![Former Finance Secretary Subhash Garg Alleges Nirmala Sitharaman - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/1/sita.jpg.webp?itok=c0S2VHQv)
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో కలిసి పని చేయడం కష్టమని ఆ శాఖ మాజీ కార్యదర్శి సుభాష్‌చంద్ర గార్గ్ శనివారం బ్లాగ్‌లో పేర్కొన్నారు. తనను ఆర్థిక శాఖ నుంచి బదిలీ చేయాలంటూ ఆమె పట్టుబట్టారని తెలిపారు. స్వచ్ఛంద పదవీ విరమణ(వీఆర్‌ఎస్) చేసిన ఏడాది తర్వాత అందుకు గల కారణాలను ఆయన బహిర్గతం చేశారు. తన బ్లాగ్ పోస్టులో పలు అంశాలను ప్రస్తావించారు. నిర్మలా సీతారామన్‌తో కలిసి పనిచేయడం చాలా కష్టమని తాను భావించానని, అందుకే వీఆర్‌ఎస్ తీసుకున్నానని వివరించారు. ఆమెతో తనకు కలిసి రాలేదన్నారు. ఆమె తన బదిలీ కోరేకంటే ముందే తమ మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఆర్థిక మంత్రిత్వ శాఖలో కాకుండా మరో శాఖలో పనిచేయాలని తాను భావించలేదని పేర్కొన్నారు. దివంగత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీతో పోలిస్తే నిర్మలది భిన్నమైన వ్యక్తిత్వమని, అరుణ్ జైట్లీతో పనిచేయడం తనకు వృత్తిపరంగా సంతృప్తినిచ్చిందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment