ఊరంతా విద్యుత్ షాక్ | electric shock to total village | Sakshi
Sakshi News home page

ఊరంతా విద్యుత్ షాక్

Published Mon, Jan 13 2014 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 2:36 AM

electric shock to total village

మనూరు, న్యూస్‌లైన్ : ట్రాన్స్‌కో అధికారుల నిర ్లక్ష్యం కారణంగా విద్యుదాఘాతంతో బాలుడు మృతి చెందాడు. ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎర్తింగ్ లోపం కారణంగా వారం రోజులుగా తండాకు షాక్ వస్తున్నట్లు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోవడంతో బాలుడు దుర్మరణం చెందాడు. ఈ సంఘటన మండల పరిధిలోని మావినెల్లి పంచాయతీ కిషన్‌నాయక్ తండాలో సోమవారం చోటుచేసుకుంది. తండా వాసుల కథనం మేరకు.. నాందేవ్, బుజ్జి బాయి దంపతులు కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరికి ఆరుగురు సం తానం కాగా నలుగురు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్ల లు.

 వీరిలో రమేష్ (12) చివరి వాడు. ఇతను మనూరు ఎస్సీ హాస్టల్‌లో ఉంటూ ఆరో తరగతి చదువుతున్నాడు. ప్రస్తుతం సంక్రాంతి సెలవులు కావడంతో కొద్ది రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చాడు. అయితే సోమవారం ఇంటికి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో ఇంటి పైకప్పుకు బిగించిన ఎర్తింగ్ వైరు పట్టుకోవడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీనిని గమనించిన ఇరుగుపొరుగు వారు అప్రమత్తమై కట్టెతో వైర్‌ను కొట్టి బాలుడిని కాపాడే ప్రయత్నం చేశారు.

అయితే అప్పటికే రమేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయా డు. దీంతో 108 వాహనంలో చికిత్స నిమిత్తం ఖేడ్ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో మృతి చెందాడు. బాలుడి తండ్రి నాందేవ్ ఫిర్యాదు మే రకు కేసును దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలస్వామి తె లిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటు ంబ సభ్యులకు అప్పగించినట్లు ఆయన పేర్కొన్నారు.

 తండా అంతా విద్యుత్ షాక్
 ట్రాన్స్‌ఫార్మర్‌కు ఎర్తింగ్ లోపం కారణంగా గ్రామం మొత్తం విద్యుత్ షాక్ వస్తోందని తండావాసులు తెలిపారు. ఈ విషయాన్ని వారం రోజుల క్రితం స్థానిక లైన్‌మన్‌కు తెలుపగా ఎవరూ బిల్లులు కట్టడం లేదని, దీంతో తాము పట్టించుకోవడం లేదని సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. అధికారులు అప్పుడే పట్టించుకుని ఉంటే ప్రాణనష్టం జరిగి ఉండేది కాదని వారన్నారు. తండాల్లో విద్యుత్ మీటర్లు బిగిస్తామని అధికారులు పేర్కొనడంతో దాదాపుగా 30 మంది మీటర్లకు సంబంధించి డీడీలు తీసి ఇచ్చామని తెలిపారు.

అయితే ఇంత వరకు మీటర్లు ఇచ్చిన పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్లే బాలుడు మృతి చెందాడని బంజారా సేవాలాల్ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవీందర్ నాయక్ విలేకరులతో అన్నారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరవాలన్నారు. బాధిత కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement