23న కలెక్టర్‌ పెళ్లి విందు | Collector wedding feast on 23rd | Sakshi
Sakshi News home page

23న కలెక్టర్‌ పెళ్లి విందు

Feb 10 2018 2:15 AM | Updated on Feb 10 2018 9:43 AM

Collector's wedding feast on 23rd - Sakshi

హన్మకొండ అర్బన్‌: వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ ఆమ్రపాలి పెళ్లి విందు ఈ నెల 23న సాయంత్రం 6 గంటలకు కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి ఆహ్వాన పత్రిక సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ నెల 18న జమ్మూలో వివాహం అనంతరం వరంగల్, హైదరాబాద్‌లో విందు ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. వరంగల్‌కు సంబంధించిన ఆహ్వాన పత్రిక జిల్లాలోనే ముద్రించారు. కలెక్టర్‌ అమ్రపాలి కాటకు 2011 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్‌ అధికారి సమీర్‌శర్మతో వివాహం నిశ్చమైన నేపథ్యంలో సెలవులో వెళ్లనున్నారు. 21 రోజుల సెలవు కాలంలో.. ఈ నెల 16 నుంచి 21 వరకు జమ్మూకాశ్మీర్‌ రాష్ట్ర సందర్శన, 22 నుంచి 25 వరకు హైదరాబాద్, వరంగల్‌లలో, 26 నుంచి మార్చి 7 వరకు టర్కీ దేశాన్ని సందర్శించనున్నట్లు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఈ నెల 18న జమ్ముకశ్మీర్‌లో సమీర్‌శర్మతో ఆమ్రపాలి వివాహం ఘనంగా జరగనుంది. అనంతరం 22న వరంగల్, 25 న హైదరాబాద్‌లో ఆమ్రపాలి తన సన్నిహితులకు విందు ఇవ్వనున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రముఖుల సమక్షంలో రిసెప్షన్ నిర్వహించేందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయినట్లుగా తెలుస్తోంది. ఆ తర్వాత 26 నుంచి మార్చి 7 వరకు భర్త సమీర్‌తో కలిసి ఆమ్రపాలి టర్కీ పర్యటన వెళ్లనున్నట్టు తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement