
నూతన సీఎస్ సమీర్ శర్మకు అమ్మవారి చిత్రపటాన్ని అందజేస్తున్న పైలా సోమినాయుడు తదితరులు
ఇంద్రకీలాద్రి(విజయవాడ పశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సమీర్ శర్మ శనివారం దర్శించుకున్నారు. దర్శనానికి వచ్చిన సమీర్‌శర్మ దంపతులకు దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణిమోహన్, దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో భ్రమరాంబ సాదరంగా స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు జరిపించారు. మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న పలు ఇంజనీరింగ్ పనులను పరిశీలించారు.
Comments
Please login to add a commentAdd a comment