
హన్మకొండ అర్బన్: వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ అమ్రపాలి, జమ్మూకు చెందిన ఐపీఎస్ అధికారి సమీర్‌శర్మ ఒక్కటయ్యారు. ఆదివారం సాయంత్రం 6.30 గంటలకు జమ్మూలో బంధుమిత్రుల సమక్షంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ నెల 21 వరకు కలెక్టర్ దంపతులు జమ్మూలోనే ఉంటారు. ఈ నెల 22న హైదరాబాద్‌కు రానున్నారు. 23న వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోనూ విందు కార్యక్రమం ఖరారైంది. ఈ నెల 26 నుంచి మార్చి 7 వరకు ఈ నూతన దంపతులు టర్కీలో పర్యటించనున్నారు.







Comments
Please login to add a commentAdd a comment