ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీగా విశాఖ | Sameer Sharma says Visakhapatnam as an Entertainment City Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీగా విశాఖ

Oct 26 2021 5:16 AM | Updated on Oct 26 2021 8:43 AM

Sameer Sharma says Visakhapatnam as an Entertainment City Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి: విశాఖను ఎంటర్‌టైన్‌మెంట్‌ సిటీగా అభివృద్ధి చేసే అంశంపై సోమవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్‌ శర్మ అధికారులతో సమీక్షించారు. ఇప్పటికే విశాఖపట్నం పర్యాటక పరంగా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును సాధిస్తుండగా దాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని సీఎస్‌ పేర్కొన్నారు.

విశాఖ నగరంతోపాటు భీమిలి నుంచి భోగాపురం వరకు బీచ్‌ కారిడార్‌ అభివృద్ధి, 7 స్టార్‌ హోటల్స్, గోల్ఫ్‌ కోర్సు వంటివి ఏర్పాటు, అడ్వెంచర్, వాటర్‌ స్పోర్ట్స్‌ వంటివి అభివృద్ధి చేయడంపై సీఎస్‌ సమీక్షించారు. జెట్టీ, బీచ్‌ వాటర్‌ స్ట్రక్చర్ల నిర్మాణం, సీప్లేన్లు, క్రూయిజ్‌ షిప్పులు, అమ్యూజ్‌మెంట్‌ పార్కు, యాంపీ థియేటర్, రిటైల్‌ అవుట్‌లెట్స్‌ వంటి వాటి ఏర్పాటుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement