
సాక్షి, అమరావతి : కోవిడ్ కారణంగా 2020 మార్చి నెలలో వాయిదా వేసిన వేతనాలు, గౌరవ వేతనాలు, పెన్షన్లను డిసెంబర్ నెలలో చెల్లించేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలను చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఏప్రిల్ నెలలో తగ్గించిన వేతనాలను డిసెంబర్, 2021 జనవరిలో చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment