జీతాలపై ఎందుకీ దుర్మార్గపు రాతలు?  | yellow media fake campaign Andhra Pradesh govt employees salaries | Sakshi
Sakshi News home page

జీతాలపై ఎందుకీ దుర్మార్గపు రాతలు? 

Published Sun, Jan 22 2023 5:08 AM | Last Updated on Sun, Jan 22 2023 5:17 AM

yellow media fake campaign Andhra Pradesh govt employees salaries - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తేదీనే జీతాలిస్తున్న రాష్ట్రమేదైనా ఉందా? పోనీ మన రాష్ట్రంలో గత ప్రభుత్వాలన్నీ ఇలా 1వ తేదీనే ఇచ్చాయా? ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఎప్పుడూ అందరికీ 1వ తేదీనే ఇచ్చిన దాఖలాలు లేవు కదా? ప్రభుత్వంలో లక్షల మంది ఉద్యోగులు, వివిధ రకాల విభాగాలు ఉన్నపుడు... వారి బిల్లులన్నీ అప్‌లోడ్‌ చేయటం, వాటిని ఆమో­దించటం అన్నీ పూర్తయి... అందరికీ 1వ తేదీనే ఇవ్వటం సాధ్యమా? గతంలో కూడా ఇలా ఇవ్వలేనపుడు... ఇప్పుడు మాత్రమే ‘ఈనాడు’ ఎందుకీ వ్యతిరేక కథనాలను వరసగా ప్రచురిస్తోంది? ఎప్పుడో 1977లోనే జీవో అమల్లోకి వచ్చిందని... 1990 నుంచీ చిన్న మార్పు జరిగిందని... కథలు కథలుగా వండి వారస్తున్న రామోజీరావు... 2014 నుంచీ 2019 మధ్య చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నపుడు ఇలా ఠంచన్‌గా 1వ తేదీన ఇవ్వలేదనే సంగతి ఎందుకు ప్రస్తావించరు? ఈనాడే కాదు... బాబు అధికారంలో ఉండగా ఏనాడూ ప్రశ్నించలేదెందుకు? మరీ ఇంత దుర్మార్గపు రాతలా? గతంలోనూ 1– 20వ తేదీ మధ్యనే కదా.. రెగ్యులర్‌ ఉద్యోగులకు, పెన్షనర్లకు చెల్లింపులు జరిగాయి. ఆ విషయాన్నెందుకు ప్రస్తావించరు రామోజీ? 

మరో ప్రధానాంశమేంటంటే చంద్రబాబు నాయుడి హయాంలో కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు, అంగన్‌వాడీ వర్కర్లు, రిసోర్స్‌ పర్సన్లు, ఆశా వర్కర్లకు, మధ్యాహ్న భోజన పథకం ఆయాలకు నెలల తరబడి జీతాలు అందేవి కావు. ఎప్పుడొస్తాయో తెలియని పరిస్థితి. 104, 108 వాహనాల ఉద్యోగులదీ అదే పరిస్థితి. ఆరేడు నెలల పాటు వేతనాలు చెల్లించకపోయినా రామోజీరావు ఒక్క అక్షరం ముక్క కూడా రాయలేదు. వారికి మద్దతు పలకనే లేదు. కానీ ఇప్పుడు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు, అంగన్‌వాడీలు, ఆశా వర్కర్లు, హోంగార్డులు, ఆర్‌పీలు... ఇలా అందరికీ రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు ఏ నెల వేతనాలు ఆ నెలలోనే చెల్లిస్తున్నారు. అలా చెల్లించడానికి ఒక పెద్ద వ్యవస్థ ఏర్పడింది. ఇదో విప్లవాత్మక మార్పు. కానీ ఈ స్థాయి సానుకూల సంస్కరణను ‘ఈనాడు’ ఒక్కనాడు కూడా ప్రస్తావింలేదు. బాబు హయాంలో దారుణ పరిస్థితుల్ని... ఈ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న మంచిని... రెండింటినీ ప్రజలకు చెప్పకపోవటమే రామోజీరావు పాలసీ. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తేదీనే జీతాలు రావటం లేదని రోజూ దారుణమైన అవాస్తవ కథనాలను వండి వారుస్తున్నారు.  

మెజారిటీ ఉద్యోగులకు నెల తొలినాళ్లలోనే జీతాలు పడుతున్నా... బిల్లుల సమర్పణలో జాప్యం, ఇతరత్రా కారణాల వల్ల కొద్ది మందికి మాత్రం 20వ తేదీ వరకు సమయం పడుతోంది. ‘ఈనాడు’ మాత్రం ఈ వాస్తవాలకు మసిపూసి... ఉద్యోగ సంఘాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు హయాంలో ఉద్యోగులకు ఏకంగా 5 డీఏలు బకాయిలు పెట్టినా పట్టించుకోని రామోజీరావు... ఇతర ఎల్లో మీడియా ప్రచురిస్తున్న కథనాలను ఆరి్థక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌ తీవ్రంగా తప్పు పట్టారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం గురించి రాష్ట్ర ప్రభుత్వం అనేక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ ‘ఈనాడు’తో పాటు కొన్ని పత్రికలు పనికట్టుకొని తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నాయని, వాటిపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. ఉద్యోగులకు జీతాలు, పెన్షన్లు సకాలంలో చెల్లించకుండా వారి సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదంటూ రాస్తున్న కథనాలపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఉద్యోగులు, ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్నామంటూ... శనివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. తప్పుడు కథనాలను నమ్మొద్దని, ఉద్యోగుల సంక్షేమమే ఈ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు. ప్రకటన ముఖ్యాంశాలివీ... 

24లోగా బిల్లులు పూర్తి చేయాలని చెప్పాం 
– రాష్ట్ర విభజన సందర్భంగా ఆరి్థక వనరుల పంపిణీ అశాస్త్రీయంగా ఉండటంతో పాటు కోవిడ్‌ సంక్షోభం కారణంగా ఆరి్థకంగా తీవ్ర ప్రభావం పడినప్పటికీ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లను ప్రభుత్వం సకాలంలో చెల్లిస్తోంది. ఇందుకోసం అనేక చర్యలు తీసుకుంది.  
– సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లించడానికి పెన్షన్‌ బిల్లులను 16వ తేదీ నుంచి ప్రారంభించి 24వ తేదీలోగా పూర్తి చేయాలని డీడీవోలకు ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్లు, జీతాల చెల్లింపును నెల తొలి పని దినం నుంచి ప్రారంభించి.. నెలాఖరులోగా ఆడిట్‌ పూర్తి చేయాలని ట్రెజరీలకు ఆదేశాలిచి్చంది. 
– రెగ్యులర్‌ ఉద్యోగులు, పెన్షనర్లకు సకాలంలో జీతాలు, పెన్షన్లు చెల్లిస్తూనే మరో పక్క ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, మధ్యాహ్న భోజనం కుక్‌ కమ్‌ హెల్పర్లు, హోంగార్డులు, వీఏవోలు, ఆర్‌పీలు, గిరిజన సంఘం కార్యకర్తలు, కాంట్రాక్టు ఉద్యోగులకు నెలలో 21వ తేదీలోగా జీతాలు అందేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంది.  
– గతంలో ఈ కేటగిరి ఉద్యోగుల్లో కొంత మందికి నెలల తరబడి జీతాలు అందేవి కావు. ఈ ప్రభుత్వం ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల జీతాల చెల్లింపునకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేకంగా ఆప్కోస్‌ పేరుతో కార్పొరేషన్‌ను సైతం ఏర్పాటు చేసింది.  

ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం 
– రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోంది. ఇందులో భాగంగా 2019 జూలై 6న జీవో 60 జారీ ద్వారా 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు గ్రాంట్‌ ఇన్‌ ఎయిడెడ్‌ సంస్థలు, వర్క్‌ చార్జ్‌ ఉద్యోగులు, 2015లో సవరించిన వేతనాలు పొందుతున్న పూర్తి స్థాయి కంటింజెంట్‌ ఉద్యోగులకు మధ్యంతర భృతి వర్తింప చేసింది. పెన్షనర్లకు కూడా జీవో 61 ద్వారా 27 శాతం మధ్యంతర భృతి మంజూరు చేసింది. మధ్యంతర భృతి ద్వారా ఉద్యోగులు, పెన్షనర్లకు 2019 జూలై 1 నుంచి 2021 డిసెంబర్‌ 31 వరకు రూ.17,918 కోట్లు ప్రభుత్వం చెల్లించింది. ఇందులో ఉద్యోగులకు రూ.11,984 కోట్లు కాగా, పెన్షనర్లకు రూ.5,933 కోట్లు.  
– ఉద్యోగులకు 11వ వేతన సవరణ సిఫార్సులు అమలు చేయడం ద్వారా ఏడాదికి అదనంగా 11,707 కోట్లు వ్యయం అవుతోంది. ఈ మేరకు ఉద్యోగులు ప్రయోజనం పొందారు. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పొడిగించటంతో ప్రస్తుత ఉద్యోగులందరితో పాటు ప్రభుత్వంలో చేరుతున్న ఉద్యోగులకూ ప్రయోజనం కలుగుతోంది. వయోపరిమితి పెంపుతో 26,878 మంది ఉద్యోగులకు తక్షణ లబ్ధి కలిగింది. 
– కాంట్రాక్టు ఉద్యోగుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి కనీస వేతన స్కేళ్లను వర్తింప చేస్తూ 2021 జూన్‌ 18న జీవో 40 జారీ చేసింది. 2015లో సవరించిన పే స్కేళ్ల ప్రకారం మినిమమ్‌ టైమ్‌ స్కేలును ప్రభుత్వంలోని కాంట్రాక్టు ఉద్యోగులకు, యూనివర్సిటీలు, సొసైటీలు, కెజీవీబీ మోడల్‌ స్కూల్స్‌లో పనిచేసే వారికి వర్తింప చేశారు. ప్రభుత్వ శాఖలు, విశ్వవిద్యాలయాలు, సొసైటీలు, కెజీవీబీ, మోడల్‌ స్కూల్స్‌లో కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేస్తున్న వివాహిత మహిళా ఉద్యోగులకు మొదటి రెండు శిశు జననాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులను మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
– కాంట్రాక్టు ఉద్యోగులు ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు, సరీ్వసులో ఉండగా సహజ మరణం అయితే రెండు లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేíÙయా చెల్లించేందుకు ఆదేశాలు జారీ చేసింది. ఈ చర్యల వల్ల కాంట్రాక్టు ఉద్యోగులు ఏడాదికి రూ.360 కోట్లు అదనపు ప్రయోజనం పొందుతున్నారు. సవరించిన వేతన స్కేళ్ల ప్రకారం 2022 జనవరి 1 నుంచి కాంట్రాక్టు ఉద్యోగులందరికీ మినిమమ్‌ టైమ్‌ స్కేళ్లను వర్తింప చేశారు.  
– ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న మంజూరైన పోస్టుల రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియను సమీక్షించడంతో పాటు నోటిఫికేషన్‌ జారీ చేయడానికి కచి్చతమైన సమయ పాలనను పాటించేలా దశల వారీగా ఖాళీ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంది. అందుకనుగుణంగా 2021–22 లో 10,143 పోస్టుల భర్తీకి వార్షిక క్యాలెండర్‌ను విడుదల చేసింది. 292 గ్రూప్‌–1, గ్రూప్‌–2 పోస్టుల భర్తీకి ఆరి్థక శాఖ 2022 మార్చి 31నన జీవో 78 జారీ చేసింది. అలాగే వైద్య ఆరోగ్య శాఖలో 47 వేల పోస్టులకు పైగా భర్తీ చేసింది. ఇతర శాఖల్లో 1,958 పోస్టుల భర్తీతో కలిపి మొత్తం 23,485 పోస్టుల భర్తీకి అనుమతించింది. 
– ఆర్టీసీ ఉద్యోగుల కోసం ప్రభుత్వంలో కొత్తగా పబ్లిక్‌ట్రాన్స్‌పోర్టు శాఖను ఏర్పాటు చేసి ఆరీ్టసీకి చెందిన 53,500 మంది ఉద్యోగులను 2020 జనవరి 1న ప్రభుత్వ ఉద్యోగుల సరీ్వసులోకి తీసుకుంది. పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు శాఖలో చేరిన ఆర్టీసీ ఉద్యోగులందరికీ 2020 జనవరి నుంచి ప్రభుత్వమే వేతనాలను చెల్లిస్తోంది. 2020 జనవరి నుంచి డిసెంబర్‌ 2021 వరకు ఉద్యోగులకు వేతనాల రూపంలో రూ,5,900 కోట్లు చెల్లించింది. 
