జూనియర్ ఐపీఎస్‌తో లవ్ మ్యారేజ్! | Amrapali to Marry Sameer sharma | Sakshi
Sakshi News home page

జూనియర్ ఐపీఎస్‌తో లవ్ మ్యారేజ్!

Published Mon, Jan 22 2018 8:28 AM | Last Updated on Mon, Jan 22 2018 6:54 PM

Amrapali to Marry Sameer sharma - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్ జిల్లా కలెక్టర్ ఆమ్రపాలి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. 2010 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ అయిన ఆమ్రపాలి ఢిల్లీకి చెందిన 2011 బ్యాచ్‌కు చెందిన సమీర్ శర్మ అనే ఐపీఎస్ అధికారిని ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు. విశాఖ జిల్లాకు చెందిన ఆమ్రపాలి ఉత్తరాదికి చెందిన ఈ ఐపీఎస్‌తో గత కొంత కాలంగా ప్రేమలో ఉన్నారు. ఫిబ్రవరి 18న వీరి పెళ్లి ఢిల్లీలో జరగనుందని సమాచారం. సమీర్ ప్రస్తుతం కేంద్ర పాలిత ప్రాంతమైన డయ్యూ ఎస్పీగా పని చేస్తున్నారు.

ఆమ్రపాలి తండ్రి విశాఖపట్నానికి చెందిన కాట వెంకటరెడ్డి. ఆయన ఆంధ్రా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ పొందారు. ఆమ్రపాలి ఐఐటీ మద్రాస్ నుంచి సివిల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశారు. అనంతరం బెంగళూరు ఐఐఎం నుంచి పీజీ డిప్లొమా పట్టా అందుకున్నారు. ఐఏఎస్‌ కాకముందు జూనియర్ రిలేషన్‌షిప్ బ్యాంకర్‌గా పని చేశారు. 2010లో సివిల్స్‌ రాసి 39వ ర్యాంక్ సాధించారు. మంచి ర్యాంక్ రావడంతో సొంత రాష్ట్ర కేడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు.

2014లో వికారాబాద్ సబ్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమ్రపాలి అనంతరం మహిళా శిశు సంక్షేమ విభాగానికి మారారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్‌ అర్బన్‌ కలెక్టర్‌గా ఆమ్రపాలి 2016 అక్టోబరు 11న బాధ్యతలు స్వీకరించారు. నాటి నుంచి పాలనలో తనదైన ముద్ర వేస్తూ వరంగల్‌ను ఓడీఎఫ్‌( ఓపెన్‌ డిఫెక్షన్‌ ఫ్రీ)గా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. కేంద్రం నుంచి పలు అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం రూరల్‌ జిల్లాకు కూడా ఇన్‌ఛార్జి కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement