- నాణ్యమైన విద్యను అందించడమే ప్రభుత్వ ధ్యేయం
- డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి
‘గురుకులాలు’ ఆదర్శంగా నిలవాలి
Published Thu, Jul 21 2016 12:03 AM | Last Updated on Sat, Sep 15 2018 6:06 PM
పరకాల : ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తున్న గురుకుల పాఠశాలలు దేశానికే ఆదర్శం గా నిలవాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆత్మకూరు మండలానికి మంజూరైన గురుకుల పాఠశాలను మండలంలోని మల్లక్కపేట గురుకులంలో బుధవారం ఆయన ప్రా రంభించారు. అనంతరం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కడియం మాట్లాడుతూ.. 1995–99 మధ్య కాలంలో ఉమ్మడి రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన తాను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న గురుకులాలను కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేశానని చెప్పారు.
ఇప్పుడు ప్రత్యేక రా ష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు పాటుపడుతున్నామని చెప్పా రు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా కొత్తగా 319 గురుకులాలను ప్రారంభించినట్లు చెప్పారు.16 గురుకులాలనుకాలేజీలుగా అప్‌గ్రేడ్ చేశామన్నారు. కొత్తగా ఏర్పా టు చేసిన గురుకులాల్లో 7వేల కోట్ల ఖర్చుతో 10 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు చెప్పా రు. సాంఘిక సంక్షేమ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ ఎంతో కష్టపడుతూ విద్యార్థుల అభివృద్ధి కోసం పని చేస్తున్నారని అభినందించారు. నడికూడలో 15 వేల మొక్కలను నాటి సంరక్షించాలని, వందశాతం మరుగుదొడ్లు నిర్మించుకుం టే 25 లక్షల నిధులను మంజూరు చేస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు తక్కళ్లపల్లి రవీందర్‌రావు, జడ్పీటీసీ సభ్యురాలు పాడి కల్పనాదేవి–ప్రతాప్‌రెడ్డి, ఎంపీపీ నేతాని సులోచన–శ్రీనివాస్‌రెడ్డి, నగర పంచాయతి చైర్మన్ మార్త రాజభద్రయ్య, డీసీవో రూపాదేవి పాల్గొన్నారు.
మనసున్న మహారాజు కేసీఆర్
చదువుతోపాటు సన్న బియ్యంతో విద్యార్థుల కడుపు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మహారాజని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కొని యాడారు. కేసీఆర్ మనువడు, మనుమరాలు తింటున్న సన్న బియ్యా న్ని విద్యార్ధులకు అందించిన మహామనిషి అని కొనియాడారు. రాష్ట్రంలో 319 గురుకులాలను ఏర్పాటు చేస్తే అందులో 200 గురుకులాలను కేవలం బాలికల కోసం కేటాయించడం జరిగిందన్నారు. అవకాశం కల్పిస్తే ఆడపిల్లలు ఆకాశమే హద్దుగా ఎదుగుతారన్నారు. మన రాష్ట్రంలోనే చేపట్టిన హరితహారం కార్యక్రమాన్ని ప్రధాన మంత్రి మోదీ సైతం అభినందించారని చెప్పారు. ఏడాదికి 46కోట్ల మొక్కల చొప్పున ఐదేళ్లలో 230 కోట్ల మొక్కలను పెంచడం కోసం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు.
ప్రభుత్వం రూ.46వేల కోట్లతో మిషన్ భగీరథతో ఇంటింటికి సురక్షితమైన నల్లా నీళ్లు అందిస్తుందన్నారు. చెరువుల పూడికతీత కోసం ప్రారంభించిన మిషన్ కాకతీయ ప్రపం చ ప్రజల దృష్టిని ఆకర్షించిందన్నారు. ఆసరా పింఛన్ల కోసం ఏటా రూ.4600 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, రూ.17వేల కోట్లతో రుణమాఫీని అమ లు చేస్తున్న ఘనత ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన అన్నారు. మంత్రి వెం ట ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ పాల్గొన్నారు.
Advertisement
Advertisement