– పౌరుల ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలందించేందుకు రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థలో కొత్తగా 1.28 లక్షల మంది రెగ్యులర్‌ ఉద్యోగులను నియమించింది. దీనివల్ల ఏడాదికి రూ.2,300 కోట్లు ఆర్థిక భారం పడుతోంది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పే స్కేళ్లను వర్తింప చేసింది.  
– ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల నియామకంలో అవినీతి నిరోధించాలనే ముఖ్యమంత్రి నిర్ణయం మేరకు ఏజెన్సీల వ్యవస్థకు స్వస్తి పలికి ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతి నెలా సకాలంలో జీతాలు చెల్లించే అవాంతరాలు లేని వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ కార్పొరేషన్‌ ఫర్‌ ఔట్‌సోర్స్‌డ్‌ సరీ్వసెస్‌ను (ఆప్కోస్‌) ఏర్పాటు చేసి పూర్తి ప్రైవేట్‌ ఏజెన్సీలకు తావు లేకుండా చేసింది. ఆప్కోస్‌ పరిధిలోకి 98,016 ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు వచ్చారు. వీరందరికి నెలలో తొలి పనిదినం రోజున వేతనాలు చెల్లిస్తున్నారు. వేతనాల రూపంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ప్రతి నెలా రూ.150 కోట్లు చెల్లిస్తున్నారు. ఈపీఎఫ్, ఈఎస్‌ఐలను వర్తింప చేస్తున్నారు.  
– ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సరీ్వసు కమిషన్‌ నిర్వహించే డిపార్ట్‌మెంట్‌ పరీక్షల్లో ప్రతికూల మార్కుల విధానాన్ని ప్రభుత్వం తొలగించింది. కనీస ఉత్తీర్ణత మార్కులను సక్రమంగా పునరుద్ధరించింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ డిపార్ట్‌మెంట్‌ పరీక్షల నిబంధనలు–1965లో సవరణలు తీసుకువస్తూ 2020 సెపె్టంబర్‌ 25న జీవో 101 జారీ చేసింది.  
– 1995 నుండి 2011 మధ్య నియమించబడిన వివిధ ఫీడర్‌ కేటగిరీలకు చెందిన మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్ల (ఎంపీడీఓలు) సీనియారిటీని ఖరారు చేయడంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య పరిష్కరించింది. డైరెక్ట్‌ రిక్రూట్‌ ఎంపీడీఓల కోసం 5:3:3 నిష్పత్తిలో ఎంపీడీఓలకు ప్రమోషన్‌ ఛానెల్‌ ఖరారు చేసింది.  
 – గ్రామ రెవెన్యూ ఆఫీసర్లకు సూపర్‌ సెషన్‌లో సీనియర్‌ అసిస్టెంట్లుగా పదోన్నతులకు మార్గం సుగమం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వీఆర్‌ఏ కేడర్‌ నుంచి 3,795 గ్రామ రెవెన్యూ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి జిల్లా కలెక్టర్లకు అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 
– హైదరాబాద్‌ నుంచి తరలి వచి్చన ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పనిదినాల అమలును కొనసాగిస్తోంది.  
– 12 సంవత్సరాల అనంతరం తొలిసారిగా రాష్ట్ర స్థాయిలో ఏపీ సివిల్‌ సర్వీసెస్‌ జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఉద్యోగ సంఘాల అసోసియేషన్లతో చర్చల ద్వారా వారి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంది. 
– వివిధ శాఖల్లోని 3,01,020 మంది చిరు ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం వేతనాలను పెంచింది. ఈ వేతనాల పెంపు వల్ల రూ,1,196 కోట్ల నుంచి రూ.3,187 కోట్లకు వేతనాలు చేరాయి. వివిధ శాఖల్లోని ఉద్యోగుల జీతాలు ఈ విధంగా పెరిగాయి 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement