
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో అత్యున్నత సర్వీసులైన గ్రూప్ – 1, 2 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతించింది. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్ రావత్ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. గ్రూప్–1లో 110, గ్రూప్–2లో 182 పోస్టులు భర్తీ చేస్తారు. గతంలో ప్రకటించిన జాబ్ క్యాలండర్ కంటే అధికంగా పోస్టులు భర్తీ చేయాలని ఇటీవల ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో గ్రూప్ 1, 2 విభాగాల్లో 292 ఉద్యోగాలను ప్రకటించారు. ఆ పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతినివ్వడంతో త్వరలోనే నోటిఫికేషన్ వెలువడనుంది. గ్రూప్–1లో డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీ, ఆర్టీవో, సీటీవో, మున్సిపల్ కమిషనర్లు, డీఎఫ్‌వో, ఎంపీడీవో వంటి పోస్టులు ఉండగా, గ్రూప్–2లో డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లు, ట్రెజరీ పోస్టులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment