండ్రులే ఫోన్లు కొనిచ్చారు. ఇప్పుడు వాళ్ళ జీవితంలో అది అంతర్భాగమైంది. సెలవులొస్తే చాలు ఫిజికల్ గేమ్స్ గురించి వాళ్ళు అసలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు కరోనా ఉధృతి దీనికి మరింత అవకాశం ఇచ్చింది. ఎంతసేపూ మొబైల్ పట్టుకుని కాలం గడిపేస్తున్నారు. ఇది విద్యార్థి మానసిక స్థితిలో మార్పు తెస్తుంది. తల్లిదండ్రులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలి – పణితి రామనాథం (ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, బూర్గుంపాడు, కొత్తగూడెం జిల్లా) సెల్ఫోన్లకు దూరంగా ఉంచాలి సెల్ ఆటలే విద్యార్థులకు శరణ్యం అయినట్టయ్యింది. అయితే ఇవి హద్దుమీరడానికి నియంత్రణ లేకపోవడమే కారణం. పిల్లల్ని తల్లిదండ్రులు అలా వదిలేయకూడదు. వాళ్ళ బాగుకోరి కొంతసేపైనా సెలవుల్లో పుస్తకాల పఠనం వైపు దృష్టి మళ్లించే ప్రయత్నం చేయాలి. తల్లిదండ్రులూ వాళ్ళతో ఆడుకుంటూ, సెల్ఫోన్లకు దూరంగా ఉండేలా చేయడం మంచిది. – శ్రీధర్ (భారత్ పబ్లిక్ స్కూల్, కోదాడ) -
సంక్రాంతి: ఊళ్లకు పయనమవుతున్న నగర వాసులు
-
ఏపీ: ఈ నెల 8 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి సెలవుల తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. మళ్లీ 17న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది. కాగా గత నాలుగు రోజులుగా టీనేజర్లకు కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నేటితో(శుక్రవారం) ముగియనుంది. ఇప్పటి వరకు 16 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ అందించారు. పాఠశాలలకు సెలవులు కావడంతో రేపటి(శనివారం) నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు. చదవండి: సీఎం జగన్ పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం -
ప్రైమరీ స్కూళ్లపై ఏం చేద్దాం?
సాక్షి, అమరావతి: సంక్రాంతి సెలవుల అనంతరం సోమవారం నుంచి రాష్ట్రంలోని స్కూళ్లు కాలేజీలు పునఃప్రారంభం కానున్నాయి. కోవిడ్ నేపథ్యంలో మరిన్ని జాగ్రత్తలు పాటించేలా విద్యాశాఖ క్షేత్రస్థాయి అధికారులకు ఆదేశాలిచ్చింది. పాఠశాలలు కోవిడ్ కారణంగా దాదాపు 5 నెలలు ఆలస్యంగా నవంబర్ 2వ తేదీ నుంచి ప్రారంభమయ్యాయి. స్కూళ్లలో 9, 10 తరగతులు, జూనియర్ కాలేజీల్లో 12వ తరగతి విద్యార్థులను తల్లిదండ్రుల అనుమతితో భౌతిక దూరం పాటిస్తూ స్కూళ్లు, కాలేజీలకు అనుమతించారు. ఆ తర్వాత 6, 7, 8 తరగతుల వారికీ తరగతులు ప్రారంభమయ్యాయి. ప్రాథమిక పాఠశాలలను ఈ విద్యాసంవత్సరానికి ప్రారంభించాలా? వద్దా? అన్న అంశంపై విద్యాశాఖ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కాగా, టీచర్లు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న బదిలీలను సంక్రాంతి సెలవుల్లో విద్యాశాఖ పూర్తిచేసింది. దాదాపు 76 వేల మంది టీచర్లకు బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి. దీంతో సోమవారం నుంచి స్కూళ్లు కొందరు కొత్త టీచర్లతో ప్రారంభం కానున్నాయి. ఉదయం తరగతులు.. తర్వాత ఆన్లైన్లో పాఠశాలల నిర్వహణకు సంబంధించిన క్యాలెండర్‌ను ఎస్సీఈఆర్టీ ఇప్పటికే ప్రకటించింది. పదో తరగతి విద్యార్థులు రోజూ తరగతులకు హాజరుకావాలని, ప్రతి సోమ, బుధ, శుక్రవారాల్లో 7, 9వ తరగతి విద్యార్థులు, ప్రతి మంగళ, గురు, శనివారాల్లో 6, 8 తరగతుల విద్యార్థులు .. గతంలో మాదిరిగానే తరగతులకు హాజరు కావాలని సూచించింది. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు స్కూళ్లు ఉంటాయి. మధ్యాహ్నం నుంచి ఆన్లైన్ బోధనను కొనసాగించాలని ఎస్సీఈఆర్టీ ఆదేశించింది. సోమవారం నుంచి ఇంటర్ ఫస్టియర్ తరగతులు కూడా ప్రారంభించాలని అన్ని కాలేజీలకు ఇంటర్ బోర్డు ఆదేశాలు ఇచ్చింది. మొత్తం పనిదినాలను 106కు తగ్గిస్తున్నారు. కాగా, వృత్తి విద్యాయేతర డిగ్రీ కోర్సుల ఫస్టియర్ ప్రవేశాల గడువును రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఈనెల 21 వరకు పొడిగించింది. ఇక ఇంజనీరింగ్, ఫార్మా కోర్సుల ఫస్టియర్ ప్రవేశాలకు సంబంధించిన విద్యార్థులు సోమవారం కాలేజీల్లో రిపోర్టు చేయకపోతే.. సీట్లు రద్దు అవుతాయి. ట్రిపుల్ ఐటీల్లో తరగతుల ప్రారంభం నేడే.. నూజివీడు: నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 కల్లా క్యాంపస్‌లలో రిపోర్ట్ చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు సూచించారు. ఇంటర్ ఫస్టియర్ వార్షిక షెడ్యూల్ ► జనవరి 18 నుంచి మార్చి 31 వరకు ఫస్ట్ టర్మ్ ► మార్చి 25 నుంచి 31 వరకు అర్థ సంవత్సర పరీక్షలు ► ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు సెకండ్ టర్మ్ ► ఏప్రిల్/మేలో ఫైనల్ పరీక్షలు (తేదీలు ఖరారు చేయలేదు) ► అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను తరువాత ప్రకటిస్తారు. ► 2020–21 ఫస్టియర్ విద్యార్థులకు సెకండియర్ (2021–22 విద్యాసంవత్సరం) తరగతుల ప్రారంభం జూన్ 3. -
సంక్రాంతికి ఊళ్ల బాట పట్టిన హైదరబాదీలు..
-
సంక్రాంతి: ఊళ్లకు పయనమవుతున్న నగర వాసులు
-
18న హైకోర్టు పునఃప్రారంభం
సాక్షి,అమరావతి: హైకోర్టుకు 8వ తేదీ నుంచి 12వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు ప్రకటించారు. అత్యవసర కేసుల విచారణకు వెకేషన్ కోర్టును హైకోర్టు ఏర్పాటు చేసింది. ఈ వెకేషన్ కోర్టులో న్యాయమూర్తులు జస్టిస్ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్ మంతోజు గంగారావు, జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్‌లుంటారు. జస్టిస్ దుర్గాప్రసాదరావు, జస్టిస్ కృష్ణమోహన్‌లు ధర్మాసనంలో కేసులను విచారిస్తే, జస్టిస్ గంగారావు సింగిల్ జడ్జిగా కేసులను విచారిస్తారు. ఈ నెల 11న వెకేషన్ కోర్టు కేసులను విచారిస్తుంది. 12 తర్వాత వరుసగా ప్రభుత్వ సెలవులు కావడంతో హైకోర్టు ఈ నెల 18న పునఃప్రారంభమవుతుంది. -
10 నుంచి సంక్రాంతి సెలవులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని స్కూళ్లకు ఈనెల పదో తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ప్రారంభం కానున్నాయి. మొత్తం ఎనిమిది రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉండేలా విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్లో పనిదినాలను సర్దుబాటు చేసింది. ఈ ఏడాది కరోనా కారణంగా విద్యాసంవత్సరం ఆలస్యంగా ప్రారంభం కావడం, ఇంకా పూర్తిస్థాయిలో స్కూళ్లు తెరవలేని పరిస్థితులు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో విద్యాసంవత్సరంలో పనిదినాలు కోల్పోకుండా ఉండేందుకు విద్యాశాఖ పండగ సెలవులను కుదించాలని భావించింది. ఈనెల 13 నుంచి మూడు రోజులు పండగ దినాలు కావడంతో సెలవులు అటుఇటుగా ఆ మేరకు ప్రకటించాలనుకున్నారు. అయితే సంక్రాంతికి ఉన్న ప్రాధాన్యం, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న విద్యాశాఖ సెలవు రోజులను పెంచేలా చర్యలు తీసుకుంది. 10వ తేదీ ఆదివారం సెలవు. అయితే, 11న సోమవారం అమ్మ ఒడి కార్యక్రమం ఉన్నందున హాఫ్ డే వర్కింగ్ డేగా ఉంటుంది. హాఫ్ డే సెలవు ఉంటుంది. తర్వాత 17వ తేదీ వరకు వరుసగా సెలవులు ఉంటాయి. 18వ తేదీ సోమవారం పాఠశాలలు తిరిగి తెరుచుకోనున్నాయి. 7, 8 తరగతుల ఫార్మేటివ్ పరీక్షలు వాయిదా ఈనెల 21 నుంచి 23 వరకు జరగాల్సిన ఫార్మేటివ్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి డైరక్టర్ డాక్టర్ బి.ప్రతాప్‌రెడ్డి ప్రకటించారు. సిలబస్ పూర్తికి సంబంధించి ఉపాధ్యాయుల నుంచి వచ్చిన విన్నపాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరీక్షలను ఫిబ్రవరి 8, 9, 10 తేదీల్లో నిర్వహించనున్నట్లు వివరించారు. -
ఏపీలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు
సాక్షి, అమరావతి : ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. 9న రెండవ శనివారం...10వ తేదీ ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు కలిసిరానున్నాయి. 11న అమ్మ ఒడి రెండో విడత నగదు పంపిణీ కారణంగా విద్యా శాఖ పనిచేయనుంది. చదవండి: గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ -
సంక్రాంతికి వస్తా
రాబోయే సంక్రాంతి పండక్కి ప్రేక్షకుల ముందుకు వచ్చేందకు రెడీ అవుతున్నారు రజనీకాంత్. శివ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా సన్ పిక్చర్స్ ‘అన్నాత్తే’ అనే సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నయనతార, కీర్తీ సురేష్, మీనా, ఖుష్భూ, ప్రకాష్‌రాజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా విడుదల చేయనున్నట్లు సన్ పిక్చర్స్ సంస్థ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమాకు డి. ఇమ్మాన్ సంగీతం అందిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే... వరుసగా మూడో ఏడాది సంక్రాంతి పండక్కి రజనీకాంత్ చిత్రం థియేటర్లో విడుదల కానుంది. ‘పేట్టా’ (2019), ‘దర్బార్’ (2020) చిత్రాలు సంక్రాంతి పండక్కి విడుదలైన సంగతి గుర్తుండే ఉంటుంది. 2021 పండక్కి కూడా రావడానికి రజనీ రెడీ అవుతున్నారు. అభిమానులకు పండగే పండగ. -
11 నుంచి సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు ఈ నెల 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు వర్తించనున్నాయి. 17న స్కూళ్లు తిరిగి ప్రారంభమవుతాయి. మిషనరీ పాఠశాలలకు ఈ సెలవులు వర్తించవు. నిబంధనలకు విరుద్ధంగా సెలవు రోజుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ తన అకడమిక్ క్యాలెండర్లో స్పష్టం చేసింది. -
నేడు జన్ సదరన్ ప్రత్యేక రైళ్లు
సాక్షి, విజయవాడ: సంక్రాంతి పండుగ సందర్భంగా రైళ్లలో రద్దీని తగ్గించేందుకు దక్షిణ మధ్య రైల్వే శనివారం పలు మార్గాల్లో జన్ సదరన్ ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఈ రైళ్లలో రిజర్వేషన్లు ఉండవు. కేవలం 16 సెకండ్ క్లాస్ బోగీలు, రెండు లగేజ్, బ్రేక్ వ్యాన్లు మాత్రమే ఉంటాయి. ప్రత్యేక చార్జీలు వసూలు చేయరు. సికింద్రాబాద్ నుంచి విజయవాడకు సాధారణ టికెట్ రూ.130, విజయవాడ నుంచి హైదరాబాద్‌కు రూ.135, తిరుపతి నుంచి కాకినాడకు రూ.175, విజయవాడ నుంచి విజయనగరానికి రూ.145 చార్జీగా వసూలు చేస్తారు. సికింద్రాబాద్–విజయవాడ (07192) ప్రత్యేక రైలు 12న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. సికింద్రాబాద్–విజయవాడ (07194) ప్రత్యేకరైలు 12న రాత్రి 11.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. విజయవాడ–హైదరాబాద్ (07193) ప్రత్యేక రైలు 12న రాత్రి 8.30 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. తిరుపతి–కాకినాడ (07190) ప్రత్యేక రైలు 12న రాత్రి 9.50 గంటలకు తిరుపతిలో బయలుదేరుతుంది. విజయవాడ–విజయనగరం (07184) ప్రత్యేక రైలు 12న రాత్రి 10.10 గంటలకు విజయవాడలో బయలుదేరుతుంది. విజయవాడ–సికింద్రాబాద్ (07195), విజయనగరం–విజయవాడ (07185) ప్రత్యేకరైళ్లు 12వ తేదీ నడుస్తాయి. -
12 నుంచి పాఠశాలలకు సంక్రాంతి సెలవులు
ఒంగోలు టౌన్: పాఠశాల విద్యాశాఖ ఎట్టకేలకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవుల అనంతరం 21వ తేదీ పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి సెలవులపై సరైన స్పష్టత లేకపోవడంతో అటు ఉపాధ్యాయుల్లో, ఇటు విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. సెలవులపై స్పష్టత ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాలు కూడా పాఠశాల విద్యాశాఖపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం స్పష్టత ఇస్తూ గందరగోళానికి తెరదించింది. -
పుస్తకం ముట్టితే ఒట్టు!
ఒంగోలు/చీరాల అర్బన్: ప్రభుత్వ కార్యక్రమాలతో సర్కారు పాఠశాలల్లో చదువులు గాలిలో దీపంలా మారుతున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమం, దాని నిర్వహణకు ముందు రెండు రోజులు ప్రిపరేషన్, ఆ తర్వాత మరొకటి.. ఇలా ఒకటి తర్వాత ఒకటిగా కార్యక్రమాల నిర్వహణతో ప్రభుత్వ పాఠశాలలో చదువులు ముందుకు సాగడంలేదు. ఈ ఏడాది జనవరి నెల మొత్తం విద్యార్థులకు బోధన అంటే ఏమిటో తెలియకుండా గడిచిపోయింది. అసలే ప్రభుత్వ పాఠశాలలపై ఇప్పటికే సమాజంలో వ్యతిరేక భావన ఉంది. దీనికి తోడు ఇటాంటి కార్యక్రమాలతో ప్రభుత్వమే విద్యను నిర్వీర్యం చేసేలా ఉందని, పదోతరగతి పరీక్షలు ప్రారంభం కానున్న సమయంలో విద్యార్థులు ఎంతో నష్టపోతారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందిస్తామని, డిజిటల్ క్లాసు రూములు, బయోమెట్రిక్ ఏర్పాటు అంటూ టీడీపీ సర్కారు గొప్పలు చెప్పుకుంటోంది. కానీ బడిలో పాఠం చెబుదామని పుస్తకం పట్టుకోగానే ఏదో ఒక కారణంతో విద్యార్థులను బయటకు తీసుకువెళుతుంటే తాము ఎవరికి విద్యబోధించాలో అర్థం కావడంలేదని ఉపాధ్యాయుల నుంచి ఆవేదన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాబోధనకు ఎస్‌సీఈఆర్‌టి రూపొందించిన అకడమిక్ క్యాలెండర్ ప్రామాణికమని, కానీ అది కూడా అమలు చేయలేని పరిస్థితులు నెలకొంటున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదీ కార్యక్రమాల తీరు.. 2017 డిసెంబర్ 14వ తేదీ మొదలు 2018 జనవరి నెలాఖరు వరకు పాఠం చెప్పేందుకు ఉపాధ్యాయునికి సరైన అవకాశమే లేకుండా పోయిందనేది యదార్థం. డిసెంబర్ 14 నుంచి 22వ తేదీవరకు సమ్మేటివ్ 1 పరీక్షలు నిర్వహించారు. 23 నుంచి క్రిస్మస్ శెలవులు ప్రకటించారు. 28, 29 తేదీలలో జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇదే సమయంలో గణిత సప్తాహాల నిర్వహణకు ప్రభుత్వం పిలుపు ఇవ్వడంతో కొన్ని రకాల తరగతులకు మంగళం పాడక తప్పలేదు. ఇక 31వ తేదీ శెలవు కావడంతో పాఠశాలల్లో ముందస్తుగా అంటే డిసెంబర్ 30వ తేదీనే పాఠశాలల అలంకరణ కార్యక్రమాలపై విద్యార్థులు దృష్టిసారించడం, ఒంగోలులో గజల్ శ్రీనివాస్ కార్యక్రమ విజయోత్సవంలో విద్యార్థులే పెద్ద ఎత్తున హాజరుకావాల్సి రావడం గమనార్హం. జనవరి 1న జిల్లాలో అత్యధిక శాతం పాఠశాలలు ఆప్షనల్ హాలిడే ప్రకటించేసుకున్నాయి. 2 నుంచి 11వ తేదీవరకు క్రీడాజన్మభూమిగా నామకరణం చేసి రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లోని విద్యార్థులు అందరినీ పదో తరగతి సహా విద్యార్థులు క్రీడల్లో పాల్గొనేటట్లు చేయాలని ఆదేశించడంతో ఒక వైపు క్రీడలు, 5కె రన్, మరో వైపు విద్యార్థులకు వ్యాసరచన, వ్యక్తృత్వ పోటీలు, పాఠశాల స్థాయి, మండల స్థాయి వంటి ఆటల పోటీలతోపాటు ఓడిఎఫ్‌పై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. 12వ తేదీనుంచి 21 వరకు సంక్రాంతి సెలవులు. 23న 3కెరన్ పోటీలు నిర్వహణ, అదేరోజు మద్యాహ్నభోజన కార్మికులు సమ్మె నోటీసు ఇవ్వడంతో విద్యార్థులకు భోజన ప్రక్రియకు అంతరాయం లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉపాధ్యాయులపైనే పడింది. 23,24 తేదీలలో గణ తంత్ర దినోత్సవ పోటీలు నిర్వహించి 25వ తేదీ జాతీయ ఓటర్ల దినోత్సవం ర్యాలీ నిర్వహించారు. 26వతేదీ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. 27వ తేదీ సూర్య ఆరాధన కార్యక్రమంలో భాగంగా వ్యక్తృత్వం, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించారు. 28న ఆదివారం అయినా ఉదయాన్నే సూర్య నమస్కారాలు నిర్వహించాల్సి వచ్చింది. ఇక ఈనెల 31వ తేదీవరకు ఒక వైపు స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలు, మరో వైపు డీఎస్సీ 2014 ఉపాధ్యాయులకు శిక్షణ వెరసి విద్యాబోధన కుంటుపడింది. 29 నుంచి 31వ తేదీవరకు స్టూడెంట్ లెర్నింగ్ అచీవ్మెంట్ సర్వే అంటూ పరీక్షలు పాఠశాలల్లో జరగనున్నాయి. కార్యక్రమాల వివరాలు.. జనవరి 2 నుంచి 11 వరకు – జన్మభూమి–మా ఊరు జనవరి 12 నుంచి 21 వరకు – సంక్రాంతి సెలవులు జనవరి 22 – అమ్మకు వందనం జనవరి 23 – రిపబ్లిక్ డే సందర్భంగా ఆటల పోటీలు జనవరి 24– జాతీయ బాలికా దినోత్సవం జనవరి 25 –ఓటర్ దినోత్సవం జనవరి 26– రిపబ్లిక్ దినోత్సవం జనవరి 28– సూర్యారాధన -
పల్లెకు పోదాం చలో..చలో..
-
పల్లెకు పోదాం చలో..చలో..
► సొంతూళ్లకు పయనమైన నగరవాసులు ► రైళ్లు, బస్సులు, ప్రైవేట్, సొంత వాహనాల్లో తరలిన జనం ► సంక్రాంతి రద్దీతో కిక్కిరిసిన రైళ్లు, బస్సులు ► తీవ్ర ఇబ్బందుల మధ్యే ప్రయాణం ► 15 లక్షల మందికి పైగా పల్లె బాట ► టోల్‌ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం సాక్షి, హైదరాబాద్: మహానగరం పల్లె వైపు పరుగులు తీసింది. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతిని సంబురాల మధ్య జరుపుకునేందుకు లక్షలాది మంది నగర వాసులు పల్లె తోవ పట్టారు. దీంతో నగరానికి నలువైపులా ఉన్న రహదారులన్నీ పల్లె దారి పట్టాయి. గురువారం స్కూళ్లు, కళాశాలలకు సెలవులు ప్రకటించడం, ప్రభుత్వ కార్యాలయాలకు సైతం వరుసగా సెలవులు రావడంతో నగర ప్రజలు భారీ సంఖ్యలో బయలుదేరారు. గురువారం మహాత్మాగాంధీ, జూబ్లీ బస్స్టేషన్లు, సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిక్కిరిసిపోయాయి. చాలామంది బస్సులు, కార్లు, సొంత వాహనాల్లో సొంతూళ్లకు బయలుదేరడంతో ఉప్పల్, ఎల్బీనగర్, మెహిదీపట్నం తదితర ప్రధాన కూడళ్లు స్తంభించాయి. ప్రయాణం.. పెనుభారం.. నాలుగైదు రోజులుగా వివిధ మార్గాల్లో సుమారు 15 లక్షల మంది వ్యయప్రయాసల కోర్చి సొంత ఊళ్లకు వెళ్లారు. రిజర్వేషన్లు లభించక పోవడంతో ఎక్కువ మంది ప్యాసిం జర్ రైళ్లు.. జనరల్ బోగీలను ఆశ్రయించారు. రైళ్లపై ఆశలు వదులుకున్న వాళ్లు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులపైనే ఆధారపడ్డారు. ప్రత్యేక బస్సులపై ఆర్టీసీ 50 శాతం అదనపు వసూళ్లకు పాల్ప డితే.. ప్రైవేట్ బస్సులు మరో అడుగు ముందు కేసి డబుల్ చార్జీలతో ఇష్టారాజ్యంగా వసూళ్లకు దిగాయి. దీంతో నగరవాసులకు పండుగ ప్రయాణం పెను భారంగా పరిణమించింది. పిల్లలు, వృద్ధులు, మహిళలు, వికలాంగులు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. విజయవాడ, విశాఖపట్టణం, అమలాపురం, కాకినాడ, తిరుపతి, కర్నూలు, కడప, నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ తదితర ప్రాంతాలకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. నోట్ల రద్దుతో తగ్గిన ప్రయాణాలు.. ఈసారి సంక్రాంతి ప్రయాణాలపైనా నోట్ల రద్దు ప్రభావం స్పష్టంగా కనిపించింది. నగ దు కొరత కారణంగా నగరవాసులు కొంత మంది సొంత ఊరి ప్రయాణాలను రద్దు చేసుకున్నారు. గతేడాది 20 లక్షల మంది సొంతూళ్లకు తరలివెళ్లగా ఈసారి ఆ సంఖ్య 15 లక్షలకు పరిమితమైంది. ఈ ఏడాది సుమారు 25% ప్రయాణాలు తగ్గినట్లు ఆర్టీ సీ, రైల్వే వర్గాలు అంచనా వేస్తున్నాయి. టోల్‌ప్లాజాల వద్ద భారీగా ట్రాఫిక్ జాం చౌటుప్పల్/అడ్డాకుల: సంక్రాంతి పండుగకోసం పట్నం వాసులు సొంతూరు బాట పట్టడంతో టోల్‌ప్లాజాలు కిటకిటలాడాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు బారులుదీరడంతో ట్రాఫిక్‌జాం అయ్యింది. గురువారం మధ్యాహ్నం మొదలైన వాహనాల రద్దీ రాత్రి వరకు కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా, మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకుల మండల శాఖాపూర్ టోల్‌ప్లాజాలు వాహనాలతో కిక్కిరిసిపోయాయి. పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ వైపు 10 గేట్లు తెరిచినా రద్దీ తగ్గలేదు. రద్దీని నియంత్రించేందుకు పోలీసులు, జీఎమ్మార్ సిబ్బంది ఎక్కడికక్కడ పికెటింగ్‌లు ఏర్పాటు చేశారు. వాహనాలను ఇతర మార్గాల మీదుగా మళ్లించారు. అలాగే, శాఖాపూర్ టోల్గేట్ వద్ద కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ వైపు నుంచి కర్నూలు వైపు వెళ్లే వాహనాలతో రోడ్లు కిక్కిరిశాయి. నగరం నుంచి ప్రయాణం ఇలా.. ► రోజువారీ బయలుదేరే 80 ఎక్స్‌ప్రెస్ రైళ్లు కాక, వివిధ ప్రాంతాల మధ్య సంక్రాంతి సందర్భంగా దక్షిణమధ్య రైల్వే మరో 45 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ప్రధాన రైళ్లకు అదనపు బోగీలను అందుబాటులోకి తెచ్చింది. అయినా ప్రయాణికుల డిమాండ్‌ను ఈ రైళ్లు భర్తీ చేయలేకపోయాయి. రైళ్లలో ప్రతి రోజూ 2.5 లక్షల చొప్పున మూడు రోజుల్లో 7.5 లక్షల మంది ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. ► జంట నగరాల నుంచి తెలుగు రాష్ట్రాలకు రాకపోకలు సాగించే 3,500 రెగ్యులర్ బస్సులతో పాటు, 3,195 