గజ వాహనంపై మహిషాసుర మర్ధిని
గజ వాహనంపై మహిషాసుర మర్ధిని
Published Tue, Oct 4 2016 12:50 AM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని భద్రకాళి దేవాలయంలో జరుగుతున్న దేవీ నవరాత్రి ఉత్సవాల్లో
భాగంగా మూడరోజైన సోమవారం అమ్మవారిని గాయత్రీమాత అవతారంలో అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు ఆధ్వర్యంలో ముఖ్య అర్చకుడు చెప్పెల నాగరాజుశర్మ, పార్నంది నర్సింహమూర్తి, టక్కరసు సత్యం సుప్రభాత సేవ, అమ్మవారికి నిత్యాహ్నికం నిర్వహించారు. ఉదయం చంద్ర ఘంటాక్రమంలో అమ్మవారికి పూజలు చేసి, సింహ వాహనంపై ఊరేగించారు. సాయంత్రం మహిషాసుర మర్ధిని క్రమంలో పూజలు చేసి, గజ వాహనంపై ఊరేగించారు. ఈ ఉత్సవాలకు డా.కట్టా రేణుక ఉభయ దాతలుగా వ్యవహరించారు. ఈసందర్భంగా నిర్వహించిన కుంకుమ పూజల్లో మహిళలు పాల్గొన్నారు.బీఎస్‌ఎన్‌ఎల్ డీజీఎం ఆర్.లీలావతి అమ్మవారిని దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సునిత భద్రకాళి మాతను దర్శించుకుని పూజలు నిర్వహించారు.
Advertisement