
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లోని ప్రభుత్వ పాఠశాలలకు సంక్రాంతి సెలవుల తేదీలను రాష్ట్ర విద్యాశాఖ ప్రకటించింది. జనవరి 8వ తేదీ నుంచి 16వ తేదీ వరకు సెలవులు ఇస్తున్నట్లు పేర్కొంది. మళ్లీ 17న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నట్లు తెలిపింది.
కాగా గత నాలుగు రోజులుగా టీనేజర్లకు కొనసాగుతున్న కోవిడ్ వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నేటితో(శుక్రవారం) ముగియనుంది. ఇప్పటి వరకు 16 లక్షల మంది టీనేజర్లకు వ్యాక్సిన్ అందించారు. పాఠశాలలకు సెలవులు కావడంతో రేపటి(శనివారం) నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో పిల్లలకు వ్యాక్సినేషన్ డ్రైవ్ చేపట్టనున్నారు.
చదవండి: సీఎం జగన్ పీఆర్సీ ప్రకటనపై ఉద్యోగ సంఘాల హర్షం
Comments
Please login to add a commentAdd a comment