Bhadrakali Temple
-
భద్రకాళి చెరువుకు గండి.. ప్రజల్లో టెన్షన్ టెన్షన్..
-
భద్రకాళీ అమ్మవారి ఆలయానికి చేరుకున్న మోదీ
-
గరుడ వాహనంపై విశ్వపతి
విశ్వపతి శ్రీ వేంకటేశ్వరుడు శనివారం గరుడ వాహనంపై అంగరంగ వైభవంగా ఊరేగుతూ భక్తకోటిని అనుగ్రహించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉదయ్ ఉమేష్ లలిత్ గరుడ వాహన సేవలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అంతకుముందు.. ఆయన ఆలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. – తిరుమల దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆరో రోజు శనివారం అలంపూర్ జోగుళాంబ, బాసర సరస్వతిదేవి, శ్రీశైలం భ్రమరాంబ అమ్మవార్లను కాత్యాయనీదేవిగా అలంకరించి పూజించారు. అలాగే వరంగల్ భద్రకాళి.. భవానీదేవిగా దర్శనమిచ్చారు. – జోగుళాంబ శక్తిపీఠం(అలంపూర్)/బాసర(ముథోల్)/హన్మకొండ కల్చరల్ -
శాకాంబరిగా శ్రీ భద్రకాళీ అమ్మవారు
-
పట్టర పట్టు కుస్తీ
టేక్మాల్(మెదక్) : మండలంలోని బొడ్మట్‌పల్లి గుట్టపై వెలసిన భద్రకాళీ సమేత వీరభద్ర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం కుస్తీపోటీలునిర్వహించారు. చివరి కుస్తీలో ఇద్దరిపై నెగ్గిన మహరాష్ట్ర ఉద్దిర్ గ్రామానికి చెందిన నూరత్‌బిడివికి టీఆర్ఎస్ జిల్లా నాయకులు బేగరి మొగులయ్య సౌజన్యంతో 5తులాల వెండి కడియాన్ని బహుకరించారు. విజేతను దేవాలయం వరకు ఊరేగిస్తూ పూజలు నిర్వహించారు. కుస్తీ పోటీలలో పాల్గొనేందుకు కర్ణాటక, మహరాష్ట్రాలతో పాటూ తెలంగాణలోని పలు జిల్లాలోని మల్లయోధులు వచ్చి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. ఉత్సవాలకు హాజరైన మాజీ డిప్యూటీ సీఎం.. వీరభద్ర ఉత్సవాల్లో మాజీ ఉపముఖ్యమంత్రి దామోదర్ రాజనర్సింహ హజరయి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సర్పంచ్ బీరప్ప, ఆలయ కమిటీ చైర్మణ్ బస్వరాజ్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు రాందాస్, పీఎసీఎస్ డైరెక్టర్ రవిశంకర్‌లు దామోదరను పూలమాల వేసి, శాలువాతో సన్మానించి ప్రసాదాన్ని అందించారు. ఇందులో ఎంపీపీ ఉపాద్యాక్షులు విష్ణువర్దన్‌రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ యశ్వంత్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు నిమ్మరమేశ్ నాయకులు భరత్, విఠల్, వీరన్న, శ్రీనివాస్, కిషోర్, విద్యాసాగర్, యాదయ్య, గోవిందాచారి, శంకర్, సేవ్యానాయక్ పాల్గొన్నారు. -
భద్రకాళి ఆలయంలో అమ్రపాలి దంపతులు
-
భద్రకాళి ఆలయంలో అమ్రపాలి దంపతులు
సాక్షి, వరంగల్ : జిల్లా కలెక్టర్ అమ్రపాలి దంపతులు శుక్రవారం భద్రకాళి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి నూతన వధూవరులు, కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అంతకు ముందు అమ్రపాలి దంపతులకు ఆలయ పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. కాగా ఈ నెల 18 జమ్ములో ఐపీఎస్ అధికారి సమీర్ శర్మతో అమ్రపాలి వివాహం జరిగిన విషయం తెలిసిందే. వివాహం అనంతరం అమ్రపాలి దంపతులు నిన్న (గురువారం) వరంగల్ విచ్చేశారు. శుక్రవారం సాయంత్రం వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ప్రముఖులకు వివాహ విందు ఏర్పాటు చేశారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
