ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు.. ఆ ఆలోచనను విరమించుకోండి: సీఎస్‌ సమీర్‌ శర్మ | AP CS Dr Sameer Sharma Press Meet On PRC at Amaravati | Sakshi
Sakshi News home page

జీతాల పెరుగుదలను తెలుసుకునేలా బ్రేక్‌ అప్‌ ఇచ్చాము: ఆర్థికశాఖ స్పెషల్‌ సీఎస్‌

Published Tue, Feb 1 2022 6:39 PM | Last Updated on Tue, Feb 1 2022 8:14 PM

AP CS Dr Sameer Sharma Press Meet On PRC at Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: ఉద్యోగులకు సీఎం ఏమి చెయ్యగలరో అన్నీ చేస్తారని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌ శర్మ అన్నారు. ఈ మేరకు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఆర్‌ ఉన్నా.. ఐఆర్‌ లేకున్నా ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఎవ్వరికీ జీతం తగ్గకూడదని సీఎం చెప్పారు. గత పీఆర్సీ నుంచి ఇప్పటి పీఆర్సీ వరకు చూస్తూ ఎక్కువ పెరుగుదల ఉంది. ఐఆర్‌తో కలిపినా పెరుగుదల ఉంది. ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు. ఈ రోజు రాత్రికి అందరికీ జీతాలు వచ్చాక తెలుస్తుంది.

ఉద్యోగులు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ప్రతి ఏటా 15 శాతం ఆదాయం పెరగాలి. పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్‌ స్కీమ్‌ వలన అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగం. ప్రతి పీఆర్సీ అప్పుడు చర్చల కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం. సమ్మె ఆలోచనను విరమించుకోండి. మనమంతా ఒక కుటుంబం. హెచ్‌ఆర్‌ఏ లాంటివి మాట్లాడుకుందాం రండి. ఉద్యోగులను చర్చలకు రమ్మని కోరుతున్నాను' అని సీఎస్‌ సమీర్‌ అన్నారు. 

చదవండి: (కేంద్ర బడ్జెట్ నిరుత్సాహపరిచింది: ఎంపీ విజయసాయిరెడ్డి)

ఆర్థికశాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్‌ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ నుంచి ఉద్యోగులను.. మంత్రులు, అధికారులతో చర్చలకు రమ్మని కోరుతున్నాను. ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. ఒకటో తేదీన జీతాలు వెయ్యడం ప్రభుత్వ బాధ్యత. 3.69లక్షల సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు జీతాలు వేశాము. 1.75 లక్షల ఇతర ఉద్యోగులకు జీతాలు వేశాము. 94,800 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు జమచేశాము. 3.3 లక్షల మంది పెన్షనర్లకు జమచేశాము. 3,97,564 రెగ్యులర్‌ ఉద్యోగుల జీతాలు కూడా వేశాము. వారికి శాలరీ బ్రేక్‌ అప్‌ కూడా పంపాము. ప్రతి ఉద్యోగి వారి జీతాల పెరుగుదలను తెలుసుకునేలా బ్రేక్‌ అప్‌ ఇచ్చాము అని ఆర్థిక శాఖ స్పెషల్‌ సీఎస్‌ ఎస్‌ఎస్‌ రావత్‌ అన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement