తెలంగాణ వచ్చాక లక్ష కోట్లు అప్పు.. | Telangana Has Crossed One Lakh Crore Debt | Sakshi
Sakshi News home page

తెలంగాణ వచ్చాక లక్ష కోట్లు అప్పు..

Published Wed, May 22 2019 7:15 AM | Last Updated on Thu, Mar 21 2024 11:09 AM

తెలంగాణ రాష్ట్ర అప్పులు రూ. 1.82 లక్షల కోట్లు అని ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు వెల్లడించారు. అం దులో తెలంగాణ రాకముందు రూ. 82 వేల కోట్ల అప్పులుండగా, రాష్ట్రం ఏర్పడ్డాక ఇప్పటి వరకు రూ. లక్ష కోట్లు అప్పు చేసినట్లు వివరిం చారు. అప్పులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వ నిబం ధనలు, చట్ట పరిధిలోనే చేసినట్లు ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంగళ వారం ఆయన సచివాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఉద్యోగులకు వేతనాలు, ఆసరా పెన్షన్లు, ప్రాజెక్టుల బిల్లులు, సంక్షేమ పథకా లకు నిధులను సకాలంలోనే చెల్లిస్తున్నామని పేర్కొన్నారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement