సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాలకమండళ్లు లేని నగర పంచాయతీలు, పురపాలక సంఘాలు, నగర పాలక సంస్థలకు ప్రత్యేక అధికారుల పదవీకాలాన్ని ప్రభుత్వం ఆరు నెలలు పొడిగించింది. ఈ మేరకు పురపాలక శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. పాలకమండళ్ల పదవీకాలం పూర్తి కావడంతో గతంలో 108 పట్టణ స్థానిక సంస్థలకు ప్రభుత్వం ప్రత్యేక అధికారులను నియమించింది. వారి పదవీకాలం గడువు కూడా ముగిసింది. మరోవైపు మున్సిపల్ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో మరోసారి 108 పట్టణ స్థానిక సంస్థల ప్రత్యేక అధికారుల పదవీకాలాన్ని ఆరు నెలలపాటు పొడిగించాలని నిర్ణయించింది. డిసెంబర్ 31 వరకు గానీ కొత్త పాలకమండళ్లు ఎన్నికయ్యే వరకుగానీ వీటిలో ఏది ముందైతే అంతవరకు ప్రత్యేక అధికారుల పదవీకాలం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment