
ఫైల్ ఫోటో
సాక్షి, అమరావతి: నూతన సంవత్సరం సందర్భంగా శనివారం విజయవాడలో తిరుమల తిరుపతి దేవస్థానం వేదపండితులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మకు వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం శ్రీవారి శేషవస్త్రం, ప్రసాదాలతో పాటు టీటీడీ క్యాలెండర్, డైరీలను సీఎస్‌కు అందించారు.
అంతకుముందు రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి అధ్యక్షుడు కె.ఫరీడ, రాష్ట్ర ప్రధానఎన్నికల అధికారి విజయానంద్, ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ టు సీఎస్ పి.ప్రశాంతి, స్పెషల్ ఆఫీసర్ ఎంఐజీ బసంత్ కుమార్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ సత్యనారాయణ, సీఎం అదనపు కార్యదర్శి ఆర్.ముత్యాలరాజు, రాష్ట్ర కార్మిక శాఖ విశ్రాంత ముఖ్య కార్యదర్శి బి.ఉదయలక్ష్మి, విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ శారదతో పాటు దివ్యాంగ విద్యార్థులు సీఎస్ సమీర్ శర్మకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.