
వచ్చే ఏడాదిలో ప్రభుత్వ సెలవులపై తెలంగాణ ప్రభుత్వం ప్రకటన..
సాక్షి, హైదరాబాద్: మరికొన్నిరోజుల్లో కొత్త ఏడాది రాబోతోంది. ఈ క్రమంలో సెలవులపై మంగళవారం ఒక ప్రకటన చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏడాదిలో అన్ని పండుగలతో కలిపి 27 సాధారణ(జనరల్), 25 ఆఫ్షనల్(ఐచ్ఛిక సెలవులు) హాలీడేస్ ఇస్తున్నట్లు ఉత్వర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది.
జనవరి 15న సంక్రాంతి సెలవు, మార్చి 8న మహా శివరాత్రి, మార్చి 25న హోలి, ఏప్రిల్ 9న ఉగాది, ఏప్రిల్ 17న శ్రీరామనవమి, జూన్ 17న బక్రీద్, సెప్టెంబర్ 7న వినాయక చవితి, అక్టోబర్ 10న దసరా, అక్టోబర్ 31న దీపావళికి సెలవులుగా పేర్కొంది.