ss rawat
-
బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 22వ తేదీ నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ప్రస్తుతం బదిలీలపై ఉన్న నిషేధాన్ని సడలించింది. ఈ మేరకు మార్గదర్శకాలతో కూడిన ఉత్తర్వులను ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ బుధవారం జారీ చేశారు. ఉద్యోగుల అభ్యర్థన, పరిపాలన ప్రాతిపదికనే బదిలీలు ఉంటాయని మార్గదర్శకాల్లో స్పష్టం చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ నెలాఖరు నాటికి రెండేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులు అభ్యర్థన మేరకు బదిలీలకు అర్హులని ఆర్థిక శాఖ పేర్కొంది. అలాగే ఏప్రిల్ నెలాఖరు నాటికి ఐదేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు ఉంటాయని స్పష్టం చేసింది. ► ఒకేచోట అంటే సిటీ, పట్టణం, గ్రామంలో పనిచేయడాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. రాష్ట్ర ఆడిట్ శాఖ ఉద్యోగులకు సంబంధించి ఒకేచోట అంటే ఆ జోన్ పరిధిలో పరిగణిస్తారు. బదిలీల్లో 40 శాతం వైకల్యం కలిగిన ఉద్యోగులకు ప్రాధాన్యం ఇస్తారు. మానసిక వైకల్య బాధిత పిల్లలున్న ఉద్యోగులకు మెరుగైన వైద్య సదుపాయాలు కలిగిన ప్రాంతానికి బదిలీల్లో ప్రాధాన్యం కల్పిస్తారు. కారుణ్య నియామకాల్లో వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యత ఇస్తారు. ► భార్యా భర్తల కేసుల్లో ప్రాధాన్యత ఇస్తారు. అయితే ఒకసారి అవకాశం వినియోగించుకుంటే మళ్లీ ఐదేళ్ల తర్వాతే బదిలీలకు అర్హులవుతారు. బదిలీలన్నింటినీ ఉద్యోగుల అభ్యర్థన బదిలీలుగానే పరిగణిస్తారు. పదోన్నతిపై ఉద్యోగి బదిలీ తప్పకపోతే బదిలీ చేసే చోట ఆ పోస్టు ఉండాలి. ► తొలుత ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీలన్నింటినీ భర్తీ చేస్తూ బదిలీలు చేపట్టాలి. ఆ తరువాతే నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీలు చేయాలి. ► ఐటీడీఏ పరిధిలో స్థానిక, జోనల్ కేడర్‌లో రెండు సంవత్సరాలకు పైగా పనిచేస్తున్న ఉద్యోగులను వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయాలి. ► ఐటీడీఏ ప్రాంతాలకు బదిలీ చేసే ఉద్యోగులు 50 ఏళ్ల లోపు వారై ఉండాలి. గతంలో ఐటీడీఏలో పనిచేయని ఉద్యోగులై ఉండాలి. ► ఐటీడీఏ ప్రాంతాలతోపాటు మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఖాళీగా ఉంటే తొలుత ఆ ప్రాంతాల్లో పోస్టులు భర్తీ చేసేలా బదిలీలను చేపట్టాలని కలెక్టర్లు, శాఖాధిపతులకు ప్రభుత్వం స్పష్టం చేసింది. ► ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు తావులేకుండా పూర్తి పారదర్శకంగా బదిలీలు జరిగే బాధ్యత సంబంధిత శాఖాధిపతులపై ఉంటుందని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ► ఆదాయార్జన శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, వ్యవసాయ శాఖల్లో ఉద్యోగుల బదిలీలను ఆయా శాఖల మార్గదర్శకాల మేరకు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ► పాఠశాల విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, సంక్షేమ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల బదిలీలపై సంబంధిత శాఖలు సొంతంగా మార్గదర్శకాలను జారీ చేస్తాయి. గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులను బదిలీ చేయరాదు. ► దృష్టి లోపం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలి. ఒకవేళ స్వచ్ఛందంగా బదిలీ కోరుకుంటే వారు కోరుకున్న ప్రాంతానికి బదిలీ చేయాలి. ► ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీ అభ్యర్ధనలను పరిగణలోకి తీసుకోరాదు. ► జూన్ 1వతేదీ నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుంది. -
బదిలీల ప్రక్రియ షురూ
సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న నిషేధాన్ని సడలించి బుధవారం నుంచి ఈ నెల 17వతేదీ వరకు బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలు, ఉద్యోగుల అభ్యర్థనల మేరకు బదిలీలు చేయనున్నారు. ఐదేళ్లుగా ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయనున్నారు. ఆదాయ ఆర్జన శాఖల్లోనూ జూన్ 17వ తేదీలోగా బదిలీల ప్రక్రియను పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉన్నత విద్య, వైద్య ఆరోగ్య శాఖల్లో బదిలీలు ఉండవని స్పష్టం చేశారు. కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లలో ఇటీవలే వర్క్ టు ఆర్డర్‌తో పనిచేస్తున్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీ నుంచి తిరిగి బదిలీలపై నిషేధం అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. బదిలీ మార్గదర్శకాలు ఇలా.. ► ఐదేళ్లుగా ఒకే చోట అంటే నగరం, పట్టణం, గ్రామంలో పనిచేస్తున్న ఉద్యోగులను బదిలీ చేస్తారు. ► 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యమున్న ఉద్యోగులు సమర్పించే ధ్రువీకరణ పత్రాల ఆధారంగా ప్రాధాన్యం. ► మానసిక స్థితి సరిగా లేని పిల్లలున్న ఉద్యోగులను సరైన వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రాంతాలకు బదిలీ చేయాలి. ► వ్యాధులతో చికిత్స పొందుతున్న తల్లిదండ్రులు/జీవిత భాగస్వామి/పిల్లలున్న ఉద్యోగులను క్యాన్సర్, గుండె ఆపరేషన్, న్యూరో సర్జరీ, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ లాంటి సౌకర్యాలు కలిగిన ప్రాంతాలకు బదిలీ చేయాలి. ► కారుణ్య నియామకాల్లో నియమితులైన వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. ► భార్య లేదా భర్తలో ఒకరిని మాత్రమే బదిలీ చేయాలి. ► నోటిఫైడ్ ఏజెన్సీ ప్రాంతాల్లోని అన్ని ఖాళీలు, పోస్టుల భర్తీకి బదిలీల్లో ముందు ప్రాధాన్యం ఇవ్వాలి. ► ఐటీడీఏ ప్రాంతాల్లో 50 ఏళ్ల కంటే తక్కువ వయసున్న ఉద్యోగులనే నియమించాలి. ► ఐటీడీఏ ప్రాంతాల పరిధిలో గతంలో పనిచేయని ఉద్యోగులను నియమించాలి. ► ఐటీడీఏ పరిధిలోని మారుమూల వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీ పోస్టులను బదిలీల ద్వారా భర్తీ చేసేందుకు సంబంధిత శాఖలు, జిల్లా కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలి. ► అన్ని బదిలీలను ఇప్పటికే ఉన్న నిబంధనల ప్రకారం అధికారులు అమలు చేయాలి. ► బదిలీల విషయంలో ఎటువంటి ఫిర్యాదులు, ఆరోపణలకు ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా సంబంధిత శాఖాధిపతులు ప్రక్రియను అమలు చేయాలి. నిబంధనలు, మార్గదర్శకాలకు వ్యతిరేకంగా బదిలీలుంటే తీవ్రంగా పరిగణిస్తారు. ► ఆదాయ ఆర్జన శాఖల్లోని ఉద్యోగుల బదిలీలను కూడా ఈ నెల 17వతేదీలోగా పూర్తి చేయాలి. వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, రవాణా, వ్యవసాయ శాఖలు విడిగా మార్గదర్శకాలను రూపొందించి ఉద్యోగుల బదిలీలను ఈ నెల 17వ తేదీలోగా పూర్తి చేయాలి. ► ఇటీవలే బదిలీలకు అనుమతించినందున ఉన్నత విద్య (కాలేజీ ఎడ్యుకేషన్ ), స్కిల్ డెవలప్మెంట్, వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖల ఉద్యోగులకు ఇప్పుడు బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్‌కు మాత్రం బదిలీలకు అవకాశం కల్పించారు. ► దృష్టిలోపం ఉన్న ఉద్యోగులకు బదిలీల నుంచి మినహాయింపు ఇవ్వాలి. అలాంటి ఉద్యోగులు బదిలీ కోరితే, అక్కడ స్పష్టమైన ఖాళీ ఉంటే బదిలీ చేయాలి. ► ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగుల బదిలీలకు అనుమతించరాదు. -
గ్రూప్–1,2 పోస్టుల భర్తీకి ఆర్థికశాఖ అనుమతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్ – 1, 2 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు భర్తీ చేస్తారు. గతంలో ప్రకటించిన జాబ్ క్యాలండర్ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ 1, 2 విభాగాల్లో 292 ఉద్యోగాలను ప్రకటించారు. ఆ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినివ్వడంతో త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్ కమిషనర్లు, డీఎఫ్‌వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి. -
ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు.. ఆ ఆలోచనను విరమించుకోండి: సీఎస్ సమీర్ శర్మ
సాక్షి, అమరావతి: ఉద్యోగులకు సీఎం ఏమి చెయ్యగలరో అన్నీ చేస్తారని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ అన్నారు. ఈ మేరకు సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐఆర్ ఉన్నా.. ఐఆర్ లేకున్నా ఉద్యోగుల జీతం పెరుగుతుంది. ఎవ్వరికీ జీతం తగ్గకూడదని సీఎం చెప్పారు. గత పీఆర్సీ నుంచి ఇప్పటి పీఆర్సీ వరకు చూస్తూ ఎక్కువ పెరుగుదల ఉంది. ఐఆర్‌తో కలిపినా పెరుగుదల ఉంది. ఎవ్వరికీ జీతాలు తగ్గలేదు. ఈ రోజు రాత్రికి అందరికీ జీతాలు వచ్చాక తెలుస్తుంది. ఉద్యోగులు ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోవాలి. వాస్తవానికి ప్రతి ఏటా 15 శాతం ఆదాయం పెరగాలి. పీఆర్సీకి అదనంగా గ్రాట్యుటీ, హౌసింగ్ స్కీమ్ వలన అదనపు ప్రయోజనం ఉంది. ఉద్యోగులంతా ప్రభుత్వంలో భాగం. ప్రతి పీఆర్సీ అప్పుడు చర్చల కమిటీ ఉంటుంది. ఇప్పుడు ఉద్యోగులు ఏ సమస్య ఉన్నా చర్చించుకుందాం. సమ్మె ఆలోచనను విరమించుకోండి. మనమంతా ఒక కుటుంబం. హెచ్ఆర్ఏ లాంటివి మాట్లాడుకుందాం రండి. ఉద్యోగులను చర్చలకు రమ్మని కోరుతున్నాను' అని సీఎస్ సమీర్ అన్నారు. చదవండి: (కేంద్ర బడ్జెట్ నిరుత్సాహపరిచింది: ఎంపీ విజయసాయిరెడ్డి) ఆర్థికశాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ.. ఆర్థిక శాఖ నుంచి ఉద్యోగులను.. మంత్రులు, అధికారులతో చర్చలకు రమ్మని కోరుతున్నాను. ఉద్యోగులకు ఏ సమస్య ఉన్నా పరిష్కరిస్తాం. ఒకటో తేదీన జీతాలు వెయ్యడం ప్రభుత్వ బాధ్యత. 3.69లక్షల సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లకు జీతాలు వేశాము. 1.75 లక్షల ఇతర ఉద్యోగులకు జీతాలు వేశాము. 94,800 ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు జమచేశాము. 3.3 లక్షల మంది పెన్షనర్లకు జమచేశాము. 3,97,564 రెగ్యులర్ ఉద్యోగుల జీతాలు కూడా వేశాము. వారికి శాలరీ బ్రేక్ అప్ కూడా పంపాము. ప్రతి ఉద్యోగి వారి జీతాల పెరుగుదలను తెలుసుకునేలా బ్రేక్ అప్ ఇచ్చాము అని ఆర్థిక శాఖ స్పెషల్ సీఎస్ ఎస్ఎస్ రావత్ అన్నారు. -
కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు రూ.786 కోట్లు
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం 11వ వేతన సవరణలో భాగంగా కాంట్రాక్టు ఉద్యోగులతోపాటు ఔట్సోర్సింగ్ సిబ్బంది వేతనాలను కూడా పెంచింది. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెంచిన వేతనాలను ఈ నెల నుంచే అమలు చేయనున్నట్లు ఆర్ధిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ వేర్వేరుగా ఉత్తర్వులు జారీ చేశారు. వేతనాల పెంపు ద్వారా కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏటా అదనంగా రూ.786 కోట్ల మేర ప్రయోజనం చేకూరనుంది. దళారీ వ్యవస్థ లేకుండా.. రాష్ట్రంలో 1,00,996 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులున్నారు. దళారీ వ్యవస్థతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఇక్కట్లను గుర్తించిన వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ ఫర్ ఔట్ సోర్స్డ్ సర్వీసెస్ (ఏపీసీఓఎస్)ను ఏర్పాటు చేసింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఈ కార్పొరేషన్ కిందకు తీసుకురావడమే కాకుండా ప్రతీ నెలా 1వ తేదీనే వేతనాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు లప్రస్తుతం వేతనాల రూపంలో ఏటా రూ.1,860 కోట్లు చెల్లిస్తున్నారు. ఇప్పుడు 11వ వేతన సవరణ ప్రకారం ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాలను పెంచడంతో ఏడాదికి అదనంగా రూ.430 కోట్ల మేర ప్రయోజనం పొందనున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను మూడు కేటగిరిలుగా వర్గీకరించి వేతనాలను పెంచుతూ ఆర్ధిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మినిమమ్ టైమ్ స్కేల్ అమలు.. కాంట్రాక్టు ఉద్యోగులకు కూడా 11వ వేతన సవరణ ప్రకారం మినిమమ్ టైమ్ స్కేలును అమలు చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు వెలువరించింది. వేల సంఖ్యలో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులకు వేతనాల రూపంలో రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ.661 కోట్లు చెల్లిస్తోంది. ఈ నెల నుంచి పెరిగిన వేతనాల ద్వారా కాంట్రాక్టు ఉద్యోగులకు ఏటా రూ.356 కోట్ల మేర అదనపు ప్రయోజనం చేకూరనుంది. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నవారు, యూనివర్సిటీలు, సొసైటీలు, కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులందరికీ వేతనాల పెంపు వర్తిస్తుందని ఆర్ధిక శాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. పూర్తి సమయం, ఎన్ఎంఆర్, రోజువారీ వేతనం, కన్సాలిడేటెడ్ పే, పార్ట్ టైం ఉద్యోగులకు కూడా 11వ వేతన సవరణ మేరకు మినిమమ్ టైమ్ స్కేలు అమలు చేస్తూ ఆర్థిక శాఖ మరో ఉత్తర్వులను కూడా ఇచ్చింది. వీరికి కూడా ఈ నెల నుంచే మినిమమ్ టైమ్ స్కేలును వర్తింప చేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కేటగిరీల వారీగా పెరిగిన వేతనాలు కేటగిరి–1 (పెరిగిన నెల వేతనం రూ. 21,500) సీనియర్ అసిస్టెంట్, సీనియర్ స్టెనో,సీనియర్ అకౌంటెంట్, ట్రాన్స్‌లేటర్,డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ కేటగిరి–2 (పెరిగిన నెల వేతనం రూ. 18,500) డ్రైవర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ స్టెనో, టైపిస్ట్, టెలిఫోన్ ఆపరేటర్, స్టోర్ కీపర్, ఫొటోగ్రాఫర్, డేటా ఎంట్రీ ఆపరేటర్, డేటా ప్రాసెసింగ్ అసిస్టెంట్ ఎలక్ట్రీషియన్, మెకానిక్, ఫిట్టర్, లైబ్రేరియన్, ల్యాబ్ అసిస్టెంట్, సూపర్వైజర్, మేనేజర్ కేటగిరి–3 (పెరిగిన నెల వేతనం రూ. 15,000) ఆఫీస్ సబార్టినేట్, వాచ్మెన్, కుక్, వాచ్మెన్, కుక్ చౌకీదార్, సైకిల్ ఆర్డర్లీ, లిఫ్ట్ ఆపరేటర్, ల్యాబ్ అసిస్టెంట్, దఫేదార్, జిరాక్స్ ఆపరేటర్, రికార్డ్ అసిస్టెంట్ -
కొత్త పేస్కేల్స్ అమలుపై మార్గదర్శకాలు
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీకి అనుగుణంగా ఉద్యోగుల పేస్కేల్స్ నిర్ణయించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్ మెమో జారీ చేశారు. ప్రస్తుతమున్న బేసిక్ పే, 2018 జూలై 1 వరకు ఉన్న డీఏలు(30.392 శాతం), 23 శాతం ఫిట్‌మెంట్‌ను కలిపి బేసిక్ పే నిర్ధారించాలని ఆదేశించారు. కొత్తగా ప్రకటించిన హెచ్ఆర్ఏలు, సీసీఏ మినహాయించి అమలు చేయాలని స్పష్టం చేశారు. మారిన పే స్కేల్స్‌ను 2018 జూలై 1 నుంచి నోషనల్‌గా తీసుకుని.. 2020 ఏప్రిల్ 1 నుంచి మానిటరీ బెనిఫిట్ అమలు చేయాలని సూచించారు. మారిన పేస్కేల్స్ ప్రకారం కొత్త జీతాలను ఫిబ్రవరి 1న ఐదు పెండింగ్ డీఏలతో కలిపి ఇవ్వాలని స్పష్టం చేశారు. పేస్కేల్స్‌కి సంబంధించిన అన్ని వివరాలను ఏపీ గెజిట్ పోర్టల్‌లో అందుబాటులో ఉంచుతామని తెలిపారు. పేస్కేల్స్ కోసం ఏపీసీఎఫ్ఎస్ఎస్ హెచ్ఆర్ఎంఎస్లో కొత్త మోడల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. -
Andhra Pradesh: వేతనాలు తగ్గవు..ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ స్పష్టీకరణ
సాక్షి, అమరావతి: కొత్త పీఆర్సీ అమలు వల్ల ఎవరి వేతనాలు తగ్గవని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ సమీర్ శర్మ స్పష్టం చేశారు. పది రోజులు ఆగితే పే స్లిప్‌లు వస్తాయని, గత పేస్లిప్, ఇప్పటి పేస్లిప్‌ను పోల్చి చూసుకుంటే ఈ విషయం అర్థమవుతుందన్నారు. ఉద్యోగులందరి జీతాలను లెక్కించామని, ఏ ఉద్యోగి గ్రాస్ జీతంలో తగ్గుదల ఉండదన్నారు. హెచ్ఆర్ఏ జీతంలో భాగమని, ఐఆర్ అనేది సర్దుబాటు అని చెప్పారు. గత పీఆర్సీ, ఈ పీఆర్సీ మధ్య తేడా చూడాలన్నారు. సగటున ప్రతి ఉద్యోగి జీతం 20 శాతం పెరుగుతుందని తెలిపారు. మధ్యంతర భృతి (ఐఆర్) తీసి వేసిన తర్వాత కూడా జీతాల్లో తగ్గుదల లేదని చెప్పారు. సచివాలయంలో బుధవారం ఆయన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఎస్ రావత్, జీఏడీ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్ ఇతర అధికారులతో కలిసి పీఆర్సీకి సంబంధించిన పలు అంశాలపై మీడియా సమావేశంలో వివరణ ఇచ్చారు. హెచ్ఆర్ఏ అంశం వేరని, కొత్త స్లాబు ప్రకారం హెచ్ఆర్ఏ 2 నుంచి 5 శాతం తగ్గినా గ్రాస్‌లో అది కనిపించదన్నారు. కొన్ని తగ్గి, కొన్ని పెరిగినా మొత్తంగా ఉద్యోగుల జీతాలు తగ్గవని స్పష్టం చేశారు. పది సంవత్సరాల క్రితం ఇచ్చిన పీఆర్సీ ప్రక్రియలో తాను ఆర్థిక శాఖ కార్యదర్శిగా పాల్గొన్నానని, అప్పటికి, ఇప్పటికీ చాలా తేడా ఉందన్నారు. కరోనా వల్ల ప్రస్తుతం ఆదాయం రూ.62 వేల కోట్లకు తగ్గిపోయిందని తెలిపారు. కరోనా లేకపోతే ఇది రూ.98 వేల కోట్లకు చేరుకునేదన్నారు. కరోనా వల్ల సొంత రెవెన్యూ తగ్గిందని, ఇప్పుడు మళ్లీ ఒమిక్రాన్ వల్ల రెవెన్యూపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పారు. సీఎస్ ఇంకా ఏమన్నారంటే.. కేంద్రం మోడల్‌ను అనుసరిస్తున్నాం ► కేంద్ర ప్రభుత్వ వేతన సవరణ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అనుసరించింది. ఐఏఎస్ అధికారులకు ఎక్కువ జీతాలు వస్తున్నాయనడం నిజం కాదు. పీఆర్సీతో ఉద్యోగులకు చాలా ప్రయోజనాలున్నాయి. కాంట్రాక్టు ఉద్యోగులకు టైమ్ స్కేల్స్ వచ్చాయి. హోంగార్డులు, ఏఎన్ఎంల జీతాలు పెరిగాయి. గ్రాట్యుటీ కూడా పెరిగింది. ► 14.29 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని కమిటీ చెబితే ముఖ్యమంత్రి 23 శాతం ఇచ్చారు. పెరిగే జీతాల వల్ల ప్రభుత్వంపై ఏటా రూ.10 వేల కోట్లు అదనపు భారం పడుతుంది. ఇతరత్రా భారం మరో రూ.10 వేల కోట్లు ఉంటుంది. ► ఎంతో అధ్యయనం తర్వాత కేంద్ర వేతన సవరణ కమిషన్ 80 ఏళ్ల తర్వాత పెన్షనర్లకు ఖర్చులు పెరుగుతాయని.. ఎక్కువ డబ్బు అవసరం అని చెప్పి, అమలు చేస్తోంది. ఆ కమిషన్‌లో మెరుగైన వృత్తి నిపుణులున్నారు. వారి మోడల్‌ను మేము అనుసరిస్తున్నాం. ప్రస్తుతం పెన్షనర్ల వైద్యం అలవెన్సు పెరుగుతుంది. ఉద్యోగుల కనీస పే స్కేల్ రూ.20 వేలకు పెరుగుతుంది. మనదంతా ఒకే కుటుంబం.. ► అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పీఆర్సీలో భాగం కాకపోయినా వారికి ఇప్పటి నుంచే డబ్బు ఇస్తున్నాం. ప్రభుత్వం అమలు చేస్తున్నది చాలా మెరుగైన విధానం. ఒకే దేశం, ఒకే పీఆర్సీ. అశుతోష్ మిశ్రా కమిటీ సిఫారసులను ప్రభుత్వం పక్కన పెట్టలేదు. వాటిలో చాలా అంశాలను అమలు చేస్తున్నాం. ► పీఆర్సీలో సిఫారసులు మాత్రమే చేస్తాం. వాటిని ప్రభుత్వం అమలు చేయొచ్చు, చేయకపోవచ్చు. అయినా పీఆర్సీలోని 90 శాతం సిఫారసులను ప్రభుత్వం యథావిధిగా అమలు చేస్తోంది. నేను కార్యదర్శుల కమిటీకి నేతృత్వం వహించి నివేదిక ఇచ్చాను. ఇంకా అనేక మార్గాల ద్వారా ముఖ్యమంత్రికి ఎంతో సమాచారం, వివరాలు వెళతాయి. వాటన్నింటినీ చూసి ఆయన నిర్ణయం తీసుకున్నారు. మేము చేసిన సిఫారసుల్లో చాలా వాటిని అంగీకరించారు. ► ఉద్యోగులు ఇప్పుడైనా ప్రభుత్వంతో మాట్లాడుకోవచ్చు. మనదంతా ఒకటే కుటుంబం. పిల్లలకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే తండ్రినే అంటారు. అలాగే నన్నూ అని ఉండవచ్చు. అన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. ► ఈ సమావేశంలో ఆర్థిక శాఖ ఈఓ కార్యదర్శి సత్యనారాయణ, ప్రభుత్వ సలహాదారు (ఉద్యోగుల సంక్షేమం) చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అందరం కలసి సిఫారసులు చేశాం కొత్త పీఆర్సీలో ప్రతి ఉద్యోగికీ వేతనం పెరుగుతుంది. సీఎస్‌ని నిందించడం సబబు కాదు. కార్యదర్శుల కమిటీకి ఆయన నేతృత్వం వహించారు. అందరం కలసి సిఫారసులు చేశాం. వ్యక్తిగత నిర్ణయం ప్రకారం ఏమీ జరగలేదు. ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచాలని మేము సిఫారసు చేయకపోయినా సీఎం ప్రకటించారు. ఉద్యోగులతో మాకు మంచి సంబంధాలున్నాయి. అవి కొనసాగుతాయి. రాష్ట్ర విభజన వల్ల ఏపీ తీవ్రంగా నష్టపోయింది. 9, 10వ షెడ్యూల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి రూ.1.06 లక్షల కోట్లు, రూ.39,191 కోట్లు నష్టపోయాం. రాజధాని నగరం కోల్పోవడం వల్ల ఏడేళ్లలో లక్షా 80 వేల కోట్ల నష్టం వచ్చింది. తెలంగాణ ఇవ్వాల్సిన విద్యుత్ బకాయిలు రూ.6,284 కోట్లు ఉన్నాయి. కోవిడ్ వల్ల రూ.21,933 కోట్ల ఆదాయాన్ని కోల్పోగా, అదనంగా రూ.30 వేల కోట్లు ఖర్చయింది. – ఎస్ఎస్ రావత్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఐఏఎస్ అధికారుల హెచ్ఆర్ఏ రద్దుకు నిర్ణయం ఉద్యోగులకు ఒక ప్యాకేజీలా ప్రభుత్వ ప్రయోజనాలు అందుతాయి. ఉద్యోగ విరమణ వయసును 62 ఏళ్లకు పెంచడం వల్ల ప్రతి ఉద్యోగికి రూ.24 లక్షల అదనపు ప్రయోజనం కలుగుతుంది. ఇళ్ల స్థలాల వల్ల రూ.10 లక్షల వరకు నేరుగా లబ్ధి కలుగుతుంది. రిటైర్మెంట్ సమయంలో ఇచ్చే గ్రాట్యూటీ కూడా పెరిగింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పీఆర్సీ ఏర్పాటు సమయానికి లేరు. అయినా సీఎం వారికి ప్రొబేషన్ ఇచ్చి, స్కేలు ఇవ్వాలని నిర్ణయించారు. ఐఏఎస్ అధికారుల హెచ్ఆర్ఏ రూ.40 వేలను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించింది. – శశిభూషణ్‌కుమార్, జీఏడీ ముఖ్య కార్యదర్శి -
Andhra Pradesh: ఉద్యోగులకు శుభవార్త
సాక్షి, అమరావతి: గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ప్రభుత్వోద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ సంక్షోభంలోనూ శుభవార్త అందించింది. జులై 2019 నుంచి చెల్లించాల్సిన కరువు భత్యాన్ని (డీఏ) మంజూరు చేసింది. ఉద్యోగుల మూల వేతనంలో ప్రస్తుతమున్న 33.536 శాతం నుంచి 38.776 శాతానికి (5.24) కరువు భత్యం పెంచుతూ ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. ► 2019 జులై నుంచి 2021 డిసెంబర్ వరకు కరువు భత్యం బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో ఉద్యోగుల జీపీఎఫ్‌కు జమచేయనున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపారు. ► పెరిగిన కరువు భత్యాన్ని వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1వ తేదీ వేతనాలతో చెల్లిస్తారు. ► అలాగే, సీపీఎస్ ఉద్యోగులకు పెరిగిన డీఏని వచ్చే ఏడాది జనవరి నుంచి నగదు రూపంలో ఫిబ్రవరి 1వ తేదీ వేతనాల నుంచి చెల్లిస్తారు. ► సీపీఎస్ ఉద్యోగులకు 2019 జులై నుంచి 2021 డిసెంబర్ వరకు డీఏ బకాయిలను వచ్చే ఏడాది జనవరి నుంచి మూడు సమాన వాయిదాల్లో నగదు రూపంలో చెల్లించనున్నట్లు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎవరెవరికి వర్తిస్తుందంటే.. పెరిగిన కరువు భత్యం జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామ పంచాయతీ, జిల్లా గ్రంధాలయాల సమితి, రెగ్యులర్ స్కేల్స్‌లో పనిచేస్తున్న వర్క్ చార్జ్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఉద్యోగులకు వర్తించనుంది. అంతేకాక.. రెగ్యులర్ పే స్కేల్స్‌లో పనిచేస్తున్న ఎయిడెడ్ ఇనిస్టిట్యూషన్స్, ఎయిడెడ్ పాలిటెక్నిక్‌లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు వర్తిస్తుంది. విశ్వవిద్యాలయాలతో పాటు వ్యవసాయ యూనివర్శిటీ.. జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన యూనివర్శిటీలో రెగ్యులర్ పే స్కేల్స్‌లో పనిచేస్తున్న టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బందికీ పెరిగిన కరువు భత్యం వర్తించనుంది. వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉద్యోగుల డీఏకు సొంత నిధులను వినియోగించుకోవాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సీఎం జగన్‌కు కృతజ్ఞతలు రాష్ట్ర ప్రభుత్వం 2019 జులై నుంచి చెల్లించాల్సిన 5.24 శాతం కరువు భత్యం విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీచేయడంపట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ చైర్మన్ కే వెంకట్రామిరెడ్డి హర్షం వ్యక్తంచేశారు. డీఏ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇప్పించినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
నవీన మోసాలపై అప్రమత్తం
సాక్షి, అమరావతి: నకిలీ చిట్ ఫండ్ కంపెనీల మోసాలు, ఆన్లైన్ లెండింగ్ ప్లాట్ ఫారం మోసాల పట్ల ప్రజలు పూర్తి అప్రమత్తతతో ఉండాలని రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్.రావత్ సూచించారు. బుధవారం సచివాలయంలో జరిగిన రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా 23వ రాష్ట్రస్థాయి కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశానికి రావత్ అధ్యక్షత వహించారు. ఆయన మాట్లాడుతూ.. సమాజంలో రోజు రోజుకూ ఆన్లైన్, నకిలీ చిట్ ఫండ్ కంపెనీలు, డిజిటల్ లెండింగ్ కంపెనీల మోసాలు అధికమవుతున్నాయని అన్నారు. అలాంటి మోసాలను నియంత్రించేందుకు సంబంధిత రెగ్యులేటరీ ఏజెన్సీలు సకాలంలో కేసులు నమోదు చేసి.. కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. దీనిపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని, ఈ విధమైన మోసాలపై వారికి పెద్దఎత్తున అవగాహన పెంపొందించాలని సూచించారు. అనేక రకాల కొత్త యాప్‌లు పుట్టుకొచ్చి ఆర్థికపరమైన మోసాలకు పాల్పడుతున్నాయని చెప్పారు. బిట్ కాయిన్, క్రిప్టో కరెన్సీ పేరిట పెద్దఎత్తున ఆన్లైన్ మోసాలు జరుగుతున్నాయని, ప్రజలు మోసపోకుండా జాగ్రత్త తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈవి ధమైన మోసాలను నియంత్రించేందుకు వివిధ కేంద్ర, రాష్ట్ర రెగ్యులేటరీ అథారిటీలు పూర్తి సమన్వయంతో పనిచేయాల్సి ఉందన్నారు. రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల రీజనల్ డైరెక్టర్ కె.నిఖిల మాట్లాడుతూ..వివిధ ఆర్థిక పరమైన మోసాలు, డిజిటల్ లెండింగ్ ప్లాట్ ఫారమ్ మోసాలు, నకిలీ కంపెనీల మోసాలపై చర్చించి నియంత్రించేందుకు రాష్ట్ర స్థాయిలో ఉన్న అత్యున్నత బాడీ ఎస్ఎల్సీసీ ఉందని పేర్కొన్నారు. ప్రతి మూడు మాసాలకు ఒకసారి ఈ బాడీ క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలని తెలిపారు. వచ్చే త్రైమాసిక సమావేశాన్ని ఫిబ్రవరి ఆఖరి వారంలో నిర్వహించేలా చూడాలని సూచించారు. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ వై.జయకుమార్ అజెండా అంశాలను వివరాలను సమావేశంలో చర్చకు పెట్టారు. వివిధ చిట్ ఫండ్ కంపెనీలు అగ్రిగోల్డ్, అక్షయ గోల్డు, హీరా గ్రూప్ తదితర మోసాలకు సంబంధించి తీసుకున్న చర్యలను సమీక్షించారు. అలాగే మార్కెట్ ఇంటెలిజెన్స్‌కు సంబంధించి వివిధ లోన్ యాప్‌ల ద్వారా వేధింపుల ఫిర్యాదులు, ముద్రా అగ్రికల్చర్–స్కిల్ డెవలప్మెంట్ మల్టీ స్టేట్ కో–ఆపరేటివ్ సొసైటీ, వర్థన్ బ్యాంకు స్కాం తదితర సంస్థలపై మోసాలు ఇప్పటి వరకు నమోదైన కేసుల ప్రగతి తదితర అంశాలను సమీక్షించారు. అదే విధంగా బానింగ్ ఆఫ్ అన్ రెగ్యులేటెడ్ డిపాజిట్ స్కీమ్ (బడ్స్)చట్టం 2019పై చర్చించారు. హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, న్యాయశాఖ కార్యదర్శి సునీత, రిజిస్ట్రార్ ఆఫ్ కో–ఆపరేటివ్స్ బాబు ఏ, సీఐడీ డిఐజీ సునీల్ కుమార్‌నాయక్ ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. -
ఆర్థిక శాఖపై హైకోర్టు అసంతృప్తి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ఆర్థిక శాఖ తీరుపై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. చేసిన పనులకు బిల్లుల చెల్లింపులో నెలల తరబడి జాప్యం చేస్తోందని అసహనం వ్యక్తంచేసింది. ట్రెజరీతో సహా అన్ని శాఖలు సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ (సీఎఫ్ఎంఎస్)కు బిల్లుల మొత్తాలను పంపుతున్నా, ఆర్థిక శాఖ సంవత్సరాల తరబడి ఎందుకు చెల్లించడంలేదో ఈ నెల 13న స్వయంగా హాజరై వివరణ ఇవ్వాలని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి శంషేర్ సింగ్ రావత్‌ను ఆదేశించింది. తదుపరి విచారణను ఆ రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బట్టు దేవానంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. స్టేషనరీ సరఫరా చేసినందుకు తమకు చెల్లించాల్సిన రూ.1.29 కోట్లను పంచాయతీరాజ్ శాఖ చెల్లించడంలేదని, బకాయిలను వడ్డీతో సహా చెల్లించేలా ఆదేశించాలని కోరుతూ నేషనల్ కోఆపరేటివ్ కన్సూ్యమర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ బ్రాంచ్ మేనేజర్ కె.శ్రీహర్ష హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పదిరి రవితేజ వాదనలు వినిపిస్తూ, అధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా బిల్లులు చెల్లించడంలేదని తెలిపారు. ఆర్థిక శాఖ తరఫు న్యాయవాది స్పందిస్తూ, పిటిషనర్ బిల్లులను ట్రెజరీ అధికారులు గత ఏడాది డిసెంబర్లోనే ప్రాసెస్ చేశారని తెలిపారు. 2021 మార్చి 31తో ఆర్థిక సంవత్సరం ముగియడంతో బిల్లుల చెల్లింపు సాధ్యం కాలేదన్నారు. ఇప్పుడు జిల్లా పంచాయతీ అధికారి నుంచి మొత్తం ప్రక్రియ తిరిగి మొదలు కావాలని చెప్పారు. దీనిపై న్యాయమూర్తి అసహనం వ్యక్తం చేశారు. చేసిన పనులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడం పిటిషనర్ న్యాయబద్ధమైన హక్కును హరించడమేనని వ్యాఖ్యానించారు. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి : కోవిడ్ కారణంగా 2020 మార్చి నెలలో వాయిదా వేసిన వేతనాలు, గౌరవ వేతనాలు, పెన్షన్లను డిసెంబర్ నెలలో చెల్లించేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలను చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఏప్రిల్ నెలలో తగ్గించిన వేతనాలను డిసెంబర్, 2021 జనవరిలో చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
