
సాక్షి, అమరావతి : ఆంధప్రదేశ్‌లో సంక్రాంతి సెలవుల తేదీలను ప్రభుత్వం సోమవారం ప్రకటించింది. రాష్ట్రంలో 6 రోజుల పాటు సంక్రాంతి సెలవులు ప్రకటిస్తున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ఈ నెల 12 నుంచి 17 వరకు సెలవులు ఉండనున్నట్లు పేర్కొంది. 9న రెండవ శనివారం...10వ తేదీ ఆదివారం కావడంతో మరో రెండు రోజులు సెలవులు కలిసిరానున్నాయి. 11న అమ్మ ఒడి రెండో విడత నగదు పంపిణీ కారణంగా విద్యా శాఖ పనిచేయనుంది. చదవండి: గవర్నర్‌తో సీఎం వైఎస్ జగన్ భేటీ
Comments
Please login to add a commentAdd a comment