బాబు విజయవాడ వెళ్లడం వెనక పెద్దకథే... | YSRCP Leader Bhumana Karunakar Reddy Slams Chandrababu naidu over Cash-for-vote case | Sakshi
Sakshi News home page

బాబు విజయవాడ వెళ్లడం వెనక పెద్దకథే...

Published Mon, Aug 29 2016 4:58 PM | Last Updated on Wed, Aug 15 2018 9:35 PM

బాబు విజయవాడ వెళ్లడం వెనక పెద్దకథే... - Sakshi

బాబు విజయవాడ వెళ్లడం వెనక పెద్దకథే...

తిరుపతి : ఓటుకు కోట్లు కేసులో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు అనుమానాలకు తావీస్తోందని వైఎస్ఆర్ సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. ఆయన సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబును ఆ బ్రహ్మదేవుడు కూడా కాపాడలేరన్న కేసీఆర్... 14 నెలలు అయినా ఆ కేసులో అనుబంధ ఛార్జిషీట్ వేయకపోవడం దేనికి నిదర్శనమన్నారు. ఉన్నపళంగా విజయవాడకు చంద్రబాబు నాయుడు పారిపోవడం వెనుక పెద్ద కథే నడిచిందని భూమన అన్నారు. కేసు నుంచి బయటపడేందుకు కేసీఆర్ కు రూ.500 కోట్లు చెల్లించడమే కాకుండా, ఏపీ ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెట్టారని భూమన విమర్శించారు.

సాక్షాత్తు ముఖ్యమంత్రే లంచాలు ఇస్తూ దొరికిపోతే కేసును ఇంతగా నీరుగార్చుతారా అని ఆయన అన్నారు. చంద్రబాబు కంటే పనికిమాలిన ముఖ్యమంత్రి దేశంలో లేరని భూమన వ్యాఖ్యానించారు. బాబులాంటి అవినీతిపరుడు ముఖ్యమంత్రిగా ఉండటం తెలుగుజాతికి అవమానమన్నారు. కపటం, మోసం తప్ప ఎలాంటి నైతికత లేని వ్యక్తి చంద్రబాబు అని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిజంగా నిప్పు అయితే ఏసీబీ కోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడాలని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement