
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పదిహేను మంది ఐపీఎస్ ఆఫీసర్ల బదిలీ ప్రక్రియ జరిగింది. మంగళవారం ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ పేరు మీదుగా ప్రభుత్వ జీవో విడుదల అయ్యింది.
ఎల్‌కేవీ రంగారావు, ఎస్వీ రాజశేఖర బాబు, పీహెచ్‌డీ రామకృష్ణ, కేవీ మోహన్ రావు, ఎస్ హరికృష్ణ, గోపినాథ్ జట్టి, కోయ ప్రవీణ్, విశాల్ గున్నీ, రవీంద్ర బాబు, అజిత వెజెండ్ల, జీ కృష్ణకాంత్, పీ జగదీశ్, తుహిన్ సిన్హా, బిందు మాధవ్ గరికపాటి, పీవీ రవికుమార్ బదిలీ జాబితాలో ఉన్నారు. విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీకి అదనపు బాధ్యతలు అప్పగించగా, శాంతి భద్రతల డీఐజీగా రాజశేఖర్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.
కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా ఎస్ హరికృష్ణకు, న్యాయవ్యవహారాల ఐజీపీగా గోపీనాథ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. గుంతకల్లు రైల్వే పోలీస్ సూపరింటెండెంట్‌గా అజిత వేజెండ్లకు అదనపు బాధ్యతలు అప్పగించగా, పోలీస్ హెడ్ క్వార్టర్స్‌కు డీఎన్ మహేష్‌ను బదిలీ చేశారు. ఐజీపీ స్పోర్ట్స్, సంక్షేమ బాధ్యతలు ఎల్ కె వి రంగారావుకు, గ్రేహౌండ్స్ డీఐజీగా గోపీనాథ్ శెట్టికి బాధ్యతలు అప్పగించారు.
ఇక ప్రస్తుతం కాకినాడ ఎస్పీగా ఉన్న రవీంద్రనాథ్ బాబుకు కాకినాడ థర్డ్ బెటాలియన్ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఏసీబీ డీఐజీగా పీహెచ్‌డీ రామకృష్ణ బదిలీ కాగా, 16వ బెటాలియన్ కమాండెంట్‌గా కోయ ప్రవీణ్‌ను బదిలీ చేశారు. పల్నాడు అదనపు ఎస్పీ అడ్మిన్‌గా బిందు మాధవ్ బాధ్యతలు తీసుకోనున్నారు. తాజా బదిలీలు, పోస్టింగ్‌లు తక్షణమే అమలులోకి వస్తాయని సీఎస్ తాజా జీవోలో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment