ఓటుకు కోట్లు కేసు మరో మలుపు తిరిగింది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌ను అనుమతించాలని హైకోర్టు తీర్పు చెప్పింది. చంద్రబాబుపై విచారణ జరపాలన్న ఏసీబీ కోర్టు ఆదేశాలను హైకోర్టు కొట్టేసింది. ఓటుకు కోట్లు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రపై దర్యాప్తు చేయాలంటూ ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఉమ్మడి హైకోర్టు ఈ తీర్పు ఇచ్చింది. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై ఏసీబీ అధికారులు సక్రమంగా దర్యాప్తు చేయడం లేదంటూ వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఫిర్యాదుచేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం దర్యాప్తు చేయాలని ఏసీబీ అధికారులను ఆదేశించింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ చంద్రబాబు హైకోర్టును ఆశ్రయించారు.