Finance secretary
-
ఐదు పెద్ద ఆర్థిక వ్యవస్థల వృద్ధిలో మనమే టాప్!
న్యూఢిల్లీ: భవిష్యత్‌లో ప్రపంచంలోని ఐదు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల (అమెరికా, చైనా, జపాన్, జర్మనీ, భారత్) వృద్ధి స్పీడ్‌లో భారత తొలి దేశంగా ఉంటుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ ఉద్ఘాటించారు. భారత్ పురోగతిలో ప్రవాస భారతీయులను ఒక ఉ్రత్పేరకం వలె పని చేయాలని, భారతదేశాన్ని అతిపెద్ద అవకాశంగా మార్చడంలో ప్రభుత్వ ప్రయత్నాలకు అనుబంధంగా ఉండాలని కోరారు. రేటింగ్ దిగ్గజం– ఎస్అండ్పీ గ్లోబల్ నివేదిక భారతదేశ ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం 3.4 ట్రిలియన్ డాలర్ల 2031 నాటికి రెట్టింపై 6.7 ట్రిలియన్ల డాలర్లకు రెట్టింపు అవుతుందని పేర్కొన్న ఇటీవలి నివేదికను సోమనాథన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ‘భారతదేశం ఇప్పటికే ప్రపంచంలో ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. జనాభా ప్రకారం ఇది అతిపెద్ద దేశం. ఏ ప్రాతిపదికన చూసినా, భారతదేశ వృద్ధి రేటు మొదటి నాలుగు దేశాల కంటే చాలా వేగంగా ఉంది. ఈ నాలుగు దేశాలూ భారతదేశం కంటే తక్కువ వృద్ధి రేటునే కలిగి ఉంటాయని మనం బల్లగుద్దిమరీ చెప్పగలం’’ అని ఆయన ఒక ప్రసంగంలో పేర్కొన్నారు. అవకాశాల పరిమాణం పరంగా చూస్తే, భారతదేశం భవిష్యత్తులో అతిపెద్ద అభివృద్ధి అవకాశంగా నిస్సందేహంగా కొనసాగుతుందని చెప్పవచ్చని ఇండియాస్పోరా జీ20 ఫోరమ్‌లో సోమనాథన్ అన్నారు. 2022–23లో 7.2 శాతంగా ఉన్న భారత్ వృద్ధి రేటు 2023–24 మధ్య 6 నుంచి 6.5 శాతం శ్రేణిలో ఉండే అవకాశం ఉందని వివిధ సంస్థలు అంచనావేస్తున్నాయి. రాబోయే సంవత్సరాల్లో దాతృత్వం కంటే పెట్టుబడి చాలా ముఖ్యమైనది కావచ్చు. పెట్టుబడి కంటే సాంకేతికత బదిలీ కీలకం కావచ్చు. డబ్బు కంటే మీ జ్ఞానం ముఖ్యమైనది కావచ్చు. – ఇండియాస్పోరా జీ20 ఫోరమ్‌లో ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ -
నిర్ధేశిత లక్ష్యాలను వేగంగా సాధించాలి - వివేక్ జోషి
న్యూఢిల్లీ: అందరికీ ఆర్థిక సేవలను చేరువ చేసే విషయమైన ప్రభుత్వ లక్ష్యాలను వీలైనంత త్వరగా సాధించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) కృషి చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి వివేక్ జోషి కోరారు. పీఎస్‌బీల అధినేతలు, నాబార్డ్ చైర్మన్‌తో ఆర్థిక శాఖ సమీక్షా సమావేశం నిర్వహించింది. పీఎం స్ట్రీట్ వెండర్స్ ఆత్మనిర్భర్ నిధి (పీఎం స్వనిధి) పథకం కింద దరఖాస్తులను వేగంగా పరిష్కరించి, అవసరమైన మేర రుణాలను మంజూరు చేయాలని వివేక్ జోషి కోరారు. వీధి వర్తకులను డిజిటల్ చానళ్లపైకి వేగంగా తీసుకురావాలని, డిజిటల్ చెల్లింపులను వేగవంతం చేయాలని సూచించారు. జన్ సురక్షా, ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన, ప్రధానమంత్రి జీవన్‌జ్యోతి బీమా యోజన, ప్రధానమంత్రి సురక్షా బీమాయోజన, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి ముద్రా యోజన, స్టాండప్ ఇండియా పథకాల విషయమై బ్యాంకుల పనితీరును ఈ సమావేశంలో సమీక్షించినట్టు ఆర్థిక శాఖ ప్రకటన విడుదల చేసింది. డిజిటల్ చెల్లింపులను పెంచే లక్ష్యంతో, డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన అంశాలపైనా సమావేశంలో చర్చించినట్టు తెలిపింది. -
అదానీ గ్రూప్ షేర్ల పతనం.. ఇదంతా జస్ట్ టీ కప్పులో తుఫాను..
న్యూఢిల్లీ: స్థూల ఆర్థిక పరిస్థితుల కోణంలో చూస్తే అదానీ గ్రూప్ షేర్ల పతనంతో స్టాక్ మార్కెట్లో నెలకొన్న అల్లకల్లోలం అంతా ’టీ కప్పులో తుఫాను’లాంటిదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ వ్యాఖ్యానించారు. స్టాక్ మార్కెట్లు హెచ్చుతగ్గులకు లోను కావడం సర్వసాధారణమేనని, దీని గురించి ప్రభుత్వం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, తగు చర్యలు తీసుకునేందుకు స్వతంత్ర నియంత్రణ సంస్థలు ఉన్నాయని ఆయన చెప్పారు. అలాగే గ్రూప్ కంపెనీలకు రుణాలిచ్చిన బ్యాంకులు, బీమా సంస్థలపై ప్రభావాల గురించి స్పందిస్తూ .. దేశీ ఆర్థిక సంస్థలు పటిష్టంగానే ఉన్నాయని సోమనాథన్ స్పష్టం చేశారు. పెట్టుబడులకు తగిన పరిస్థితులు కల్పించడం, ఆర్థిక మార్కెట్ల నియంత్రణ పటిష్టంగా .. పారదర్శకంగా ఉండేలా చూడటం వంటి అంశాల గురించే ప్రభుత్వం ఆలోచిస్తుందని ఆయన పేర్కొన్నారు. బ్యాంకింగ్ రంగం పటిష్టం: ఆర్బీఐ అదానీ గ్రూప్‌నకు రుణాలిచ్చిన బ్యాంకుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ గ్రూప్ పేరును ప్రస్తావించకుండా .. దేశీ బ్యాంకింగ్ రంగం పటిష్టంగా, స్థిరంగానే ఉందని రిజర్వ్ బ్యాంక్ స్పష్టం చేసింది. ఆర్థిక స్థిరత్వాన్ని పాటించే క్రమం ్డలో .. ఒక నియంత్రణ సంస్థగా బ్యాంకుల పరిస్థితిని ఆర్బీఐ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉంటుందని ఒక ప్రకటనలో తెలిపింది. భారీ రుణాల విషయంలో బ్యాంకులు కూడా నిర్దేశిత మార్గదర్శకాలకు అనుగుణంగానే వ్యవహరిస్తున్నాయని పేర్కొంది. డో జోన్స్ సూచీల నుంచి ఏఈఎల్ తొలగింపు.. అకౌంటింగ్ మోసాల ఆరోపణలతో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తమ సస్టెయినబిలిటీ సూచీల నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగించనున్నట్లు ఎస్అండ్పీ డోజోన్స్ తెలిపింది. ఫిబ్రవరి 7 నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఖాతాల్లో అవకతవకలు జరుగుతున్నాయంటూ అమెరికన్ షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ ఇచ్చిన రిపోర్టుతో అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు కుప్పకూలడం, రూ. 20,000 కోట్ల భారీ ఎఫ్‌పీవోను అదానీ ఎంటర్ప్రైజెస్ ఉపసంహరించడం తెలిసిందే. నిధుల సమీకరణ కష్టతరం.. గ్రూప్ కంపెనీల షేర్ల భారీ పతనం కారణంగా అదానీ గ్రూప్ తదుపరి నిధుల సమీకరణపై ప్రతికూల ప్రభావం పడొచ్చని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హెచ్చరించింది. ఇటీవలి పరిణామాలతో తాము రేటింగ్ ఇచ్చే గ్రూప్ సంస్థల ఆర్థిక పరిస్థితులను సమీక్షించినట్లు పేర్కొంది. దీర్ఘకాలిక కాంట్రాక్టులు, మార్కెట్లో ఆధిపత్యం తదితర అంశాలపరంగా అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనమిక్ జోన్, అదానీ గ్రీన్ ఎనర్జీ, అదానీ ట్రాన్స్మిషన్లకు తాము రేటింగ్ ఇచ్చినట్లు వివరించింది. మరోవైపు, అదానీ సంస్థల రుణ పరపతిపై తాజా అంశాల తక్షణ ప్రభావమేమీ ఉండబోదని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అటు, అదానీ పోర్ట్స్, అదానీ ఎలక్ట్రిసిటీ సంస్థల రేటింగ్స్‌ను స్థిర స్థాయి నుంచి నెగటివ్ స్థాయికి ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ కుదించింది. రేటింగ్స్ ఇచ్చేటప్పుడు తాము పరిగణనలోకి తీసుకున్న రిస్కులపై ఇన్వెస్టర్లలో మరింత ఎక్కువ ఆందోళన ఉండవచ్చని లేదా ప్రతికూల సెంటిమెంటు కారణంగా గ్రూప్ నిధుల సమీకరణ వ్యయాలు మరింతగా పెరగవచ్చనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. షేర్లపై రుణాలేమీ ఇవ్వలేదు: ఎస్బీఐ అదానీ గ్రూప్ కంపెనీల షేర్లపై రుణాలేమీ ఇవ్వలేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్ దినేశ్ ఖరా తెలిపారు. రుణాలతో పాటు లెటర్స్ ఆఫ్ క్రెడిట్, పెర్ఫార్మెన్స్ బ్యాంక్ గ్యారంటీల రూపంలో ఎస్బీఐ ఇచ్చినది సుమారు రూ. 27,000 కోట్ల ఉంటుందని, ఇది తమ మొత్తం పద్దుల్లో 0.88 శాతం మాత్రమేనని ఆయన చెప్పారు. రీపేమెంటులో అదానీ గ్రూప్‌నకు మంచి రికార్డే ఉందని, వడ్డీల చెల్లింపులో సమస్యలెదుర్కొనే పరిస్థితి ఉంటుందని భావించడం ఆయన చెప్పారు. అదానీ గ్రూప్‌నకు ఇచ్చిన రుణాలను గత రెండేళ్లలో క్రమంగా తగ్గించుకున్నామని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీవోబీ) ఎండీ సంజీవ్ చడ్ఢా చెప్పారు. ప్రస్తుతమున్న వాటికి సంబంధించి కూడా అసెట్ క్వాలిటీపరంగా ఆందోళనేమీ లేదని వివరించారు. మరోవైపు, భారతీయ చట్టాలకు అనుగుణంగానే అదానీ గ్రూప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసినట్లు ఫ్రాన్స్‌కి చెందిన టోటల్ఎనర్జీస్ ఎస్ఈ తెలిపింది. ఇటీవలి పరిణామాల కారణంగా వీటినేమీ పునఃసమీక్షించలేదని పేర్కొంది. టోటల్ఎనర్జీస్కు అదానీ టోటల్ గ్యాస్‌లో 37.4 శాతం, అదానీ గ్రీన్ ఎనర్జీలో 19.75 శాతం వాటాలు ఉన్నాయి. -
చెక్కుచెదరని భారత్ వృద్ధి వేగం
న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్) భారత్ స్థూల దేశీయోత్పత్తి 13.5 శాతంగా నమోదయ్యింది. గడచిన ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో (2021 ఏప్రిల్-జూన్) ఎకానమీ వృద్ధి రేటు 20.1 శాతంకాగా, మార్చితో ముగిసిన చివరి త్రైమాసికంలో (జనవరి-మార్చి)లో ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు కేవలం 4.09 శాతంగా నమోదయ్యింది. వినియోగం, సేవలుసహా పలు రంగాల్లో దేశీయ డిమాండ్ పటిష్టంగా ఉందని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. ఇక ఉత్పత్తి స్థాయి వరకూ విలువను పరిశీలనలోకి తీసుకునే గ్రాస్ వ్యాల్యూ యాడెడ్ (జీవీఏ)ను తీసుకుంటే మొదటి త్రైమాసి కంలో 12.7 శాతంగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 17.6%. 13.5 శాతం వృద్ధి అంటే.. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) ప్రకారం, 2021–22లో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో జీడీపీ (2011-12 స్థిర ధరల ప్రాతిపదికన) విలువ రూ.32.46 లక్షల కోట్లు. తాజా సమీక్షా త్రైమాసికంలో ఈ విలువ రూ.36.85 లక్షల కోట్లు. వెరసి వృద్ధి రేటు 13.5 శాతంగా ఉంది. ఇక జీవీఏను విలువను తీసుకుంటే, ఇది 12.7 శాతం వృద్ధితో రూ.34.41 లక్షల కోట్లుగా ఉంది. కాగా ద్రవ్యోల్బణం పెరుగుదలతో సర్దుబాటు చేయని నామినల్ జీడీపీ (కరంట్ ప్రైసెస్ వద్ద) విలువ మొదటి త్రైమాసికంలో 26.7 శాతం ఎగసి రూ.51.27 లక్షల కోట్ల నుంచి రూ.64.95 లక్షల కోట్లకు ఎగసిందని ఎన్ఎస్ఓ పేర్కొంది. సవాళ్లు ఉన్నాయ్... రానున్న త్రైమాసికాల్లో వృద్ధి తీరుపై ఆందోళనలు నెలకొన్నాయి. వ్యవస్థపై ద్రవ్యోల్బణం సవాళ్లు, వడ్డీరేట్ల భారం, ప్రపంచ ప్రధాన ఆర్థిక వ్యవస్థలకు మాంద్యం భయాలు వంటివి ఇక్కడ ప్రధానమైనవి. మొదటి త్రైమాసికంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకన్నా తక్కువగా వృద్ధి రేటు నమోదవడం గమనార్హం. 2022-23లో జీడీపీ 7.2 శాతంగా అంచనా. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో 16.2 శాతం, 6.2 శాతం, 4.1 శాతం, 4 శాతం వృద్ధి రేట్లు నమోదవుతాయని ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన కమిటీ భావిస్తోంది. సమీక్షా కాలంలో తయారీ రంగం 4.8 శాతంగా నమోదుకావడం ఆందోళన కలిగించే విషయం. ఇక ఎగుమతులకన్నా, దిగుమతుల పరిమాణం ఎక్కువగా ఉండడమూ సమస్యాత్మకమే. దీనికితోడు వర్షపాతం దేశ వ్యాప్తంగా విస్తృత ప్రాతిపదికన తగిన విధంగా లేనందున వ్యవసాయ వృద్ధి, గ్రామీణ డిమాండ్, ద్రవ్యోల్బణంపై ఈ ప్రభావం పడే అవకాశం ఉంది. గడచిన ఆరు నెలలుగా ద్రవ్యోల్బణం ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న ఆరు శాతానికి పైబడి నమోదవుతుండడంతో మే నుంచి ఆర్బీఐ బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు రెపోను 1.40 శాతం పెంచింది. దీనితో ఈ రేటు 5.4 శాతానికి చేరింది. బ్యాంకులు కూడా వడ్డీరేట్ల పెంపు బాటన నడవడం ప్రారంభించాయి. 7-7.5 శాతం శ్రేణిలో ఉండవచ్చు: కేంద్రం భారత్ ఎకానమీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 7 నుంచి 7.5 శాతం శ్రేణిలో నమోదుకావచ్చని కేంద్రం భావిస్తోంది. 2021-22లో భారత్ 8.7 శాతం వృద్ధి నమోదుచేసుకుంది. ‘‘మొదటి త్రైమాసిక గణాంకాలు మేము ఆశించిన తీరులోనే ఉన్నాయి. వివిధ రంగాల పనితీరు పూర్తిస్థాయి ఆశాజనకంగా ఉంది. వృద్ధి రేటు 7-7.5 శాతం శ్రేణిలో ఉంటుందని భావిస్తున్నాం. అంతర్జాతీయ ఆర్థిక సంస్థలుసైతం ఇదే అంచనాలను వెలిబుచ్చుతున్నాయి’’ అని ఫైనాన్స్ కార్యదర్శి టీవీ సోమనాథన్ పేర్కొన్నారు. -
భారత్‌లో క్రిప్టోకరెన్సీ.. ఇక గ్యాంబ్లింగ్ తరహాలోనే!
క్రిప్టో ఆస్తుల చట్టబద్ధతపై బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం.. లావాదేవీలపై 30 శాతం ట్యాక్స్ ప్రకటనతో క్రిప్టో హోల్డర్స్‌కు పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి మరింత స్పష్టత ఇచ్చారు ఇవాళ. జూదంలో ఎలాగైతే గెలిచిన వాళ్ల దగ్గరి నుంచి పన్నులు వసూలు చేస్తారో.. అదే తరహాలో క్రిప్టో ట్రాన్జాక్షన్స్పై పన్నుల వసూలు ఉండబోతుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. తద్వారా ప్రత్యేక చట్టంపై ఇప్పటికిప్పుడు తొందర పాటు నిర్ణయం తీసుకోకుండా.. క్రిప్టో ట్రాన్జాక్షన్స్ ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం పన్నులు విధించే నిర్ణయం అమలు చేయనుంది. ‘‘క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం చట్ట వ్యతిరేకం ఏం కాదు. ప్రస్తుతానికి ఇదొక సందిగ్ధావస్థ. గుర్రపు పందేలు గెలవడం, బెట్టింగులు, ఊహాజనిత ట్రాన్జాక్షన్స్.. నుంచి ఎలాగైతే ట్యాక్సుల పరిగణనలోకి తీసుకుంటామో.. అదే విధంగా క్రిప్టో ఆస్తుల కోసం ఒక ప్రత్యేకమైన ట్యాక్సేషన్ ఫ్రేమ్‌వర్క్‌ని వర్తింపజేస్తాం’’ అని సోమనాథన్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ధరల అస్థిరత నెలకొంటుందని ఆర్బీఐ మొదటి నుంచి హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్యాక్స్ మోత మోగించడం వల్ల పై కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు ఇప్పటికే క్రిప్టోకరెన్సీ నియంత్రణకు ప్రత్యేక చట్టం.. త్వరలో కేబినెట్ నుంచి క్లియరెన్స్ ద్వారా పార్లమెంట్లో చర్చకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వం సంప్రదింపులు, అంతర్జాతీయ పరిణామాల తర్వాతే ముందకు వెళ్లాలని యోచిస్తోంది. -
రుణానికి బ్యాంకు గ్యారంటీగా బీమా బాండ్లు!
ముంబై: బ్యాంకు గ్యారంటీలకు ప్రత్యామ్నాయంగా ఇన్సూరెన్స్ బాండ్లను తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. ముంబైలో పారిశ్రామికవేత్తలతో ఆర్థిక మంత్రి భేటీ సందర్భంగా సోమనాథన్ ఈ ప్రకటన చేశారు. బ్యాంకుల వద్ద రుణ సాయాన్ని పొం దేందుకు పలు సందర్భాల్లో బ్యాంకు గ్యారంటీలు నమర్పించాల్సి వస్తుంది. ఈ గ్యారంటీ కింద బీమా బాండ్లను అనుమతిస్తే.. రుణాలు పొందడం మరింత సులభం కానుంది. చదవండి : 'నిధి' కంపెనీల పట్ల జాగ్రత్త, హెచ్చరించిన ప్రభుత్వం -
సంక్షేమ పథకాల మొత్తం లబ్ధిదారులకు ఇవ్వాల్సిందే..
సాక్షి, అమరావతి/గూడూరు: రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాల కింద నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్న నగదు మొత్తాన్ని వారి పాత బకాయిల చెల్లింపులకు బ్యాంకులు సర్దుబాటు చేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఈ విషయాన్ని రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) కన్వీనర్‌కు రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి గురువారం ఓ లేఖలో తెలిపారు. ఈ మేరకు గతంలోనే ఎస్ఎల్బీసీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. జగనన్న విద్యాదీవెన పథకం కింద శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా చిట్టమూరులో 74 మంది లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని కెనరా బ్యాంకు శాఖ పాత బకాయిల కింద సర్దుబాటు చేసిన విషయాన్ని ‘సాక్షి’ గురువారం వెలుగులోకి తెచ్చిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగనన్న విద్యాదీవెన కింద జమ చేసిన మొత్తాన్ని లబ్ధిదారులకు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇలాంటి చర్యలు ఎక్కడా పునరావృతం కాకుండా బ్యాంకులకు తగిన మార్గదర్శకాలను మరోసారి జారీ చేయాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఫిర్యాదులపై ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నంబర్ 1920కి వచ్చే వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాల నిధులు దారిమళ్లితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. నెల్లూరు ఘటనపై కూలంకషంగా విచారణ జరిపించాలని సీఎంవో అధికారులను ఆదేశించారు. దీంతో అధికారులు వెంటనే నెల్లూరు జిల్లాలోని సంబంధిత బ్యాంకు శాఖ అధికారులతో మాట్లాడి ఆ 74 మంది లబ్ధిదారులకు పూర్తి మొత్తాన్ని విడుదల చేయించారు. సాక్షికి ధన్యవాదాలు మా కుమారుడు కావలిలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. జగనన్న విద్యాదీవెన కింద నగదు నా ఖాతాలో జమ అయ్యింది. కానీ మాకు బ్యాంకులో మరో అప్పు ఉండడంతో.. మా అకౌంట్ హోల్డ్‌లో ఉందని నగదు డ్రా చేసుకునేందుకు వీలు లేదని మేనేజర్ చెప్పారు. ‘సాక్షి’ కథనంతో ప్రభుత్వం స్పందించి అధికారులను ఆదేశించడంతో విద్యాదీవెన నగదును గురువారం డ్రా చేసుకోమని చెప్పారు. సాక్షికి మా ధన్యవాదాలు. – సన్నారెడ్డి భారతి, తంబుగారిపాళెం, ఆరూరు పంచాయతీ చదవండి: అసత్య కథనాలతో ఆందోళన సృష్టించొద్దు సీఎం వైఎస్ జగన్‌కు గడ్కరీ కృతజ్ఞతలు -
ఆర్థిక వృద్ధికి చర్యలు కొనసాగుతాయి
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థ విషయంలో జాగ్రత్తతో కూడిన ఆశావాదంతోనే ప్రభుత్వం ఉందని, ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లేందుకు మద్దతు చర్యలు కొనసాగుతాయని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి తరుణ్‌బజాజ్ తెలిపారు. ఫిక్కీ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. రెండో త్రైమాసికం జీడీపీ గణాంకాలు (జూలై–సెప్టెంబర్) మార్కెట్ అంచనాల కంటే మెరుగ్గా ఉన్నాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వీతీయ భాగంలో (2020 అక్టోబర్ నుంచి 2021 మార్చి వరకు) మరింత పురోగతి ఉంటుందని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కరోనా మహమ్మారి కారణంగా.. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ మైనస్ 23.9 శాతం స్థాయిలో ఉంటుందని మార్కెట్లు అంచనా వేయగా.. కేవలం మైనస్ 7.5 శాతంగానే నమోదు కావడం గమనార్హం. ‘‘మేము సానుకూల ధోరణితో ఉన్నాము. అదే సమయంలో ఆర్థిక ప్రగతి విషయంలో అప్రమత్తతతో కూడినా ఆశావాదంతోనే ఉన్నాము. మూడు, నాలుగో త్రైమాసికాల్లో మరింత మెరుగుదల ఉంటుందని అంచనా వేస్తున్నాము. మేమే కాదు అంతర్జాతీయ సంస్థలు, రేటింగ్ ఏజెన్సీలు సైతం దేశ ఆర్థిక వృద్ధి విషయంలో వాటి అంచనాలను మెరుగుపరిచాయి’’ అని తరుణ్ బజాజ్ వివరించారు. పండుగలు ముగిసిన తర్వాత కూడా డిమాండ్ కొనసాగుతుండడం రెండు, మూడో త్రైమాసికాల్లో వృద్ధికి మద్దతునిస్తుందన్నారు. ఇక్కడి నుంచి ఆర్థిక వ్యవస్థ ప్రగతి కోసం అవసరమైన అన్ని చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని భరోసా ఇచ్చారు. ప్రభుత్వరంగ సంస్థల నూతన విధానం త్వరలోనే నూతన ప్రభుత్వరంగ సంస్థల విధానంతో ప్రభుత్వం ముందుకు వస్తుందని తరుణ్ బజాజ్ తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజీ కింద వ్యూహాత్మక రంగాల్లో గరిష్టంగా నాలుగు ప్రభుత్వరంగ సంస్థలే ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే. అంతకుమించి ఉంటే వాటిని ప్రైవేటీకరించాలన్నది ప్రభుత్వ ఉద్దేశ్యం. ఈ విధానం ఎంతో ప్రతిష్టాత్మకమైనదన్న తరుణ్ బజాజ్.. త్వరలోనే అమల్లోకి రానుందన్నారు. ప్రభుత్వం పట్ల ఆలోచనలో ఇది ఎంతో మార్పును తెస్తుందన్నారు. -
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్
సాక్షి, అమరావతి : కోవిడ్ కారణంగా 2020 మార్చి నెలలో వాయిదా వేసిన వేతనాలు, గౌరవ వేతనాలు, పెన్షన్లను డిసెంబర్ నెలలో చెల్లించేందుకు ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్చి, ఏప్రిల్ నెలల బకాయిలను చెల్లించేందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి ఎస్.ఎస్ రావత్ ఆదేశాలు జారీ చేశారు. దీంతో పాటు ఏప్రిల్ నెలలో తగ్గించిన వేతనాలను డిసెంబర్, 2021 జనవరిలో చెల్లించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
లక్ష కోట్లు దాటిన జీఎస్టీ వసూళ్లు
న్యూఢిల్లీ: అక్టోబర్ నెలలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు రూ.1.05 లక్షల కోట్లకు చేరాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి చూస్తే జీఎస్టీ కలెక్షన్స్ లక్ష కోట్ల మార్క్‌ను దాటడం ఇదే ప్రథమం. గత నెలలో మొత్తం స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,05,155 కోట్లు కాగా.. ఇందులో సీజీఎస్టీ రూ.19,193 కోట్లు, ఎస్జీఎస్టీ రూ.5,411 కోట్లు, ఐజీఎస్టీ రూ.52,540 కోట్లు (ఇందులో రూ.23,375 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి), సెస్ ఆదాయం రూ.8,011 కోట్లు (ఇందులో రూ.932 కోట్లు వస్తువుల దిగుమతి సుంకంతో కలిపి) ఉన్నాయని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. 2019 అక్టోబర్‌తో పోలిస్తే.. ఈ ఏడాది అక్టోబర్‌లో 10 శాతం ఆదాయం వృద్ధిని నమోదు చేసింది. గతేడాది అక్టోబర్‌లో జీఎస్టీ ఆదాయం రూ.95,379 కోట్లుగా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జీఎస్టీ ఆదాయం రూ.1.05 లక్షల కోట్లు, మార్చిలో రూ.97,597 కోట్లు, ఏప్రిల్‌లో రూ.32,172 కోట్లు, మేలో రూ.62,151 కోట్లు, జూన్‌లోరూ.90,917 కోట్లు, జూలైలో రూ.87,422 కోట్లు, ఆగస్టులో రూ.86,449 కోట్లు, సెప్టెంబర్‌లో రూ.95,480 కోట్లుగా ఉన్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో గ్రాస్ జీఎస్టీ ఆదాయం రూ.5.59 లక్షల కోట్లుగా ఉండగా.. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే 20 క్షీణత నమోదైందని ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అక్టోబర్ 31 నాటికి 80 లక్షల జీఎస్టీఆర్–3బీ రిటర్న్‌లు ఫైల్ అయ్యాయని ఫైనాన్స్ సెక్రటరీ అజయ్ భూషన్ పాండే తెలిపారు. రూ.50 వేల కంటే విలువైన వస్తువుల రవాణాలో తప్పనిసరి అయిన ఈ–వే బిల్లుల చెల్లింపుల్లోనూ అక్టోబర్ నెలలో 21 శాతం వృద్ధి నమోదైంది. ప్రస్తుతం రోజుకు 29 లక్షల ఈ–ఇన్వాయిస్ జనరేట్ అవుతున్నాయి. -
నా బదిలీకి నిర్మలా పట్టుబట్టారు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి పని చేయడం కష్టమని ఆ శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ శనివారం బ్లాగ్‌లో పేర్కొన్నారు. తనను ఆర్థిక శాఖ నుంచి బదిలీ చేయాలంటూ ఆమె పట్టుబట్టారని తెలిపారు. స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్ఎస్) చేసిన ఏడాది తర్వాత అందుకు గల కారణాలను ఆయన బహిర్గతం చేశారు. తన బ్లాగ్ పోస్టులో పలు అంశాలను ప్రస్తావించారు. నిర్మలా సీతారామన్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని తాను భావించానని, అందుకే వీఆర్ఎస్ తీసుకున్నానని వివరించారు. ఆమెతో తనకు కలిసి రాలేదన్నారు. ఆమె తన బదిలీ కోరేకంటే ముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కాకుండా మరో శాఖలో పనిచేయాలని తాను భావించలేదని పేర్కొన్నారు. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పోలిస్తే నిర్మలది భిన్నమైన వ్యక్తిత్వమని, అరుణ్ జైట్లీతో పనిచేయడం తనకు వృత్తిపరంగా సంతృప్తినిచ్చిందన్నారు. -
ఆదాయపు పన్నులు నాలుగు శ్లాబ్‌లలో ఉండాలి
న్యూఢిల్లీ: వ్యక్తిగత ఆదాయపు పన్నుల విధానాన్ని మరింత సరళతరం చేయాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి ఎస్సీ గర్గ్ అభిప్రాయపడ్డారు. సెస్సులు, సర్‌చార్జీలు లేకుండా దీన్ని నాలుగు రేట్లకు పరిమితం చేయొచ్చని ఆయన పేర్కొన్నారు. కార్పొరేట్ ట్యాక్స్ విధానాన్ని ఇప్పటికే సముచిత స్థాయిలో హేతుబద్ధీకరించినందున.. ఇక ఆ విషయంలో తదుపరి చర్యలేమీ ఆశించడానికి లేదని గర్గ్ చెప్పారు. అయితే, వ్యక్తిగత ఆదాయపు పన్నుల విషయంలో కొన్ని కీలకమైన సంస్కరణలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రస్తుతం ఆదాయపు పన్నుకు సంబంధించి ఎనిమిది శ్లాబ్‌లు ఉన్నాయి. గరిష్టంగా 40% రేటు ఉంటోంది. రూ. 5 లక్షలకు లోపు ఆదాయం ఉన్న వారికి ఎలాంటి పన్ను విధించరాదని గర్గ్ ప్రతిపాదించారు. రూ. 5–10 లక్షల మధ్య ఆదాయ వర్గాలపై 5 శాతం, రూ. 10–25 లక్షల ఆదాయాలపై 15 శాతం, రూ. 25–50 లక్షలపై 25 శాతం, రూ. 50 లక్షల పైబడిన ఆదాయంపై 35% రేటు విధిస్తే సముచితంగా ఉండగలదని ఆయన పేర్కొన్నారు. -
తెలంగాణ వచ్చాక లక్ష కోట్లు అప్పు..
-
రాష్ట్ర అప్పులు 1,82,000 కోట్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ. 1.82 లక్షల కోట్లు అని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. అం దులో తెలంగాణ రాకముందు రూ. 82 వేల కోట్ల అప్పులుండగా, రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రూ. లక్ష కోట్లు అప్పు చేసినట్లు వివరిం చారు. అప్పులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిబం ధనలు, చట్ట పరిధిలోనే చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంగళ వారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు వేతనాలు, ఆసరా పెన్షన్లు, ప్రాజెక్టుల బిల్లులు, సంక్షేమ పథకా లకు నిధులను సకాలంలోనే చెల్లిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గతేడాది అధిక ఆర్థికవృద్ధి నమోదైం దన్నారు. ఆర్థిక వృద్ధిరేటు నమోదులో తెలం గాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని, స్టేట్ ఓన్ ట్యాక్స్‌లోనూ తెలంగాణ నంబర్ వన్‌గా నిలిచిందన్నారు. కేంద్ర గణాంకాల లెక్కల ప్రకారం 2018–19 రాష్ట్ర జీఎస్డీపీ రూ.8,65,875 కోట్లు అని ఆయన వెల్లడించారు. గతేడాది రాష్ట్ర ఆర్థిక వృద్ధి రేటు 15 శాతమన్నారు. ఐదేళ్లలో తెలంగాణ కాపిటల్ ఎక్స్పెండిచర్ 1,64,519 కోట్లు అని ఆయన పేర్కొన్నారు. ప్రతి 15 రోజులకోసారి బిల్లులు చెల్లిస్తుంటామని, నెలకు సుమారు రూ. 2 వేల కోట్ల వరకు బిల్లులు క్లియర్ చేస్తుంటామని తెలిపారు. మిషన్ భగీరథ ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.46,960 కోట్లు అని, ఇప్పటివరకు ప్రాజెక్టుపై రూ. 27,509 కోట్లు ఖర్చు చేశామన్నారు. మిషన్ భగీరథలో పెండింగ్ బిల్లులు రూ. 659 కోట్లు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రభుత్వ పథకాలకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. పింఛన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని, రైతుబంధుకోసం రబీ సీజన్లో రూ. 5,200 కోట్లు విడుదల చేశామని చెప్పారు. పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ ఆర్థిక వృద్ధిరేటు పెరుగుతుందని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఎలాంటి అనుమానాలు అక్కర్లేదని తెలిపారు. ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయన్నారు. రైతుబంధు పథకం నిధులు రైతులకు ఆన్లైన్లో చెల్లిస్తామని, రైతుకు ఇబ్బంది లేకుండా రుణమాఫీని అమలు చేస్తామన్నారు. ‘మే నెలాఖరు నుంచి జూన్ మొదటి వారం వరకు రైతుబంధు సాయం పంపిణీ చేస్తాం. పింఛన్లకు అవసరమైన నిధులు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి’అని స్పష్టం చేశారు. రాష్ట్రం వృద్ధిరేటు 14 శాతం కంటే తక్కువ ఉంటే... కేంద్రం జీఎస్టీ మినహాయింపు ఇస్తుందన్నారు. రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న బిల్లులు కేవలం రూ. 3,474 కోట్లు మాత్రమే అని వివరించారు. ట్యాక్స్ పెరిగింది... తెలంగాణ ఏర్పాటయ్యాక అత్యంత వృద్ధిని సాధించామని రామకృష్ణారావు వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో పదేళ్లలో జరిగిన అభివృద్ధికంటే ఈ ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి ఎక్కువుందన్నారు. ప్రాథమిక రంగంలో 10.9 శాతం, సెకండరీ సెక్టార్లో 14.9 శాతం వృద్ధి సాధించామని, రాష్ట్రానికి వచ్చే ఆదాయం ట్యాక్స్ రెవెన్యూ 2018–19లో 14.5 శాతం పెరిగిందన్నారు. అంటే రూ. 64,714 కోట్లు వచ్చిందన్నారు. క్యాపిటల్ ఎక్స్పెండేచర్ బడ్జెట్ 22,904 కోట్లు, బడ్జెటేతర ఖర్చు 24,130 కోట్లు అని తెలిపారు. నెలన్నరలోగా మొత్తం బిల్లుల చెల్లింపు జరుగుతుందన్నారు. రైతుబంధు, రుణ మాఫీ, ఆసరా పింఛన్లకు ఓట్ ఆన్ అకౌంట్లో 6 నెలలకు బడ్జెట్ పెట్టామన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల ఇబ్బంది లేకుండా అమలు చేస్తున్నామని తెలిపారు. బిల్లుల చెల్లింపులో జాప్యం నిజమే ఎఫ్ఆర్బీఎం 2004 ప్రకారం జీడీపీలో 3 శాతం రుణాలు తీసుకోవచ్చు. ఆ ప్రకారం ఈ ఏడాది రూ. 29,750 కోట్లు తీసుకోవడానికి అనుమతి ఉందన్నారు. నిధులు సమృద్ధిగా ఉన్నప్పటికీ ఎన్నికల కోడ్ కారణంగా చెల్లింపుల్లో జాప్యం జరిగినమాట నిజమేనన్నారు. ఏప్రిల్ నెలలో సహజంగా ఖర్చు తక్కువగా ఉంటుందన్నారు. ప్రతి నెల రూ.12 వేల కోట్లు నిధులు వస్తాయని, దీన్ని దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేస్తున్నామన్నారు. రైతుబంధు చెల్లింపులో బకాయిలు లేవని, రబీలో 52 లక్షల మంది రైతులకు రైతుబంధు సాయం అందజేశామన్నారు. చిన్న కాంట్రాక్టర్లకు ఇబ్బందులు లేకుండా ప్రాధాన్యతా క్రమంలో చెల్లింపులు చేస్తున్నామని చెప్పారు. ఫీజు రీయింబర్స్మెంట్ కోసం 14 లక్షల మంది విద్యార్థులకు రూ. 3 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామన్నారు. 2014 నుంచి 2019 వరకు రాష్ట్రంలో వృద్ధి రేటు భారీగా పెరిగిందని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. జీడీపీలో 9 శాతం పన్నుల రూపంలో వసూలు చేస్తున్నామన్నారు. 2018–19లో ట్యాక్స్ రెవెన్యూ 14.5 శాతమని, గత ఐదేళ్ల సరాసరి 16.5 శాతంగా ఉందని చెప్పారు. గ్రామీణ రోడ్లు, గ్రామీణ ప్రాంతాలతో అనుసంధానం, వ్యవసాయానికి చేస్తున్న ఖర్చులు అభివృద్ధి కిందకే వస్తాయని వివరించారు. కేంద్రం క్యాపిటల్ ఎక్స్పెండేచర్ 10 శాతముంటే, రాష్ట్రంలో 25 శాతం ఉందన్నారు. రాష్ట్ర రెవెన్యూ, పన్నుల రాబడిని చూసి ఆర్బీఐ ప్రశంసించిందన్నారు. కేరళ, పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రాలు జీడీపీలో 35 నుంచి 45 శాతం వరకు అప్పులు తీసుకుంటే, తెలంగాణ కేవలం 22 శాతమే తీసుకుందన్నారు. గత డిసెంబర్ వరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం రూ. 80 వేల కోట్లు ఖర్చు చేశామని, కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయితే జీడీపీ పెరుగుతుందని ఆయన తెలిపారు. -
కొత్త ఆర్థిక కార్యదర్శి ఎంపిక
సాక్షి, న్యూఢిల్లీ: రెవెన్యూ కార్యదర్శిగా పనిచేస్తున్న హస్ముఖ్ అధియాకు కేంద్రం పదోన్నతి కల్పించింది. కేంద్ర ఆర్థిక శాఖ కొత్త కార్యదర్శి గా ఆయనను ఎంపిక చేసింది. ప్రస్తుత కార్యదర్శి శక్తి కాంత్ దాస్ స్థానంలో ఆయన్ను నియమించింది. ఈ మేరకు క్యాబినెట్‌కు చెందిన అపాయింట్మెంట్స్ కమిటీ ఆమోదం లభించింది. ప్రస్తుతం ఈ పదవిలో కొనసాగుతున్న శక్తి కాంత్ దాస్ పదవీ కాలం ముగియడంతో ఈ ఎంపిక అనివార్యమైంది. -
వృద్ధికి ‘తయారీ’ జోష్..
జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో 7.4 శాతం జీడీపీ వృద్ధి రేటు ప్రపంచంలో వేగంగా వృద్ధి చెందుతున్న దేశం హోదాలో భారత్ తయారీ రంగం వృద్ధి రేటు 9.3 శాతం మైనింగ్, సేవా రంగాలూ ఊతం న్యూఢిల్లీ: ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ కొనసాగుతున్నట్లు సోమవారం వెల్లడైన తాజా స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) గణాంకాలు వెల్లడించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో (2015-16, జూలై-సెప్టెంబర్) భారత్ 7.4 శాతం ఆర్థికాభివృద్ధిని నమోదుచేసుకుంది. తయారీ, మైనింగ్, సేవా రంగాల చక్కని పనితీరు... మొత్తం ఫలితం పటిష్టతకు కారణమైంది. జూన్ 30తో ముగిసిన త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు 7 శాతం. కాగా గడచిన కొన్ని నెలల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో (బ్యాంకులు తాము ఆర్బీఐ నుంచి తీసుకునే స్వల్పకాలిక రుణాలపై చెల్లించే వడ్డీ రేటు) రేటు కోత కూడా తాజా ఫలితానికి కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. డిసెంబర్ 1వ తేదీన ఆర్బీఐ ఐదవ ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్ష నేపథ్యంలో తాజా గణాంకాలు వెలువడ్డాయి. కేంద్ర గణాంకాల కార్యాలయం (సీఎస్ఓ) తాజాగా విడుదల చేసిన గణాంకాలకు సంబంధించి ముఖ్యాంశాలు.. 2014-15 క్యూ 2తో పోల్చితే ప్రస్తుత రేటు తక్కువే. గత సంవత్సరం ఇదే కాలంలో వృద్ధి రేటు 8.4 శాతంగా నమోదయ్యింది. కాగా ఈ ఏడాది ఇదే కాలంలో చైనా వృద్ధి రేటు 6.9 శాతం. దీనితో ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా భారత్ కొనసాగుతున్నట్లయ్యింది. ఇదే కాలంలో వర్థమాన దేశాల్లో కీలకమైన రష్యాలో అసలు వృద్ధి లేకపోగా -4.1 క్షీణత నమోదయ్యింది. బ్రెజిల్ సైతం -4.2 శాతం క్షీణతలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో వృద్ధి రేటు 7.2 శాతంగా ఉంటే... గత ఏడాది ఇదే కాలంలో ఈ వృద్ధిరేటు 7.5 శాతం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 8.1 శాతం నుంచి 8.5 శాతం వరకూ వృద్ధి నమోదవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తున్నప్పటికీ, ఇప్పటికి గడిచిన రెండు త్రైమాసికాల్లో ఈ రేటు లక్ష్యానికి భారీ దూరంలో ఉన్న సంగతి గమనార్హం. తాజా గణాంకాల ప్రకారం 7 శాతానికి పైగా వృద్ధిని నమోదుచేసుకున్న రంగాల్లో తయారీ, వాణిజ్యం, హోటల్స్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్ ఉన్నాయి. బ్రాడ్‌కాస్టింగ్, ఫైనాన్స్, బీమా, రియల్టీ, వృత్తిపరమైన సేవా రంగాలూ 7 శాతం పైగా వృద్ధిని సాధించాయి. తయారీ రంగం సెప్టెంబర్ క్వార్టర్లో భారీగా 9.3 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ రంగం వృద్ధి రేటు 7.9 శాతమే. మైనింగ్, క్వారీయింగ్ రంగాల వృద్ధి రేటు 1.4 శాతం నుంచి 3.2 శాతానికి ఎగసింది. ట్రేడ్, హోటల్, ట్రాన్స్పోర్ట్, కమ్యూనికేషన్లతో సహా మొత్తం సేవా రంగాల వృద్ధి రేటు 8.9 శాతం నుంచి 10.6 శాతానికి ఎగసింది. కాగా ఫైనాన్షియల్, రియల్టీ, ప్రొఫెషనల్ సర్వీసుల్లో వృద్ధి మాత్రం 13.5 శాతం నుంచి 9.7 శాతానికి తగ్గింది. విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా ఇతర యుటిలిటీ సేవల్లో వృద్ధి రేటు కూడా 8.7 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది. వ్యవసాయం, అనుసంధాన రంగాల్లో వృద్ధి రేటు స్వల్పంగా 2.1 శాతం నుంచి 2.2 శాతానికి పెరిగింది. నిర్మాణ రంగంలో వృద్ధిరేటు 8.7 శాతం నుంచి 2.6 శాతానికి పడింది. 2011-12 స్ధిర ధరల ప్రకారం... జీడీపీ విలువ రెండవ త్రైమాసికంలో రూ.27.57 లక్షల కోట్లుగా నమైదైంది. గత ఏడాది ఇదే కాలంలో ఈ విలువ 25.66 లక్షల కోట్లు. అంటే జీడీపీ వృద్ధి రేటు 7.4 శాతమన్నమాట. మరింత మెరుగవుతుంది.. గత ఆర్థిక సంవత్సరం సాధించిన 7.3% వృద్ధిరేటుకన్నా... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మంచి వృద్ధి నమోదవుతుంది. అంతర్జాతీయంగా ప్రతికూల పరిస్థితులు ఉన్నా... తయారీ రంగం మంచి ఫలితాన్ని ఇవ్వడం గమనార్హం. మొత్తంగా ఈ గణాంకాలు సంతృప్తిని ఇస్తున్నాయి. మున్ముందు మరింత వృద్ధి ఖాయం. - అరుణ్ జైట్లీ, ఆర్థిక మంత్రి సానుకూల ధోరణి... దేశ ఆర్థిక రంగానికి సంబంధించి సానుకూల ధోరణి పటిష్టతకు తాజా గణాంకాలు దోహదపడుతున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వృద్ధి 7.5%గా నమోదవుతుందన్నది అభిప్రాయం. ఆర్థిక వ్యవస్థ ఊపందుకున్నదని సంకేతాలు అందుతున్నాయి. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం వృద్ధికి మరింత ఊపునిస్తుంది. - శక్తికాంత దాస్, ఆర్థిక శాఖ కార్యదర్శి వేగవంతమైన రికవరీ... ఆర్థిక వ్యవస్థలో రికవరీ వేగవంతమైందనడానికి తాజా గణాంకాలు నిదర్శనం. ఈ తరహా ధోరణి మేము ఊహించిందే. అయితే నిర్మాణ రంగంలో వృద్ధి రేటు భారీగా పడిపోవడం ఆందోళనకరం. తయారీ, రియల్టీ, మౌలిక రంగాల్లో నిలిచిపోయిన ప్రాజెక్టుల పునరుద్ధరణపై తక్షణం విధానపరమైన దృష్టి పెట్టాలి. - చంద్రజిత్ బెనర్జీ, సీఐఐ డెరైక్టర్ జనరల్ -
బోనాలకు 10 కోట్లు
-
మెట్రోరైల్ పై అభ్యంతరాలుంటే....
-
10 శాతం మించిన ...
న్యూఢిల్లీ: భారత్‌లో విదేశీ పెట్టుబడులకు సంబంధించిన నిబంధనల్లో స్పష్టతనిచ్చేలా ప్రభుత్వ కమిటీ కీలక సూచనలను చేసింది. ఏదైనా లిస్టెడ్ కంపెనీలో 10 శాతానికి మించి ఉన్న విదేశీ పెట్టుబడులను విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి(ఎఫ్‌డీఐ)గా పరిగణించాలని... అదేవిధంగా ప్రవాసీయుల పెట్టుబడులను(రాబడులను విదేశాలకు తరలించని ప్రాతిపదికన) దేశీ ఇన్వెస్ట్మెంట్గా వ్యవహరించాలని సిఫార్సు చేసింది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ), ఎఫ్‌డీఐల విషయంలో గందరగోళం లేకుండా వాటి నిర్వచనాలను హేతుబద్దీకరించేందుకు ఆర్థిక శాఖ కార్యదర్శి అరవింద్ మాయారామ్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ ఈ సిఫార్సులు చేసింది. కాగా, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులన్నింటినీ ఎఫ్డీఐగానే పరిగణించాలని ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో పేర్కొంది. 10 శాతం లోపు చేసే పెట్టుబడులను కూడా ఎఫ్‌డీఐగా అనుమతించొచ్చని, అయితే తొలి పెట్టుబడి నుంచి ఏడాది వ్యవధిలోగా తమ వాటాను 10 శాతం లేదా అంతకుపైగా పెంచుకోవాలన్న షరతు విధించాలని అభిప్రాయపడింది. కాగా, ఈ ఎఫ్డీఐలన్నీ ఆయా రంగాల్లోని పరిమితులకు అనుగుణంగానే ఉండాలని స్పష్టం చేసింది.