ఆర్థిక క్రమశిక్షణ వైపే అడుగులు
సాక్షి, అమరావతి: ఆర్థిక నిర్వహణలో మరింత పొదుపు పాటించాలని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ సరఫరా సంస్థ (ఏపీ ట్రాన్స్‌కో) నిర్ణయించింది. చౌక విద్యుత్ కొనుగోళ్లు, వృధా వ్యయాన్ని తగ్గించడంపైనే రాబోయే కాలంలో దృష్టి పెట్టాలని తీర్మానించింది. ఏపీ ట్రాన్స్‌కో బోర్డు సమావేశం శుక్రవారం విజయవాడలో జరిగింది. ఈ సందర్భంగా ట్రాన్స్‌కో ఆర్థిక పరిస్థితిపై సమావేశంలో చర్చించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ వివరాలను ఇంధన పొదుపు సంస్థ సీఈవో చంద్రశేఖర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ► వృధాను అరికట్టడంలో గత ఏడాదిగా తీసుకున్న నిర్ణయాలు దేశంలోని పలు రాష్ట్రాలకు ఆదర్శ ప్రాయమైందని, ముందస్తు వ్యూహంతో చౌక విద్యుత్‌ను కొనుగోలు చేయడం వల్ల రూ.700 కోట్లు మిగిల్చినట్టు పేర్కొన్నారు. ► తమిళనాడు, మహారాష్ట్ర, పంజాబ్, బిహార్, యూపీ వంటి రాష్ట్రాలు ఆర్థిక క్రమశిక్షణ పాటించేందుకు ఏపీని ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఇంధనశాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి తెలిపారు. ఈ విషయౖ మె ఆయా రాష్ట్రాలు సంప్రదించినట్టు వివరించారు. ► గడచిన ఏడాదిలోనే రాష్ట్ర విద్యుత్ సంస్థలు రూ.4,783.23 కోట్లు ఆదా చేయగలిగాయని శ్రీకాంత్ ప్రస్తావించారు. 2018–19లో రూ. 48,110.79 కోట్లున్న విద్యుత్ సంస్థల వ్యయాన్ని 2019–20 నాటికి రూ.43,437.56 కోట్లకు తగ్గించినట్టు తెలిపారు. ► విద్యుత్ కొనుగోలుకు ముందే ప్రణాళిక రూపొందించడం వల్ల యూనిట్ రూ.1.63 నుంచి రూ.2.80 మధ్యే లభించిందని, ఇది విద్యుత్ సంస్థల ఆర్థిక భారాన్ని గణనీయంగా తగ్గించిందని సమావేశం అభిప్రాయపడింది. ► విద్యుత్ సంస్థలను నష్టాల నుంచి గట్టెక్కించే క్రమంలో ప్రభుత్వం అందిస్తున్న తోడ్పాటును బోర్డు ప్రశంసించింది. గత ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ సబ్సిడీలకు ఈ ఏడాది రూ.11,311.70 కోట్లు విడుదల చేయడం, రూ.8,353.58 కోట్లు వ్యవసాయ సబ్సిడీ ఇవ్వడంపై ట్రాన్స్‌కో బోర్డు హర్షం వ్యక్తం చేసింది. ► విద్యుత్ సంస్థల ఆర్థిక నిర్వహణ పర్యవేక్షణలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న ట్రాన్స్‌కో జేఎండీ చక్రధర్‌బాబును బోర్డు ప్రత్యేకంగా అభినందించింది. ► విద్యుత్ సంస్థలకు రాష్ట్రం ఇస్తున్న సబ్సిడీ ఏ ఇతర రాష్ట్రాల్లోనూ ఇవ్వడం లేదని ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్ఎస్ రావత్ గుర్తు చేశారు. -
ఏపీలో కరోనా నియంత్రణకు 374 కోట్లు
-
కోవిడ్–19 నియంత్రణకు రూ.374 కోట్లు
సాక్షి, అమరావతి: కోవిడ్ 19 నియంత్రణకు అవసరమైన నిధులను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలవారీగా వివిధ పద్దులు కింద అందుబాటులో ఉంచింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ ఎస్ రావత్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర విపత్తుల సహాయ నిధి టీఆర్ 27, గ్రీన్ ఛానెల్ పీడీ ఖాతాలు, జిల్లా మినరల్ ఫండ్ కింద మొత్తం రూ.373.76 కోట్లు అందుబాటులో ఉంచినట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఈ నిధులను.. క్వారంటైన్లో ఉన్నవారికి తాత్కాలిక వసతి, ఆహారం, దుస్తులు, ఆరోగ్య సంరక్షణకు,స్క్రీనింగ్, కాంటాక్ట్‌లో ఉన్నవారిని గుర్తించడానికి, కోవిడ్ 19 నియంత్రణ, చికిత్సలకు అవసరమైన పరికరాల కొనుగోలుకు, కోవిడ్ నియంత్రణలో భాగంగా సేవలందిస్తున్న వైద్య, ఆరోగ్య, పురపాలక, అగ్నిమాపక, పోలీసు సిబ్బందికి అవసరమైన పరికరాల కొనుగోలుకు వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న వారి సంక్షేమానికి చర్యలు ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఏపీకి చెందినవారి సంక్షేమానికి చర్యలు తీసుకుంటున్నామని కోవిడ్–19 నియంత్రణ చర్యల రాష్ట్ర స్థాయి సమన్వయాధికారి ఎంటీ కృష్ణబాబు చెప్పారు. లాక్డౌన్ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై త్వరలో ఓ కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నట్టు ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌పై ప్రణాళిక ఏ విధంగా ఉండాలన్నదానిపై వైద్యారోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి నేతృత్వంలో టాస్క్ఫోర్సు కమిటీ పనిచేస్తోందన్నారు. విజయవాడలోని ఆర్ అండ్ బీ కార్యాలయంలో బుధవారం ఆయన ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబులతో కలిసి కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ► సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 53 వేల మంది కూలీలకు రాష్ట్ర వ్యాప్తంగా 326 షెల్టర్లు ఏర్పాటు చేసి ఆహార వసతి కల్పించాం. ► పరిశ్రమల్లో పనిచేస్తున్న మరో 50 వేల మంది కార్మికులకు పరిశ్రమల యాజమాన్యాలు మరో 208 షెల్టర్లు ఏర్పాటు చేశాయి. ► పది రాష్ట్రాల్లో చిక్కుకున్న 8 వేల మంది ఏపీకి చెందిన వారి క్షేమం కోసం చర్యలు. -
ఉద్యోగుల బదిలీలు నేటి నుంచే..
సాక్షి, అమరావతి : ఉద్యోగుల సాధారణ బదిలీలు మంగళవారం నుంచి నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వచ్చే నెల 5వ తేదీ వరకు ఈ బదిలీలకు అనుమతినివ్వగా.. ప్రస్తుతమున్న నిషేధాన్ని తొలగించారు. తిరిగి వచ్చే నెల 6న నుంచి నిషేధం అమల్లోకి రానుంది. ఈ మేరకు ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఎస్ రావత్ సోమవారం జీవో జారీచేశారు. అయితే, ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమైనందున అన్ని రకాల విద్యాశాఖలను బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఎటువంటి ఆరోపణలకు, ఫిర్యాదులకు ఆస్కారం లేకుండా పూర్తి పారదర్శకంగా ఈ బదిలీల ప్రక్రియను పూర్తి చేయాల్సిందిగా జీవోలో ప్రభుత్వం స్పష్టంచేసింది. ఉద్యోగుల రిక్వెస్ట్, పరిపాలనాపరమైన సౌలభ్యం ప్రాతిపదికగా బదిలీలు చేయాలని అందులో పేర్కొన్నారు. అలాగే, ఐదేళ్ల పాటు ఒకేచోట పనిచేస్తున్న ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలన్నారు. ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్న మార్గదర్శకాలు ఇవే.. - ఉద్యోగుల బదిలీల్లో 40 శాతం పైగా అంగవైకల్యం సర్టిఫికెట్ గల వారికి ప్రాధాన్యతనివ్వాలి - ఉద్యోగుల పిల్లలు ఎవరైనా మానసిక వైకల్యంతో ఉంటే అలాంటి ఉద్యోగులను సంబంధిత వైద్య సదుపాయం గల ప్రాంతాలకే బదిలీ చేయాలి - క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి జరిగిన భార్యగాని ఆధారపడిన పిల్లలు, తల్లిదండ్రులు ఉన్నట్లయితే ఆ వైద్య సదుపాయాలున్న చోటకు మాత్రమే సంబంధిత ఉద్యోగులను బదిలీ చేయాలి. - కారుణ్య నియామకాల్లోని వితంతు ఉద్యోగులకు బదిలీల్లో ప్రాధాన్యతనివ్వాలి. - భార్యభర్తల కేసుల్లో భార్య బదిలీకి ప్రాధాన్యత ఇవ్వాలి. అదీ కూడా గతంలో ఈ సదుపాయం పొందినట్లయితే ఎనిమిదేళ్ల తరువాత మాత్రమే అనుమతించాలి. - బదిలీలన్నీ రిక్వెస్ట్ కింద పరిగణనలోకి తీసుకోవాలి. - పదోన్నతులు పొందిన ఉద్యోగులను బదిలీ చేయాలి. అయితే, బదిలీ చేసేచోట సంబంధిత పోస్టు ఉంటేనే చేయాలి. - తొలుత అన్ని ఏజెన్సీ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫై చేయాలి. వాటిని భర్తీచేశాకే నాన్ ఐటీడీఏ ప్రాంతాల్లో బదిలీలు చేయాలి. - ఐటీడీఏ ప్రాంతాల్లో పనిచేస్తున్న లోకల్ కేడర్, జోనల్ కేడర్ ఉద్యోగులను రెండేళ్లకు పైగా పనిచేసిన ఉద్యోగులను సీనియారిటీ ప్రాతిపదికన బదిలీలకు ప్రాధాన్యతనివ్వాలి. - ఐటీడీఏ ప్రాంతాల్లో పోస్టింగ్‌లకు ఉద్యోగులు 50 ఏళ్లలోపు వయస్సు గలవారై ఉండాలి. అలాగే, గతంలో ఐటీడీఏలో పనిచేయని వారై ఉండాలి. - ఐటీడీఏ పరిధిలోని మారుమూల ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఖాళీలున్నాయి. వీటిని బదిలీల ద్వారా భర్తీచేయడానికి సంబంధిత శాఖాధిపతులు, కలెక్టర్లు ప్రాధాన్యత ఇవ్వాలి. - అన్ని బదిలీలు సంబంధిత అథారిటీ ఆదేశాలు, నిబంధనల మేరకు జరగాలి. - బదిలీ ప్రక్రియకు సంబంధిత శాఖాధిపతి బాధ్యత వహించాలి. ఎటువంటి ఆరోపణలు, ఫిర్యాదులు లేకుండా నిబంధనలను ఉల్లంఘించకుండా పూర్తి పారదర్శకంగా నిర్వహించాలి. - రెవెన్యూ, ఇతర ఆర్జిత శాఖలైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, రవాణా, వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలు కూడా ఆయా శాఖల మార్గదర్శకాల మేరకు వచ్చే నెల 5లోగా బదిలీల ప్రక్రియను పూర్తిచేయాలి. - వ్యవసాయ శాఖలో బదిలీలను మాత్రం ఆయా శాఖలకు అనుగుణంగా నిర్వహించుకోవచ్చు. - స్కూలు విద్య, ఉన్నత విద్య, ఇంటర్మీడియట్ విద్య, సాంకేతిక విద్య, సంక్షేమ శాఖల విద్యా సంస్థలన్నింటిలో బదిలీల నుంచి మినహాయింపు ఇచ్చారు. ఇప్పటికే విద్యా సంస్థలు ప్రారంభమైనందున వీటిల్లో బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. వీరిని బదిలీ చేయరాదు.. - వచ్చే ఏడాది మార్చి 31లోగా పదవీ విరమణ చేసే ఉద్యోగులు.. అలాగే, గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల్లో పనిచేస్తున్న వారికీ బదిలీల నుంచి మినహాయింపు ఉంది. - కంటిచూపు లేని ఉద్యోగులు ప్రత్యేకంగా వారు బదిలీకి రిక్వెస్ట్ చేస్తే తప్ప వారిని బదిలీ చేయరాదు. వారు కోరిన చోట స్పష్టమైన ఖాళీ ఉంటేనే బదిలీ చేయాలి. - ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్‌లో ఉన్న ఉద్యోగులతో పాటు ఇతర శాఖాపరమైన ఆరోపణలున్న వారిని కూడా. -
లోపాలు లేని ఓటర్ల జాబితా ఎన్నికలకు పునాది
విజయనగరం గంటస్తంభం : ప్రజాస్వామ్యానికి పునాది ఎన్నికలైతే... లోపాలు లేని ఓటర్ల జాబితా ఎన్నికలకు పునాదిలాంటిదని ఓటర్ల జాబితా పరిశీలకులు, సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్.ఎస్. రావత్ అన్నారు. కలెక్టరేట్ కార్యాలయంలో శుక్రవారం ఓటర్ల నమోదు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితా రూపకల్పన ప్రక్రియపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్లు పేర్లు తప్పుగా నమోదు చేయడంపై ఎక్కువ ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. ఎన్నికలే కాదు ఓటర్ల జాబితా పక్కాగా రూపోందించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో రాజ కీయ నాయకులు అధికారులకు సహకరించాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటరు జాబితా తయారు చేయాలని, ఎటువంటి పొరపాట్లు జరిగినా చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. 4,196 దరఖాస్తుల స్వీకరణ జిల్లాలో 18 ఏళ్లు నిండిన యువత 7,738 మంది ఉన్నారని, ఇప్పటివరకు ఓటు నమోదుకు 4,196 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ వివేక్‌యాదవ్ ఈ సందర్భంగా పరిశీలకులకు తెలియజేశారు. జిల్లాలో తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు పార్లమెంట్ స్థానాలు పరిధిలో విస్తరించి ఉన్నాయన్నారు. జిల్లాలో 2,152 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, 16.43 లక్షల ఓటర్లు ప్రస్తుతం ఉన్నారన్నారు. రాజకీయ పార్టీలతో ఇప్పటికే ఒక సమావేశం నిర్వహించామన్నారు. స్థానిక మీడియా ద్వారా ప్రచారం నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రతినిధులు పలు సూచనలు చేశారు. కళాశాల యజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసి 18ఏళ్లు నిండిన విద్యార్థులను ఓటర్లుగా నమోదు చేసేందుకు దరఖాస్తులు తీసుకోవాలని వైఎస్సాఆర్ సీపీ నాయకులు మామిడి అప్పలనాయుడు కోరారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌పార్టీ ప్రతినిధి బొంగా భానుమూర్తి, టీడీపీ నాయకుడు పొగిరి పైడిరాజు, సీపీఐ నాయకులు రెడ్డి శంకరరావులు పలు సలహాలిచ్చారు. కార్యక్రమంలో జేసీ శ్రీకేష్ లఠ్కర్, డీఆర్వో రాజ్‌కుమార్, ఓటర్ల రిజిస్ట్రేషన్ అధికారులు సుదర్శనదొర, ఆర్.శ్రీలత, ఎస్.డి. అనిత, సాల్మన్‌రాజ్, గణపతిరావు, బాలత్రిపురసుందరి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పెద్దింటి జగన్మోహనరావు, లోక్‌సత్తా ప్రతినిధి కోటేశ్వరరావు, బీఎస్పీ నాయకులు సోములు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
బదిలీ అయినా సీటు వదలని రావత్
♦ కీలక ఫైళ్లపై చకచకా సంతకాలు... ♦ ఫిరాయించిన ఎమ్మెల్యే పైరవీలు సాక్షి, హైదరాబాద్: పరిశ్రమల శాఖ కమిషనర్ ఎస్ఎస్ రావత్ బదిలీ అయినప్పటికీ ఆ సీటును మాత్రం వదల్లేదు. బదిలీ ఉత్తర్వులు వచ్చినప్పటి నుంచి రాత్రి 9 గంటల వరకూ ఆయన చాంబర్‌కు ఫైళ్లు రావడం, వాటిపై సంతకాలు పెట్టే బిజీలో ఆయన ఉండటంపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. కొంతమంది పారిశ్రామిక వేత్తలు వరుసగా వచ్చి పెండింగ్ ఫైళ్లను క్లియర్ చేసుకుంటున్నారని పరిశ్రమల శాఖలో గుసగుసలు విన్పిస్తున్నాయి. పరిశ్రమల రాయితీల గోల్‌మాల్‌పై విజిలెన్స్ విభాగం ఇప్పటికే నివేదిక ఇచ్చింది. విచారణ జరిగే వరకూ ఉన్నతాధికారులను దూరంగా ఉంచాలని కూడా అందులో పేర్కొన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఈ నెల 6న రావత్‌కు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేశారు. ఆ స్థానంలో సాల్మన్ ఆరోఖ్యరాజ్‌ను నియమించారు. కొత్త కమిషనర్ బుధవారం బాధ్యతలు స్వీకరించే వీలుంది. బదిలీ ఉత్తర్వులు వచ్చిన తర్వాత కీలకమైన ఫైళ్లపై ఎలాంటి సంతకాలు చేసినా వివాదాస్పదమయ్యే వీలుంది. అందువల్ల రావత్ పాత తేదీలతోనే సంతకాలు చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు రాయితీల కేసులో సస్పెండ్ అయిన అధికారులకు అనుకూలంగా ప్రభుత్వానికి నివేదిక పంపడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటీవల టీడీపీలో చేరిన రాయలసీమకు చెందిన ఓ ఎమ్మెల్యే, ఏపీఎన్జీవో నేతలు రావత్‌ను కలవడం, ఆ తర్వాత సస్పెండ్ అయిన అధికారులపై అనుకూల నివేదికలు పంపడం, ఈ క్రమంలోనే కీలకమైన ఫైళ్లపై ఆయన సంతకాలు చేయడం పరిశ్రమల శాఖ సిబ్బందిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ విషయమై రావత్‌ను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. -
సీఎంతో టాటా చైర్మన్ మిస్త్రీ భేటీ
రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో టాటా గ్రూపు సంస్థల చైర్మన్ సైరన్మిస్త్రీ, మరికొందరు ప్రతినిధులు రాజమండ్రి ఆర్అండ్బీ అతిథి గృహంలో గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంతోపాటు పరిశ్రమల ఏర్పాటుపై వారు చర్చించినట్లు సమాచారం. విభజన నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే జపాన్, సింగపూర్ వంటి పలు దేశాలను ఆహ్వానించారు. ఆ కోవలోనే స్వదేశీ సంస్థలనూ ఆయన కోరుతున్నారు. దానిలో భాగంగానే టాటా గ్రూపు సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించినట్లు తెలిసింది. ఈ భేటీలో విశాఖలో విద్యాసంస్థకు భూ కేటాయింపులపైనా చర్చించినట్టు తెలిసింది. అంతే కాకుండా పలు ఇతర సంస్థల భాగస్వామ్యంతో టాటా గ్రూపు సంస్థలు విశాఖతో సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో స్థాపించాలనుకుంటున్న పరిశ్రమలపైనా చర్చించినట్లు సమాచారం. సమావేశంలో సీఎంతోపాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉన్నారు.