రాజమండ్రి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో టాటా గ్రూపు సంస్థల చైర్మన్ సైరన్‌మిస్త్రీ, మరికొందరు ప్రతినిధులు రాజమండ్రి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో గురువారం భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే అంశంతోపాటు పరిశ్రమల ఏర్పాటుపై వారు చర్చించినట్లు సమాచారం. విభజన నేపథ్యంలో కొత్త రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ముఖ్యమంత్రి ఇప్పటికే జపాన్, సింగపూర్ వంటి పలు దేశాలను ఆహ్వానించారు. ఆ కోవలోనే స్వదేశీ సంస్థలనూ ఆయన కోరుతున్నారు. దానిలో భాగంగానే టాటా గ్రూపు సంస్థ ప్రతినిధులతో సీఎం చర్చించినట్లు తెలిసింది.
ఈ భేటీలో విశాఖలో విద్యాసంస్థకు భూ కేటాయింపులపైనా చర్చించినట్టు తెలిసింది. అంతే కాకుండా పలు ఇతర సంస్థల భాగస్వామ్యంతో టాటా గ్రూపు సంస్థలు విశాఖతో సహా రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో స్థాపించాలనుకుంటున్న పరిశ్రమలపైనా చర్చించినట్లు సమాచారం. సమావేశంలో సీఎంతోపాటు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, పరిశ్రమల శాఖ కార్యదర్శి ఎస్.ఎస్.రావత్ ఉన్నారు.
సీఎంతో టాటా చైర్మన్ మిస్త్రీ భేటీ
Published Thu, Jul 23 2015 11:03 PM | Last Updated on Sat, Jul 28 2018 6:48 PM
Advertisement
Advertisement