
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది.
దీంతో సీఎస్ సమీర్ శర్మ మరో 6 నెలల పాటు.. అంటే నవంబరు 30వ తేదీ వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉంటారు. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై ఉత్తర్వులు విడుదల చేసింది డీవోపీటీ(Department of Personnel and Training).
గతంలో 6 నెలల పాటు సమీర్ శర్మ కి సర్వీస్ పొడిగించించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ఏపీలో మొదటి సారి ఆరు నెలలకు మించి పొడిగింపు పొందిన అధికారిగా సీఎస్ సమీర్ శర్మ గుర్తింపు దక్కించుకున్నారు. గతంలో యూపీ, బీహార్ సీఎస్ లకు మాత్రమే ఇలాంటి అవకాశం ఇచ్చింది కేంద్రం.