భక్తులపైకి దూసుకెళ్లిన కారు
- ఐదుగురికి గాయాలు వరంగల్: నగరంలోని భద్రకాళి ఆలయ సమీపంలో బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి ఆలయం వద్ద ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద్దరు పిల్లలు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే నగరంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. -
మహాలక్ష్మీదేవిగా అమ్మవారి దర్శనం
హన్మకొండ కల్చరల్ : వరంగల్ నగరంలోని భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న దేవీ శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నాలుగోరోజైన మంగళవారం అమ్మవారిని మహాలక్ష్మీదేవి అవతారంలో అలంకరించారు. ఉదయం నవదుర్గా క్రమంలో భద్రకాళి మాతకు ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు, ముఖ్య అర్చకుడు చెప్పెల నాగరాజుశర్మ, వేదపండితులు పార్నంది నర్సింహమూర్తి, అర్చకులు టక్కరసు సత్యం పలు అనుష్టానాలు నిర్వహించారు. అనంతరం చంద్రఘంటా దుర్గా క్రమంలో పూజలు నిర్వహించి సూర్యప్రభ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం మహిషాసుర మర్దిని క్రమంలో పూజలు చేసి హంస వాహనంపై ఊరేగించారు. ఈసందర్భంగా భద్రకాళి సేవా సమితి కన్వీనర్ అయిత గోపీనాథ్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. నూతన కార్యనిర్వహణాధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్.సునిత, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, ఆలయ సిబ్బంది, అర్చకులతో సమావేశం నిర్వహించి నవరాత్రుల ఏర్పాట్లను సమీక్షించారు. ‘శక్తితత్వం’పై సౌమిత్రి లక్ష్మణాచార్య ఉపన్యసించారు. జమ్మికుంటకు చెందిన మల్లంపల్లి సుబ్రహ్మణ్య శర్మ ‘సతీ అనసూయ’ హరికథను ప్రదర్శించారు. సంకీర్తన మ్యూజిక్ అకాడమీ నిర్వాహకులు ఉమ్మడి లక్ష్మణాచారి కర్ణాటక సంగీత కచేరీ నిర్వహించారు. ఈ సాంస్కృతిక కార్యక్రమాలకు వేదాంతం జగన్నాథ శర్మ హార్మోనియం సహకారాన్ని అందించారు. శివానంద నృత్యమాల ఆచార్యులు బి. సుధీర్‌రావు శిష్యబృందం కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు. -
గజ వాహనంపై మహిషాసుర మర్ధిని
హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మూడరోజైన సోమవారం అమ్మవారిని గాయత్రీమాత అవతారంలో అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకుడు చెప్పెల నాగరాజుశర్మ, పార్నంది నర్సింహమూర్తి, టక్కరసు సత్యం సుప్రభాత సేవ, అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం చంద్ర ఘంటాక్రమంలో అమ్మవారికి పూజలు చేసి, సింహ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం మహిషాసుర మర్ధిని క్రమంలో పూజలు చేసి, గజ వాహనంపై ఊరేగించారు. ఈ ఉత్సవాలకు డా.కట్టా రేణుక ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఈసందర్భంగా నిర్వహించిన కుంకుమ పూజల్లో మహిళలు పాల్గొన్నారు.బీఎస్ఎన్ఎల్ డీజీఎం ఆర్.లీలావతి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సునిత భద్రకాళి మాతను దర్శించుకుని పూజలు నిర్వహించారు. -
దేవీ నవరాత్రి ఉత్సవాలకు శ్రీకారం
భద్రకాళి ఆలయంలో వేడుకలను ప్రారంభించిన ఎమ్మెల్యే వినయ్, మేయర్ బాలా త్రిపుర సుందరీదేవిగా అమ్మవారి దర్శనం శైల పుత్రీ, యోగ నిద్రా క్రమాల్లో పూజలు హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని భద్రకాళి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు శనివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 4గంటలకు నిర్మాల్య సేవలు, సుప్రభాత పూజలు జరిపారు. సుగంధ ద్రవ్య పరిమళాలతో అమ్మవారిని అభిషేకించారు. ఈసందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భద్రకాళి మాతను బాలా త్రిపుర సుందరీ దేవిగా అలంకరించి, శైలపుత్రీ క్రమంలో పూజలు జరిపారు. అనంతరం అమ్మవారిని వృషభ వాహనంపై ఊరేగించారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ , వేద పండితులు పార్నంది నర్సింహమూర్తి, టక్కరసు సత్యం ఆగమార్చన విధులు నిర్వహించారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, రేవతి దంపతులు, వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్‌లు భద్రకాళి ఆలయాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు జరిపారు. వారికి ఆలయ ఈఓ కట్టా అంజనీదేవి, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, మేయర్ నన్నపునేని నరేందర్‌లు జ్యోతి ప్రజ్వలన చేసి దేవీ నవరాత్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్చకులు వారికి మహదాశీర్వచనం అందజేశారు. మధ్యాహ్నం 2వేల మంది భక్తులకు అన్నదానం చేశారు. బుకింగ్ కౌంటర్ ప్రారంభం.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బుకింగ్ కౌంటర్‌ను బ్యాంక్ రీజినల్ జనరల్ మేనేజర్ మణికందన్ ప్రారంభించి, ఈఓ అంజనీదేవికి కౌంటర్ తాళం చెవులను అందించారు. సాయంత్రం అమ్మవారికి యోగనిద్రా క్రమంలో పూజలు నిర్వహించి జింక వాహనంపై ఊరేగించారు. రాత్రి 9 గంటలకు మహాపూజ, కుమారీ, సువాసినీ పూజలు, మహానీరాజన మంత్రపుష్పం నిర్వహించారు. అనంతరం మహా ప్రసాద వితరణ జరిపారు. ఈసందర్భంగా సాంస్కృతిక వేడుకల్లో భాగంగా సాయంత్రం 5 గంటల నుంచి బొడిగె లక్ష్మీ నారాయణ భాగవతార్ మహిషాసుర సంహారం, మహాలక్ష్మీ వైభవం హరికథలను ప్రదర్శించారు. భద్రాచలం సీతారాయచంద్రస్వామి దేవస్థానం స్థానాచార్యులు స్థలశాయి శాస్త్రీయ సంగీత ప్రదర్శన ఆకట్టుకుంది. కాశిబుగ్గ శ్రీదత్త కూచిపూడి కళాక్షేత్రం ప్రిన్సిపాల్ ముదిగొండ సునిత శిష్య బృందం కూచిపూడి నృత్య ప్రదర్శన అలరించింది. కాగా, నేడు అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి బ్రహ్మచారిణీ క్రమంలో పూజలు నిర్వహించనున్నారు. కార్యక్రమంలో సిబ్బంది కూచన హరినాథ్, కొత్తపల్లి వెంకటయ్య, అలుగు కృష్ణ , అశోక్, చింత శ్యాంసుందర్ తదితరులు పాల్గొన్నారు. -
భద్రకాళి ఆలయాన్ని సందర్శించిన తాళ్లపాక హరినారాయణాచార్యులు
హన్మకొండ కల్చరల్ : చారిత్రాత్మక భద్రకాళి దేవాలయాన్ని తాళ్లపాక అన్నమాచార్యుల 12వ తరం వారసులు, తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ప్రస్తుత సంకీర్తనా కైంకర్యధారులు తాళ్లపాక హరినారాయణాచార్యులు కుటుంబసమేతంగా సందర్శించారు. ఆలయ ముఖ్య అర్చకులు చెప్పెల నాగరాజుశర్మ, అర్చకులు టక్కరసు సత్యం, సూపరింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్ ఆయనకు స్వాగతం పలికారు. వల్లభ గణపతి, ఆదిశంకరులు, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకానికి చర్యలు
హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయంలో ధర్మకర్తలను నియమించేందుకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్ణయించినట్లు ప్రభుత్వ కార్యదర్శి ఎన్. శివశంకర్ ఒకప్రకటనలో తెలిపారు. ధర్మకర్తగా పనిచేసేందుకు ఆసక్తి కలిగిన వారు సెక్షన్ 17, ఉపసెక్షన్ 3 అనుసరించి నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సెప్టెంబర్ 5వ తేదీ లోపు కమిషనర్ దేవాదాయ ధర్మాదాయశా ఖ హైదరాబాద్‌లో అందజేయాలని సూచించారు. లేకుంటే జాయింట్ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయశాఖ హైదరాబాద్, డిప్యూటీ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయశాఖవరంగల్, సహాయ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్‌లో కూడా అందజేయవచ్చని ఆయన పేర్కొన్నారు. -
వైభవంగా వరలక్ష్మి వ్రతాలు
హన్మకొండ కల్చరల్ : శ్రావణమాసం మొదటి శుక్రవారాన్ని పురస్కరించుకుని జిల్లాలోని పలు దేవాలయా ల్లో మహిళలు వరలక్ష్మి వ్రతాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్‌లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో మహిళలు అమ్మవారికి ఒడిబాలబియ్యం, చీరలు సమర్పిం చుకున్నారు. అలాగే కుంకుమ పూజలు నిర్వహించారు. తొలుత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, నగర మేయర్ నన్నపునేని నరేందర్ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ కట్టా అంజనీదేవి, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, తదితరులు పాల్గొన్నారు. రాజరాజేశ్వరీ ఆలయంలో.. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలోని శ్రీరాజరాజేశ్వరీదేవి ఆలయంలో అర్చకుడు రాజు, అమ్మవారి ఉపాసకులు యల్లంభట్ల లక్ష్మణశర్మ ఆధ్వర్యంలో మహిళలు అమ్మవారికి కుంకుమ పూజలు, సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు. అలాగే వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పూజలు చేశారు. ఆలయ సిబ్బంది భక్తులకు తగిన ఏర్పాట్లు చేశారు. -
మహా శాకంబరీ నమోనమః
శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు మంగళవారం ఘనంగా ముగిశాయి. చివరిరోజు భద్రకాళి అమ్మవారు మహా శాకంబరీ అవతారంలో భక్తులకు దర్శన మిచ్చారు. అమ్మవారిని రెండు టన్నుల దుంపలు, కాయలు, 70 రకాల పండ్లు, కూరగాయలతో సంపూర్ణ శాకంబరీగా అలంకరించారు. హన్మకొండ కల్చరల్ : వరంగల్ శ్రీభద్రకాళి దేవాలయంలో జరుగుతున్న శాకంబరీ ఉత్సవాలు మంగళవా రం ముగిశాయి. చివరిరోజు భద్రకాళి అమ్మవారిని రెండు టన్నుల దుంపలు, కాయలు, 70 రకాల పండ్లు, కూరగాయలతో అలం కరించా రు. ఈ సందర్భంగా తెనాలికి చెందిన అలంకా ర కళానిధి చావలి హనుమాన్‌కుమార్ బృందం, ఆలయ ప్రధానార్చకుడు భద్రకాళి శేషు, ముఖ్యార్చకులు పార్నంది నరసింహామూర్తి, చెప్పెల నాగరాజుశర్మ, టక్కరసు సత్యం, పాలకుర్తి నరసింహామూర్తి, ప్రభాకరశర్మ, సుధాకర్‌శర్మ, సురేష్‌శర్మ, రాముశర్మ అమ్మవారిని సంపూర్ణ శాకంబరీగా అలంకరించి పూజలు చేశారు. హన్మకొండ టీచర్స్ కాలనీకి చెందిన మండువ వెంకటకిషన్‌రావు, దయామణి దం పతులు, మండువ శేషగిరిరావు, రేణుక దంపతులు అమ్మవారి అలంకరణ దాతలుగా వ్యవహరించారు. వ్యాపారవేత్త తోట గణేష్ ఆధ్వర్యంలో యువకులు అమ్మవారికి కూరగాయ లు, పూలదండలు తయారు చేశారు. బుధ వారం మధ్యాహ్నం వరకు అమ్మవారి దర్శనం ఉంటుందని అర్చకులు తెలి పారు. మితాక్రమంలో ముగిసిన ఉత్సవాలు చివరి రోజు అమ్మవారి ఇచ్ఛామూర్తిని కాళీక్రమంలోని మితాక్రమంలోనూ, జ్ఞానమూర్తిని షోఢశీక్రమంలో చిత్రానిత్యా అమ్మ వారిగా అలంకరించారు. ఈ సందర్భంగా అర్చకులు చతుఃస్థానార్చన పూజలు, నీరాజనమంత్రపుష్పములు నిర్వహించారు. ఉత్సవాల ముగింపు క్రతువుల్లో భాగంగా వృద్ధిహోమం, బలిప్రదానం, మహా పూర్ణాహుతి, త్రిశూల తీర్థోత్సవము, అవబృథ స్నానం నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు సుమారు 50 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భద్రకాళి శరణమమః అని కొలుస్తూ పూజలు చేశారు. కాగా, ఆలయ ఈఓ, అసిస్టెంట్ కమిషనర్ కట్టా అంజనీదేవి, ఆలయ సూప రింటెండెంట్ అద్దంకి విజయ్‌కుమార్, సిబ్బంది కూచన హరినాథ్, కృష్ణ, కె. వెంకటయ్య, అశోక్, చింతశ్యామ్, సిబ్బంది ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ దంపతులు, కలెక్టర్ వాకాటి కరుణ, డీఐజీ ప్రభాకర్‌రావు, జైళ్ల శాఖ డీఐజీ కేశవులునాయుడు దంపతులు, మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. మట్టెవాడ సీఐ శివరామయ్య ఆధ్వర్యంలో 70 మంది పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది ఆలయంలో బందోబస్తు నిర్వహించారు. మహబూబాబాద్‌కు చెందిన శ్రీవేంకటేశ్వరసేవా సమితి సభ్యులు 40 మంది భక్తులకు సేవలు అందించారు. అయిత గోపినాథ్ ఆధ్వర్యంలో భద్రకాళి సేవా సమితి సభ్యులు భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. -
పాత కక్షలతో యువకుడి దారుణ హత్య
తొర్రూరులో ఘటన బంధువులపైనే అనుమానం తొర్రూరు : పాత కక్షలతో ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన తొర్రూరు శివారులో అమ్మాపురంలో రోడ్డులోని భద్రకాళి దేవాలయం సమీపంలో శనివారం వెలుగు చూసింది. సీఐ సార్ల రాజు, ఎస్సై కరుణాకర్‌రావు కథనం ప్రకారం... మండలంలోని ఖానాపురం గ్రామానికి చెందిన కుంట వెంకన్న, సుగుణమ్మ దంపతుల రెండో కుమారుడు మహేందర్(24) కొద్దినెలలుగా తొర్రూరులోని ఓ టైలర్‌షాపులో టైలరింగ్ నేర్చుకుంటున్నాడు. ఈ క్రమంలో అతడు శుక్రవారం ఉదయం షాపునకు వచ్చాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వెళ్లేందుకు సిద్ధమవుతుండగా తన బావలు నారబోయిన రాజారాం(మహేందర్ పిన్ని కూతురు భర్త), నారబోయిన పురుషోత్తం షాపు దగ్గరికి వచ్చారు. అక్కడి నుంచే మహేందర్‌ను వెంట తీసుకెళ్లారు. అరుుతే రాత్రి 10 గంటలైనా ఇంటికి రాకపోవడంతో మహేందర్‌కు అతడి అన్న కుమారస్వామి ఫోన్ చేశాడు.ఫోన్ స్విచ్ఛాప్ రావడంతో టైలర్‌షాపు యజమానికి ఫోన్ చేయగా మహేందర్‌ను రాజారాం, పురుషోత్తం తీసుకెళ్లారని చెప్పాడు. పురుషోత్తం, రాజారంకు కూడా ఫోన్ చేయగా వారి ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ వచ్చారుు. దీంతో వారు ఆందోళనకు రాత్రంతా బంధువులకు ఫోన్లు చేస్తూ ఎదురు చూశా రు. అతడి జాడ తెలియకపోవడంతో శనివారం ఉదయమే కుమారస్వామి తన తమ్ముడి జాడ కోసం ఆటోలో తొర్రూరు బయల్దేరాడు. అదే సమయంలో భద్రకాళి ఆలయం సమీపంలోని ముళ్ల పొదల్లోపడి ఉన్న వ్యక్తిని చూసిన రైతులు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి సీఐ, ఎస్సై చేరుకుని ముళ్లపొదల్లోపడి ఉన్న అతడిని బయటికి తీసేసరికి రక్తపు మడుగులో మహేందర్ మృతిచెంది ఉన్నాడు. ఆటోలో తొర్రూరుకు వస్తున్న కుమారస్వామి పోలీసులు, స్థాని కులు గుమిగూడి ఉండడాన్ని చూసి ఆటో దిగి సంఘటన స్థలానికి చేరుకున్నాడు. మృతదేహం తన తమ్ముడిదిగా గుర్తించి బోరున విలపించాడు. రాజారాం, పురుషోత్తంలే తమ్ముడిని పొట్టనపెట్టుకున్నారని రోదించాడు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు ఆ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మానుకోట ఏరియా ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయిన నాలుగు నెలలకే.. మృతుడు మహేందర్‌కు నాలుగు నెలల క్రితమే వివాహమైంది. మృతుడి భార్య మౌనిక, తల్లిదండ్రులు వెంకన్న, సుగుణమ్మ, సోదరులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరుగా రోదించారు. చెల్లెలిని కొడుతుంటే అడ్డుకున్నందుకే.. దారుణం మహేందర్ పిన్ని కూతురికి నారబోయిన రాజారాంతో వివాహమైంది. గత ఆరు నెలలుగా రాజారాం తన భార్యతో తరచూ గొడవపడుతుండేవాడు. ఈ క్రమంలో ఒకసారి అలాగే కొడుతుండగా ఇంటి పక్కనే ఉన్న మహేందర్ చూడలేక తన ముందే తన చెల్లెలిని ఎందుకు కొడుతున్నావని రాజారాంతో గొడవపడ్డాడు. వారి గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. గ్రామపెద్దలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి బావ, బావమరిది నచ్చజెప్పి ఇంటికి తీసుకొచ్చారు. ఆ విషయూన్ని మనసులో పెట్టుకున్న రాజారాం తన బావమరిది మహేందర్‌ను ఎలాగైనా హత్య చేయాలని పథకం పన్నినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తన పెద్దనాన్న కుమారుడు పురుషోత్తంతో కలిసి మహేందర్‌ను హత్య చేశాడని మృతుడి కుటుంబ సభ్యులు, అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
భద్రకాళి’ని దర్శించుకున్న సినీగాయని జానకి
హన్మకొండకల్చరల్, న్యూస్‌లైన్ : వరంగల్ భద్రకాళి ఆల యాన్ని సినీ గాయని జానకి గురువారం తన కుమారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు, ధర్మకర్తల మండలి చైర్మన్ భద్రకాళి శేషు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం జానకి వల్లభ గణపతిని, శ్రీశంకరభవత్పాదుల విగ్రహాన్ని, భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అలాగే అమ్మవారికి మొక్కు లు చెల్లించుకుని భద్రకాళి శేషు గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని జానకి సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు మఠంప్రణవ్, సందీప్‌శర్మ, పురావస్తుశాఖ సిబ్బంది సదాశివశర్మ, బసవన్న ఆలయమర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జానకి రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.