భక్తులపైకి దూసుకెళ్లిన కారు
Published Wed, Aug 23 2017 12:08 PM | Last Updated on Tue, Aug 14 2018 3:22 PM
- ఐదుగురికి గాయాలు
వరంగల్: నగరంలోని భద్రకాళి ఆలయ సమీపంలో బుధవారం ఉదయం ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన ఓ కారు అదుపు తప్పి ఆలయం వద్ద ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిలో ఇద‍్దరు పిల‍్లలు ఉన్నారు. క్షతగాత్రులను వెంటనే నగరంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Advertisement
Advertisement