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు. మరో 1000కి పైగా ప్రైవేట్ బస్సులు హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించాయి. సుమారు 3.5 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ, ప్రైవేట్ బస్సుల్లో తరలి వెళ్లారు. ► బస్సులు, రైళ్లు కాకుండా హైదరాబాద్ నుంచి అన్ని రూట్లలో వ్యక్తిగత వాహనా లు, ట్రావెల్స్ కార్లు, ద్విచక్ర వాహనా లు, మ్యాక్సీక్యాబ్‌లు, తూఫాన్లు, టాటాఏస్‌లు, ఆటోలు వంటి 1.5 లక్షల వాహనాలు సొంత ఊళ్లకు తరలి వెళ్లా యి. ఈ వాహనాల్లో సుమారు 4 లక్షల మందికిపైగా బయలుదేరి వెళ్లారు. -
దసరాకు 15 రోజులు సెలవులు
♦ సెప్టెంబరు 30 - అక్టోబరు 14 వరకు ♦ జనవరి 11-17 వరకు సంక్రాంతి సెలవులు ♦ ఏప్రిల్ 24-జూన్ 11 వరకు వేసవి సెలవులు ♦ మైనారిటీ స్కూళ్లకు డిసెంబరు 24- 31 ♦ వరకు క్రిస్మస్ సెలవులు ♦ 2015-16 వార్షిక కేలండర్ సిద్ధం ♦ స్కూళ్లకు అక్రెడిటేషన్, ర్యాంకులు సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు 2016-17 వార్షిక కేలండర్‌ను విద్యా శాఖ రూపొందించింది. వచ్చే విద్యా సంవత్సరాన్ని మార్చి 21 నుంచే ప్రారంభించాలని నిర్ణయించింది. ‘స్కూళ్లకు అక్రెడిటేషన్, ర్యాంకుల విధానముండాలి. ఒకే ఆవరణలో వేర్వేరుగా సెక్షన్లుగా కొనసాగుతున్న తెలుగు, ఇంగ్లిషు మీడియం స్కూళ్లను విడదీయాలి. ఇంగ్లిష్ మీడియం స్కూళ్లను వేరుగానే కొనసాగించాలి. ఇంగ్లిష్ మీడియంలో చదువుకున్న వారిని వాటిలోకి బదిలీ చేయాలి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 12 వరకు వేసవి సెలవులిచ్చి జూన్ 13న స్కూళ్లను తిరిగి ప్రారంభించాలి. ఇంగ్లిషు మీడియం బోధించే టీచర్లకు వేసవి సెలవుల్లోనే ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి’ అని పేర్కొంది. ఈ కేలండర్పై పాఠశాల విద్యా డెరైక్టర్ కిషన్ గురువారం విద్యా శాఖ సీనియర్ అధికారులతో చర్చించారు. దీన్ని ఉపాధ్యాయ సంఘాలకు పంపారు. ఈ నెల 29లోగా సలహాలు, సూచనలు కోరారు. ఇదే కేలండర్ దాదాపుగా అమల్లోకి రానుంది. ప్రతి ప్రాథమిక పాఠశాలలోనూ ముగ్గురు టీచర్లు ‘హేతుబద్ధీకరణలో భాగంగా ఒక నివాస ప్రాంతంలో కిలోమీటరు పరిధిలో ఉన్న ప్రాథమిక పాఠశాలలను విలీనం చే సి ఒక స్కూల్‌నే కొనసాగించాలి. వాటిల్లో ముగ్గురు టీచర్లుండేలా చూడాలి. రాష్ట్రంలో ఇకపై ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విధానమే ఉండాలి. ప్రాథమికోన్నత విధానం అక్కర్లేదు. ఆ పాఠశాలలను 3 కిలోమీటర్ల పరిధిలోని ఉన్నత పాఠశాలల్లో విలీనం చేయాలి. 4 కిలోమీటర్ల పరిధిలో కూడా ఉన్నత పాఠశాల లేకపోతే సదరు ప్రాథమికోన్నత పాఠశాలలనే ఉన్నత పాఠశాలలుగా అప్‌గ్రేడ్ చేయాలి. హైస్కూళ్లకు సంబంధించి హేతుబద్ధీకరణ సమయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒక్క విద్యార్థి లేని పాఠశాలు 407, పది మందిలోపే ఉన్నవి 992 ఉన్నాయి’ అని విద్యా వార్షిక ప్రణాళిక పేర్కొంది. పరీక్షలిలా... ♦ అన్ని సబ్జెక్టుల్లోనూ సిలబస్‌ను మార్చి 21-ఏప్రిల్ 23 వరకు ఒక విభాగం, జూన్ 13-2017 ఫిబ్రవరి 28 వరకు రెండో విభాగంగా విభజించారు ♦ ఫార్మేటివ్-1 పరీక్ష (ఎఫ్ఏ)లను జూలై 31లోగా, ఎఫ్ఏ-2ను సెప్టెంబరు 22లోగా, ఎస్ఏ-1 పరీక్షల్ని సెప్టెంబర్ 23-29 వరకు, ఎఫ్ఏ-3ని నవంబరు 30లోగా, ఎఫ్ఏ-4ను 2017 జనవరి 30లోగా నిర్వహించాలి. ♦ పది మినహా మిగతా తరగతులకు వార్షిక పరీక్ష (ఎస్ఏ-2)లను 2017 మార్చి 7 నుంచి 15 వరకు నిర్వహించాలి. ♦ పదో తరగతికి ఫిబ్రవరి 22-మార్చి 6 దాకా ప్రీ ఫైనల్ పరీక్షలుంటాయి. వార్షిక పరీక్షల తేదీని తర్వాత నిర్ణయిస్తారు. -
గ్రేటర్ ఎన్నికల ప్రక్రియకు సెలవుల అడ్డంకి
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో సంక్రాంతి సెలవు దినాలు తెలంగాణ ప్రభుత్వానికి పరీక్షగా మారాయి. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి పండుగ.. వరుసగా ఈ రెండ్రోజులు ప్రభుత్వ సెలవు దినాలు. ఇదే వారంలో జీహెచ్ఎంసీ ఎన్నికల షెడ్యూలు వెలువడితే.. ఈ రెండు సెలవులు కీలకమైన నామినేషన్ల ఘట్టంలోఅడ్డంకిగా మారే అవకాశముంది. అందుకే సెలవు దినాల విషయంలో ప్రభుత్వం తల పట్టుకుంటోంది. నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు ఎన్నికల ప్రక్రియ గడువును మూడు వారాల నుంచి రెండు వారాలకు కుదిస్తూ ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. అందుకు వీలుగా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చట్టాన్ని సవరించింది. కానీ ఎన్నికల షెడ్యూలులో కీలకమైన నామినేషన్ల దాఖలు, నామినేషన్ల పరిశీలన, నామినేషన్ల ఉపసంహరణకు నిర్దేశించిన తేదీల్లో ప్రభుత్వ సెలవు దినాలుంటే.. మరుసటి వర్కింగ్ డే రోజున వాటిని అనుమతించాలని ఇదే చట్టంలో సెక్షన్ 40 స్పష్టం చేస్తోంది. దీంతో ఎన్నికల ప్రక్రియకు నిర్దేశించిన గడువులో మూడు, నాలుగు రోజులు సెలవు దినాలు వస్తే.. ఈ వ్యవధిని కుదించిన ప్రయోజనం నెరవేరకుండా పోతుంది. అందుకే ఈ సెలవుల గందరగోళానికి తెర దింపేందుకు మున్సిపల్ యంత్రాంగం అప్రమత్తమైంది. అడ్డంకిగా ఉన్న ఈ సెక్షన్‌ను సైతం మారుస్తూ చట్టాన్ని సవరించాలని సంబంధిత అధికారులు నిర్ణయించారు. బుధవారం ఈ ఉత్తర్వులు జారీ చేసే అవకాశాలున్నాయి. దీని ప్రకారం నామినేషన్ల దాఖలు, పరిశీలన, ఉపసంహరణ గడువులో ఉన్న సెలవు దినాలున్నా.. వాటిని సైతం ఎన్నికల ప్రక్రియలో భాగంగా వర్కింగ్ డేలుగానే పరిగణిస్తారు. -
కలకలం రేపిన ఆకాశరామన్న ఉత్తరం
తుమ్మలపెన్‌పహాడ్ (ఆత్మకూర్(ఎస్), న్యూస్‌లైన్: ఉపాధ్యాయురాలికి అందిన ఆకాశరామన్న ఉత్తరం.. చివరికి ఆమె సస్పెన్షన్ కారణమైంది. అయితే సదరు ఉపాధ్యాయురాలిని సస్పెండ్ చేయవద్దంటూ సోమవారం విద్యార్థులు పాఠశాల గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. ఈ సంఘటన తుమ్మలపెన్‌పహాడ్ ప్రాథమిక పాఠశాలలో జరిగింది. స్థానికులు, ఉపాధ్యాయులు తెలిపిన వివరాల ప్రకారం... పాఠశాల ఉపాధ్యాయురాలు గన్నా జ్యోతికి గత నెల 8వ తేదీన అసభ్యకర పదజాలంతో కూడిన ఆకాశరామన్న ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఉపేందర్ రాశాడంటూ ఆయనతో ఘర్షణకు దిగింది. అతను మాత్రం తనకు ఆ ఉత్తరంతో ఎలాంటి సంబంధమూ లేదని, కావాలంటే న్యాయ విచారణ కోసం ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలని సూచించాడు. ఆ తర్వాత సంక్రాంతి సెలవులు కావడంతో సమస్య సద్దుమణిగింది. తిరిగి పాఠశాల పునఃప్రారంభం అయిన 21వ తేదీన పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిని ఉపాధ్యాయురాలు అసభ్యకరంగా దూషించింది. దీంతో అతను ఎంఈఓ శంకర్‌నాయక్‌కు, పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై ఎంఈఓ విచారణ జరిపి డీఈఓకు నివేదిక పంపారు. ఆ తర్వాత పాఠశాలలో జరుగుతున్న ఘర్షణపై గ్రామస్తులకు, సర్పంచ్‌కు ఇరు వురు తెలపగా సమస్యను పరిష్కారం చేస్తామన్నారు. ఇదిలా ఉండగా నివేదికను పరిశీలించిన డీఈఓ సద రు ఉపాధ్యాయురాలి వ్యవహారశైలిని తప్పుపడుతూ సస్పెండ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉపాధ్యాయురాలు గ్రామస్తులు, విద్యార్థులతో కలిసి సోమవారం పాఠశాల గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించారు. సస్పెన్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న ఎంఈఓ, పోలీసులు పాఠశాలకు వచ్చి ధర్నా విరమింపజేశారు. సస్పెన్షన్ ఆర్డర్ పంపాం తుమ్మలపెన్‌పహాడ్ పీఎస్ ప్రధానోపాధ్యాయుడిని దూషించిన ఉపాధ్యాయురాలి విషయంలో ఎంఈఓ పంపిన నివేదికను పరిశీలించి ఆమెపై సస్పెన్షన్ వేటు వేసినట్టు డీఈఓ జగదీష్ ‘న్యూస్‌లైన్’కు తెలిపారు. సస్పెన్షన్ ఆర్డర్‌ను ఎంఈఓ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా పంపినట్టు పేర్కొన్నారు. పాఠశాల గేటుకు తాళం వేసి ధర్నా నిర్వహించిన వారిపై చర్యలు తీసుకుంటామని డీఈఓ చెప్పారు. -
ఊరంతా విద్యుత్ షాక్
మనూరు, న్యూస్‌లైన్ : ట్రాన్స్‌కో అధికారుల నిర ్లక్ష్యం కారణంగా విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందాడు. ట్రాన్స్ఫార్మర్కు ఎర్తింగ్ లోపం కారణంగా వారం రోజులుగా తండాకు షాక్ వస్తున్నట్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోవడంతో బాలుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మావినెల్లి పంచాయతీ కిషన్‌నాయక్ తండాలో సోమవారం చోటుచేసుకుంది. తండా వాసుల కథనం మేరకు.. నాందేవ్, బుజ్జి బాయి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఆరుగురు సం తానం కాగా నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్ల లు. వీరిలో రమేష్ (12) చివరి వాడు. ఇతను మనూరు ఎస్సీ హాస్టల్లో ఉంటూ ఆరో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కావడంతో కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అయితే సోమవారం ఇంటికి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఇంటి పైకప్పుకు బిగించిన ఎర్తింగ్ వైరు పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై కట్టెతో వైర్‌ను కొట్టి బాలుడిని కాపాడే ప్రయత్నం చేశారు. అయితే అప్పటికే రమేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయా డు. దీంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. బాలుడి తండ్రి నాందేవ్ ఫిర్యాదు మే రకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బాలస్వామి తె లిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటు ంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు. తండా అంతా విద్యుత్ షాక్ ట్రాన్స్ఫార్మర్కు ఎర్తింగ్ లోపం కారణంగా గ్రామం మొత్తం విద్యుత్ షాక్ వస్తోందని తండావాసులు తెలిపారు. ఈ విషయాన్ని వారం రోజుల క్రితం స్థానిక లైన్‌మన్‌కు తెలుపగా ఎవరూ బిల్లులు కట్టడం లేదని, దీంతో తాము పట్టించుకోవడం లేదని సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. అధికారులు అప్పుడే పట్టించుకుని ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని వారన్నారు. తండాల్లో విద్యుత్ మీటర్లు బిగిస్తామని అధికారులు పేర్కొనడంతో దాదాపుగా 30 మంది మీటర్లకు సంబంధించి డీడీలు తీసి ఇచ్చామని తెలిపారు. అయితే ఇంత వరకు మీటర్లు ఇచ్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని బంజారా సేవాలాల్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ విలేకరులతో అన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. -
నుమాయిష్‌కు పండగ కళ
-
సంక్రాంతి సెలవులపై సందిగ్ధత
గుంటూరు ఎడ్యుకేషన్, న్యూస్‌లైన్: ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి పండుగ సెలవులపై సందిగ్ధత నెలకొంది. ప్రభుత్వ అకడమిక్ కేలండర్ ప్రకారం ఏటా ఇస్తున్న విధంగానే ఈసారి 10 రోజులు సెలవులుగా పరిగణించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తుండగా, ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ఉత్తర్వులు జారీ చేసింది. సమైక్యాంధ్ర ఉద్యమ ప్రభావంతో పాఠశాలలు మూతబడిన కారణంగా సెలవుదినాలు, ఆదివారాల్లోనూ పాఠశాలలను నిర్వహిస్తున్న నేపథ్యంలో సంక్రాంతికి మూడురోజుల సెలవులు మంజూరు చేస్తూ పాఠశాల విద్యాశాఖ డెరైక్టరేట్ మంగళవారం జారీ చేసిన ఉత్తర్వులే ఇందుకు నిదర్శనం. సమైక్యాంధ్ర ఉద్యమం సీమాంధ్రలోని 13 జిల్లాల్లో ఒక్కో జిల్లాలో ఒక్కో విధంగా పాఠశాలలు మూతబడగా, జిల్లాలో 50 రోజుల పాటు పాఠశాలలు తెరుచుకోలేదు. సెలవు లు పోనూ జిల్లాలో నికరంగా 33 పనిదినాల నష్టం జరిగింది. తెలంగాణా ప్రాంతంలోని పాఠశాలలకు ఈనెల 9వ తేదీ నుంచి 18వ తేదీ వరకూ సెలవులివ్వగా, సీమాంధ్రలో మాత్రం ఈనెల 13, 14, 15 తేదీల్లో సెలవులుగా పరిగణించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఉద్యమ సమయంలో జిల్లాలో సమ్మెలోకి వెళ్లని ఉపాధ్యాయులు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుబడుతున్నారు. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి దొంతు ఆంజనేయులును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా పాఠశాల విద్య డెరైక్టరేట్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే జిల్లాలోని పాఠశాలలకు సంక్రాంతి సెలవులుగా పరిగణిస్తామని, దీనిపై ఎటువంటి సందేహాలకు తావులేదని స్పష్టం చేశారు. -
9 నుంచి స్కూళ్లకు సంక్రాంతి సెలవులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని పాఠశాలలకు 9 నుంచి సంక్రాంతి సెలవులు ఇస్తున్నట్టు విద్యా శాఖ సోమవారం తెలిపింది. తెలంగాణలో 9 నుంచి 18వరకు, సీమాంధ్రలో 13, 14, 15లో సెలవులు ఇస్తున్నట్టు పేర్కొంది. సీమాంధ్ర ఉపాధ్యాయులు చేసిన సమ్మె కారణంగా అప్పటి సెలవులను ఇప్పుడు సర్దు బాటు చేసినట్టు వివరించింది.