
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఏడాది సాధారణ సెలవులను ప్రభుత్వం వెల్లడించింది. 2022 సంవత్సరంలో మొత్తం 23 ప్రభుత్వ సాధారణ సెలవులను ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఏప్రిల్ నెలలోనే ఆరు సాధారణ సెలవులు రానున్నాయి. ఉగాది, శ్రీరామనవమితో పాటు మరో నాలుగు సెలవులు ఈ నెలలో రానున్నాయి.
చదవండి: కావలి మేఘనకు కేటీఆర్ అభినందనలు, శాలువాతో సత్కారం
అన్ని ఆదివారాలు, రెండో శనివారాల్లో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అయితే జనవరి 1న సెలవు దినంగా ప్రకటించినందున, ఆరోజుకు బదులుగా ఫిబ్రవరి 12 రెండో శనివారం రోజున కార్యాలయాలు పని చేస్తాయని తెలిపారు. వచ్చే ఏడాదిలో ప్రభుత్వ ఉద్యోగులు ఐదుకు మించి ఐచ్ఛిక సెలవులు (ఆప్షనల్ హాలిడేస్) వాడుకోరాదని సూచించారు. (చదవండి: కిలో టమాట రూ. 50.. ఎగబడ్డ జనం)