భద్రకాళి’ని దర్శించుకున్న సినీగాయని జానకి | went to singer janaki bhadrakali temple | Sakshi
Sakshi News home page

భద్రకాళి’ని దర్శించుకున్న సినీగాయని జానకి

Published Fri, Mar 21 2014 3:37 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

భద్రకాళి’ని దర్శించుకున్న సినీగాయని జానకి

భద్రకాళి’ని దర్శించుకున్న సినీగాయని జానకి

 హన్మకొండకల్చరల్,  న్యూస్‌లైన్ : వరంగల్ భద్రకాళి ఆల యాన్ని సినీ గాయని జానకి గురువారం తన కుమారులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకులు, ధర్మకర్తల మండలి చైర్మన్ భద్రకాళి శేషు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం జానకి వల్లభ గణపతిని, శ్రీశంకరభవత్పాదుల విగ్రహాన్ని, భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు.

అలాగే అమ్మవారికి మొక్కు లు  చెల్లించుకుని భద్రకాళి శేషు గృహంలో కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం హన్మకొండలోని వేయిస్తంభాల దేవాలయాన్ని జానకి  సందర్శించారు. ఈ సందర్భంగా అర్చకులు మఠంప్రణవ్, సందీప్‌శర్మ,  పురావస్తుశాఖ సిబ్బంది సదాశివశర్మ, బసవన్న ఆలయమర్యాదలతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జానకి రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement