మేడారం ఆలయంలో మొక్కలు నాటుతున్న మంత్రులు
-
మేడారం, నార్లాపూర్‌లో హరితహారం
-
హాజరైన మంత్రులు కడియం, జోగు రామన్న, చందూలాల్
-
వనదేవతలకు పూజలు..
ఎస్‌ఎస్‌తాడ్వాయి : హరితహారం కార్యక్రమం ఉద్యమంలా సాగుతోందని, వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యమని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. మండలంలోని మేడారం ఆలయంలో, నార్లాపూర్ చింతల క్రాస్ వద్ద అటవీ భూమిలో కడియంతో పాటు మంత్రులు జోగు రామన్న, అజ్మీరా చందూలాల్, కలెక్టర్ వాకాటి కరుణ, జెడ్పీ చైర్‌పర్సన్ గద్దల పద్మ మెుక్కలు నాటారు. అనంతరం కలెక్టర్ అధ్యక్షతన జరిగిన సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. భావితరాలకు పచ్చదనాన్ని కానుకగా ఇచ్చేందుకే సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని చెప్పారు.
మేడారంలో లక్షల మొక్కలు పెంచేలా అధికారులు చర్యలు చేపడుతున్నారని తెలిపారు. అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న మాట్లాడుతూ.. మానవాళి మనుగడ కోసం సీఎం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారని, ఇది ఆయన మానసపుత్రిక అని అన్నారు. చెట్లను పెంచితేనే పర్యావరణ సమతుల్యత సాధ్యమని చెప్పారు. గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ.. హరితహారంతో మొక్కలను పెంచి పూర్వవైభవం చూడాలన్నారు.
మేడారం వంటి వనదేవతల పవ్రిత స్థలంలో మొక్కలు నాటితే భక్తులకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. అంతకుముందు మంత్రులు వనదేవతలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో వన్యప్రాణి విభాగం అడిషనల్ పీసీసీఎఫ్ పృ«థ్విరాజు, కన్జర్వేటర్లు అక్బర్, పీవీ రాజారావు, జేసీ ప్రశాంత్ జీవన్ పటేల్, పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ మహేందర్‌జీ, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపెల్లి రవీందర్‌రావు, ఎంపీపీ కొండూరి శ్రీదేవి, జేడ్పీటీసీ సభ్యురాలు పులుసం సరోజన. డీఎఫ్‌ఓలు పురుషోత్తం, బీమా, మండల అధ్యక్షుడు బాపిరెడ్డి పాల్గొన్నారు.