
ఒంగోలు టౌన్: పాఠశాల విద్యాశాఖ ఎట్టకేలకు సంక్రాంతి సెలవులను ప్రకటించింది. ఈనెల 12 నుంచి 20వ తేదీ వరకు పాఠశాలలకు సెలవులను ప్రకటిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సెలవుల అనంతరం 21వ తేదీ పాఠశాలలు పున ప్రారంభం కానున్నాయి. సంక్రాంతి సెలవులపై సరైన స్పష్టత లేకపోవడంతో అటు ఉపాధ్యాయుల్లో, ఇటు విద్యార్థుల్లో గందరగోళం నెలకొంది. సెలవులపై స్పష్టత ఇవ్వాలంటూ ఉపాధ్యాయ సంఘాలు కూడా పాఠశాల విద్యాశాఖపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించాయి. ఈ నేపథ్యంలో సంక్రాంతి సెలవులపై ప్రభుత్వం స్పష్టత ఇస్తూ గందరగోళానికి తెరదించింది.
Comments
Please login to add a commentAdd a comment