భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకానికి చర్యలు
Published Thu, Aug 18 2016 12:41 AM | Last Updated on Mon, Aug 20 2018 3:09 PM
హన్మకొండ కల్చరల్ : వరంగల్‌లోని శ్రీభద్రకాళి దేవాలయంలో ధర్మకర్తలను నియమించేందుకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ నిర్ణయించినట్లు ప్రభుత్వ కార్యదర్శి ఎన్. శివశంకర్ ఒకప్రకటనలో తెలిపారు. ధర్మకర్తగా పనిచేసేందుకు ఆసక్తి కలిగిన వారు సెక్షన్ 17, ఉపసెక్షన్ 3 అనుసరించి నిర్ణీత దరఖాస్తు ఫారాన్ని పూర్తి వివరాలతో నింపి సెప్టెంబర్ 5వ తేదీ లోపు కమిషనర్ దేవాదాయ ధర్మాదాయశా ఖ హైదరాబాద్‌లో అందజేయాలని సూచించారు. లేకుంటే జాయింట్ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయశాఖ హైదరాబాద్, డిప్యూటీ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయశాఖవరంగల్, సహాయ కమిషనర్ దేవాదాయ ధర్మాదాయ శాఖ వరంగల్‌లో కూడా అందజేయవచ్చని ఆయన పేర్కొన్నారు.
Advertisement
Advertisement