
జిల్లాను ‘ఆదర్శజ్యోతి’గా నిలపాలి
ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి
హన్మకొండ : గ్రామజ్యోతి పథకం అమలులో జిల్లాను రాష్ర్టంలోనే ఆదర్శంగా నిలుపుదామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శనివారం హన్మకొండలో టీఆర్‌ఎస్ శ్రేణులకు గ్రామజ్యోతి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామాల సమగ్రాభివృద్ధికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం గ్రామజ్యోతి పథకాన్ని చేపట్టిందని, గంగదేవిపల్లిని స్ఫూర్తితో ముం దుకు సాగాలన్నారు. గ్రామసభలో ప్రాధాన్య త క్రమంలో ప్రణాళికలు రూపొందించాల న్నారు. అవకాశాలు రాలేదనే నిరుత్సాహం తో పార్టీ శ్రేణులు గ్రామజ్యోతికి దూరంగా ఉండొద్దని సూచించారు.
మాజీ ఉప ముఖ్యమం త్రి తాటికొండ రాజయ్య మాట్లాడుతూ, కాంగ్రెస్ నాయకుల విమర్శలు అర్థం లేనివన్నారు. పత్రికల్లో వచ్చిన ఆరోపణల ఆధారంగా, ప్రభుత్వం పారదర్శకంగా ఉంద ని చెప్పడానికే తనను మంత్రి వర్గం నుంచి తొలగించారన్నారు. అవినీతి జరిగిందని కాదన్నారు. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ, శ్రావణ మాసం పదవుల పందేరం మాసమన్నారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్‌రెడ్డి,ఎమ్మెల్యేలు దా స్యం వినయభాస్కర్, ఆరూరి రమేష్, శంకర్ నాయక్, చల్లా ధర్మారెడ్డి, రెడ్యా నాయక్, మాజీ ఎమ్మెల్యేలు సత్యవతి రాథోడ్, మొలుగూరి భిక్షపతి, సుధాకర్‌రావు, రాజయ్య, మాజీ ఎమ్మెల్సీ నాగపురి రాజలింగం, టీఆర్‌ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు నరేందర్ పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ శ్రేణుల అసమ్మతి
హన్మకొండ: ఏడాదిగా అవకాశాల కోసం ఎదురు చూస్తున్న టీఆర్‌ఎస్ శ్రేణులు తమ అసమ్మతిని వ్యక్తం చేశాయి. గ్రామజ్యోతి పథకంపై పార్టీ శ్రేణులకు అవగాహన కల్పించేందుకు శనివారం ఏర్పాటు చేసిన సదస్సు.. టీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు లేక బోసిపోయింది. ఈ సదస్సులో ఖాళీ కుర్చీలు కనపడడం, హాల్ బోసిపోయి ఉండటంతో ఉప ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా సమావేశాలు ఏర్పాటు చేసినపుడు నియోజకవర్గాల్లో సమావేశాలు ఏర్పాటు చేయవద్దని, ఎంతటి ప్రాధాన్యత పనులున్నా వదులుకొని పార్టీ సమావేశాలకు పాల్గొనాలని సూచించారు.
టీఆర్‌ఎస్ శ్రేణులు మోటివేటర్లుగా పని చేయాల్సి ఉండగా సదస్సుకు హాజరు కాకపోవడటం మంచిది కాదని అన్నారు. పార్టీ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి పార్టీ కార్యక్తలు రాకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు, గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు ఈ దిశగా ఆలోచించాలన్నారు. ఎంతో ప్రాధాన్యతాంశంగా తీసుకొని ఏర్పాటు చేసిన ఈ సదస్సుకు జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి హాజరు కాలేదు. చల్లా ధర్మారెడ్డి గీసుకొండ మండలం గంగదేవిపల్లిలో ఏర్పాటు చేసిన నియోజకవర్గస్థాయి సమావేశంలో పాల్గొని ఆలస్యంగా వచ్చారు.