tenure extended
-
ఐబీ చీఫ్ డేకా పదవీకాలం ఏడాది పొడిగింపు
న్యూఢిల్లీ: ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) చీఫ్ తపన్ కుమార్ డేకా పదవీ కాలాన్ని మరో ఏడాదిపాటు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన 2025 జూన్ వరకు బాధ్యతల్లో కొనసాగుతారని సోమవారం కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ తెలిపింది. ఈ నెల 30వ తేదీన ముగియనున్న డేకా పదవీ కాలాన్ని ఏడాది పాటు పొడిగించేందుకు కేబినెట్ నియామ కాల కమిటీ ఆమోదించిందని వెల్లడించింది. 1988 బ్యాచ్ హిమాచల్ ప్రదేశ్ కేడర్ ఐపీఎస్ అయిన డేకా 1998లో ఐబీలో చేరారు. 2022 జూలై ఒకటో తేదీన ఆయన ఐబీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు. అదేవిధంగా, జాతీయ మానవహక్కుల కమిషన్(ఎన్హెచ్ఆర్సీ) సెక్రటరీ జనరల్ భరత్ లాల్ పదవీ కాలాన్ని ఏడాదిపాటు పొడిగిస్తూ సిబ్బంది వ్యవహారాల శాఖ ఉత్తర్వులిచి్చంది. -
TS: ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పదవీకాలం పొడిగించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో టీఎస్ఎఫ్సీ పార్థసారథి పదవీకాలం మరో ఏడాది పొడిగిస్తూ శుక్రవారం తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. -
AP: బీసీ కార్పొరేషన్ల పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో బీసీ కార్పొరేషన్ల పదవీ కాలాన్ని కొనసాగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 139 వెనుకబడిన కులాలకు 56 సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే రెండేళ్ల కిందట ఏర్పాటు చేసిన ఆ కార్పొరేషన్ల పదవీకాలం ముగిసింది. దీంతో వాటిలో 55 బీసీ కార్పొరేషన్లను కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచి్చంది. తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు ఆయా కార్పొరేషన్లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు పదవిలో కొనసాగుతారని బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కాగా, పాల ఏకరి సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ టి.మురళీధర్ ఆ తర్వాత జెడ్పీటీసీ సభ్యుడిగా ఎంపికవడంతో ప్రస్తుతానికి ఆ కార్పొరేషన్ పదవీకాలాన్ని కొనసాగించలేదు. సీఎం జగన్ చిత్రపటాలకు క్షీరాభిషేకాలు కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్ల పదవీకాలాన్ని పొడిగించిన నేపథ్యంలో బీసీల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. పశి్చమగోదావరి జిల్లా తణుకులో ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న ఆధ్వర్యంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సమక్షంలో సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిõÙకం చేశారు. ఏలూరు జిల్లా గణపవరంలో రాష్ట్ర సూర్య బలిజ కార్పొరేషన్ చైర్మన్ శెట్టి అనంతలక్ష్మి ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబును సత్కరించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట వైఎస్సార్సీపీ కార్యాలయంలో శ్రీశయన, పొందర–కూరాకుల కార్పొరేషన్ చైర్పర్సన్లు చీపురు రాణి, రాజాపు హైమావతి సీఎం జగన్ చిత్రపటానికి క్షీరాభిõÙకం చేశారు. బీసీలకు పెద్దపీట: ఏపీ బీసీ సంఘం సీఎం వైఎస్ జగన్ బీసీలకు అన్నింటా పెద్దపీట వేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ మారేష్ అన్నారు. బీసీల కోసం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వాటిని, వాటి పదవీ కాలాన్నీ తిరిగి యథాతథంగా కొనసాగిస్తూ శనివారం ప్రభుత్వం జీవో జారీ చేయడంపై యావత్తు బీసీ లోకం హర్షం వ్యక్తం చేస్తోందన్నారు. -
ఏపీ సీఎస్ సమీర్‌శర్మ పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ పదవీ కాలం పొడిగించింది కేంద్రం. మరో 6 నెలలు పొడిగిస్తున్నట్లు శుక్రవారం పేర్కొంది. దీంతో సీఎస్ సమీర్ శర్మ మరో 6 నెలల పాటు.. అంటే నవంబరు 30వ తేదీ వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవిలో ఉంటారు. ఈ మేరకు సీఎస్ పదవీకాలం పెంపుపై ఉత్తర్వులు విడుదల చేసింది డీవోపీటీ(Department of Personnel and Training). గతంలో 6 నెలల పాటు సమీర్ శర్మ కి సర్వీస్ పొడిగించించింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ అనుమతి ఇచ్చింది. ఏపీలో మొదటి సారి ఆరు నెలలకు మించి పొడిగింపు పొందిన అధికారిగా సీఎస్ సమీర్ శర్మ గుర్తింపు దక్కించుకున్నారు. గతంలో యూపీ, బీహార్ సీఎస్ లకు మాత్రమే ఇలాంటి అవకాశం ఇచ్చింది కేంద్రం. -
అనురాగ్ శర్మ పదవీ కాలం పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అనురాగ్ శర్మ పదవీకాలాన్ని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయన పదవీకాలం ఈ నెల 12తో ముగియనుండగా, మరో మూడేళ్లు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు, శాంతిభద్రతలు, నేర నియంత్రణ అంశాల సలహాదారుడిగా అనురాగ్ శర్మ వ్యవహరిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర తొలి డీజీపీగా పని చేసిన ఆయన 2017లో పదివీ విరమణ పొందారు. (తెలంగాణలో కోర్టులు తెరవాలని హైకోర్టు నిర్ణయం) -
ప్రత్యేక అధికారుల పదవీకాలం పొడిగింపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలకమండళ్లు లేని నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలకు ప్రత్యేక అధికారుల పదవీకాలాన్ని ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండళ్ల పదవీకాలం పూర్తి కావడంతో గతంలో 108 పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వారి పదవీకాలం గడువు కూడా ముగిసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మరోసారి 108 పట్టణ స్థానిక సంస్థల ప్రత్యేక అధికారుల పదవీకాలాన్ని ఆరు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు గానీ కొత్త పాలకమండళ్లు ఎన్నికయ్యే వరకుగానీ వీటిలో ఏది ముందైతే అంతవరకు ప్రత్యేక అధికారుల పదవీకాలం ఉంటుంది. -
పింఛన్ లేకున్నా.. ఇల్లుంటే చాలు!
సీనియర్ సిటిజన్ల కోసం ప్రవేశపెట్టిన రివర్స్ మార్టిగేజ్ పథకాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతూ ప్రభుత్వం కొన్ని సవరణలు చేసింది. సొంతింటిలోనే ఉంటూ, ఆ ఇంటిపై ప్రతి నెలా అద్దె రూపంలో (నిజంగా అద్దె కాదు... రుణం) కొంత మొత్తం వచ్చే ఈ రివర్స్ మార్టిగేజ్ పథకం ఇప్పటిదాకా గరిష్టంగా 20 ఏళ్లు మాత్రమే వర్తించేది. ఇపుడు జీవితాంతం వర్తించేలా కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఆనందరావు ప్రైవేటు ఉద్యోగి. రిటైరయ్యాడు. కొడుకులిద్దరూ ఉద్యోగ రీత్యా అమెరికాకు వెళ్లారు. అక్కడే సెటిలయ్యారు. ప్రైవేటు ఉద్యోగి కావటంతో తను ఏర్పాటు చేసుకున్న పింఛన్ చాలా తక్కువ. ఆత్మాభిమానం ఎక్కువ కావటంతో కొడుకుల్ని కూడా అడగలేకపోతున్నాడు. హైదరాబాద్‌లోని సొంతింట్లో ఉండే ఆనందరావుకు ఏం చేయాలో అర్థంకాలేదు. ధరలు పెరగటంతో చాలా ఇబ్బందిగా ఉంది. ఇదే విషయాన్ని తన స్నేహితుడు కుటుంబరావుకు చెప్పాడు. ‘‘నువ్వు సంపాదించుకున్న ఇల్లేగా! నీక్కూడా పనికిరాకపోతే ఎలా? అందుకని తనఖా పెట్టు’’ అని సలహా ఇచ్చాడు కుటుంబరావు. ‘మరి నేనెక్కడుండాలి?’ అడిగాడు ఆనందరావు. ‘‘నువ్వు నిక్షేపంలా నీ ఇంట్లోనే ఉండొచ్చు. అలా ఉంటూనే నెలవారీ లేదా మూడు నెలలకోసారి నీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంత మొత్తం తీసుకోవచ్చు’’ అంటూ రివర్స్ మార్టిగేజ్ పథకాన్ని వివరించాడు. జీవితాంతం ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా గడపటానికి వీలయ్యే రివర్స్ మార్టిగేజ్ పథకం వివరాలే ఈ వారం ప్రాఫిట్ ప్రధాన కథనం... ఎలా పనిచేస్తుంది? మీ పేరుమీద ఉన్న ఇంటిని బ్యాంకు తన వద్ద తనఖాగా పెట్టుకొని ఆ ఇంటి విలువ ఆధారంగా కొంత మొత్తం వెనక్కి ఇస్తుంది. మీ అవసరాలకు అనుగుణంగా ప్రతి నెలా లేదా మూడు నెలలు, ఆరు నెలలు సంవత్సరానికి లేదా ఒకేసారిగా కూడా వెనక్కి తీసుకోవచ్చు.ఈ డబ్బులు మీకు బ్యాంకులు ఉచితంగా ఏమీ ఇవ్వవు. దీనిపై వడ్డీని వసూలు చేస్తాయి. ప్రస్తుతం చాలా బ్యాంకులు రివర్స్ మార్టిగేజ్‌పై బేసురేటుపైన రెండు నుంచి మూడు శాతం అధిక వడ్డీని వసూలు చేస్తున్నాయి. అంటే 12 నుంచి 13 శాతం వడ్డీ పడుతుందన్న మాట. ఈ స్కీంలో ప్రధాన ఆకర్షణ ఏమిటంటే రుణం కాలపరిమితి తీరేంత వరకు మనం ఒక పైసా కట్టాల్సిన అవసరం ఉండదు. పెపైచ్చు మన ఇంట్లో మనమే ఉండొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే మన గృహ రుణాలకు పూర్తి వ్యతిరేకంగా ఈ పథకం పనిచేస్తుంది. అందుకే దీన్ని రివర్స్ మార్టిగేజ్ స్కీంగా పిలుస్తున్నారు. కాలపరిమితి తీరిన తర్వాత మనం వాడుకున్న మొత్తం చెల్లిస్తే ఇల్లు తిరిగి మన చేతికి వచ్చేస్తుంది. లేకపోతే ఆ ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బుల్లో బాకీలను మినహాయించుకొని మిగిలిన మొత్తాన్ని బ్యాంకు మనకు ఇచ్చేస్తుంది. ఒక వేళ రుణం తీసుకున్న తర్వాత ఆ వ్యక్తి మరణిస్తే వారసుడు (నామినీ) రుణం చెల్లించి ఇంటిని తీసుకోవచ్చు. లేకపోతే బ్యాంకు ఆ ఇంటిని అమ్మి బకాయిలు పోగా మిగిలిన మొత్తాన్ని వారసులకు అందచేస్తుంది. ఎంత ఇస్తారు? నేషనల్ హౌసింగ్ బోర్డు నిబంధనల ప్రకారం మీ ఇంటి విలువలో గరిష్టంగా 60 శాతం వరకు రుణం లభిస్తుంది. ఉదాహరణకు మీ ఇంటి విలువ కోటి రూపాయలు అనుకోండి మీకు సుమారు 60 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఇంత మొత్తం అవసరం లేదనుకున్నారనుకోండి.. మీ నెలసరి అవసరాలకు ఎంత డబ్బు అవసరమవుతుందో అంతే మొత్తానికి రుణం తీసుకోవచ్చు. నెలకు ఎంత వస్తుంది అనేది రుణ మొత్తం, ఎంచుకున్న కాలపరిమితిపై ఆధారపడి ఉంటుంది. పై ఉదాహరణే తీసుకుంటే 10 ఏళ్ల కాలపరిమితి ఎంచుకుంటే ప్రతి నెలా రూ.25,200 చేతికి వస్తాయి. అదే 15 ఏళ్లు అయితే రూ.11,400, అదే 20 ఏళ్లు అయితే రూ.5,400 వరకు చేతికి వస్తాయి. ఇప్పుడు అమలులోకి వచ్చిన జీవిత కాలం నగదు కావాలనుకుంటే ఈ మొత్తం మరింత తగ్గుతుంది. అదే ఒకేసారి తీసుకుంటే మాత్రం చాలా బ్యాంకులు ఇంటి విలువ ఎంత అధికంగా ఉన్నా గరిష్టంగా రూ.15 నుంచి 20 లక్షల వరకు మాత్రమే ఇస్తున్నాయి. సీనియర్స్‌కి మాత్రమే.. ఈ పథకాన్ని అందరూ తీసుకోలేదు. సీనియర్ సిటిజన్స్‌కు మాత్రమే ఇది అందుబాటులో ఉంది. అది కూడా సొంత ఇల్లు ఉండి , 60 సంవత్సరాల వయసు దాటిన వారు మాత్రమే తీసుకోవడానికి అర్హులు. మీకు ఈ అర్హతలు ఉంటే మీ ఇంటిని బ్యాంకు తన దగ్గర తనఖా కింద పెట్టుకొని డబ్బులు ఇస్తుందన్నమాట. కాలపరిమితి కంటే ముందుగానే వాడుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించేయొచ్చు. ఒకవేళ ఈ రుణాన్ని వేరే బ్యాంక్ టేకోవర్ చేస్తే మాత్రం రెండు శాతం వరకు పెనాల్టీలను విధిస్తున్నాయి. ఒకసారి రుణం మంజూరు చేసిన తర్వాత బ్యాంకు విధించిన నిబంధనలు నచ్చకపోతే 10 రోజుల్లోగా రద్దు చేసుకోవచ్చు. ఎటువంటి పెనాల్టీలు ఉండవు. అనేక ఆకర్షణలు అరవై సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ ఈ రివర్స్ మార్టిగేజ్ పథకానికి అర్హులు. మీ స్థిరాస్తి విలువలో గరిష్టంగా 60 శాతం వరకు రుణం లభిస్తుంది. ఈ మొత్తాన్ని ఒకేసారి లేదా నెలసరి వాయిదాలు, లేదా మూడు నెలలు, ఆరు నెలలకు ఒకసారి తీసుకునే సౌలభ్యం ఉంది. మీ స్థిరాస్తి విలువను ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మదింపు చేస్తుంటారు. విలువలో ఏమైనా తేడా వస్తే దాని ప్రకారం మీకు చెల్లించే మొత్తంలో మార్పులు జరుగుతాయి. ఇలా ప్రతి నెలా వచ్చే మొత్తాన్ని ఆదాయంగా పరిగణించరు. ఆ మేరకు పన్ను భారం ఉండదు. - సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం